భారతీయుడు మళ్లీ వస్తున్నాడు.. అఫీషియల్‌ ప్రకటన | Kamal Haasan's Bharateeyudu Movie Re-Release | Sakshi
Sakshi News home page

భారతీయుడు మళ్లీ వస్తున్నాడు.. అఫీషియల్‌ ప్రకటన

Published Mon, May 27 2024 7:23 AM | Last Updated on Mon, May 27 2024 9:04 AM

Kamal Haasan's Bharateeyudu Movie Re-Release

కమల్‌హాసన్‌- దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో విడుదలైన భారతీయుడు సినిమా సౌత్‌ ఇండియాలో భారీ హిట్‌ను అందుకుంది. 1996లో విడుదలైన ఈ చిత్రం పలు రికార్డ్స్‌ క్రియేట్‌ చేసి ఇప్పటికీ భారతీయుడు వారిద్దరి కెరియర్‌లో చాలా ప్రత్యేకం. ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించారు. కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో మనీషా కొయిరాలా, సుకన్య, కౌందమణి, సెంథిల్ తదితరులు నటించారు. అయితే ఈ సినిమా రీ-రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. 

1996లో శంకర్‌ దర్శకత్వంలో విడుదలైన 'భారతీయుడు' చిత్రంలో సేనాపతి పాత్రలో కమల్‌ దుమ్మురేపాడు. ఆ పాత్రలో ఆయన చూపిన ఆహార్యం, హావభావాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు తీసుకోవడం చట్ట విరుద్ధం అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్‌ ఎప్పటికీ మరిచిపోలేము. అయితే, భారతీయుడు చిత్రాన్ని జూన్‌ 7న తెలుగు,తమిళంలో రీ-రిలీజ్‌ చేస్తున్నారు. నేడు ట్రైలర్‌ కూడా విడుదల కానుంది.  

'భారతీయుడు'కు కొనసాగింపుగా ఇండియన్‌-2 కూడా తెరకెక్కిన విషయం తెలిసిందే. దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజల్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్, ప్రియా భవానీ శంకర్‌, ఎస్‌జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. జులై 12న ప్రేక్షకుల ముందుకు ఇండియన్‌2 రానుంది. దీంతో తొలి భాగం అయిన భారతీయుడు చిత్రాన్ని రీ-రిలీజ్ చేయడంతో కమల్ అభిమానులను ఉత్సాహంగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement