బడా సినిమాల కంటే చిన్న చిత్రాలకే ఓటీటీల బాగా ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు అటు థియేటర్లు దొరికేవి కావు, ఆ తర్వాత రిలీజ్ చేద్దామంటే టీవీల్లోనూ పెద్దగా వేసేవారు కాదు. కానీ ఇప్పుడలా కాదు. పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేసే ఛాన్సులు ఇస్తున్నాయి. దీంతో సినీ ప్రేమికులు.. చిన్న చిత్రాలని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడలా రెండు తెలుగు సినిమాలు చాలారోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేశాయి.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్)
తెలుగులో గతేడాది వచ్చిన ఓ ప్రేమకథా సినిమా 'ప్రేమిస్తే చచ్చేది మేమే'. పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడంతో ఈ సినిమా ఎప్పుడొచ్చి వెళ్లిందనేది కూడా చాలామందికి తెలియదు. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లోకి ఈ చిత్రం వచ్చేసింది. పూర్తిగా నిబ్బానిబ్బీ తరహా కథతో ఈ చిత్రాన్ని తీశారు. ఓ ధనవంతులైన అమ్మాయి, ఆటో నడుపుకొనే కుర్రాడు ప్రేమలో పడితే.. చివరకు ఏమైందనేదే స్టోరీ. కథ పరంగా ఓకే కానీ బడ్జెట్ పరిమితి అనేది స్క్రీన్‌పై స్పష్టంగా కనిపించింది.
గతేడాది అక్టోబరు చివర్లో వచ్చిన మరో తెలుగు సినిమా 'ఓటు'. టైటిల్‌కి తగ్గట్లే ఓటు విలువ చెప్పే ఈ చిత్రం కూడా ఎప్పుడొచ్చి వెళ్లిపోయిందో జనాలకు పెద్దగా తెలియదు. పేరున్న నటీనటులు కూడా మూవీలో ఎవరూ లేరు. దీంతో ఈ చిత్రం అలా థియేటర్లలోకి వచ్చి ఇలా వెళ్లిపోయింది. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లోనే రిలీజైంది. ఒకవేళ ఏదైనా తెలుగు మూవీస్ చూస్తూ టైంపాస్ చేయాలనుకుంటే వీటిని ట్రై చేయొచ్చు.
(ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్)
Comments
Please login to add a commentAdd a comment