పవన్ రెండో సారి రిపీట్ చేస్తున్నాడు
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తి కావస్తొంది. ఈ 20 ఏళ్ల కెరీర్లో 20 సినిమాల్లో సోలో హీరోగా నటించాడు. అయితే ఇంత లాంగ్ కెరీర్లో పవన్ తన హీరోయిన్లను రిపీట్ చేసింది మాత్రం ఒకే ఒక్కసారి. తన మాజీ భార్య రేణుదేశాయ్తో కలిసి రెండు సినిమాల్లో నటించాడు పవన్. బద్రి సినిమాలో తొలిసారిగా కలిసి నటించిన ఈ జంట తరువాత జానీ సినిమాలో మరోసారి జంటగా కనిపించారు.
అయితే ఇప్పుడు రెండో తన హీరోయిన్ రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు పవర్ స్టార్. తనతో గబ్బర్సింగ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్లో కలిసి నటించిన శృతిహాసన్తో కలిసి మరోసారి తెరను పంచుకోనున్నాడు. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కునున్న సినిమా కోసం హీరోయిన్గా శృతిహాసన్ను ఫైనల్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈసినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.