
ఓటీటీలో మరో ఫ్యామిలీ సిరీస్ వచ్చేందుకు రెడీ అయిపోయింది. 90స్, ఎర్లీ 20స్ లో జరిగిన కథలతో ఇదివరకే పలు సినిమాలు, సిరీసులు రాగా.. ఇప్పుడు ఆ తరహా కాన్సెప్ట్ తోనే తీసిన 'హోమ్ టౌన్' సిరీస్ రానుంది. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఇది ఎలా ఉందంటే?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)
ఇప్పుడంటే సోషల్ మీడియా అందరికీ కామన్ అయిపోయింది. కానీ ఫేస్ బుక్ వచ్చిన కొత్తలో ముగ్గురు టీనేజర్స్ ఎంత సందడి చేశారు? అటు స్కూల్, ఇటు ఇంట్లో పాటు క్రికెట్ గ్రౌండ్ లోనూ వీళ్లు ఎలా అల్లరి చేశారు? అనేది తెలియాలంటే 'హోమ్ టౌన్' సిరీస్ చూడాలి.
ఆహా ఓటీటీలో ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రాజీవ్ కనకాల, ఝాన్సీ తప్పితే పెద్దగా తెలిసిన ముఖాలు లేవు. కానీ టీజర్ చూస్తుంటే మాత్రం పర్లేదనిపించేలా ఉంది. 90స్ లో పుట్టి పెరిగిన వాళ్లు కనెక్ట్ అయ్యేలా ఉందనిపిస్తోంది. శ్రీకాంత్ పల్లె దర్శకుడు. నవీన్ మేడారం షో రన్నర్.
(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి)
Comments
Please login to add a commentAdd a comment