Youtuber MrBeast Squid Game Prize Money: ప్రముఖ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో సౌత్ కొరియన్ స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ చరిత్ర సృష్టించిన సంగతి మనకు తేలిసిందే. ఈ వెబ్ సిరీస్ వల్ల నిర్మాతలకు, నెట్ ఫ్లిక్స్ కు కోట్లలో వర్షం కురిసింది. ఈ సెన్సేషన్ వెబ్ సిరీస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ కథలో జీవితాలతో ఆడుకునేవాడు ఒకడైతే.. ఆ ఆటలో పాల్గొనేవాళ్లు 456 మంది. పేరుకు పిల్లల ఆటలేగానీ.. ఓడితే మాత్రం ప్రాణాలు పోతాయి. 38 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ గెల్చుకోవడానికి వాళ్లంతా పడే తాపత్రయమే ఈ కథ. ఈ ఆటలో పాల్గొన్న వారు అంత అప్పుల్లో కూరుకొని పోయినవారు.
అయితే, ఒక ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ ఇప్పుడు నిజంగానే స్క్విడ్ గేమ్ రూపొందించారు. అందులో గెలిచిన వారికి భారీగా ప్రైజ్ మనీ కూడా ఇచ్చాడు. మిస్టర్ బీస్ట్ రూపొందించిన గేమ్ ఎక్కడ కూడా వెబ్ సిరీస్ లో చూపించిన దానికంటే తక్కువగా లేదు. మిస్టర్ బీస్ట్ నిర్వహించిన రియల్ స్క్విడ్ గేమ్‌లో నెట్ ఫ్లిక్స్ షో మాదిరిగానే 456 మంది పాల్గొన్నారు. ఈ గేమ్ 'రెడ్ లైట్ గ్రీన్ లైట్' గేమ్ తో ప్రారంభమవుతుంది. మొదటి గేమ్ లో ఓడిపోయిన వారు చనిపోయినట్లు నటిస్తారు. ఆ తర్వాత డాల్గానా క్యాండీ గేమ్ లో ప్రతి ఆటగాడు వారికి కేటాయించిన ఆకారాన్ని చెక్కాల్సి ఉంటుంది.
(చదవండి: అడిడాస్ సంచలన నిర్ణయం..! ఫేస్‌బుక్‌కు పెద్ద దెబ్బే..!)
ఇందులో గెలిచిన వారు టగ్ ఆఫ్ వార్, ఆ తర్వాత మార్బుల్ గేమ్, చివరికి గ్లాస్ స్టెప్పింగ్ గేమ్ వరకు కొనసాగుతారు. చివరి గేమ్ పేరు గురుంచి తెలిస్తే, మీరు కూడా ఒకింత ఆశ్చర్యపోతారు. మనం చిన్నప్పుడు ఆడిన కుర్చీలా ఆటే, ఈ లాస్ట్ గేమ్. చివరగా, ఆరుగురు ఆటగాళ్ళు ప్రైజ్ మనీ కోసం పోరాడాల్సి ఉంది. ఈ కుర్చీలా ఆటలో గెలిచిన వారికి $456,000(రూ.3,39,80,208) నగదు బహుమతి లభించింది. ఈ స్క్విడ్ గేమ్ సెటప్ దాదాపు నెట్ ఫ్లిక్స్ షోలో చూపించిన మాదిరిగానే ఉంది. మిస్టర్ బీస్ట్ రూపొందించిన ఈ స్క్విడ్ గేమ్ కు యూట్యూబ్ లో 27 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment