
తమిళనాడులో హీరోలు, నిర్మాతల మధ్య వివాదం ముదురుతోంది. రెమ్యునరేషన్, అడ్వాన్సులు తీసుకుని డేట్స్ ఇవ్వడం లేదంటూ నిర్మాతలు హీరోలపై మండిపడుతున్నారు. సరైన కథలతో కాకుండా పిచ్చి కథలతో ముందుకు వస్తే ఎలా డేట్లు సర్దుబాటు చేస్తామని అటు నటులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గత కొన్ని నెలలుగా వీరి మధ్య జరుగుతున్న వివాదంపై తమిళనాడు చిత్రమండలి స్పందించింది. శింబు, ఎస్‌జే సూర్య, అధర్వ, విశాల్, యోగి బాబు.. ఐదుగురు నటులకు రెడ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. మరి ఈ నిర్ణయంపై హీరోలు ఏమని స్పందిస్తారో చూడాలి!
చదవండి: తనను ఎక్కడ సమాధి చేయాలో ముందే చెప్పిన రాకేశ్ మాస్టర్
Comments
Please login to add a commentAdd a comment