ఓటీటీల్లో కొన్ని సినిమాలు లేదా వెబ్ సిరీసులు అనుహ్యంగా హిట్ అవుతుంటాయి. అలాంటి వాటిలో 'స్క్విడ్ గేమ్' ఒకటి. పేరుకే ఇది కొరియన్ సిరీస్. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ లవర్స్‌ని మెప్పించింది. 2021లో రిలీజైన తొలి సీజన్ అద్భుతమైన రికార్డులు సెట్ చేయగా.. ఇప్పుడు రెండో సీజన్ విడుదలకి సిద్ధమైంది. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేయడంతో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)
నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన బెస్ట్ వెబ్ సిరీసుల్లో 'స్క్విడ్ గేమ్' ఒకటి. చిన్నపిల్లలు ఆడుకునే ఆటల్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా కథ రాయడం విశేషం. డబ్బు అవసరమున్న 456 మందిని ఓ ద్వీపానికి తీసుకొచ్చి ఉంచుతారు. వీళ్ల మధ్య చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ పెడతారు. పోటీల్లో గెలిచినోళ్లు తర్వాత దశకు వెళ్తుంటారు. మిగిలిన వాళ్లని నిర్వహకులు నిర్ధాక్షిణ్యంగా చంపేస్తుంటారు. చివరకు గెలిచిన ఒక్కరు ఎవరనేదే స్టోరీ.
తొలి భాగం ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచి రెండో సీజన్ మొదలవుతుంది. ఈసారి కూడా 456 మంది ఉంటారు. మళ్లీ వీళ్ల మధ్య కొత్త గేమ్స్ పెడతారు. మరి ఇందులోనూ హీరో గెలిచాడా? ఈసారి ఏమేం గేమ్స్ ఉండబోతున్నాయనేది టీజర్‌లో చూచాయిగా చూపించారు. ఇక ఏడాది చివరి వారంలో అంటే డిసెంబరు 26న సిరీస్ స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. మరి ఈ సిరీస్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు?
(ఇదీ చదవండి: 27 ఏళ్లకే ప్రముఖ సింగర్ మృతి.. కారణమేంటి?)
Comments
Please login to add a commentAdd a comment