
నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన తాజా చిత్రం 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో రిలీజైంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ సినిమాకు తొలిరోజు నుంచే తొలి ఆట నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దసరా, హాయ్ నాన్న చిత్రాలతో హిట్స్ కొట్టిన నాని తన ఖాతాలో మరో సూపర్‌హిట్ ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.

అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన సరిపోదా శనివారం మూవీకి బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా కలెక్షన్స్ రాబట్టింది. గురువారం ఒక్క రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.24.11 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కేవలం ఇండియాలోనే అత్యధికంగా రూ.12 కోట్ల నెట్ రాట్టింది. ఈ మూవీని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా ఐదు భాషల్లో రిలీజ్ చేశారు మేకర్స్.
కాగా.. ఈ చిత్రం కోలీవుడ్ సూపర్ స్టార్ ఎస్‌జే సూర్య కీలక పాత్రలో నటించాడు. అంతే కాకుండా అభిరామి, అదితి బాలన్, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, అజయ్ ఘోష్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి జేక్స్ బేజాయ్ సంగీతమందించారు.
Comments
Please login to add a commentAdd a comment