squid game
-
'ఈ గేమ్ ఆడితే అందరం చస్తాం'.. భయపెట్టిస్తోన్న టీజర్!
ప్రస్తుతం సినీ ప్రియులు ఓటీటీలపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ సైతం సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ మరో క్రేజీ వెబ్ సిరీస్‌తో సిద్ధమైంది. 2021లో విడుదలైన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంది. కొరియన్లో తెరకెక్కించిన ఈ సిరీస్ ఇండియాలో క్రేజ్‌ను దక్కించుకుంది.ఈ వెబ్ సిరీస్ దక్కిన ఆదరణతో స్క్విడ్ గేమ్ సీజన్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా సీజన్-2 టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగులోనూ విడుదలైన ఈ టీజర్ మరింత ఆకట్టుకుంటోంది. గ్రీన్ లైట్, రెడ్ లైట్ వంటి గేమ్స్ ఈ సీజన్లో చూపించనున్నారు. టీజర్లో సన్నివేశాలు చూస్తుంటే హారర్ థ్రిల్లర్ లాంటి ఫీలింగ్ వస్తోంది. గేమ్‌లో పాల్గొన్న వారంతా ప్రాణాలతో బయటపడతారా లేదా అన్నది తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ స్క్విడ్ గేమ్ సీజన్- 2 డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
వరల్డ్ బెస్ట్ సిరీస్.. రెండో సీజన్ ఓటీటీ రిలీజ్ ఫిక్స్
ఓటీటీల్లో కొన్ని సినిమాలు లేదా వెబ్ సిరీసులు అనుహ్యంగా హిట్ అవుతుంటాయి. అలాంటి వాటిలో 'స్క్విడ్ గేమ్' ఒకటి. పేరుకే ఇది కొరియన్ సిరీస్. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ లవర్స్‌ని మెప్పించింది. 2021లో రిలీజైన తొలి సీజన్ అద్భుతమైన రికార్డులు సెట్ చేయగా.. ఇప్పుడు రెండో సీజన్ విడుదలకి సిద్ధమైంది. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేయడంతో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన బెస్ట్ వెబ్ సిరీసుల్లో 'స్క్విడ్ గేమ్' ఒకటి. చిన్నపిల్లలు ఆడుకునే ఆటల్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా కథ రాయడం విశేషం. డబ్బు అవసరమున్న 456 మందిని ఓ ద్వీపానికి తీసుకొచ్చి ఉంచుతారు. వీళ్ల మధ్య చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ పెడతారు. పోటీల్లో గెలిచినోళ్లు తర్వాత దశకు వెళ్తుంటారు. మిగిలిన వాళ్లని నిర్వహకులు నిర్ధాక్షిణ్యంగా చంపేస్తుంటారు. చివరకు గెలిచిన ఒక్కరు ఎవరనేదే స్టోరీ.తొలి భాగం ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచి రెండో సీజన్ మొదలవుతుంది. ఈసారి కూడా 456 మంది ఉంటారు. మళ్లీ వీళ్ల మధ్య కొత్త గేమ్స్ పెడతారు. మరి ఇందులోనూ హీరో గెలిచాడా? ఈసారి ఏమేం గేమ్స్ ఉండబోతున్నాయనేది టీజర్లో చూచాయిగా చూపించారు. ఇక ఏడాది చివరి వారంలో అంటే డిసెంబరు 26న సిరీస్ స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. మరి ఈ సిరీస్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు?(ఇదీ చదవండి: 27 ఏళ్లకే ప్రముఖ సింగర్ మృతి.. కారణమేంటి?) -
ఓటీటీలోనే సూపర్ హిట్ వెబ్ సిరీస్.. రెండో సీజన్ రిలీజ్ ఫిక్స్
ఓటీటీల్లో కొన్ని సినిమాలు, వెబ్ సిరీసులు సూపర్ హిట్ అవుతుంటాయి. అలాంటి లిస్టులో కచ్చితంగా ఉండే సిరీస్ 'స్క్విడ్ గేమ్'. 2021లో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ సిరీస్.. ఊహించిన దానికంటే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా తీసిన రెండో సీజన్‌కి సంబంధించిన స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేశారు. అలానే మూడో సీజన్ గురించి కూడా అప్డేట్ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట విషాదం)ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ వెబ్ సిరీసుల్లో 'స్క్విడ్ గేమ్' ఒకటి. తొమ్మిది ఎపిసోడ్స్‌తో తీశారు. క్షణక్షణం టెన్షన్ అనిపించే థ్రిల్లింగ్ అంశాలతో దీన్ని తెరకెక్కించారు. అప్పట్లో వరల్డ్ మోస్ట్ పాపులర్ సిరీస్‌గా నిలిచింది. చిన్నచిన్న గేమ్లతోనే ఉండే ఈ స్క్విడ్ గేమ్‌లలో ప్రాణాలను కాపాడుకునేందుకు కంటెస్టెంట్లు చేసే పోరాటాన్ని చూపించారు.హ్వాంగ్ డాంగ్ హ్యుక్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ రెండో సీజన్‌ని ఈ ఏడాది డిసెంబరు 26 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. తొలి సీజన్‌లానే ఇప్పుడు తెలుగు డబ్బింగ్ కూడా ఉండనుంది. అలానే వచ్చే ఏడాది మూడో సీజన్ కూడా తీసుకొస్తామని, దీంతో సిరీస్‌కి ముగింపు ఇస్తామని ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు రిలీజ్) -
లైంగిక వేధింపుల కేసులో నటుడికి జైలు శిక్ష
‘స్క్విడ్ గేమ్’.. రెండేళ్ల క్రితం ఏ దేశంలో చూసిన ఈ వెబ్ సిరీస్ గురించే చర్చ. ఈ వెబ్‌సిరీస్ విడుదలైన 90 దేశాల్లో నెం.1గా కొనసాగింది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో తక్కవ సమయంలో ఎక్కువమంది చూసిన వెబ్‌సిరీస్‌గా గుర్తింపు ఉంది. ఈ స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌లో కీలకపాత్రలో కనిపించిన 'ఓ యోంగ్ సు' మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. 2017లో వచ్చిన అభియోగాలపై ఈ 79 ఏళ్ల నటుడికి దక్షిణ కొరియా కోర్టు శిక్ష విధించింది. స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ హిట్ కావడంతో ఇటీవలే సీజన్ 2పై ఓ వీడియో ద్వారా మేకర్స్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి సీజన్లో కీలక పాత్రలో కనిపించిన దక్షిణ కొరియాకు చెందిన ఓ యోంగ్ సు (79) మీద లైంగిక వేధింపుల కేసులో శిక్ష పడింది. సువాన్ జిల్లా కోర్టు సియోంగ్నామ్ శాఖ ఓ యోంగ్ సుకు ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది. అలాగే సినీ రంగంలో రెండేళ్ల పాటు నిషేధం కూడా విధించింది. గతంలో కూడా ఆయనపై మరో లైంగిక వేధింపుల కేసు కూడా ఉంది. 2017లో ఓ గ్రామీణ ప్రాంతంలో థియేటర్ ప్రదర్శన కోసం వెళ్లిన యోంగ్ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కానీ అక్కడ ఓ సరస్సు దాటేందుకు సహాయం కోసం మాత్రమే ఆ మహిళ చేతిని పట్టుకున్నట్లు యోంగ్ తెలిపాడు. అందుకు ఆమెకు క్షమాపణలు కూడా చెప్పినట్లు తెలిపాడు. కానీ వాస్తవంగా ఆ మహిళను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు పూర్తి ఆధారాలు కోర్టుకు దక్కడంతో ఆయనకు శిక్ష ఖరారు అయింది. 50 ఏళ్లుగా ఆయన సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు వచ్చింది. -
ఒకేసారి 1415 మంది విద్యార్థుల ఆట.. వీరికి రికార్డులు కొత్తేం కాదు..
రికార్డుతో ఆటలు... రెడ్‌లైట్... గ్రీన్‌లైట్.. పిల్లలాడుకునే ఆట. కానీ 1415 మంది యూనివర్సిటీ విద్యార్థులు ఆడి రికార్డు సృష్టించారు. గతంలో 1203 మంది విద్యార్థులు నెలకొల్పిన రికార్డును కాలిఫోర్ని యా ఇర్వైన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ బద్దలు కొట్టారు. ఈ క్రెడిటంతా దక్షిణ కొరియా డ్రామా ‘స్క్విడ్ గేమ్’దేనంటున్నారు. ఇదంతా ఎందుకు అంటే... లాస్ట్ ఇయర్ క్లాసులన్నీ ఆన్లైన్లోనే జరిగాయి. మిగతా విద్యార్థులెలా ఉన్నా.. ఫస్ట్ ఇయర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు, ఈ ఇయర్ వస్తున్న వారికి యూనివర్సిటీ కొత్త. ఈ ఏడాది వెల్కమ్ వీక్‌ను భిన్నంగా నిర్వహించాలకుని, ఈ ఆటతో రికార్డు నెలకొల్పింది. విద్యార్థులు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఏ ఆటనే విషయం పక్కన పెడితే... ఆడటం బాగుందని సీనియర్ విద్యార్థులు సైతం అంటున్నారు. యూనివర్సిటీకి ఈ రికార్డులు కొత్తేం కాదు.. 2012 డాడ్జ్‌బాల్, 2013లో వాటర్ పిస్టల్ ఫైట్, 2015 క్యాప్చర్ ద ఫ్లాగ్ లార్జెస్ట్ గేమ్, 2017లో బెలూన్ ట్యాగ్‌తో రికార్డులు సృష్టించింది. 🚦💙💛🐜🍽 Anteaters have done it again! With a crowd of 1,415 UCI has broken the Guinness World Records title for largest game of Red Light/Green Light. #UCIWelcome pic.twitter.com/PYwKgp8i5O — UC Irvine (@UCIrvine) September 21, 2022 -
సరికొత్తగా రానున్న 'స్క్విడ్ గేమ్ 2'.. మరబొమ్మకు బాయ్‌ఫ్రెండ్ అట..
Squid Game Season 2 Official Announcement And Doll Has Boyfriend: ప్రముఖ కొరియన్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' వినడానికి చిన్న పిల్లల ఆటల ఉన్నా చూసే ఆడియెన్స్‌ను ప్రతిక్షణం థ్రిల్లింగ్‌కు గురిచేసింది. సెప్టెంబర్ 17, 2021న ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై నెంబర్ వన్ సిరీస్‌గా నెట్‌ఫ్లిక్స్ చరిత్రలోనే రికార్డు సాధించింది. రిలీజైన 28 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా 11 కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్ యూజర్లు చూశారు. కొరియన్ భాషలో విడుదలైన ఈ వెబ్ సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్‌కు సుమారు 900 మిలియన్ డాలర్లు లాభం వచ్చినట్లు సమాచారం. మొత్తం 8 గంటల 12 నిమిషాలు ఉండే ఈ సిరీస్‌లో 9 ఎపిసోడ్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సిరీస్‌కు రెండో సీజన్ వస్తున్నట్లుగా డైరెక్టర్ హ్వాంగ్ డాంగ్ హ్యూక్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో రౌండ్స్ మరింత కొత్తగా, ప్రతిక్షణం ఉత్కంఠకు గురిచేసేలా ఉండన్నున్నట్లు తెలిపారు. 'గతేడాది స్క్విడ్ గేమ్‌కు ప్రాణం పోసి ఓ సిరీస్ రూపంలో ఒకటో సీజన్‌గా తీసుకురావడానికి 12 ఏళ్లు పట్టింది. కానీ మోస్ట్ పాపులర్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌గా అవతరించేందుకు 12 రోజులు మాత్రమే పట్టింది. స్క్విడ్ గేమ్‌ను ఇంతగా ఆదరించి ఘన విజయాన్ని అందించిన వరల్డ్‌వైడ్‌గా ఉన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇక ఇప్పుడు జీ-హన్ రిటర్న్స్.. ది ఫ్రంట్ మ్యాన్ రిటర్న్స్.. సీజన్-2 వచ్చేస్తోంది. ఆ సూట్ ధరించి మేమ్ ప్రారంభించేందుకు డీడాగ్జి మళ్లీ తిరిగి రావొచ్చు. ఈసారి యంగ్ హీ (మరబొమ్మ)కి బాయ్‌ఫ్రెండ్‌గా 'కియోల్-సు' రానున్నాడు.' అని డైరెక్టర్ తెలిపారు. Hwang Dong-Hyuk writer, director, producer, and creator of @squidgame has a message for the fans: pic.twitter.com/DxF0AS5tMM — Netflix (@netflix) June 12, 2022 అయితే ఇందులో ఉన్న మరబొమ్మ (రోబోట్)కు బాయ్‌ఫ్రెండ్ ఉండటం అనే విషయంపై నెటిజన్స్ ఒక్కోరకంగా స్పందిస్తున్నారు. 'ఈ బొమ్మకు (రోబోట్) కూడా బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా ? నమ్మలేకపోతున్నాను. నేను ఇంకా సింగిల్‌గానే ఉన్నా' అంటూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ రెండో సీజన్ ఎప్పుడు వస్తుందనేది ఇంకా వెల్లడించలేదు. Red light… GREENLIGHT! Squid Game is officially coming back for Season 2! pic.twitter.com/4usO2Zld39 — Netflix (@netflix) June 12, 2022 how come the doll in squid game has a boyfriend but im single https://t.co/ST4RFRhv77 — xin 🌱 FL!P that (@nagumowife) June 12, 2022 the squid games doll has a boyfriend & some of you guys are still single lol just saying https://t.co/gzJg971Swa — brooke (@brookeab) June 12, 2022 now??? imagine the squid game robot got a boo and ur still single 😭 https://t.co/jlA69DdFDc — jimin connoisseur ⁷ (@sunflowrmemory) June 12, 2022 Girlie got a boyfriend~ 💃🏽 pic.twitter.com/BNsyn4dGv7 — shera || (@ddiddirere) June 12, 2022 -
'స్క్విడ్ గేమ్' మళ్లీ రానుంది.. ఈసారి ఎలాంటి గేమ్ ?
Squid Game Second Season Confirmed By Netflix: ప్రముఖ కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 17, 2021న ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. నెంబర్ వన్ సిరీస్‌గా నెట్‌ఫ్లిక్స్ చరిత్రలోనే రికార్డు సాధించింది. రిలీజైన 28 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా 11 కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్ యూజర్లు చూశారు. కొరియన్ భాషలో విడుదలైన ఈ వెబ్ సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్‌కు సుమారు 900 మిలియన్ డాలర్లు లాభం వచ్చినట్లు సమాచారం. మొత్తం 8 గంటల 12 నిమిషాలు ఉండే ఈ సిరీస్‌లో 9 ఎపిసోడ్లు ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ కోసమే నెట్‌ఫ్లిక్స్‌కు సబ్‌స్క్రైబ్ అయిన వారి సంఖ్య కూడా ఎక్కువే. అయితే తాజాగా స్క్విడ్ గేమ్ సిరీస్‌కు రెండో సీజన్ రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ కో సీఈవో, చీఫ్ కంటెంట్ ఆఫీసర్ టెడ్ సారండోస్ తెలిపారు. నెట్‌ఫ్లిక్స్ 2021 నాల్గో త్రైమాసిక ఆదాయం గురించి సారండోస్తో ఓ ఇంటర్వ్యూ చేశారు. అందులో సౌత్ కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్‌కు రెండో సీజన్ రానుందా అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు సారండోస్ ఇలా జవాబిచ్చాడు. 'కచ్చితంగా. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకులు అత్యధికంగా వీక్షించిన నెంబర్ 1 సిరీస్. స్క్విడ్ గేమ్ ప్రపంచం ఇప్పుడే ప్రారంభమైంది. నెట్‌ఫ్లిక్స్ అభివృద్ధికి దోహదపడే ఫ్రాంచైజీలో మొదటి స్థానంలో ఉంది. అలాగే రెండో స్థానంలో బ్రిడ్జర్టన్ కాగా తర్వాతి స్థానాల్లో స్ట్రేంజర్ థింగ్స్ ఉన్నాయి.' అని చెప్పుకొచ్చాడు. అయితే గతంలో కూడా స్క్విడ్ గేమ్ డైరెక్టర్ హ్వాంగ్ డాంగ్ హ్యూక్ ఈ సిరీస్‌కు సెకండ్ సీజన్ వస్తుందని పేర్కొన్నాడు. ఈ సిరీస్ మొదటి సీజన్లో 456 మంది పోటీదారులు డబ్బు కోసం పిల్లలకు సంబంధించిన గేమ్ ఆడతారు. కానీ అందులో ఓడిపోయిన వారిని చంపడం వంటి ఘోరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఈసారి సెకండ్ సీజన్ ఎలాంటి గేమ్‌తో రానుందో వేచి చూడాలి. -
వామ్మో! రియల్ స్క్విడ్ గేమ్ ప్రైజ్ మనీ ఇన్ని కోట్లా?
Youtuber MrBeast Squid Game Prize Money: ప్రముఖ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో సౌత్ కొరియన్ స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ చరిత్ర సృష్టించిన సంగతి మనకు తేలిసిందే. ఈ వెబ్ సిరీస్ వల్ల నిర్మాతలకు, నెట్ ఫ్లిక్స్ కు కోట్లలో వర్షం కురిసింది. ఈ సెన్సేషన్ వెబ్ సిరీస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ కథలో జీవితాలతో ఆడుకునేవాడు ఒకడైతే.. ఆ ఆటలో పాల్గొనేవాళ్లు 456 మంది. పేరుకు పిల్లల ఆటలేగానీ.. ఓడితే మాత్రం ప్రాణాలు పోతాయి. 38 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ గెల్చుకోవడానికి వాళ్లంతా పడే తాపత్రయమే ఈ కథ. ఈ ఆటలో పాల్గొన్న వారు అంత అప్పుల్లో కూరుకొని పోయినవారు. అయితే, ఒక ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ ఇప్పుడు నిజంగానే స్క్విడ్ గేమ్ రూపొందించారు. అందులో గెలిచిన వారికి భారీగా ప్రైజ్ మనీ కూడా ఇచ్చాడు. మిస్టర్ బీస్ట్ రూపొందించిన గేమ్ ఎక్కడ కూడా వెబ్ సిరీస్ లో చూపించిన దానికంటే తక్కువగా లేదు. మిస్టర్ బీస్ట్ నిర్వహించిన రియల్ స్క్విడ్ గేమ్‌లో నెట్ ఫ్లిక్స్ షో మాదిరిగానే 456 మంది పాల్గొన్నారు. ఈ గేమ్ 'రెడ్ లైట్ గ్రీన్ లైట్' గేమ్ తో ప్రారంభమవుతుంది. మొదటి గేమ్ లో ఓడిపోయిన వారు చనిపోయినట్లు నటిస్తారు. ఆ తర్వాత డాల్గానా క్యాండీ గేమ్ లో ప్రతి ఆటగాడు వారికి కేటాయించిన ఆకారాన్ని చెక్కాల్సి ఉంటుంది. (చదవండి: అడిడాస్ సంచలన నిర్ణయం..! ఫేస్‌బుక్‌కు పెద్ద దెబ్బే..!) ఇందులో గెలిచిన వారు టగ్ ఆఫ్ వార్, ఆ తర్వాత మార్బుల్ గేమ్, చివరికి గ్లాస్ స్టెప్పింగ్ గేమ్ వరకు కొనసాగుతారు. చివరి గేమ్ పేరు గురుంచి తెలిస్తే, మీరు కూడా ఒకింత ఆశ్చర్యపోతారు. మనం చిన్నప్పుడు ఆడిన కుర్చీలా ఆటే, ఈ లాస్ట్ గేమ్. చివరగా, ఆరుగురు ఆటగాళ్ళు ప్రైజ్ మనీ కోసం పోరాడాల్సి ఉంది. ఈ కుర్చీలా ఆటలో గెలిచిన వారికి $456,000(రూ.3,39,80,208) నగదు బహుమతి లభించింది. ఈ స్క్విడ్ గేమ్ సెటప్ దాదాపు నెట్ ఫ్లిక్స్ షోలో చూపించిన మాదిరిగానే ఉంది. మిస్టర్ బీస్ట్ రూపొందించిన ఈ స్క్విడ్ గేమ్ కు యూట్యూబ్ లో 27 మిలియన్ వ్యూస్ వచ్చాయి. -
కిమ్ దుశ్చర్య.. ఆ వెబ్ సిరీస్ చూసినందుకు మరణశిక్ష!
ఎవరు ఎలా పోయినా సరే.. దేశ కఠిన చట్టాలను తన పౌరులు గౌరవించాలన్నది ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఉద్దేశం. అదే దాయాది దక్షిణ కొరియా విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే కర్కశంగా వ్యవహరిస్తుంటాడు. తాజాగా అలాంటి పరిణామమే ఒకటి జరగ్గా.. దుశ్చర్యకు పాల్పడ్డాడు కిమ్. దక్షిణ కొరియా నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ను చూశాడనే నెపంతో ఓ వ్యక్తికి మరణశిక్ష విధించాడు కిమ్ జోంగ్ ఉన్. ఆ వెంటనే శిక్షను అమలు చేస్తూ ఆ వ్యక్తిని కిరాతకంగా కాల్చి చంపింది సైన్యం. చైనా సర్వర్ల నుంచి సిరీస్‌ను డౌన్లోడ్ చేసి వీక్షించాడని, అంతటితో ఆగకుండా ఫ్లాష్ పెన్‌డ్రైవ్‌లలో కొందరు విద్యార్థులకు కాపీలను అమ్ముకున్నాడని ప్రభుత్వం ఆరోపించింది. ఇక ఈ వ్యవహారంలో ఓ విద్యార్థికి జీవిత ఖైదు విధించారు. సిరీస్ చూసిన మరో ఆరుగురికి, సదరు స్కూల్ ప్రిన్స్‌పాల్, టీచర్లను విధుల నుంచి తొలగించి ఐదేళ్ల నిర్భంద శిక్ష విధించాడు కిమ్. నార్త్ కొరియా చట్టాల ప్రకారం.. వీళ్లంతా బొగ్గు గనుల్లో, మారుమూల పల్లెల్లో శిక్షాకాలం పాటు కూలీ పనులు చేయాల్సి ఉంటుంది. ‘‘స్క్విడ్ గేమ్ అనేది వినోదం పంచేది కాదు. పెట్టుబడిదారి అయిన దక్షిణ కొరియా క్రూరత్వాన్ని ప్రతిబింబించే షో. డబ్బు కోసం మనిషి ఉవ్విళ్లూరడం, ప్రాణాల్ని పణంగా పెట్టడం.. ఉత్తర కొరియా సంప్రదాయానికి విరుద్ధమైన అంశాలు. అందుకే మొగ్గలోనే ఈ వ్యవహారాన్ని తుంచేస్తున్నాం’’ అంటూ ప్రభుత్వం తరపు నుంచి ఓ స్టేట్మెంట్ స్థానికంగా ఓ పత్రికలోనూ ప్రచురితమైంది. ఉత్తర కొరియాలో క్యాపిటలిస్ట్ దేశాల ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్ని వీక్షించినా, వాటి కాపీలు కలిగి ఉన్నా, ఇతరులకు పంపిణీ చేసినా నార్త్ కొరియాలో కఠిన శిక్షను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ లిస్ట్‌లో అమెరికా, దక్షిణ కొరియాను ప్రముఖంగా చేర్చింది కిమ్ ప్రభుత్వం. అలా చేస్తే తమ దేశ గౌరవాన్ని దిగజార్చినట్లు, కల్చర్‌ను కించపరిచినట్లు భావిస్తుంది అక్కడి ప్రభుత్వం. చదవండి: కిమ్ కొత్త ఎత్తు! కల్చరల్ వార్ ఎందుకంటే.. -
కిక్కెక్కించే ఐదు కొరియన్ వెబ్ సిరీస్ ఇవే..
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన స్క్విడ్ గేమ్ గురించి సినీ ప్రేక్షకులకు తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌లోనే మోస్ట్ వాచ్డ్ వెబ్ సిరీస్ స్థానంలో మొదటగా నిలిచింది స్క్విడ్ గేమ్. వరల్డ్ వైడ్‌గా అత్యంత ప్రజాధరణ పొందిందీ సిరీస్. ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యేవరకు ఎవరూ దీన్ని అంతగా పట్టించుకోలేదు. ఏదో చిన్న పిల్లల ఆటలా ఉందే అనుకున్నారు. కానీ ఒక్కసారి చూద్దామని మొదలు పెట్టిన ప్రేక్షకులను కట్టిపడేసింది స్క్విడ్ గేమ్. ఇప్పుడు ఈ సిరీస్‌కు రెండో సీజన్‌ను కూడా విడుదల చేయండని అభిమానులు కోరుతున్నారు. ఈ స్విడ్ గేమ్ సౌత్ కొరియన్ వెబ్ సిరీస్. దీంతో ఈ కొరియన్ వెబ్ సిరీస్ చూసే వారి సంఖ్య పెరిగిందట. స్క్విడ్ గేమ్‌లా మిమ్మల్ని కట్టిపడేసే టాప్ 5 కొరియన్ వెబ్ సిరీస్ మీకోసం. 1. కింగ్డమ్ 2. మై నేమ్ 3. వాగాబాండ్ 4. స్ట్రేంజర్స్ ఫ్రమ్ హెల్ 5. హోటల్ డెల్ లూనా ఈ వెబ్ సిరీస్‌లన్ని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. -
అబ్బా ఏం ఆడుతుంది...ఇది కదా ఆటంటే
మనం పెంపుడు జంతువులు మనం ఏవిధంగా ట్రైయిన్ చేస్తే అవి అలా చేస్తాయి. పైగా మనం ఇంత వరకు మన పనుల్లో సహయపడే విధంగా ట్రైయిన్ చేయంగానే అవి కూడా భలే క్రమం తప్పకుండా రోజు చేస్తాయి. ఇంతవరకు కుక్కలకు, కోతులకు ట్రైయిన్ చేయడం మన రోజువారీ పనులను ఎలా చేస్తుందో వంటి వాటిని చూశాం. కానీ కుక్కలు ఆడటం చూశామా ! (చదవండి: ఏంటీ... విమానంలో ప్రయాణించేటప్పుడు తినడానికి అది తీసుకువెళ్తావా!) మహా అయితే మనం బాల్ విసిరితే పట్టుకోవడం చూసి ఉంటాం. కానీ ఈ కుక్క స్క్విడ్ గేమ్ ఎలా ఆడుతుందో చూడండి. వర్షాకాలంలో బయటకి తీసుకెవెళ్లడం కుదరని సమయంలో ఆ కుక్క యజమాని మేరీ ఈ గేమ్ ప్రాక్టీస్ చేయించారు. అయితే ఆ కుక్క ఎంత సులభంగా నేర్చుకుని ఆడేస్తుందో చూడండి. దీనికి సంబంధించిన వీడియోను మేరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. పైగా లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు ఓ లుక్ వేయండి. (చదవండి: షాకింగ్ వీడియో: 16వేల అడుగుల ఎత్తులోంచి..) View this post on Instagram A post shared by Mary & Secret (@my_aussie_gal) -
'స్క్విడ్ గేమ్'నట్టేట ముంచింది, కోట్లలో నష్టపోయి లబోదిబో మంటున్నారు
సౌత్ కొరియన్ డ్రామా 'స్క్విడ్ గేమ్' ఇన్వెస్టర్లను నట్టేట ముంచింది. వెబ్ సిరీస్ నట్టేట ముంచడం ఏంటని అనుమానం వ్యక్తం చేస్తున్నారా? 'స్క్విడ్ క్రిప్టోకరెన్సీ' పేరుతో ఏర్పాటైన క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు. ప్రారంభించిన వారంలోనే కరెన్సీ భారీ ఎత్తున లాభాల్ని తెచ్చి పెట్టినా..ఇప్పుడు భారీగా నష్టపోతున్నారు. కాయిన్ మార్కెట్ క్యాప్ కాయిన్ మార్కెట్ క్యాప్ లెక్కల ప్రకారం.. స్క్విడ్ క్రిప్టో కరెన్సీ విలువ అక్టోబర్ 26న $0.01236 నుంచి అక్టోబర్ 29కి $4.5 కి చేరింది. దీంతో కేవలం 100 గంటల్లో మదుపర్లు రూ.1000 నుంచి రూ.3,43,850 లక్షల వరకు సంపాదించారు. ఆ లాభాలు ఎక్కువయ్యేసరికి పెట్టుబడుల్ని భారీగా పెంచారు. కానీ ఇప్పుడు ఆ కరెన్సీ వ్యాల్యూ జీరోకి పడిపోవడంతో పెట్టుబడిదారులు భారీగా నష్టపోయారు. కాయిన్ మార్కెట్ క్యాప్ ప్రకారం..స్క్విడ్ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ గరిష్టంగా $2,861 చేరిన తరువాత ఆ వ్యాల్యూ కాస్తా సడెన్ $0కి పడిపోయింది. దీంతో పెట్టుబడిదారులు సుమారు రూ.25.3కోట్లు నష్టపోయారు. స్క్విడ్ క్రిప్టోకరెన్సీ మోసం సెప్టెంబర్ 17న విడుదలై 90 దేశాల్లో నెంబర్ 1 వెబ్ సిరీస్‌గా నిలిచిన స్క్విడ్ గేమ్ పేరుతో సైబర్ నేరస్తులు భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఫోర్బ్స్ సెప్టెంబర్ 27 తేదీన విడుదల చేసిన లెక్కల ప్రకారం.. ఒక్క యూఎస్‌లో వారం రోజుల వ్యవధిలోనే టీవీ స్క్రీన్లపై స్క్విడ్ గేమ్ 9 ఏపీసోడ్‌లను ఆడియన్స్ 3.26 బిలియన్ మినిట్స్ వీక్షించారని, దీంతో ఈ గేమ్ మరో రికార్డ్ సృష్టించినట్లైందని ఫోర్బ్స్ వెల్లడించింది. అయితే దీన్ని క్యాష్ చేసుకునేందుకు స్కామర్లు మూడు వారాల క్రితం స్క్విడ్ గేమ్ పేరుతో స్వ్కిడ్ క్రిప్టో కరెన్సీని (SquidGame.cash.పేరుతో వెబ్సైట్) ను ప్రారంభించారు. స్క్విడ్ గేమ్ కు ప్రజాదారణ బాగుందని, తాము ఏర్పాటు చేసిన క్రిప్టోలో పెట్టుబడి పెడితే లాభాల్ని అర్జించవచ్చిన ఊదరగొట్టారు. దీంతో పలువురు భారీగా పెట్టుబడులు పెట్టారు. ప్లాన్ ప్రకారం ఇన్స్టంట్ గా కాయిన్ వ్యాల్యూని పెంచారు. ఆ వ్యాల్యూ పెరగడంతో పెట్టుబడులు ఎక్కువయ్యాయి. అంతే అదును చూసిన మోసగాళ్లు మొత్తం డబ్బును కాజేసి కరెన్సీ వ్యాల్యూని జీరోకి తగ్గించారు. ఇప్పుడు అందులో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు లబోదిబో మంటున్నారు. అదే సమయంలో నిపుణులు క్రిప్టో కరెన్సీ పేరుతో జరుగుతున్న మోసాల్ని గుర్తించాలని హెచ్చరిస్తున్నారు. చదవండి: స్క్విడ్ గేమ్ క్రేజ్ మాములుగా లేదుగా..!