Nenu Keerthana Movie
-
8 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు మూవీ
తెలుగులో ప్రతి ఏడాది వందల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కాకపోతే స్టార్ హీరోల మూవీస్ కి ఉన్నంత హైప్ చిన్న చిత్రాలకు ఉండదు. వాటిని సరిగా పట్టించుకోరు. కానీ ఓటీటీలో లేదా యూట్యూబ్ లో వస్తే మాత్రం ప్రేక్షకులు టైమ్ పాస్ కోసం చూస్తుంటారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)ఇప్పుడు అలాంటి ప్రేక్షకుల కోసమా అన్నట్లు ఓ తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది ఆగస్టు చివరలో రిలీజైన 'నేను కీర్తన' అనే మూవీ.. దాదాపు 8 నెలల తర్వాత అంటే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మధ్య కాలంలో ప్రైమ్ ఓటీటీలోకి ఇలానే చాలా చిన్న సినిమాలు వస్తున్నాయి.నేను కీర్తన మూవీ విషయానికొస్తే.. ఆపదలో ఉన్నవాళ్లకు సాయపడే కుర్రాడు జానీ. ఇతడి జీవితంలోకి కీర్తన అనే అమ్మాయి వస్తుంది. తర్వాత జానీ లైఫ్ టర్న్ అవుతుంది. తనకు లభించిన ఓ వరాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా, సమాజ ప్రయోజనాలకు జానీ ఏవిధంగా ఉపయోగించాడనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: చెబితే బూతులా ఉంటుంది.. 'పెరుసు' మూవీ ఓటీటీ రివ్యూ) -
'నేను కీర్తన' సినిమా రివ్యూ
చిమటా రమేశ్ బాబు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'నేను కీర్తన'. స్టోరీ, మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చింది కూడా ఈయనే. రకరకాల జానర్స్ కలిపి తీసిన ఈ మూవీ తాజాగా థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?అన్యాయాన్ని ఎదురిస్తూ, ఆపదలో ఉన్నవాళ్లకు జానీ అనే యువకుడి సాయం చేస్తుంటాడు. ఇతడి జీవితంలోకి కీర్తన అనే అమ్మాయి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత జానీ లైఫ్ ఎలా టర్న్ అయింది. తనకు లభించిన ఓ వరాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా, సమాజ ప్రయోజనాలకు జానీ ఏవిధంగా ఉపయోగించాడనేది మిగిలిన కథ.(ఇదీ చదవండి: వనపర్తిలో మా పెళ్లి.. హీరోయిన్ అదితీ ఇంకేం చెప్పింది?)ఎలా ఉందంటే?'మల్టీ జానర్ ఫిల్మ్'గా ప్రచారం చేసిన ఈ చిత్రంలో నిజంగానే అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. లవ్, సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ, రివెంజ్, హర్రర్ వంటి అంశాలన్నీ బ్యాలెన్స్ చేశారు. చిన్న సినిమాలో ఇన్ని జానర్స్ మిక్స్ చేయడం అవసరమా అని అనిపించినా.. స్టోరీ పరంగా పర్లేదనిపించింది.నటీనటుల విషయానికొస్తే రమేష్ బాబుకి ఇది తొలి సినిమా. హీరోగా చేస్తూనే అన్ని విభాగాల్లో తలో చెయ్యి తన వరకు కష్టపడ్డారు. హీరోయిన్లతో పాటు మిగిలిన పాత్రధారులు పరిధి మేరకు నటించారు. దర్శకుడిగా పర్లేదనిపించిన రమేష్ బాబు... రైటర్గా ఇంకాస్త శ్రద్ధ పెట్టాలి. సినిమా నిడివి కొంచెం తగ్గించి ఉంటే బాగుండేది. మిగతావన్నీ ఓకే ఓకే.(ఇదీ చదవండి: సరిగా కూర్చోలేకపోయిన హీరో సల్మాన్ ఖాన్.. ఏమైంది?) -
‘నేను - కీర్తన’ ట్రైలర్ రిలీజ్
చిమటా రమేష్ బాబు హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘నేను - కీర్తన’. రిషిత - మేఘన హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ని రిలీజ్ చేశారు. ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు, శోభారాణి, పద్మినీ నాగులపల్లి, గిడుగు కాంతికృష్ణ, వాసిరెడ్డి స్పందన పాల్గొని, "నేను - కీర్తన" చిత్రం చిమటా రమేష్ బాబుకు హీరోగా తిరుగులేని పునాది వేయాలని అభిలషించారు.రమేష్ బాబు మాట్లాడుతూ.. ఒక మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడానికి అవసరమైన ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. తన సోదరుడు నటించిన సినిమా అని అనడం లేదని, "నేను-కీర్తన" పైసా వసూల్ ఎంటర్టైనర్ అని చిత్ర సమర్పకురాలు చిమటా జ్యోతిర్మయి పేర్కొన్నారు. నిర్మాత చిమటా లక్ష్మీ కుమారి మాట్లాడుతూ... "ఎన్నో వ్యయప్రయాసలతో మల్టీ జోనర్ ఫిల్మ్ గా రూపొందించిన "నేను - కీర్తన" కచ్చితంగా నిరుపమాన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.