చిమటా రమేశ్ బాబు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'నేను కీర్తన'. స్టోరీ, మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చింది కూడా ఈయనే. రకరకాల జానర్స్ కలిపి తీసిన ఈ మూవీ తాజాగా థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
అన్యాయాన్ని ఎదురిస్తూ, ఆపదలో ఉన్నవాళ్లకు జానీ అనే యువకుడి సాయం చేస్తుంటాడు. ఇతడి జీవితంలోకి కీర్తన అనే అమ్మాయి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత జానీ లైఫ్ ఎలా టర్న్ అయింది. తనకు లభించిన ఓ వరాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా, సమాజ ప్రయోజనాలకు జానీ ఏవిధంగా ఉపయోగించాడనేది మిగిలిన కథ.
(ఇదీ చదవండి: వనపర్తిలో మా పెళ్లి.. హీరోయిన్ అదితీ ఇంకేం చెప్పింది?)
ఎలా ఉందంటే?
'మల్టీ జానర్ ఫిల్మ్'గా ప్రచారం చేసిన ఈ చిత్రంలో నిజంగానే అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. లవ్, సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ, రివెంజ్, హర్రర్ వంటి అంశాలన్నీ బ్యాలెన్స్ చేశారు. చిన్న సినిమాలో ఇన్ని జానర్స్ మిక్స్ చేయడం అవసరమా అని అనిపించినా.. స్టోరీ పరంగా పర్లేదనిపించింది.
నటీనటుల విషయానికొస్తే రమేష్ బాబుకి ఇది తొలి సినిమా. హీరోగా చేస్తూనే అన్ని విభాగాల్లో తలో చెయ్యి తన వరకు కష్టపడ్డారు. హీరోయిన్లతో పాటు మిగిలిన పాత్రధారులు పరిధి మేరకు నటించారు. దర్శకుడిగా పర్లేదనిపించిన రమేష్ బాబు... రైటర్‌గా ఇంకాస్త శ్రద్ధ పెట్టాలి. సినిమా నిడివి కొంచెం తగ్గించి ఉంటే బాగుండేది. మిగతావన్నీ ఓకే ఓకే.
(ఇదీ చదవండి: సరిగా కూర్చోలేకపోయిన హీరో సల్మాన్ ఖాన్.. ఏమైంది?)
Comments
Please login to add a commentAdd a comment