చిమటా రమేష్ బాబు హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘నేను - కీర్తన’. రిషిత - మేఘన హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు, శోభారాణి, పద్మినీ నాగులపల్లి, గిడుగు కాంతికృష్ణ, వాసిరెడ్డి స్పందన పాల్గొని, "నేను - కీర్తన" చిత్రం చిమటా రమేష్ బాబుకు హీరోగా తిరుగులేని పునాది వేయాలని అభిలషించారు.
రమేష్ బాబు మాట్లాడుతూ.. ఒక మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడానికి అవసరమైన ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. తన సోదరుడు నటించిన సినిమా అని అనడం లేదని, "నేను-కీర్తన" పైసా వసూల్ ఎంటర్టైనర్ అని చిత్ర సమర్పకురాలు చిమటా జ్యోతిర్మయి పేర్కొన్నారు. నిర్మాత చిమటా లక్ష్మీ కుమారి మాట్లాడుతూ... "ఎన్నో వ్యయప్రయాసలతో మల్టీ జోనర్ ఫిల్మ్ గా రూపొందించిన "నేను - కీర్తన" కచ్చితంగా నిరుపమాన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment