సరిగా కూర్చోలేకపోయిన హీరో సల్మాన్ ఖాన్.. ఏమైంది? | Salman Khan Rib Injury Not Sit Properly Video Viral | Sakshi
Sakshi News home page

Salman Khan: స్టార్ హీరో కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు!

Aug 30 2024 4:06 PM | Updated on Aug 30 2024 6:55 PM

Salman Khan Rib Injury Not Sit Properly Video Viral

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరిగా కూర్చోలేకపోయాడు. పదే పదే కదులుతూ ఇబ్బంది పడ్డాడు. దీంతో అభిమానులు కంగారు పడుతున్నారు. అసలు ఏం జరిగిందా అని మాట్లాడుకుంటున్నారు. తాజాగా ముంబైలో పర్యావరణ హిత వినాయక చవితి అందరూ జరుపుకోవాలనే ఉద్దేశంతో 'బచ్చే బోలే మోరియా' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో సల్మాన్ ఇబ్బంది పడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: నాని 'సరిపోదా శనివారం'కి ఊహించని కలెక్షన్స్‌!)

సల్మాన్‌కి ఏమైంది?
తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్ కొత్త సినిమా 'సికిందర్'. ఇందులో సల్మాన్ ఖాన్ హీరో. రీసెంట్‌గా షూటింగ్ టైంలో సల్మాన్ గాయపడగా.. పక్కటెముకలకు గాయమైందని తెలుస్తోంది. ఇలా ఓ వైపు నొప్పి వేధిస్తున్నా సరే ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఈ విషయాన్నే కార్యక్రమాన్ని నిర్వహించిన అమృత ఫడ్నవీస్ చెప్పకొచ్చారు.

గాయం ప్రమాదమా?
అయితే సల్మాన్ ఖాన్‌ ఇలా కుర్చీలో ఇబ్బంది పడుతున్న వీడియోని చూసి అభిమానులు కంగారు పడ్డారు. కానీ అదెమంత పెద్ద సమస్య కాదని, కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. 

(ఇదీ చదవండి: 'పుష్ప 2'.. సందేహాలు అక్కర్లేదు అంతా క్లారిటీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement