Hometown
-
1,000 మైళ్లు..2 నెలలు
అంత దూరాన తప్పిపోయిన పెంపుడు పిల్లి రెణ్నెల్లలో క్షేమంగా స్వస్థలం చేరిన వైనం పెంపుడు జంతువులంటేనే ఎంతో విశ్వాసంగా ఉంటాయి. ఎంత దూరం వెళ్లినా తిరిగి తమ ఆవాసాలకు చేరి ఆశ్చర్యపరుస్తుంటాయి. కానీ ఏకంగా ఎన్నో మైళ్ల దూరాన తప్పిపోయిన ఓ పెంపుడు పిల్లి ఒకరకంగా చరిత్రే సృష్టించింది. అక్షరాలా వెయ్యి మైళ్లు వెనక్కు ప్రయాణించి మరీ రెండు నెలల తరవాత ఇల్లు చేరింది! ప్రాణప్రదమైన పిల్లి తిరిగి రావడంతో యజమానుల ఆనందానికి పట్టపగ్గాల్లేవు. అమెరికాలో కాలిఫోర్నియాలోని సాలినాస్‌కు చెందిన సుసానే, బెన్నీ అంగుయానోలకు రెండున్నరేళ్ల పిల్లి ఉంది. ముద్దుగా రెయిన్బో అని పిలుచుకునేవారు. జూన్ 4న పిల్లితో పాటు వ్యోమింగ్‌లోని ఎల్లో స్టోన్ పార్కుకు వెళ్లారు. ఏమైందో గానీ పిల్లి ఉన్నట్టుండి భయపడి పారిపోయింది. ఎంత పిలిచినా వెనక్కి తిరిగి కూడా చూడకుండా పరుగు తీసింది. రోజుల తరబడి వెదికినా లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి తిరిగొచ్చారు. నెల తర్వాత మరో పిల్లిని దత్తత తీసుకున్నారు. 61 రోజుల తర్వాత కాలిఫోరి్న యాలో సాలినాస్‌కు 190 మైళ్ల దూరంలోని రోజ్‌విల్లేలో దాన్ని గుర్తించారు. దాంతో దంపతులిద్దరూ పరుగెత్తుకుని వెళ్లి దాన్ని ఇంటికి తెచ్చుకున్నారు. ‘మేం వెళ్లేసరికి ఆరోగ్యం పాడై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. లేదంటే ఆ 190 మైళ్లు కూడా దాటేసి ఇంటికే వచ్చేసేదేమో’అంటూ సుసానే మురిసిపోయింది. అయితే దాదాపు 1,000 మైళ్ల దూరంలోని వ్యోమింగ్ నుంచి రోజ్‌విల్లే దాకా అది ఎలా రాగలిగిందన్నది మాత్రం పజిల్‌గానే మిగిలిపోయింది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
సొంత నగరంపైనే రష్యా బాంబింగ్
మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న వేళ రష్యా వైమానిక దళం పొరపాటున సరిహద్దుల్లోని సొంత నగరంపైనే భారీ బాంబు వేసింది. ఉక్రెయిన్ సరిహద్దుకు 25 మైళ్ల దూరంలోని బెల్గొరొడ్ నగరంలోని అపార్టుమెంట్‌కు సమీపంలో తమ బాంబర్లు అనుకోకుండా ఒక బాంబు వేసినట్లు రష్యా మిలటరీ ధ్రువీకరించింది. ఈ ఘటనతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సుమారు 500 కిలోల బరువైన శక్తివంతమైన బాంబు పేలి 20 మీటర్ల లోతు గొయ్యి ఏర్పడింది. పలు కార్లు ధ్వంసమయ్యాయి. ఇద్దరు వ్యక్తులు గాయపడగా ఒక వ్యక్తి హైబీపీతో ఆస్పత్రి పాలయ్యాడని అధికారులు తెలిపారు. -
సొంత పట్టణం నిర్మించనున్న ఎలాన్ మస్క్
టెక్సాస్: ప్రపంచ కుబేరుడు, అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్ సొంతంగా ఒక పట్టణాన్నే నిర్మించబోతున్నారు. ఇందుకోసం ఆయన కంపెనీలు, అనుబంధ సంస్థలు టెక్సాస్‌లో వేలాది ఎకరాల భూమిని కొనుగోలు చేస్తున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఆస్టిన్‌కు సమీపంలోని బస్ట్రోప్ కౌంటీలోసుమారు 3,500 ఎకరాల భూమిని కొనుగోలు చేశాయి. స్నెయిల్ బ్రూక్ అనే పేరుతో సొంత పట్టణాన్ని నిర్మించే పనుల్లో ఎలాన్ మస్క్ నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా మస్క్‌కు చెందిన బోరింగ్ కంపెనీ, టెస్లా, స్పేస్ ఎక్స్ తదితర సంస్థలకు ఆస్టిన్ సమీపంలో ఉత్పత్తి కేంద్రాలున్నాయి. కొత్త పట్టణంలో మార్కెట్ ధర కంటే చౌకగానే ఆఫీసులను ఏర్పాటు చేయనున్నాయి. ఉద్యోగుల నివాసాలు కూడా ఇందులోనే ఉంటాయి. నూతనంగా రూపుదాల్చే స్నెయిల్ బ్రూక్‌లో 100కు పైగా భవనాలను నిర్మిస్తారు. ఇందులో స్విమ్మింగ్ పూల్, క్రీడా మైదానాల వంటి ఏర్పాట్లూ ఉంటాయి. టెస్లా ప్రధాన కార్యాలయంతోపాటు తన వ్యక్తిగత నివాసాన్ని కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌కు మారుస్తానని గతంలోనే మస్క్ ప్రకటించారని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం గుర్తు చేసింది. -
కిక్కిరిసిన జర్నీ.. అరకొర రైళ్లే.. ప్రైవేట్ బస్సుల్లో రెట్టింపు చార్జీలు వసూలు
సాక్షి, హైదరాబాద్: నగరం పల్లెబాట పట్టింది. సద్దుల బతుకమ్మ, దసరా సందర్భంగా నగరవాసులు సొంత ఊళ్లకు తరలి వెళ్తున్నారు. దీంతో గత రెండు రోజులుగా బస్సులు, రైళ్లలో రద్దీ పెరిగింది. పండగకు మరో మూడు రోజులే ఉండడడంతో శుక్రవారం పెద్ద సంఖ్యలో బయలుదేరారు. దీంతో మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లు, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర కూడళ్ల వద్ద ప్రయాణికుల రద్దీ కనిపించింది. అలాగే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి కూడా ప్రయాణికులు సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ సంఖ్యలో బయలుదేరారు. ఈ సంవత్సరం ఆర్టీసీ పుణ్యమా అని పండగ ప్రయాణికులకు కాస్త ఊరట లభించింది. ఆర్టీసీ బస్సుల్ని సాధారణ చార్జీలపైనే ప్రత్యేక బస్సులు నడుపుతుండడంతో ప్రయాణికుల ఆదరణ పెరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, కడప, కర్నూలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రైవేట్ బస్సుల్లో మాత్రం యథావిధిగా దారిదోపిడీ కొనసాగుతోంది. రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. దక్షిణమధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు అరకొరగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. డిమాండ్ మేరకు రైళ్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలకు అదనంగా ప్యాసింజర్ రైళ్లను ఏర్పాటు చేయకపోవడం వల్ల చాలా వరకు బస్సులపైనే ఆధారపడి ప్రయాణం చేయవలసి వస్తోంది. అరకొర రైళ్లే... ► ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయవలసి ఉండగా, ఈసారి అదనపు రైళ్లను చాలా వరకు తగ్గించారు. ► కొన్ని ప్రాంతాలకు మాత్రమే సుమారు 20 రైళ్లను అదనంగా ఏర్పాటు చేశారు. ► దసరా సందర్భంగా ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగించే వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాలకు ► అదనపు రైళ్లను ఏర్పాటు చేయకపోవడంతో ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లలో వెళ్లేందుకు అవకాశం లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ► ‘కనీసం జనరల్ బోగీలను కూడా అదనంగా ఏర్పాటు చేయడం లేదు. ఒక్కో బోగీలో వందలకొద్దీ కిక్కిరిసి ప్రయాణం చేయవలసి వస్తుంది’. అని కాగజ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఫణీంద్ర విస్మయం వ్యక్తం చేశారు. ► తెలంగాణ ప్రాంతాలకు రైలు సర్వీసుల విస్తరణలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని సికింద్రాబాద్ నుంచి వికారాబాద్‌కు వెళ్తున్న మరో ప్రయాణికుడు శ్రీనివాస్ ఆరోపించారు. దూరప్రాంతాలకు మాత్రమే పరిమితంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు... ► తెలుగు రాష్ట్రాలకు ప్రతి రోజు సుమారు 3500 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకొని 4400కు పైగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ► విజయవాడ, విశాఖపట్టణం, కాకినాడ, అమలాపురం, ఏలూరు, కర్నూలు, కడప, తిరుపతి తదితర నగరాలతో పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ► అక్టోబర్ 1 నుంచి రద్దీ మరింత పెరగనున్న దృష్ట్యా రోజుకు 500 నుంచి 1000 వరకు అదనపు బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఏ బస్సులు ఎక్కడి నుంచి బయలుదేరుతాయి.. సీబీస్: అనంతపూర్, చిత్తూరు, కడప,కర్నూలు,ఒంగోలు, తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్‌రోడ్డు: వరంగల్, హనుమకొండ, జనగామ, యాదగిరిగుట్ట వైపు దిల్సుఖ్నగర్: నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట .. జేబీఎస్: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వైపు వెళ్లేవి.. ఎల్బీనగర్: వైజాగ్, విజయవాడ, గుంటూరు వైపు .. ఎంజీబీఎస్: మహబూబ్‌నగర్,వికారాబాద్, తాండూరు, భద్రాచలం, తదితర ప్రాంతాలకు.. సాధారణ చార్జీలే.. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించరాదని, సాధారణ చార్జీలపైనే ఆర్టీసీ బస్సులు అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న దృష్ట్యా సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తమ్ నాయక్ కోరారు. ప్రయాణికులు ఆన్లైన్లో టిక్కెట్లు నమోదు చేసుకోవచ్చునని, నేరుగా ప్రయాణసమయంలోనూ టిక్కెట్లు తీసుకోవచ్చునని తెలిపారు. -
ఈటలపై భూకబ్జా ఆరోపణలు: కమలాపూర్‌లో హై టెన్షన్..
సాక్షి, వరంగల్: ఈటల రాజేందర్ స్వగ్రామం కమలాపూర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈటల భూ వివాదం రాజకీయ దుమారం రేపుతోంది. కమలాపూర్‌లో ఈటల అభిమానులు ఆందోళనకు దిగారు. ఆయనకు వస్తున్న ప్రజాదరణచూసి ఓర్వలేకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హుజూరాబాద్ నుంచి అభిమానులు హైదరాబాద్ బయలుదేరారు. ఈటలకు అన్యాయం చేస్తే సహించేది లేదని అభిమానులు అన్నారు. హైదరాబాద్‌లో కూడా మంత్రి ఈటలకు మద్దతుగా కార్యకర్తలు నిరసన చేపట్టారు. తమ నేతను అక్రమంగా భూ వివాదంలో ఇరికించారని ఆందోళనకు దిగారు. శామీర్‌పేట్‌లో కార్యకర్తల రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోయాయి. ఈటల రాజేందర్.. 2004 నుంచి ఎమ్మెల్యేగా, ఫ్లోర్ లీడర్‌గా, మంత్రిగా టీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితుల్లో కీలక నేత ఈటల. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పార్టీ, అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన పలుమార్లు తన అభిప్రాయాన్ని నర్మగర్భంగా చెపుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. అయితే.. ప్రజల పక్షాన మాట్లాడుతున్నానంటూ... కొన్ని సార్లు ప్రభుత్వంపై వాగ్బాణాలు సంధించేందుకూ వెనుకాడలేదు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఇటీవల చురుకైన పాత్ర పోషిస్తున్న ఈటల తన సమర్ధతను చాటుకున్నారు. వ్యాక్సిన్ కొరత విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అంతా సర్దుకుంటుందనుకునే లోపే శుక్రవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చిన మాసాయిపేట మండలంలోని అసైన్డ్ భూముల వివాదం కొత్త చర్చకు దారితీసింది. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరంగా మారింది. చదవండి: ఈటలపై భూకబ్జా ఆరోపణలు: వివరాలు వెల్లడించిన కలెక్టర్ ఈటల కథ క్లైమాక్స్‌కు.. ఏం జరగబోతోంది..? -
సీఎం సొంతూరులో తాగునీటికి కటకట
చండీగఢ్: హరియాణాలోని చాలా గ్రామాలు తాగునీరు లేక అల్లాడుతున్నాయి. రాజస్థాన్ సరిహద్దుకు దగ్గర్లో గల శివాని పట్టణం అందులో ఒకటి. ఇప్పుడీ పట్టణంపై అందరి దృష్టీ పడింది. ఎందుకంటే ఆ పట్టణం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సొంతూరు కావడమే అందుకు కారణం. శివానిలోని ప్రజలు తాగునీరు లేక అల్లాడిపోతున్నారు. మంచినీటి కోసం 11 రోజులుగా సబ్ డివిజనల్ ఆఫీసు ముందు ధర్నా చేస్తున్నారు. శివాని పట్టణంలో 5000 వేల లీటర్ల నీటి ట్యాంకర్‌ను రూ.1000కి కొనుగోలు చేయాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఈ యేడాది తక్కువ వర్షపాతం కురవడంతో నాలుగు వేల ఎకరాల్లోని శనగ పంట ఎండిపోయిందని చెప్పారు. అసలే కష్టాల్లో ఉన్న తమకు తాగునీరు కొనుక్కోవడం భారంగా మారిందని వారు చెబుతున్నారు. ప్రభుత్వం మంచి నీటి సరఫరా ట్యాంకర్ల ముందు గంటల తరబడి వేచిచూస్తే కొద్దిపాటి నీరు దొరుకుతుందని అదే గ్రామానికి చెందిన దయానంద్ పునియా అన్నారు. పునియా ఆల్ ఇండియా కిసాన్ సభ హరియాణా యూనిట్ కి అధ్యక్షునిగా ఉన్నారు. తాము ఇప్పటి వరకు అనేక మంది అధికారులకు తాగునీరు కోసం విన్నవించామని, అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి తమ సమస్యను చెప్పాలనే ఆలోచన ఇప్పటి వరకు రాలేదనన్నారు. ఇప్పుడీ విషయాన్ని కేజ్రీవాల్ దృష్టికి తీసుకు వెళతామని పేర్కొన్నారు. -
పండగకు ఊరెళ్లితే..!!
నల్లకుంట: పండుగొస్తే చాలు పట్నంలో ఉండేవారి మనస్సు పల్లెల వైపు మళ్లుతుంది. పుట్టిపెరిగిన ఊరు గుర్తొస్తుంది. అక్కడ పండుగ జరిగే తీరు ముచ్చటగొలుపుతుంది. అందుకే పేరుకు నగరాల్లో నివసిస్తున్నా.. పండుగ అనగానే సొంతూరి వెళ్లాలని అంతా ఆశిస్తారు. ఇక సంక్రాంతి పండుగ గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. హైదరాబాద్ అంతా ఖాళీ అవుతుంది. ఇదేవిధంగా సంక్రాంతి పండుగ కోసం ఆనందంగా సొంతూరి వెళ్లివచ్చిన ఓ జంటకు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. ఇంటికి గట్టిగా తాళం వేసి ఊరికి వెళ్లినా.. తిరిగొచ్చేసరికి దొంగలు పడి ఇల్లును గుల్ల చేశారు. ఇంట్లో వారు దాచుకున్న రూ. 12వేలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్న గోకుల్ దేవీలాల్(25) భార్య విజయలక్ష్మితో కలిసి నల్లకుంట టీఆర్టీ కాలనీలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 10న ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి స్వగ్రామం ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం వెళ్లారు. తిరిగి శనివారం హైదరాబాద్‌కు వచ్చిన దంపతులు ఇంటికి వెళ్లి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా ఇంట్లో వస్తువులన్నీ చిందర వందరగా పడిఉన్నాయి. ఇంట్లో ఉంచిన రూ. 12 వేల నగదు కూడా కనిపించలేదు. ఇంట్లో దొంగలు పడ్డారని గ్రహించిన గోకుల్ దేవీలాల్ వెంటనే నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులుస కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'సీఎం' సోంతుర్లో సంక్రాంతి శోభ
-
ఎనభై ఏళ్ళ వృద్ధుడి సృష్టి... డాగ్ ట్రైన్
తొమ్మిది బోగీలున్న ఓ చిన్నపాటి ట్రయిన్ ఇప్పుడా పట్టణంలో అందరినీ ఆకర్షిస్తోంది. దానిపేరు డాగ్ ట్రైన్. కుక్కలను సరదాగా రైడింగ్ కు తీసుకెళ్ళేందుకు ఓ జంతు ప్రేమికుడి సృష్టి అది. టెక్సాస్ లోని ఫోర్ట వర్త్ గ్రామంలో తిరుగుతున్న ఆ బుజ్జి రైలు... అక్కడివారినే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆకట్టుకుంటోంది. పదవీ విరమణ అనంతరం వ్యవసాయంలో స్థిరపడ్డ ఎనభై ఏళ్ళ వృద్ధుడు బోస్టిక్. నిరాశ్రయులకు, జంతువులకు స్నేహితుడుగా ఉంటూ, గ్రామంలో సెలబ్రిటీగా మారాడు. తన వద్ద ఉన్న తొమ్మిది పెట్స్ ఒకేసారి వాక్ చేసేందుకు వీలుగా ఓ కొత్తరకం రైలును సృష్టించి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. బోస్టిక్.. పదిహేనేళ్ళ నుంచి స్వగ్రామమైన ఫోర్ట్ వర్త్ లోని తన వ్యవసాయ క్షేత్రంలో వీధికుక్కలను చేరదీసి పెంచుతున్నాడు. వీధి చివరిలో ఉండే ఇంట్లో బోస్టిక్... అతడి సోదరుడూ నివాసం ఉంటారు. అయితే ఇతడు జంతుప్రేమికుడ్న విషయం తెలిసో ఏమో... చాలామంది వీధికుక్కలను సైతం ఇతడి ఇంటివద్ద వదిలి వెళ్ళిపోతుంటారు. దీంతో బోస్టిక్ వాటిని చేరదీసి వాటికి ఆహారం అందించడంతోపాటు, అవి నివసించేందుకు వీలుగా సౌకర్యాలు కూడ కల్పిస్తుంటాడు. తనవద్ద ఉన్న కుక్కలను వాకింగ్ కు తీసుకెళ్ళడం కూడ అలవాటు చేశాడు బోస్టిక్... అయితే ఇంట్లో పెంచుకునే ఒక్కదాన్నివాకింగ్ కు తీసుకెళ్ళేందుకే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. తొమ్మిది కుక్కలను ఒకేసారి తీసుకెళ్ళడం అంటే మాటలా? అతడికి అదో పెద్ద ఛాలెంజింగ్ గా మారింది. ఎన్నోసార్లు పెంపుడు కుక్కల నిపుణులతో చర్చించాడు. ఐదు కుక్కలే ఉన్నపుడు అన్నింటినీ ఒకేసారి తన ట్రాక్టర్ లో బయటకు తీసుకెళ్ళేవాడు. అవి తొమ్మిదికి చేరిన తర్వాత వాటి రైడింగ్ కోసం బోస్టిక్ పలు విధాలుగా ఆలోచించాడు. ఒకరోజు ట్రాక్టర్ కు రాళ్ళను తగిలించి లాగడాన్ని గమనించాడు. అప్పుడే బోస్టిక్ కు డాగ్ ట్రైన్ తయారు చేయొచ్చన్న థాట్ వచ్చింది. అతడు స్వతహాగా మంచి వెల్డర్ కూడ కావడంతో.. అనుకున్నదే తడవుగా ప్లాస్టిక్ డ్రమ్ములకు రంధ్రాలు చేసి చక్రాలను అమర్చి ఒకదానికొకటి కట్టి, తక్కువ ఖర్చుతో ఓ కొత్త రకం ట్రైన్ ను తయారు చేశాడు. తొమ్మిది కుక్కలూ ఒకేసారి వాకింగ్ కు వెళ్ళేందుకు వీలుగా ఉన్న ఆట్రైన్ ను ఆ పెంపుడు జంతువులు కూడ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాయి. ట్రైన్ ను చూడగానే వాకింగ్ కు వెళ్ళేందుకు సిద్ధమై... ఇబ్బంది పెట్టకుండా ఉత్సాహంగా ఒక్కోసీట్లో ఒక్కోటి ఎక్కి కూచోవడం ప్రారంభించాయి. డాగ్ ట్రైన్ చూసి స్థానికులు కూడ ఎంతో మురిసిపోతున్నారు. వారానికి రెండ్రోజులు తోకలూపుకుంటూ హ్యాపీగా ఆ పెట్ డాగ్స్ సంతోషంగా తిరిగి వస్తున్నాయి. ''నాకిప్పటికే ఎనభై ఏళ్ళు వచ్చాయి. ఇలా ఈ జంతువుల సంరక్షణ ఎంతకాలం నేను కొనసాగించగలనో తెలియదు. కానీ నేనున్నంతకాలం మాత్రం వీటి సంరక్షణకు ఏమాత్రం లోటు చేయను'' అంటున్నాడు బోస్టిక్. బోస్టిక్ సంరక్షణలో పెరుగుతున్న ఆ పెట్ డాగ్స్ ఎంత అదృష్టం చేసుకున్నాయో.. -
సొంతూరుకి ఎంపీ
దోమకొండ(నిజామాబాద్): తాను పుట్టి పెరిగిన గ్రామంలో మెదక్ ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. వివరాలు... ఎంపీ సొంతూరు అయిన నిజామాద్ జిల్లా దోమకొండ మండలం తుజాల్పూర్ గ్రామంలో ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. గ్రామస్తులను కలిస సమస్యలు అడిగి తెలసుకున్నారు. అనంతరం వాటి పరిష్కారానికి అధికారులతో మాట్లాడారు. ఎంపీ ,గ్రామ అభివృద్ధికి కమిటీలు వేశారు. -
కలాం అంత్యక్రియలు పూర్తి
-
మళ్లీ పల్లెబాట
సొంత ఊళ్లకు పయనమైన వలసజీవులు * సంక్షేమ ఫలాలు పొందేందుకు పరుగులు * ఆహార భద్రత, పింఛన్ల కోసం దరఖాస్తులు * వ్యయభారమైనా తప్పని పరిస్థితి మెదక్: ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వలస జీవులంతా ఇపుడు స్వగ్రామాల బాట పడుతున్నారు. ఒక్కరోజు సమగ్ర కుటుంబ సర్వే కోసం పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లిన శ్రమ జీవులు...ఇపుడు మరోసారి పల్లెముఖం పట్టాల్సిన పరిస్థితి తప్పనిసరైంది. పూట గడవక పొట్టకూటికోసం పట్నం వెళ్లిన వారంతా తమ పనులు మానుకొని ఆహార భద్రత కార్డులు, పింఛన్ల కోసం తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ సర్కార్ ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వే ఒకేరోజు నిర్వహించింది. సర్వేకు మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో వివిధ ప్రాంతాలకు వలసవెళ్లిన పల్లెవాసులు ఆగమేఘాల మీద తమ పనులు మానుకొని స్వగ్రామాలకు పరుగులు పెట్టారు. దీంతో దాదాపు తెలంగాణ రాష్ర్ట జనజీవనం స్తంభించింది. పథకాల కోసం పల్లెలకు అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలను అందించడానికి టీఆర్ఎస్ సర్కార్ మరోసారి వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో అర్హులకు పథకాలు అందించి, అనర్హులపై వేటు వేసేందుకు సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఆధారం చేసుకుంది. గతంలో ఉన్న రేషన్‌కార్డులను, పింఛన్ పథకాలను రద్దు చేస్తూ సమగ్ర సర్వే ప్రాతిపదికగా ఈనెల 15లోగా అర్హులైన లబ్ధిదారులంతా దరఖాస్తులు చేసుకోవాలని ఆదేశించింది. దీంతో కూలీనాలీ చేసుకునేందుకు పట్టణాలకు వలస వెళ్లిన గ్రామీణులు తిరిగి సొంతూళ్లకు పయనమవుతున్నారు. దరఖాస్తుల గడువు కేవలం ఐదు రోజులు మాత్రమే విధించారు. ఇందులో రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలు ముగిసిపోయాయి. దీంతో మరో మూడు రోజులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. తమ కుటుంబీకుల ద్వారా విషయం తెలుసుకున్న వలస జీవులు స్వగ్రామాలకు వెళ్లేందుకు నానా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీరా గ్రామాలకు వచ్చాక ఆధార్‌కార్డులు లేక కొంతమంది, ఇతర ధ్రువ పత్రాలు లేక మరికొంతమంది పరేషాన్ అవుతున్నారు. ఈ క్రమంలో కేవలం రూ.1 విలువ చేసే దరఖాస్తు ఫారాన్ని జిరాక్స్ సెంటర్ల వారు రూ.5 విక్రయిస్తుండగా, ఆధార్ నమోదు కోసం మీ సేవా కేంద్రాలు రూ.100 పైగా దండుకుంటున్నాయి. దరఖాస్తు తర్వాత ఊర్లోనే ఉండాలి పింఛన్లు, ఆహార భద్రత కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారు మరో 15 రోజుల పాటు స్వగ్రామంలోనే ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. దరఖాస్తులో తెలిపిన వివరాలను నిర్ధారణ చేసుకునేందుకు ఈనెల 16 నుంచి 30 వరకు మండల అధికారులు ఇంటింటి సర్వే నిర్విహ ంచనున్నారు. దీంతో అధికారులు ఎవరింటికి ఎప్పుడు వస్తారో తెలియక వలసజీవులంతా 15 రోజులపాటు ఇళ్ల వద్దే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్రైవేట్ ఉద్యోగాలు, కూలీ పనులు చేసుకునే శ్రామిక జీవులు ఉపాధిని కోల్పోయే పరిస్థితి నెలకొంది. మరోవైపు వికలాంగులు కూడా పింఛన్ల కోసం మెడికల్ సర్టిఫికెట్లు తీసుకురావాల్సిన పరిస్థితి తప్పనిసరైంది. అలాగే ఆధార్‌కార్డు లేనివారు కనీస ఎన్రోల్మెంట్నంబర్ను రాయాల్సి ఉం టుంది. ఇవన్నీ ఇతర ప్రదేశాల్లో నివసిస్తున్న వలసజీవులకు ఇబ్బందికరంగా మారాయి. దీంతో జీతాలు రాక పూట గడవని పరిస్థితి నెలకొంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా వారికి ఆహార భద్రత కార్డులు, పింఛన్లు వస్తాయోలేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కుటుంబ సమగ్ర సర్వే కోసం ఆగస్టులో సొంతూళ్లకు వచ్చిన వలసజీవులు, ఇటీవలే దసరా పండుగకూ ఓ సారి వచ్చిపోయారు. మళ్లీ ఇపుడు సర్కార్ సంక్షేమ ఫలాలు పొందాలంటే తప్పకుండా ఊర్లోనే ఉండాలని నిబంధన విధించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ పల్లెబాట పడుతున్నారు. ఇలా 15రోజులకోసారి స్వగ్రామాలకు వెళ్లిరావడం వల్ల ఖర్చులు పెరుగుతున్నాయని, దరఖాస్తు చేసుకున్నాక మరో 15 రోజుల పాటు గ్రామాల్లోనే ఉంటే తమ పూట గడిచేదెట్లా? అని శ్రామికులు ప్రశ్నిస్తున్నారు. అక్టోబర్ 25 వరకు పరిశీలనలు జరుపుతున్న సమయంలో కూడా లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నప్పటికీ ఏ అధికారి ఎప్పుడు తమ ఇంటికి వస్తాడో తెలియక వలసజీవులు ఆందోళన చెందుతున్నారు. -
సొంత ప్రజల గోడు పట్టించుకోని చంద్రబాబు