
ఓటీటీల్లో కొన్ని సినిమాలు చాలా హడావుడితో రిలీజ్ చేస్తారు. మరికొన్నింటిని మాత్రం ఎలాంటి ప్రకటన లేకుండా సింపుల్ గా స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చేస్తారు. అలా ఇప్పుడు రెండు తెలుగు సినిమాల్ని ఓటీటీలోకి అందుబాటులోకి తెచ్చారు. ఇంతకీ అవేంటి? ఎందులో చూడొచ్చు?
కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన మూవీ 'తల'. తన కొడుకునే హీరోగా పెట్టి ఈ సినిమా తీశారు. ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ చేశారు. అసలు విడుదలైనట్లు కూడా తెలియనంత వేగంగా మాయమైపోయింది. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)
గతేడాది నవంబర్ 8న రిలీజైన 'జాతర' అనే సినిమా కూడా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ఒక ఊరిలో ఉండే గంగమ్మ తల్లి దేవత బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. పేరున్న నటీనటులు లేకపోవడంతో ఇదొకటి ఉందని కూడా ఎవరికీ తెలియదు.
అయితే ఈ రెండు తెలుగు సినిమాల్ని నేరుగా స్ట్రీమింగ్ చేసుంటే అయిపోయేది. కానీ రెంట్ విధానంలో ఎందుకు తీసుకొచ్చారనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న. త్వరలో ఉచితంగా స్ట్రీమింగ్ అందుబాటులోకి తెస్తారేమో చూడాలి?
(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి)


Comments
Please login to add a commentAdd a comment