SJ Suriya
-
సరిపోదా శనివారం బాక్సాఫీస్.. నాని మూవీకి ఊహించని కలెక్షన్స్!
నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన తాజా చిత్రం 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో రిలీజైంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ సినిమాకు తొలిరోజు నుంచే తొలి ఆట నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దసరా, హాయ్ నాన్న చిత్రాలతో హిట్స్ కొట్టిన నాని తన ఖాతాలో మరో సూపర్‌హిట్ ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన సరిపోదా శనివారం మూవీకి బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా కలెక్షన్స్ రాబట్టింది. గురువారం ఒక్క రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.24.11 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కేవలం ఇండియాలోనే అత్యధికంగా రూ.12 కోట్ల నెట్ రాట్టింది. ఈ మూవీని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా ఐదు భాషల్లో రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఈ చిత్రం కోలీవుడ్ సూపర్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్రలో నటించాడు. అంతే కాకుండా అభిరామి, అదితి బాలన్, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, అజయ్ ఘోష్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి జేక్స్ బేజాయ్ సంగీతమందించారు. -
రివ్యూ: ‘సరిపోయిందా’ శనివారం!
టైటిల్: 'సరిపోదా శనివారం' నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్జే సూర్య, సాయి కుమార్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, శుభలేఖ సుధాకర్, తదితరులునిర్మాణ సంస్థ: డివీవీ ఎంటర్టైన్మెంట్స్నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరిరచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయసంగీతం: జేక్స్ బిజోయ్సినిమాటోగ్రఫీ: మురళి జిఎడిటర్: కార్తీక శ్రీనివాస్విడుదల తేది: ఆగస్ట్ 29, 2024కథేంటంటే.. సూర్య(నాని)కి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ. అన్యాయాన్ని సహించడు. అయితే తల్లికి ఇచ్చిన మాట ప్రకారం వారంలో ఒక రోజు మాత్రమే తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఆ వారమే శనివారం. మిగతా ఆరు రోజులు ఎల్ఐసీ ఏజెంట్‌గా పని చేస్తూ.. తనకు కోపం వచ్చేలా చేసిన వ్యక్తుల పేర్లను డైరీలో రాసుకుంటాడు. శనివారం ఆ డైరీలో రాసుకున్న వాళ్ల భరతం పడతాడు. కట్ చేస్తే.. దయానంద్ అలియాస్ దయా(ఎస్జే సూర్య) క్రూరమైన పోలిస్ ఆఫీసర్. తనకు కోపం వస్తే చాలు.. సోకులపాలెం గ్రామంలోని ప్రజలు భయంతో వణికిపోతారు. దయా చేసే అన్యాయాలను చూసి తట్టుకోలేకపోతుంది కానిస్టేబుల్ చారులత(ప్రియాంక అరుల్ మోహన్). తన పైఅధికారి కావడంతో అతన్ని ఏమి చేయలేక.. సోకులపాలెం ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు సూర్య కూడా సోకులపాలెం ప్రాంతంలో జరుగుతున్నా అన్యాయాలను ఎదిరించాలని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సోకులపాలెం ప్రజలను దయా నుంచి విముక్తి కల్పించేందుకు సూర్య, చారులత కలిసి వేసిన ప్లాన్ ఏంటి? శనివారం మాత్రమే కోపాన్ని ప్రదర్శించే సూర్య.. క్రూరమైన సీఐ దయాను ఎలా ఎదిరించాడు? దయాకు సోకులపాలెం గ్రామ ప్రజలపై కోపం ఎందుకు? చిన్నప్పుడే వేరే ప్రాంతానికి వెళ్లిపోయిన సూర్య మరదలు కల్యాణికి చారులతకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు సోకులపాలెం ప్రజలకు దయా నుంచి విముక్తి లభించిందా లేదా అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఓ ప్రాంతాన్ని విలన్ పట్టి పీడిస్తుంటాడు. అతను చేసే అన్యాయాలను ఎదిరించి, ఆ ప్రాంత ప్రజలను కాపాడడానికి హీరో వస్తాడు. తనకు సంబంధం లేకున్నా.. వారికి అండగా నిలిచి చివరకు విలన్ నుంచి ఆ ప్రాంత ప్రజలకు విముక్తి కల్పిస్తాడు.. ఈ కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. సరిపోదా శనివారం కథ కూడా ఇదే ఫార్మాట్లో ఉంటుంది. అయితే అన్ని సినిమాల్లో మాదిరి హీరో ఎప్పుడు పడితే అప్పుడు కొట్టకుండా.. కేవలం వారంలో ఒక రోజు మాత్రమే కొట్టడం ఈ సినిమా స్పెషల్. అంతకు మించి ఇందులో కొత్తదనం ఏమీ ఉండదు. ఇదే విషయాన్ని చిత్రబృందం ముందు నుంచి చెబుతూ రావడం సినిమాకు కలిసొచ్చే అంశం. ట్రైలర్లోనే కథ ఏంటో చెప్పి ముందే ఆడియెన్స్ మైండ్ సెట్ చేశారు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కొత్త కథను చెప్పేందుకు ప్రయత్నం చేయలేదు కానీ.. రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమాలకు వాడే ఫార్మూలతో పాత కథనే కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. మదర్ సెంటిమెంట్.. ఫ్యామిలీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ కమర్షియల్ ఫార్మెట్లో కథనాన్ని నడిపించాడు. మొదలు.. మలుపు... దాగుడు మూతలు.. ముగింపు అంటూ కథను విడదీసి చెప్పాడు. నాని, ఎస్జే సూర్యల నుంచి అద్భుతమైన నటనను రాబట్టాడు. కానీ స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. సినిమా నిడివి కూడా ఎక్కువగా(174 నిమిషాలు) ఉండడం, ఊహకందేలా కథనం సాగడం ఉండడం సినిమాకు మైనస్. హీరో శనివారం మాత్రమే తన కోపాన్ని ప్రదర్శించడానికి గల కారణం సినిమా ప్రారంభంలోనే చూపించి.. ఆడియన్స్ మైండ్‌ని సెట్ చేశాడు. ఆ తర్వాత ఒకవైపు సూర్యకు, మరోవైపు సీఐ దయాకు భారీ ఎలివేషన్స్ ఇస్తూ..వీరిద్దరి మధ్య ఫైట్ జరిగితే ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఆలోచించేలా చేశాడు. అయితే ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్‌లో మొత్తం నాని-సూర్యల చుట్టే కథనం సాగుతుంది. అయితే సెకండాఫ్ ప్రారంభం అయిన కాసేపటికే ముగింపు ఎలా ఉంటుంది అనేది తెలిసిపోతుంది. ఊహకందేలా కథనం సాగినా..నాని, సూర్యలు తమ నటనతో బోర్ కొట్టకుండా చేశారు. కొత్తదనం ఆశించకుండా వెళ్తే ఈ సినిమా ఎంటర్టైన్ చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్ర అయినా.. తనదైన సహజ నటనతో ఆకట్టుకుంటాడు. ఇందులో కూడా ఓ డిఫరెంట్ పాత్ర చేశాడు. వారం మొత్తం ప్రశాంతంగా ఉండి.. ఒక్కరోజు మాత్రమే కోపం ప్రదర్శించే యువకుడు సూర్య పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషన్‌తో పాటు యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేశాడు. ఇక ఈ చిత్రం బాగా పండిన మరో పాత్ర ఎస్జే సూర్యది. నెగెటివ్ షేడ్స్ ఉన్న సీఐ దయా పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. సూర్య పాత్రను మలచిన తీరు..అతని నటన సినిమాకు ప్లస్ పాయింట్. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆ పాత్ర గుర్తిండిపోతుంది. ఇక కానిస్టేబుల్ చారులతగా ప్రియాంక అరుళ్ మోహన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో తండ్రిగా సాయి కుమార్, కార్పెరేటర్ కుర్మానంద్గా మురళీ శర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. జేక్స్ బిజోయ్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేసి సినిమా నిడివిని తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆగస్టు 29.. పోతారు.. మొత్తం పోతారు: హీరో నాని
‘‘ఈ మధ్య కొన్ని చోట్ల గమనించాను. ఏంటి సార్... కోవిడ్ తర్వాత ప్రేక్షకులు సినిమాలకు రావడం లేదంటున్నారు. మంచి సినిమాలు ఉన్నప్పుడు తప్పకుండా వస్తారు సార్. వస్తూనే ఉంటారు. మనమే అప్పుడప్పుడు మిస్ అవుతుంటాం. ఈసారి మిస్ అయ్యేదే లేదు. డిస్ట్రిబ్యూటర్స్‌కి, ఎగ్జిబిటర్స్‌కు ఏదైనా మాట చెప్పాల్సి వస్తే మనదో సామెత ఉంది. ‘కలిసొచ్చే కాలం వస్తే... నడిచొచ్చే సినిమా వస్తుంది’’ అంటారు కదా. సినిమా పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాం. ఆగస్టు 29.. పోతారు.. మొత్తం పోతారు... థియేటర్స్‌కు పోతారు’’ అని నాని అన్నారు. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా నటించారు. డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని మాట్లాడుతూ– ‘‘దయా పాత్రను మేం ఊహించినదానికన్నా ఎక్కువగా చేశారు ఏస్జే సూర్యగారు. దానయ్యగారు పాజిటివ్ పర్సన్ . అందుకే మంచి కథలు ఆయన్ను వెతుక్కుంటూ వస్తాయి. నిర్మాత కల్యాణ్‌కు ఈ సినిమా ట్రైనింగ్ గ్రౌండ్ అనుకోవచ్చు. వివేక్ ఆత్రేయ శివతాండవం ఏంటో థియేటర్స్‌లో చూస్తారు. ఈ సినిమా టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అని చెప్పారు. వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ– ‘‘అంటే.. సుందరానికీ!’ సినిమా రిలీజ్ డే రోజు నేను కన్ఫ్యూజ్ అయ్యాను. కొందరు ల్యాగ్ అన్నారు. మరికొందరు బాగుంది అన్నారు. అయితే నానీగారు నాకు మళ్లీ చాన్స్ ఇచ్చారు. చాన్స్ అన్నది చాలా చిన్న పదం. నానీగారు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు’’ అని తెలిపారు. డీవీవీ దానయ్య మాట్లాడుతూ– ‘‘కథల ఎంపికలో నానీగారు నంబర్ వన్ . కథ నచ్చితే కొత్త దర్శకులకూ అవకాశం ఇస్తారు. నానీగారితో సినిమా చేస్తే నిర్మాతకు టెన్షన్ ఉండదు. సాధారణంగా నేను ఏ సినిమా వేదికపైనా ఇంత మాట్లాడలేదు. సినిమా మాట్లాడిస్తుంది. ‘సరిపోదా శనివారం’ సినిమా చూశాను. పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుంది. ఈ సినిమాతో వివేక్ ఆత్రేయ ఓ పెద్ద కమర్షియల్ డైరెక్టర్ అవుతాడు’’ అని చెప్పారు. ‘‘సరిపోదా శనివారం’ కాన్సెప్ట్ నచ్చి ఓకే చెప్పాను. తెలుగు ప్రేక్షకుల కోసం సొంత డబ్బింగ్ చెప్పాను’’ అని వెల్లడించారు ఎస్జే సూర్య. ‘‘సూర్య (నాని పాత్ర), చారులత (ప్రియాంక పాత్ర)లను గుర్తు పెట్టుకుంటారు’’ అని తెలిపారు ప్రియాంకా అరుళ్. ‘‘నాని కష్టపడి స్టార్ అయ్యాడు. ఆస్కార్ వేదికపై మన ఖ్యాతి చాటారు డీవీవీ దానయ్య, రాజమౌళిగార్లు’’ అని పేర్కొన్నారు నటుడు అలీ. అతిథులుగా పాల్గొన్న దర్శకులు దేవా కట్టా ప్రశాంత్ వర్మ , శైలేష్ కొలను, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్ ఈ సినిమా విజయాన్ని ఆకాంక్షించారు. నాని తండ్రి రాంబాబు, సంగీత దర్శకుడు జేక్స్, కెమెరామేన్ మురళి తదితరులు పాల్గొన్నారు. -
నాని సినిమా 'సరిపోదా శనివారం' రన్‌టైమ్ ఇదే
నాని హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఆగష్టు 29న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. అయితే, తాజాగా ‘సరిపోదా శనివారం’ సెన్సార్ పూర్తి చేసుకుంది.భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ సినిమా సెన్సార్ వచ్చేసిందని ఒక వీడియో ద్వారా నాని, ఎస్జే సూర్య,ప్రియాంక మోహన్ కాస్త డిఫరెంట్‌గా తెలిపారు. సెన్సార్ బోర్డ్ U/A సర్టీఫికెట్ ఇచ్చిందని వారు చెప్పారు. సినిమా రన్‌టైమ్ 2 గంటల 35 నిమిషాలు ఉన్నట్లు నాని ప్రకటించారు. అయితే, వెంటనే తెరపైకి ఎస్జే సూర్య ఎంట్రీ వచ్చి ప్లస్ 15 మినిట్స్ అంటాడు. దీంతో సినిమా మొత్తం 2 గంటల 50 నిమిషాలు ఉన్నట్లు ప్రకటించారు. అంటే సుందరానికి.. కూడా ఇదే రన్ టైం కదా అంటూ ఎస్జే సూర్య గుర్తు చేసే ప్రయత్నం చేస్తుండగా.. అంటే కాదు ‘సరిపోదా శనివారం’ యాక్షన్ ఫిల్మ్ అని నాని తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆ వెంటనే ప్రియాంక ఎంట్రీ ఇచ్చి లవ్‌స్టోరీ కూడా అంటూ కామెంట్ చేస్తుంది. ఫన్నీగా సాగిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అంటే సుందరానికి, సరిపోదా శనివారం.. రెండు చిత్రాలకు దర్శకుడు వివేక్ ఆత్రేయ కావడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్లో మరోసారి సినిమా రానున్నడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.🥶#SaripodhaaSanivaaram #SuryasSaturday pic.twitter.com/lsfX1uQevb— Nani (@NameisNani) August 23, 2024 -
గేమ్ ఛేంజర్ సెట్లో ఈ సినిమా గురించే చర్చ: దిల్ రాజు కామెంట్స్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ 'సరిపోదా శనివారం'. ఈ సినిమాను వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించారు. దసరా, హాయ్ నాన్న తర్వాత నాని నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఆర్జే సూర్య గురించి ప్రస్తావించారు.దిల్ రాజు మాట్లాడుతూ..'గేమ్ ఛేంజర్ షూటింగ్లో ఎక్కువగా ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. గ్యాప్ వచ్చినప్పుడల్లా నానికి, ఎస్జే సూర్య మధ్య సీన్స్ గురించి చెప్పేవారు. నానికి కూడా విలన్‌గా ఎస్జే సూర్య దొరకడం చూస్తుంటే ఫుల్ మజా కనిపిస్తోంది. ఈ సినిమా గురించి నాకు ఎప్పుడు షేర్ చేస్తున్నందుకు ఎస్జే సూర్యకు థ్యాంక్స్. సరిపోదా శనివారం చిత్రంలో నాని, ఎస్జే సూర్య, ట్రైలర్ చాలు. ఈ మూవీ దసరాను బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.' అని అన్నారు. "Aug 29th na #Nani garu malli #Dasara records anni badhalu kodtaru ani korukuntunna"💥Producer #DilRaju garu at the #SaripodhaaSanivaaram Press Meet ❤️🔥 #NaturalStarNani #SJSuryah #YouWeMedia pic.twitter.com/YsmDl6nxtL— YouWe Media (@MediaYouwe) August 21, 2024 -
భారతీయుడు మళ్లీ వస్తున్నాడు.. అఫీషియల్ ప్రకటన
కమల్‌హాసన్- దర్శకుడు శంకర్ కాంబినేషన్లో విడుదలైన భారతీయుడు సినిమా సౌత్ ఇండియాలో భారీ హిట్‌ను అందుకుంది. 1996లో విడుదలైన ఈ చిత్రం పలు రికార్డ్స్ క్రియేట్ చేసి ఇప్పటికీ భారతీయుడు వారిద్దరి కెరియర్లో చాలా ప్రత్యేకం. ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించారు. కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో మనీషా కొయిరాలా, సుకన్య, కౌందమణి, సెంథిల్ తదితరులు నటించారు. అయితే ఈ సినిమా రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 1996లో శంకర్ దర్శకత్వంలో విడుదలైన 'భారతీయుడు' చిత్రంలో సేనాపతి పాత్రలో కమల్ దుమ్మురేపాడు. ఆ పాత్రలో ఆయన చూపిన ఆహార్యం, హావభావాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు తీసుకోవడం చట్ట విరుద్ధం అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ ఎప్పటికీ మరిచిపోలేము. అయితే, భారతీయుడు చిత్రాన్ని జూన్ 7న తెలుగు,తమిళంలో రీ-రిలీజ్ చేస్తున్నారు. నేడు ట్రైలర్ కూడా విడుదల కానుంది. 'భారతీయుడు'కు కొనసాగింపుగా ఇండియన్-2 కూడా తెరకెక్కిన విషయం తెలిసిందే. దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. జులై 12న ప్రేక్షకుల ముందుకు ఇండియన్2 రానుంది. దీంతో తొలి భాగం అయిన భారతీయుడు చిత్రాన్ని రీ-రిలీజ్ చేయడంతో కమల్ అభిమానులను ఉత్సాహంగా ఉన్నారు.Get ready to re-live the blockbuster experience once again! 🤩#Bharateeyudu - 1 Re-Release Trailer Out TOMORROW, Stay Tuned!!💥Releasing worldwide in Telugu & Tamil on June 7th at theatres near you! 🔥@ikamalhaasan @shankarshanmugh @arrahman @mkoirala @UrmilaMatondkar… pic.twitter.com/wC36I7saE6— AM Rathnam (@AMRathnamOfl) May 26, 2024 -
నయనతార భర్తకు 'ఎల్ఐసీ' నోటీసులు..!
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ చిత్రం అంటేనే సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈయన అజిత్‌తో ఒక చిత్రం చేయడానికి కొద్దిరోజుల క్రితం విశ్వప్రయత్నం చేశారు. కథా చర్చలు కూడా పూర్తి చేశారు. ఇక చిత్రం సెట్‌పైకి వెళ్లడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో కారణాలేమైనా ఆ చిత్రం నుంచి వైదొలిగారు. ఆ తరువాత 'లవ్ టుడే' చిత్రం ఫేమ్ ప్రదీప్‌రంగనాథన్ హీరోగా చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. లియో చిత్ర నిర్మాత సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార కూడా నటిస్తుంది. ఈ చిత్రానికి ఎల్ఐసీ (లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అదే ఈ చిత్ర దర్శక, నిర్మాతలను చిక్కుల్లో పడేసింది. ఎల్ఐసీ అనేది భారత్‌లో అత్యంత ప్రజాధరణ పొందిన జీవిత బీమా సంస్థ అని ఈ టైటిల్ తమ పేటెంట్ హక్కు అంటూ చిత్ర నిర్మాత, దర్శకులకు నోటీసులు జారీ చేసింది ఆ సంస్థ. ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఎవరూ స్పందించలేదు. అయితే ఎల్ఐసీ అనే టైటిల్‌ను వాడుకునే అవకాశం మాత్రం వీరికి లభించే అవకాశం ఉండదని సమాచారం. ఏదేమైనా నటి కృతిశెట్టి నాయకిగా నటిస్తున్న ఇందులో నటుడు ఎస్జే సూర్య ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే చడీచప్పుడు లేకుండా కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ఆవరణలో చిత్రీకరణను జరుపుకుంటోందని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
వివాహం చేసుకునే అభిమానులకు గిఫ్ట్.. సాయంలో లారెన్స్ ఎవర్గ్రీన్
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'జిగర్ తండ: డబుల్ ఎక్స్' దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'జిగర్ తండ'కు సీక్వెల్‌గా తెరకెక్కించిన ఈ సినిమా యాక్షన్ కామెడీ చిత్రంగా ప్రేక్షకులను మెప్పించింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిసెంబర్ 8 నుంచి ప్రసారం కానుంది. తాజాగా ఈ చిత్రం విజయోత్సవ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు కార్తీక సుబ్బరాజ్, ఎస్‌జె సూర్య, రాఘవ లారెన్స్, నవీన్ చంద్ర, సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ తదితరులు పాల్గొని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా నాకు మంచి విజయాన్ని అందించింది. కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాలో అసలైన హీరో అని నా మనసులో ఉంది. ఈ సినిమాకి దేవుడి ఆశీస్సులు చాలా ఉన్నాయి, అదే ఈ సినిమాకు భారీ విజయాన్ని ఇచ్చింది. నా అభిమానుల ప్రోత్సాహం ఎప్పటికీ మరిచిపోలేను. వారందరూ నా కుటుంబ సభ్యులే.' అని ఆయన అన్నారు. ఉచిత కళ్యాణ మండపం అభిమానులకు మరో శుభవార్తను లారెన్స్ ఇలా తెలిపాడు.. 'సినిమా విడుదలైన ప్రతిసారీ నా అభిమానులకు ఏదో ఒకటి చేయాలనుకుంటాను. అందుకే మా అమ్మ పేరు మీద కన్మణి కళ్యాణ మండపాన్ని త్వరలో నిర్మించబోతున్నాను. అందులో నా అభిమానులు ఉచితంగా పెళ్లి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నానంటే.. నా అభిమాని ఒకరు పెళ్లి పత్రిక ఇచ్చి నన్ను పెళ్లికి ఆహ్వానించారు. అప్పుడు పెళ్లి ఎక్కడ అని అడిగాను. అప్పుడు అతను తన ఇంట్లోనే అంటూ.. సరైన వసతిలేదని తెలిపాడు. కళ్యాణమండపంలో పెళ్లి చేసుకుందామనుకుంటే అంత డబ్బు లేదని తెలిపాడు. పెళ్లి సమయంలో సంతోషంగా ఉండాల్సిన వ్యక్తి అలా బాధగా కనిపించేసరికి నాకు నచ్చలేదు. దీంతో వాళ్ల కోసం ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే మా అమ్మ పేరుతో ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించాలనుకున్నాను. అక్కడ వంట పాత్రలతో సహా అన్నీ ఉంటాయి. ఎలాంటి డబ్బు చెల్లించకుండా ఉచితంగానే పెళ్లి చేసుకోవచ్చు. అని లారెన్స్ తెలిపాడు. -
నా భర్త నుంచి దూరం అయ్యాను: బిచ్చగాడు-2 నటి
కోలివుడ్లో ప్రముఖ నటిగా కొనసాగుతున్న షీలా రాజ్‌కుమార్ తన భర్త నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.కోలివుడ్లో షీలా రాజ్‌కుమార్ చాలా చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ద్రౌపది, టూలెట్, మండేలా, ఇటీవల విడుదలైన జిగర్తాండ డబుల్ ఎక్స్ వంటి చిత్రాల్లో ఆమె నటించింది. అరుణ్ విజయ్ నటించిన 'ఆరదు చినమ్' సినిమాతో ఆమె తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'టూ లెట్' సినిమాలో నటించింది. ఈ చిత్రం ద్వారా ఆమెకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. ఆ చిత్రానికి జాతీయ అవార్డు కూడా దక్కడం విషేశం. ఆ తర్వాత తమిళ, మలయాళ చిత్రాల్లో భారీగా అవకాశాలు వచ్చాయి. మండేలా సినిమాలో పోస్టల్ ఆఫీసర్ పాత్రలో నటించి అభిమానుల మన్ననలు పొందింది. ఆ తర్వాత తన నటనకు స్కోప్ ఉన్న మంచి పాత్రల్లో నటించడంపై దృష్టి సారిస్తోంది. ఈ ఏడాది దీపావళికి విడుదలైన కార్తీక్ సుబ్బరాజ్ జిగర్తాండ డబుల్ ఎక్స్‌లో ఎస్.జే సూర్య సరసన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌గా నటించింది. శివకార్తికేయన్‌తో నమ్మ వైట్టుప్ పిళ్లై, అసురవతం, పెట్టైకలి వెబ్ సిరీస్, జ్యోతితో కనిపించిన షీలా బిచ్చగాడు 2 చిత్రంలో విజయ్ ఆంటోని చెల్లెలు రాణిగా మెప్పించింది. మోహన్ జి దర్శకత్వం వహించిన ద్రౌపది చిత్రంలో ఆమె రిచర్డ్ రిషి సరసన నటించింది. ఈ సినిమా కులాల మధ్య విభేదాలను చూపిస్తూ తెరకెక్కింది. దీంతో తమిళనాట వివాదాన్ని సృష్టించింది. పెటైకాలి అనే వెబ్ సిరీస్‌లో ఆమె జల్లికట్టు ఎద్దును పెంచే మహిళగా నటించింది. కోలీవుడ్‌లో నటన శిక్షణ పాఠశాలను నడుపుతున్న చోళన్‌తో ఆమె వివాహం జరిగింది. తాజాగా వివాహబంధానికి ఫుల్స్టాప్ పెడుతున్నట్లు ఆమె ప్రకటించింది. తన వైవాహిక బంధాన్ని ఎందుకు వదులుకుంటుందో అనే కారణాన్ని ఆమె తెలపలేదు. చివరగా ధన్యవాదాలు చోళన్ అంటూ తన భర్త పేరు చేర్చి పోస్ట్ చేసింది.పరిశ్రమలోని వ్యక్తులు వరుసగా విడాకులు తీసుకోవడం అభిమానులను షాక్‌కు గురిచేస్తుండడం గమనార్హం. திருமண உறவிலிருந்து நான் வெளியேறுகிறேன் நன்றியும் அன்பும் @ChozhanV — Sheela (@sheelaActress) December 2, 2023 -
ఓటీటీలో జిగర్తాండ డబుల్ ఎక్స్.. అప్పటినుంచే స్ట్రీమింగ్
రాఘవ లారెన్స్, ఆర్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం జిగర్తాండ డబుల్ ఎక్స్. తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన జిగర్తాండ (ఈ మూవీ తెలుగులో గద్దలకొండ గణేశ్‌గా రీమేక్ అయింది)కు సీక్వెల్‌గా తెరకెక్కింది. నవంబర్ 10న తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది చిత్రం. తెలుగువారికి పెద్దగా కనెక్ట్ అవలేదు కానీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా వసూలు చేసింది. లారెన్స్, సూర్య నటనకైతే నూటికి నూరు మార్కులు పడ్డాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. డిసెంబర్ 8 నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఇంగ్లీష్‌లో కూడా త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించింది నెట్‌ఫ్లిక్స్. ఇది చూసిన అభిమానులు వెయిటింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కథేంటంటే.. కృపాకర్ (ఎస్జే సూర్య) కష్టపడి పోలీసు ఉద్యోగం సంపాదించుకుంటాడు. అంతలోనే చేయని తప్పుకు ఓ హత్య కేసులో జైలుపాలవుతాడు. కర్నూల్లోని జిగర్ తాండ మర్డర్ క్లబ్ గ్యాంగ్‌స్టర్ సీజర్ (రాఘవ లారెన్స్)ను చంపితే కేసు నుంచి బయటపడటమే కాకుండా తిరిగి ఎస్సై ఉద్యోగం పొందగలుగుతాడు. అందుకని సీజర్‌ను చంపే ఆపరేషన్‌ను పూర్తి చేసేందుకు ఒప్పుకుంటాడు. సీజర్కు హీరో అవ్వాలన్న పిచ్చి ఉందని తెలిసి దర్శకుడిగా అతడి దగ్గర చేరతాడు. మరి కృపాకర్ అనుకున్నది జరిగిందా? హీరోగా పేరు తెచ్చుకోవాలన్న సీజర్ కల నెరవేరిందా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే! Roll-camera-action!🎥 Indha Pandyaa Blockbuster paaka ellarum vaanga! 💥 Jigarthanda DoubleX is coming to Netflix on 8 December in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi! Coming soon in English.#JigarthandaDoubleXOnNetflix pic.twitter.com/r1OlgnTpLY — Netflix India South (@Netflix_INSouth) December 1, 2023 చదవండి: ఎవరైనా నా చేయి పట్టుకుంటారా?.. హీరోయిన్ పోస్ట్ చూశారా? -
'జిగర్ తండ డబుల్ ఎక్స్' ట్విటర్ టాక్.. రివ్యూ ఇచ్చిన ధనుష్
రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘జిగర్ తాండ డబుల్ ఎక్స్’. ఇది తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన జిగర్ తండ(ఈ మూవీ తెలుగులో గద్దలకొండ గణేశ్‌గా రీమేక్ అయింది) సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. నిజానికి తొలి భాగంలో హీరోగా నటించే ఛాన్స్ లారెన్స్‌కు వచ్చినప్పటికీ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ సినిమా చేయలేదు. ఫస్ట్ పార్ట్ మిస్.. సీక్వెల్లో ఛాన్స్ కానీ ఈ మూవీకి రెండు జాతీయ అవార్డులు రావడంతో సీక్వెల్ ఉంటే నటిస్తానని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుకు చెప్పాడు. అందుకు ఆయన ఓకే అన్నాడు. అలా సుమారు ఏడేళ్ల తర్వాత దీనికి సీక్వెల్‌గా తెరకెక్కింది జిగర్ తండ డబుల్ ఎక్స్. ఇందులో లారెన్స్ గ్యాంగ్‌స్టర్‌గా నటించాడు. ఎస్జే సూర్య దర్శకుడు కావాలనుకునే పాత్రలో కనిపించాడు. కార్తికేయన్ సంతానం నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నేడు(నవంబర్ 10న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చివరి 40 నిమిషాలు.. కొన్ని చోట్ల మాత్రమే ఫస్ట్ డే ఫస్ట్ షో పడ్డాయి. చాలా చోట్ల ఇంకా షో పడకపోవడంతో సినిమా ఎలా ఉందనే టాక్ ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. అటు హీరో ధనుష్ మాత్రం జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా చూసి ట్విటర్(ఎక్స్) వేదికగా రివ్యూ ఇచ్చాడు. ఈ మూవీలో సూర్య, లారెన్స్ నటన చాలా బాగుందని, సినిమా చివరి 40 నిమిషాలు అదిరిపోయిందని రివ్యూ ఇచ్చాడు. Watched jigarthandaxx. Fantastic craft from @karthiksubbaraj, being amazing has become an usual deal for @iam_SJSuryah. As a performer @offl_Lawrence is a revelation. @Music_Santhosh u r a beauty. The last 40 mins of d film steals your heart. All the best to the crew and cast. — Dhanush (@dhanushkraja) November 9, 2023 #JigarthandaDoubleX Review Good First Half and Very Good Second Half💥 S.J.Surya and Lawrence Performance Ultimate🔥 Music👏 Screenplay Brilliant 💥 Last 40 Minutes and Climax Verithanam🔥 Worth watch. My Rating 4.2/5⭐#Japan #Leo #Ayalaan #Salaar #CaptainMiller #TheMarvels pic.twitter.com/BrWGIkdTnT — LetsOTT (@letesott) November 10, 2023 #JigarthandaDoubleX Review Good First Half and Very Good Second Half💥 S.J.Surya and Lawrence Performance Ultimate🔥 Music👏 Screenplay Brilliant 💥 Last 40 Minutes and Climax Verithanam🔥 Worth watch. My Rating 4.2/5⭐#Japan #Leo #Ayalaan #Salaar #CaptainMiller #TheMarvels pic.twitter.com/BrWGIkdTnT — LetsOTT (@letesott) November 10, 2023 -
విజయ్ ఆంటోని కూతుర్ని తలుచుకుని విశాల్ ఎమోషనల్
హీరో విశాల్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మార్క్ ఆంటోని. సునీల్, నటి రీతూవర్మ, అభినయకింగ్స్లీ ముఖ్యపాత్రలు పోషించిన అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్‌కుమార్ నిర్మించారు. జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందించిన మార్క్ ఆంటోనీ చిత్రం ఈనెల 15న విడుదలవగా ప్రేక్షకుల విశేష ఆదరణతో విజయవంతంగా ప్రదర్శిమవుతోంది. ఈ చిత్రం దాదాపు రూ.65 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం చైన్నెలో జరిగిన సక్సెస్ మీట్లో విశాల్ మాట్లాడుతూ.. ఇంత భారీ చిత్రాన్ని నిర్మించడం ఒక్క వ్యక్తికి అంత సాధ్యం కాదన్నారు. దాన్ని నిర్మాత వినోద్‌కుమార్ సుసాధ్యం చేశారని అభినందించారు. ఈ చిత్రంలోని ఒక పాట కోసమే దాదాపు కోటిన్నర ఖర్చు చేశారని తెలిపారు. గజనీ మహ్మద్ 18 ఏళ్లు దండయాత్ర చేసి గెలిచినట్లు తాను 11 ఏళ్ల పోరాటం తర్వాత వచ్చిన విజయమే ఈ చిత్రం అన్నారు. ఈ చిత్రం ద్వారా తనకు దర్శకుడు అధిక్ రవిచంద్రన్, నటుడు సునీల్ వంటి మంచి మిత్రులు లభించారని పేర్కొన్నారు. యూనిట్ సభ్యులందరూ తమ చిత్రంగా భావించి మార్క్ ఆంటోనీ కోసం ఎంతగానో శ్రమించారని పేర్కొన్నారు. ఈ చిత్రం హిట్ అవుతుందని ముందే భావించాం.. కానీ ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని ఊహించలేదన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు విశాల్ పేర్కొన్నారు. విజయ్ ఆంటోని కూతురు మీరా మరణంపై స్పందిస్తూ ఆయన స్టేజీపై ఎమోషనలయ్యారు. విజయ్ తన కాలేజ్‌మేట్ అని పేర్కొన్న విశాల్.. మీరా ఆత్మకు శాంతి చేకూరాలంటూ కాసేపు మౌనం పాటించారు. తన తాను ఇంతకుముందు కొన్ని చిత్రాలు నిర్మించినా, మార్క్ ఆంటోని తన జీవితంలో మరిచిపోలేని చిత్రం అని నిర్మాత వినోద్ కుమార్ పేర్కొన్నారు. చదవండి: తండ్రి కన్నీరు పెడుతుంటే.. బావకు భజన చేసిన బుర్ర తక్కువ బాలయ్య -
Mark Antony Movie Review: ‘మార్క్ ఆంటోని’ మూవీ రివ్యూ
టైటిల్: మార్క్ ఆంటోని నటీనటుటు: విశాల్, ఎస్జే సూర్య, సునీల్, సెల్వ రాఘవన్, రీతువర్మ, అభినయ తదితరులు నిర్మాత: ఎస్ వినోద్ కుమార్ రచన-దర్శకత్వం: అధిక్ రవిచంద్రన్ సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్ సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజం ఎడిటర్: విజయ్ వేలుకుట్టి విడుదల తేది: సెప్టెంబర్ 15, 2023 కథేంటంటే.. ఈ సినిమా కథ 1975-1995 మధ్య కాలంలో జరుగుతుంది. సైంటిస్ట్ చిరంజీవి(సెల్వ రాఘవన్) టైమ్ ట్రావెల్లో గతంలోకి వెళ్లే టెలిఫోన్ని కనిపెడతాడు. దానికి కొన్ని కండీషన్స్ ఉంటాయి. అయితే అది కనిపెట్టిన కొద్ది రోజులకే అతను చనిపోతాడు. మరోవైపు గ్యాంగ్‌స్టర్ ఆంటోనీ(విశాల్) మరణించడంతో కొడుకు మార్క్(విశాల్)ని అతని ప్రాణ స్నేహితుడు జాకీ మార్తాండ(ఎస్జే సూర్య) సొంత కొడుకులా పెంచుతాడు. మార్క్‌కి తండ్రి ఆంటోనీ అంటే ద్వేషం. తన తల్లిని అతనే చంపాడని భావిస్తాడు. తండ్రిలా తాను రౌడీ కావొద్దని, కత్తులకు, తుపాలకు దూరంగా ఉంటూ మెకానిక్‌గా పని చేసుకుంటాడు. 1975లో చిరంజీవి కనిపెట్టిన టైమ్ ట్రావెల్ టెలిఫోన్ మార్క్ చెంతకు వస్తుంది. ఆ ఫోన్ ద్వారా తన తల్లిదండ్రులతో మాట్లాడగా.. ఓ నిజం తెలుస్తుంది. ఆ నిజమేంటి? ఆంటోనీ ఎలా మరణించాడు? మరణించిన తండ్రిని మార్క్ ఎలా బతికించుకున్నాడు? మార్క్ తల్లిని హత్య చేసిందెవరు? ఈ కథలో ఏకాంబరం(సునీల్) పాత్ర ఏంటి? రమ్య(రీతూ వర్మ)తో మార్క్ ప్రేమాయణం ఎక్కడికి దారి తీసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయి. 'ఆదిత్య 369' మొదలు మొన్నటి 'బింబిసార', 'ఒకే ఒక జీవితం' లాంటి చిత్రాలన్ని టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చి సూపర్ హిట్ అనిపించుకున్నాయి. అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే మార్క్ ఆంటోనీ. గ్యాంగ్‌స్టర్ డ్రామాకి టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ అంశాలను జోడించి కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని తెరెక్కించాడు దర్శకుడు అధిక్ రవిచంద్రన్. టైమ్ ట్రావెల్ టెలిఫోన్ సహాయంతో గతంలోకి వెళ్లిన తర్వాత ఎస్ జే సూర్య పండించే కామెడీ సినిమాకు ప్లస్ అయింది. ఎలాంటి సాగదీత లేకుండా కథ స్పీడ్‌గా ముందుకు సాగుతుంది. సైంటిస్ట్ చిరంజీవి 1975లో గతంలోకి వెళ్లే టెలిఫోన్ని కనిపెట్టే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కథ 1995కి షిఫ్ట్ అవుతుంది. ఫస్టాఫ్ మొత్తం ఎస్జే సూర్య కామెడీతో సరదాగా సాగిపోతుంది. ఆంటోని, జాకీ మార్తండ, మార్క్, మదన్ మార్తండ పాత్రలు పండించే కామెడీ, డైలాగ్స్ ఆకట్టుకుంటుంది. అయితే టైమ్ ట్రావెల్ మిషన్‌తో ప్రతిసారి గతంలోకి వెళ్లడం..మళ్లీ ప్రస్తుత కాలంలోకి రావడం.. కొన్ని చోట్ల ఆడియన్స్ కాస్త గందరగోళానికి గురవుతారు. ఇంటర్వెల్ వరకు కథ యమ స్పీడ్‌గా ముందుకు వెళ్తుంది. ఇక సెంకడాఫ్‌లో కథ నెమ్మదిగా సాగుతుంది. రిపీట్ సీన్స్ కొన్ని చోట్ల చిరాకు తెప్పిస్తాయి. సిల్క్ స్మిత ఎపిసోడ్, ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన సీన్స్ ఆకట్టుకుంటాయి. టెలిఫోన్ని ఉపయోగించి చనిపోయిన వారిని బతికించుకోవడం కొంతవరకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది కానీ ప్రతిసారి ఆ తరహా సన్నివేశాలే రిపీట్ కావడం ఇబ్బందిగా, గందరగోళంగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌కి ముందు వచ్చే అనకొండ(మిషన్ గన్) ఫైట్ సీన్ అయితే హైలైట్. ఈ సన్నివేశంలో విశాల్ ఎంట్రీ, గెటప్ అదిరిపోతుంది. ఓవరాల్‌గా ఎలాంటి లాజిక్కులు వెతక్కుండా వెళ్తే ‘మార్క్ ఆంటోనీ’ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడంతో పాటు ఎంటర్టైన్మెంట్ని అందిస్తుంది. ఎవరెలా చేశారంటే.. వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేయడం విశాల్‌కు అలవాటు. మార్క్ ఆంటోనిలో కూడా వైవిధ్యమైన పాత్రనే పోషించాడు. రెండు డిఫరెంట్ వేరియషన్స్ ఉన్న పాత్రలకు తనదైన నటనతో న్యాయం చేశాడు. లుక్ పరంగానూ వ్యత్యాసం చూపించాడు. ఇక క్లైమాక్స్‌లో గుండుతో కనిపించి షాకిచ్చాడు. ఈ సినిమాలో బాగా పండిన మరో పాత్ర ఎస్జే సూర్యది. జాకీ మార్తాండగా, అతని కొడుకు మార్తాండ్‌గా రెండు పాత్రల్లోనూ ఒదిగిపోయాడు. తెరపై ఆయన పండించిన కామెడీ సినిమాకు చాలా ప్లస్ అయింది. విశాల్, సూర్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడి నటించారు. ఇక గ్యాంగ్‌స్టర్ ఏకాంబరం పాత్రకు సునీల్ న్యాయం చేశాడు. టైమ్ ట్రావెల్ చేయగల ఫోన్ కనిపెట్టిన శాస్త్రవేత్త చిరంజీవి పాత్రలో సెల్వ రాఘవన్ తన పరిధిమేర చక్కగా నటించాడు. రీతూ వర్మ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ ఉన్నంతలో చక్కగా నటించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం జీవీ ప్రకాశ్ నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
రెమ్యునరేషన్ తీసుకుని డేట్స్ ఇవ్వని హీరోలకు షాక్!
తమిళనాడులో హీరోలు, నిర్మాతల మధ్య వివాదం ముదురుతోంది. రెమ్యునరేషన్, అడ్వాన్సులు తీసుకుని డేట్స్ ఇవ్వడం లేదంటూ నిర్మాతలు హీరోలపై మండిపడుతున్నారు. సరైన కథలతో కాకుండా పిచ్చి కథలతో ముందుకు వస్తే ఎలా డేట్లు సర్దుబాటు చేస్తామని అటు నటులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా వీరి మధ్య జరుగుతున్న వివాదంపై తమిళనాడు చిత్రమండలి స్పందించింది. శింబు, ఎస్జే సూర్య, అధర్వ, విశాల్, యోగి బాబు.. ఐదుగురు నటులకు రెడ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. మరి ఈ నిర్ణయంపై హీరోలు ఏమని స్పందిస్తారో చూడాలి! చదవండి: తనను ఎక్కడ సమాధి చేయాలో ముందే చెప్పిన రాకేశ్ మాస్టర్ -
వదంతి వెబ్‌సిరీస్‌కు అరుదైన గౌరవం
తమిళ సినిమా: ప్రస్తుతం సినిమాలకు ధీటుగా వెబ్ సిరీస్‌లు రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే సినిమాల్లో కంటే వెబ్సిరీస్లోనే నటించడానికి నటీనటులు ఆసక్తి చూపుతున్నారు. కారణం ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్‌తో పాపులారిటీ పెరుగుతుందనే భావం. తాజాగా అమేజాన్ ప్రైమ్ టైంలో డిసెంబర్ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్న వదంతి వెబ్ సిరీస్ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఇంతకుముందు విక్రమ్ వేద వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన పుష్కర్–గాయత్రి ధ్వయం నిర్మించిన వెబ్ సిరీస్ వదంతి. ఈ సిరీస్ ద్వారా ఆండ్రు లయిస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటుడు దర్శకుడు ఎస్జే సూర్య కథానాయకుడిగా నటించిన ఈ వెబ్ సిరీస్ ద్వారా నటి సంజనా నాయకగా పరిచయం అవుతోంది. నటి లైలా, నాజర్ తదితరులు ముఖ్యపాత్ర పోషించిన ఈ వెబ్ సిరీస్‌ను క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందినట్లు నిర్మాతలు తెలిపారు. అమెజాన్ ప్రైమ్ టైంలో డిసెంబర్ 2వ తేదీ నుం 240 దేశాల్లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. కాగా ఈ వెబ్ సిరీస్ గోవాలో జరిగిన 53వ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడటం విశేషం. ఇది తమకు అరుదైన గౌరవం అంటూ నిర్మాతలు పుష్కర్–గాయత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. -
ఇట్స్ అఫీషియల్.. RC15లో ప్రముఖ నటుడు సూర్య
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సాధారణంగా శంకర్ సినిమా అంటే ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దీనికి తగినట్లుగానే నటీనటులు, టెక్నీషియన్స్ విషయంలో ఏమాత్రం రాజీపడరాయన. తాజాగా RC15 కోసం ఓ స్టార్ యాక్టర్‌ను రంగంలోకి దించుతున్నారు. ప్రముఖ తమిళ నటుడు ఎస్.జే సూర్యను ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. ఈ విషయాన్ని చిత్రబృందం కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. సూట్ వేసుకొని చేతిలో ఫైల్ పట్టుకొని స్టైల్‌గా నడుస్తున్నట్లున్నఎస్.జే సూర్య పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. Versatile actor @iam_SJSuryah joins our stellar cast! Welcome on board sir @shankarshanmugh @AlwaysRamCharan@advani_kiara @yoursanjali @MusicThaman @DOP_Tirru @ramjowrites @saimadhav_burra @SVC_official #SVC50 #RC15 pic.twitter.com/Az5CQxIeta — Sri Venkateswara Creations (@SVC_official) September 9, 2022 -
నటి ‘ప్రేమలేఖ’ నెట్టింట్లో వైరల్
నటి ప్రియా భవానీశంకర్ తన ప్రియుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రేమలేఖ లాంటిది తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. ఇటీవల వార్తల్లో ఉంటుంన్న నటి ప్రియా భవానీశంకర్. అందుకు కారణం దర్శకుడు, నటుడు ఎస్జే.సూర్యతో ప్రేమాయణం అనే వదంతులు రావడమే. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అయిన ఈ అమ్మడు ఇప్పుడు సక్సెస్‌పుల్ కథానాయికిగా రాణిస్తోంది. మేయాదమాన్తో నాయకిగా ఎంట్రీ ఇచ్చిన ప్రియా భవానీశంకర్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో కమలహాసన్‌తో కలిసి ఇండియన్ 2 చిత్రంలో నటించే స్థాయికి చేరుకుంది. కాగా ఈ మధ్యలో ఎస్జే.సూర్యతో కలిసి మాన్స్టర్ చి త్రంలో నటించింది. ఆ చిత్రం సక్సెస్ అయ్యింది. తాజా గా బొమ్మై అనే మరో చిత్రంలో ఆయనతో జత కట్టింది. దీంతోనే వీరి మధ్య ప్రేమ సాగుతోందనే ప్రచారం వైరల్ అవుతోంది. అయితే ఈ వ్యవహారంపై నటుడు ఎస్జే.సూర్య క్లారిటీ ఇచ్చారు. ప్రియా భవానీశంకర్ తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని స్పష్టం చేశారు. అయినా సామాజిక మాధ్యమాలు వారి గురించి వదంతులు ప్రసారం చేస్తూనే ఉన్నాయి. తాజాగా నటి ప్రియా భవానీశంకర్ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న తన ప్రేమికుడు రాజ్‌కు ప్రేమలేఖ రాసింది. అందులో ‘పదేళ్ల క్రితం కళాశాలలో చాలా సంతోషంగా, ఆత్మస్థైర్యంతో చాలా ఓ మాదిరి అందం కలిగిన నన్ను నువ్యు ప్రేమించినప్పుడు ఆశ్యర్యపడలేదు. ఇప్పటికీ అన్నింటినీ దాటి ఇంకా నాతో ఉండాలని కోరుకోవడమే ఆశ్చర్యంగా ఉంది. పగిలిన భావాలను సేకరించుకుంటున్న ఒకరితో ఉండడం అంత సంతోషాన్నివ్వదు. నువ్వు నేను వినడానికి మరిచిన సంగీతం లాంటి వారం. గాయాలను మరచిపోవడానికి కొత్త ప్రేమను విమర్శించనవసరం లేదు. పరిస్థితులకు మారని అభిమానం చాలు. నాకు ఒక పాప పుడితే తన జీవితంలో నీలాంటి వాడు ఒకడు ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటాను. నక్షత్రాలు నిండిన నా జీవితంలో నువ్వు మాత్రమే సూర్యుడివి. పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని పేర్కొంది. అంతేకాకుండా తన ప్రియుడితో సన్నిహితంగా ఉన్న ఫొటో సహా ఈ అమ్మడు ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొన్న ఈ ప్రేమలేఖ ఇప్పు డు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌కు ఇప్పటివరకు రెండు లక్షలకుపైగా లైక్స్ రావడం విశేషం. View this post on Instagram I wasn’t surprised when you fell in love with the most happy, confident, less attractive, so called average looking ‘me’ from college a decade ago. But I am surprised you chose to stay with this ‘new me’ through everything. It is NOT fun & exciting to be with a broken person picking their destroyed pieces. நீ, நான் கேட்க மறந்த இசை. காயங்களை மறக்க புதிய காதலின் கிளர்ச்சி தேவையில்லை, சூழ்நிலைக்கு மாறாத அன்பு போதும் என்றிருக்கும் பேராண்மை. எனக்கு ஒரு பெண் குழந்தை பிறந்தா அவள் வாழ்க்கைல உன்னை மாதிரி ஒரு ஆண் இருக்கனும்னு நான் கடவுளை கேட்டுக்கறேன்😊 in my world full of stars you remain my sunshine! Happy birthday maa🤗 A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) on Jan 26, 2020 at 8:58pm PST -
వారిద్దరి ప్రేమాయణం సోషల్‌మీడియాలో వైరల్
నటుడు, దర్శకుడు ఎస్జే.సూర్య నటి ప్రియభవానీ శంకర్‌ని ప్రేమిస్తున్నట్లు, అయితే ఆమె ఆయన ప్రేమను తిరష్కరించినట్లు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రసారం వైరల్ అవుతోంది. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన నటి ప్రియాభవానీశంకర్. మేయాదమాన్ చిత్రంతో పరిచయం అయిన ఈ అమ్మడు ఆ చిత్ర విజయంతో పేరు తెచ్చుకుంది. ఈ తరువాత కార్తీతో నటించిన కడైకుట్టి సింగం వంటి చిత్రాల సక్సెస్ ప్రియభవానీశంకర్ పేరు మరింత ప్రాచుర్యం పొందింది. అయితే ఆ తరువాత సోలో హీరోయిన్గా ఎస్జే.సూర్యకు జంటగా నటించిన మాన్స్టర్ చిత్ర విజయం మరింత పాపులర్ చేసింది. చదవండి: నా గురించి అసత్య ప్రచారం చేస్తున్నారు: రష్మిక ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో కమలహాసన్‌కు జంటగా ఇండియన్–2 చిత్రంలో నటించే అవకాశం వరించే స్థాయికి చేరుకుంది. కాగా ఇప్పుడు మరోసారి ఎస్జే.సూర్యతో కలిసి బొమ్మై అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా ఆమె పేరును నటుడు ఎస్జే, సూర్యనే సిఫారసు చేశారనే ప్రచారం జరిగింది. దీంతో ఎస్జే.సూర్య, నటి ప్రియభవానీశంకర్ల మధ్య ప్రేమాయణం జరుగుతుందనే ప్రచారం హోరెత్తుతోంది. ఇప్పటివరకూ ఈ ప్రచారంపై పెదవి విప్పని నటుడు ఎస్జే.సూర్య తాజాగా స్పందించారు. ఆయన తన ట్విట్టర్లో పేర్కొంటూ కొందరు ఫూల్స్ తాను నటి ప్రియభవానీశంకర్కు ఐలవ్యూ చెప్పినట్లు, దాన్ని ఆమె నిరాకరించినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. చదవండి: సినిమాగా నయన, విఘ్నేశ్‌శివన్ ప్రేమకథ నిజానికి మాన్స్టర్ చిత్రం నుంచే నటి ప్రియభవానీశంకర్ తో పరిచయం తమ మధ్య మంచి స్నేహంగా మారిందన్నారు. ప్రియభవానీశంకర్ మంచి నటి అని పేర్కొన్నారు. తమ మధ్య స్నేహం తప్ప మరేదీ లేదని స్పష్టం చేశారు. తమ స్నేహాన్ని ఏదేదో ఊహించుకుంటూ తప్పుడు ప్రచారం చేయవద్దు అని అని వదంతులకు ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. కాగా నటుడు ఎస్జే.సూర్య ఇప్పటికీ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అన్నది గమనార్హం. అయితే ఈ వ్యవహారంపై నటి ప్రియభవానీశంకర్ మాత్రం మౌనం దాల్చింది. -
రాక్షసుడు!
గతేడాది మహేశ్‌బాబు హీరోగా వచ్చిన ‘స్పైడర్’ సినిమాలో విలన్ పాత్ర చేసిన ఎస్.జె. సూర్య గుర్తుండే ఉంటారు. 2001లో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ‘ఖుషి’ చిత్రానికి కూడా ఎస్.జె. సూర్యానే దర్శకుడని తెలిసిన విషయమే. అప్పుడప్పుడు హీరోగా, విలన్‌గా చేస్తుంటారాయన. ఇప్పుడు సూర్య హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘మాన్స్టర్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. మాన్స్టర్ అంటే రాక్షసుడు, భూతం అనే మీనింగ్స్ ఉన్నాయి. ‘ఒరు నాళ్ కూత్తు’ దర్శకుడు నెల్సన్ ఈ సినిమాకు దర్శ కత్వం వహిస్తున్నారు. ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావొచ్చింది. పిల్లల నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. -
కొత్త అవతారంలో సూర్య
రాక్ స్టార్లా కనిపిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా..? ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ హీరో కం డైరెక్టర్ పేరు తెగ వినిపిస్తోంది. ఓ స్టార్ హీరో సినిమాను డైరెక్ట్ చేసే చాన్స్ వచ్చినట్టుగానే వచ్చి మిస్ అయ్యింది. అదే సమయంలో మరోస్టార్ హీరో సినిమాలో విలన్‌గా నటించనున్నాడు. ఇలా టాప్ స్టార్స్‌తో డీల్ చేస్తున్న ఈ ఆర్టిస్ట్ ఎవరో కాదు.. తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య. ఎస్ జె సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన నెంజం మరప్పదిల్లై సినిమా పోస్టర్ ఇది. వర్ణ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సెల్వ, సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ జానర్ అనిపించుకున్న హర్రర్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎస్ జె సూర్యతో డిఫరెంట్ గెటప్ వేయించి సెల్వ ఆ లుక్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. మరో దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎస్ జె సూర్య సరసన రెజీనా హీరోయిన్గా నటిస్తోంది. -
ఈ పోస్టర్‌లోని నటుణ్ని గుర్తుపట్టగలరా..?
రాక్ స్టార్లా కనిపిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా..? ప్రస్తుతం టాలీవుడ్ ఈ హీరో కం డైరెక్టర్ పేరు తెగ వినిపిస్తోంది. ఓ స్టార్ హీరో సినిమాను డైరెక్ట్ చేసే చాన్స్ వచ్చినట్టుగానే వచ్చి మిస్ అయ్యింది. అదే సమయంలో మరోస్టార్ హీరో సినిమాలో విలన్‌గా నటించనున్నాడు. ఇలా టాప్ స్టార్స్‌తో డీల్ చేస్తున్న ఈ ఆర్టిస్ట్ ఎవరో కాదండి తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య. ఎస్ జె సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన నెంజం మరప్పదిల్లై సినిమా పోస్టర్ ఇది. వర్ణ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సెల్వ, సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ జానర్ అనిపించుకున్న హర్రర్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎస్ జె సూర్యతో డిఫరెంట్ గెటప్ వేయించి సెల్వ ఆ లుక్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. మరో దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎస్ జె సూర్య సరసన రెజీనా హీరోయిన్గా నటిస్తోంది. -
పవన్ రెండో సారి రిపీట్ చేస్తున్నాడు
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తి కావస్తొంది. ఈ 20 ఏళ్ల కెరీర్లో 20 సినిమాల్లో సోలో హీరోగా నటించాడు. అయితే ఇంత లాంగ్ కెరీర్లో పవన్ తన హీరోయిన్లను రిపీట్ చేసింది మాత్రం ఒకే ఒక్కసారి. తన మాజీ భార్య రేణుదేశాయ్‌తో కలిసి రెండు సినిమాల్లో నటించాడు పవన్. బద్రి సినిమాలో తొలిసారిగా కలిసి నటించిన ఈ జంట తరువాత జానీ సినిమాలో మరోసారి జంటగా కనిపించారు. అయితే ఇప్పుడు రెండో తన హీరోయిన్ రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు పవర్ స్టార్. తనతో గబ్బర్‌సింగ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్లో కలిసి నటించిన శృతిహాసన్‌తో కలిసి మరోసారి తెరను పంచుకోనున్నాడు. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కునున్న సినిమా కోసం హీరోయిన్గా శృతిహాసన్‌ను ఫైనల్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈసినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.