
తెలుగులో ప్రతి ఏడాది వందల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కాకపోతే స్టార్ హీరోల మూవీస్ కి ఉన్నంత హైప్ చిన్న చిత్రాలకు ఉండదు. వాటిని సరిగా పట్టించుకోరు. కానీ ఓటీటీలో లేదా యూట్యూబ్ లో వస్తే మాత్రం ప్రేక్షకులు టైమ్ పాస్ కోసం చూస్తుంటారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)
ఇప్పుడు అలాంటి ప్రేక్షకుల కోసమా అన్నట్లు ఓ తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది ఆగస్టు చివరలో రిలీజైన 'నేను కీర్తన' అనే మూవీ.. దాదాపు 8 నెలల తర్వాత అంటే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మధ్య కాలంలో ప్రైమ్ ఓటీటీలోకి ఇలానే చాలా చిన్న సినిమాలు వస్తున్నాయి.
నేను కీర్తన మూవీ విషయానికొస్తే.. ఆపదలో ఉన్నవాళ్లకు సాయపడే కుర్రాడు జానీ. ఇతడి జీవితంలోకి కీర్తన అనే అమ్మాయి వస్తుంది. తర్వాత జానీ లైఫ్ టర్న్ అవుతుంది. తనకు లభించిన ఓ వరాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా, సమాజ ప్రయోజనాలకు జానీ ఏవిధంగా ఉపయోగించాడనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: చెబితే బూతులా ఉంటుంది.. 'పెరుసు' మూవీ ఓటీటీ రివ్యూ)