1,000 మైళ్లు..2 నెలలు | Lost cat travels from Wyoming to home in California | Sakshi
Sakshi News home page

1,000 మైళ్లు..2 నెలలు

Published Tue, Sep 24 2024 6:20 AM | Last Updated on Tue, Sep 24 2024 6:20 AM

Lost cat travels from Wyoming to home in California

అంత దూరాన తప్పిపోయిన పెంపుడు పిల్లి   రెణ్నెల్లలో క్షేమంగా స్వస్థలం చేరిన వైనం పెంపుడు జంతువులంటేనే ఎంతో విశ్వాసంగా ఉంటాయి. ఎంత దూరం వెళ్లినా తిరిగి తమ ఆవాసాలకు చేరి ఆశ్చర్యపరుస్తుంటాయి. కానీ ఏకంగా ఎన్నో మైళ్ల దూరాన తప్పిపోయిన ఓ పెంపుడు పిల్లి ఒకరకంగా చరిత్రే సృష్టించింది. అక్షరాలా వెయ్యి మైళ్లు వెనక్కు ప్రయాణించి మరీ రెండు నెలల తరవాత ఇల్లు చేరింది! ప్రాణప్రదమైన పిల్లి తిరిగి రావడంతో యజమానుల ఆనందానికి పట్టపగ్గాల్లేవు. 

అమెరికాలో కాలిఫోర్నియాలోని సాలినాస్‌కు చెందిన సుసానే, బెన్నీ అంగుయానోలకు రెండున్నరేళ్ల పిల్లి ఉంది. ముద్దుగా రెయిన్‌బో అని పిలుచుకునేవారు. జూన్‌ 4న పిల్లితో పాటు వ్యోమింగ్‌లోని ఎల్లో స్టోన్‌ పార్కుకు వెళ్లారు. ఏమైందో గానీ పిల్లి ఉన్నట్టుండి భయపడి పారిపోయింది. ఎంత పిలిచినా వెనక్కి తిరిగి కూడా చూడకుండా పరుగు తీసింది. రోజుల తరబడి వెదికినా లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి తిరిగొచ్చారు. 

నెల తర్వాత మరో పిల్లిని దత్తత తీసుకున్నారు. 61 రోజుల తర్వాత కాలిఫోరి్న యాలో సాలినాస్‌కు 190 మైళ్ల దూరంలోని రోజ్‌విల్లేలో దాన్ని గుర్తించారు. దాంతో దంపతులిద్దరూ పరుగెత్తుకుని వెళ్లి దాన్ని ఇంటికి తెచ్చుకున్నారు. ‘మేం వెళ్లేసరికి ఆరోగ్యం పాడై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. లేదంటే ఆ 190 మైళ్లు కూడా దాటేసి ఇంటికే వచ్చేసేదేమో’అంటూ సుసానే మురిసిపోయింది. అయితే దాదాపు 1,000 మైళ్ల దూరంలోని వ్యోమింగ్‌ నుంచి రోజ్‌విల్లే దాకా అది ఎలా రాగలిగిందన్నది మాత్రం పజిల్‌గానే మిగిలిపోయింది! 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement