tamil producers council
-
నాపై చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలి: విశాల్
‘‘ప్రస్తుత తమిళ నిర్మాతల మండలి నాపై చేసిన తీర్మానాన్ని 24 గంటల్లో వెనక్కి తీసుకోవాలి. లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటాను’’ అని హీరో విశాల్ అన్నారు. గతంలో తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా పని చేసిన విశాల్ పలు అవకతవకలకు పాల్పడ్డారని, మండలి నిధుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, ఇకపై విశాల్‌తో చిత్రాలు చేసే దర్శక–నిర్మాతలు తమను సంప్రదించాలంటూ తమిళ నిర్మాతల మండలి ఓ ప్రకటనలో పేర్కొంది.దీనిపై విశాల్ స్పందించి, తమిళ నిర్మాతల మండలికి ఓ లేఖ రాశారు. ‘‘మండలి నిబంధనలకు అనుగుణంగానే అప్పటి కార్యవర్గంలో బాధ్యతలు నిర్వహించిన కదిరేశన్, ఇతర సభ్యుల అంగీకారంతోనే సభ్యుల సంక్షేమం కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాం.. వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు వేశాం. ప్రత్యేక ఆడిటర్ చేసిన ఆరోపణల విషయంలో నన్ను వివరణ కోరలేదు.కార్యవర్గం చేసిన తీర్మానంతోనే ‘ఇళయరాజా 75’ పేరుతో సంగీత విభావరి నిర్వహించి, నిర్మాతల మండలికి మంచి పేరు తెచ్చిపెట్టాను. వాటికి సంబంధించిన వివరాలు మండలి కార్యాలయంలో ఉన్నాయి. అలాంటిది ఏ ఆధారాలున్నాయని నాతో చిత్రాలు చేసే దర్శక–నిర్మాతలు మండలిలో చర్చించాలని తీర్మానం చేస్తారు? ఆ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలి’’ అని స్పందించారు విశాల్. – సాక్షి, చెన్నై -
హీరో విశాల్‌ని టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. అసలేం జరుగుతోంది?
హీరో విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 'పందెం కోడి' సినిమా నుంచి ఇప్పటివరకు అడపాదడపా ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఎప్పుడూ వివాదాలని వెంటేసుకునే తిరిగే విశాల్.. గతంలోనూ ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ మూవీస్ గుత్తాధిపత్యాన్బ్ని, థియేటర్ల మాఫియాని ప్రశ్నించాడు. ఇప్పుడు తమిళ నిర్మాతల మండలితో వాగ్వాదానికి దిగాడు.(ఇదీ చదవండి: సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సింగర్ పోస్ట్ వైరల్!)గతంలో ఇదే తమిళ నిర్మాతల మండలికి అధ్యక్షుడిగా విశాల్ పనిచేశాడు. ఆ సమయంలో దాదాపు రూ.12 కోట్ల మేర నిధులు దుర్వినియోగం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే విశాల్‌తో ఎవరూ సినిమాలు చేయొద్దని నిర్మాతల మండలి అల్టిమేటర్ జారీ చేసింది. ఈ క్రమంలోనే విశాల్ ట్విట్టర్ వేదికగా పెద్ద పోస్ట్ పెట్టాడు.'మనం ఓ బృందంగా, సమష్టిగా కలిసి తీసుకున్న నిర్ణయాలు నీకు తెలియదా? మిస్టర్ కథిరేశన్.. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లోని సభ్యుల సంక్షేమం కోసం నిధులు ఖర్చు చేశాం. వారి కుటుంబం, విద్య, వైద్యం అంటూ ఇలా సంక్షేమానికి ఖర్చు చేశాం. మీరు అక్కడ మీ పని సక్రమంగా చేయండి.. ఇండస్ట్రీలో చాలా పని ఉంది.. డబుల్ టాక్సేషన్, థియేటర్ మెయింటైన్స్ ఛార్జెస్ అంటూ ఇలా ఎన్నో సమస్యలకు పరిష్కరాలు వెతకాల్సి ఉంది.. విశాల్ ఇక్కడ కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉంటాడు.. కావాలంటే నన్ను ఆపేందుకు ట్రై చేసుకోవచ్చు.. అసలు అక్కడ సినిమాలు తీసే నిర్మాతలున్నారా?' అని విశాల్ తన ట్వీట్‌తో ఆగ్రహాన్ని అంతా బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ధనుష్ 'రాయన్' సినిమా రివ్యూ) -
కొత్త రూల్స్.. తమిళనాడులోనే షూటింగ్.. తమిళులకే ఛాన్స్!
తమిళ చిత్రాలను అనవసరంగా విదేశాల్లో షూటింగ్ నిర్వహించరాదని దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి పేర్కొన్నారు. ఈ సమాఖ్య నిర్వాహకులు, తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులు బుధవారం సాయంత్రం చైన్నెలో సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో తీసుకున్న నిర్ణయాలను సెల్వమణి మీడియాకు వెల్లడించారు. అందులో ఒక సినిమాను నిర్మించడానికి ముందు నటీనటులు, సాంకేతికవర్గంతో ఒప్పందం చేసుకున్న తర్వాత ఆ వివరాలను ఫెఫ్సీకి లిఖిత పూర్వక లేఖ రాసి అందజేయాలన్నారు. అన్ని అంశాలు సక్రమంగా ఉన్నాయని చిత్ర నిర్మాత ఫెఫ్సీకి లిఖితపూర్వక లేఖను అందించిన తర్వాతే ఫెప్సీ కార్మికులు ఆ చిత్రాల్లో పనిచేస్తారన్నారు. లేకుంటే 2022, మార్చిలో చేసుకున్న ఒప్పందంలోని నిబంధనల్లో ప్రధానంగా తమిళ చిత్రాల షూటింగ్లలో తమిళ కళాకారులకే పని కల్పించాలని, తమిళ చిత్ర షూటింగ్ లను తమిళనాడులోనే నిర్వహించాలని చెప్పారు. షూటింగ్లో పనిచేసే దినసరి కార్మికులకు అదేరోజు వేతనాలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. చిత్ర కథను దర్శకుడే రాసుకుంటే ఆ తర్వాత ఆ కథ గురించి తలెత్తే సమస్యలకు ఆయనే బాధ్యత వహించాలన్నారు. నిర్మాతలను సమస్యల్లోకి లాగకూడదన్నారు. ఇతర రచయిత కథ అయితే దర్శకుడు అందుకు తగిన విధివిధానాలను రూపొందించాలన్నారు. చిత్రాన్ని ముందుగా నిర్ణయించిన బడ్జెట్లో నిర్ణయించిన రోజుల్లో పూర్తిచేయలేకపోతే నిర్మాతల వర్గం అందుకు కారణాలను లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. ఈనిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. FEFSI - Film employee's federation of south India new rules 1. For Tamil films only Tamil artists should be employed. 2. Shooting of films should happen only in Tamil Nadu. 3. Shoot should not take place in outside state or outside country without utmost necessity. 4. If… pic.twitter.com/Drno33OSX5 — Manobala Vijayabalan (@ManobalaV) July 20, 2023 చదవండి: ప్రాజెక్ట్ కె టైటిల్ గ్లింప్స్ రిలీజ్ -
రెమ్యునరేషన్ తీసుకుని డేట్స్ ఇవ్వని హీరోలకు షాక్!
తమిళనాడులో హీరోలు, నిర్మాతల మధ్య వివాదం ముదురుతోంది. రెమ్యునరేషన్, అడ్వాన్సులు తీసుకుని డేట్స్ ఇవ్వడం లేదంటూ నిర్మాతలు హీరోలపై మండిపడుతున్నారు. సరైన కథలతో కాకుండా పిచ్చి కథలతో ముందుకు వస్తే ఎలా డేట్లు సర్దుబాటు చేస్తామని అటు నటులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా వీరి మధ్య జరుగుతున్న వివాదంపై తమిళనాడు చిత్రమండలి స్పందించింది. శింబు, ఎస్జే సూర్య, అధర్వ, విశాల్, యోగి బాబు.. ఐదుగురు నటులకు రెడ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. మరి ఈ నిర్ణయంపై హీరోలు ఏమని స్పందిస్తారో చూడాలి! చదవండి: తనను ఎక్కడ సమాధి చేయాలో ముందే చెప్పిన రాకేశ్ మాస్టర్ -
చిక్కుల్లో షారుక్ చిత్రం, డైరెక్టర్‌పై తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు
‘కింగ్ ఖాన్’ జవాన్ మూవీ చిక్కుల్లో పడింది. ఈ మూవీ డైరెక్టర్ అట్లీపై ఓ కోలీవుడ్ నిర్మాత ఫిర్యాదు చేసినట్లు తమిళ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా బాలీవుడ్ బాద్షా షారుక్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో హిందీలో జవాన్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తోంది. దీంతో ఈ మూవీపై సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథ తనదని, డైరెక్టర్ అట్లీ దానిని కాపీ కొట్టాడని కోలీవుడ్ నిర్మాత మాణిక్యం నారాయణన్ ఆరోపించాడు. చదవండి: తండ్రి కాబోతున్న ప్రముఖ కమెడియన్, ‘అసలు పెళ్లెప్పుడు అయింది?’ అంతేకాదు డైరెక్టర్ అట్లీపై నిర్మాత మండలిలో ఫిర్యాదు చేసి జవాన్ టీంకి షాకిచ్చాడు. 2006లో తాము విజయ్ కాంత్ హీరోగా తెరకెక్కించిన ‘పేరరసు’ సినిమా కథనే అట్లీ ‘జవాన్’ పేరుతో హిందీలో నిర్మిస్తున్నాడంటూ ఆయన ఆరోపించాడు. అయితే ఈ సినిమాపై షారుక్ ఖాన్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. తమిళంలోనూ ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జవాన్ మూవీపై కాపీ రైట్ ఆరోపణలు రావడంతో బాద్షా ఫ్యాన్స్ ఆందోళన చేందుతున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు డైరెక్టర్ అట్లీ స్పందించకపోవడం గమనార్హం. మరి దీనిపై జవాన్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. చదవండి: సమంత వ్యాధి గురించి అప్పుడే తెలిసింది, అయినా తానే స్వయంగా..: యశోద నిర్మాత -
శింబు కేసులో నిర్మాతల సంఘానికి హైకోర్టు జరిమానా
High Court Fined Tamil Film Producers Council: నటుడు శింబు కేసులో తమిళ సినీ నిర్మాతల సంఘానికి చెన్నై హైకోర్టు రూ. లక్ష జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే నిర్మాత మైఖేల్ రాయప్పన్ నటుడు శింబు కథానాయకుడిగా నిర్మించిన అన్భానవన్ అడంగాదవన్ అసరాదవన్ చిత్రం 2016లో విడుదలైంది. ఈ చిత్రంలో నటించడానికి తనకు రూ.8 కోట్లు పారితోకం ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుని.. అడ్వాన్స్‌గా రూ.కోటి 51 లక్షలు ఇచ్చిన నిర్మాత మిగిలిన రూ.6 కోట్ల 48 లక్షలు చెల్లించలేదని ఆ మొత్తాన్ని ఇప్పించవలసిందిగా శింబు నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేశారు. చదవండి: సమంతపై దారుణమైన ట్రోల్స్.. చీచీ ఇలా దిగజారిపోతున్నావేంటి? అదే సమయంలో నిర్మాత మైఖేల్ రాయప్పన్ శింబుతో నిర్మించిన చిత్రంతో తాను తీవ్రంగా నష్టపోయానని, కాబట్టి శింబు నుంచి నష్టపరిహారాన్ని ఇప్పించవలసిందిగా నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మాత మైఖేల్ రాయప్పన్ తన గురించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయనపై శింబు చెన్నై హైకోర్టులో రూ.కోటికి పరువు నష్టం దావా వేశారు. ఆ పిటిషన్లో నిర్మాతల సంఘాన్ని, నడిగర్ సంఘాన్ని, అప్పటి ఈ సంఘం కార్యదర్శి విశాల్‌ను ప్రతివాదులుగా చేర్చారు. చదవండి: బిగ్‌బాస్: వారానికి ముమైత్ ఖాన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? చాలాకాలంగా విచార ణలో ఉన్న ఈ కేసును బుధవారం న్యాయమూర్తి నీ.వేల్ మురుగన్ సమక్షంలో మరోసారి విచారణకు వచ్చింది. ఈ కేసులో 1080 రోజులు అయినా నిర్మా త సంఘం లిఖిత పూర్వకంగా వాదనలను కోర్టులో దాఖలు చేయని కారణంగా ఆ సంఘానికి రూ.లక్ష అపరాధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మొ త్తాన్ని ఈ నెల 31వ తేదీలోగా కోర్టు రిజిస్టర్ కార్యాలయంలో చెల్లించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ ఒకటవ తేదీకి వాయిదా వేశారు. -
సంగీతంలో రాజాగారే నాకు స్ఫూర్తి
సంగీత జ్ఞాని ఇళయరాజా 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ఇళయరాజా 75’ పేరుతో గత శని, ఆదివారాల్లో చెన్నైలో ఘనంగా వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకను తమిళ నిర్మాతల మండలి నిర్వహించింది. ఈ వేడుకలోని హైలెట్స్... ► ఇళయరాజాగారితో ఉన్న అనుబంధం గురించి రెహమాన్ మాట్లాడుతూ – ‘‘నేను రాజాగారి దగ్గర పని చేసిన రోజులు నాకింకా గుర్తున్నాయి. ‘మూండ్రామ్ పిరై’ (వసంత కోకిల) సినిమాకు రాజాసార్ టీమ్‌లో జాయిన్ అయ్యాను. రాజాగారు రికార్డింగ్ స్టూడియోలోకి ప్రవేశిస్తుంటే ,హెడ్ మాస్టర్ క్లాస్‌రూమ్‌లోకి వస్తున్న భావన కలిగేది. ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. సంగీతంలో రాజాగారే నాకు స్ఫూర్తి’’ అన్నారు. ► ఈ కార్యక్రమానికి సీనియర్ నటి, మణిరత్నం భార్య సుహాసిని యాంకర్‌గా వ్యవహరించారు. ‘రెహమాన్ మిమ్మల్ని గురువు అన్నారు. దాని గురించి ఏదైనా పంచుకుంటారా? అని ఇళయరాజాని ఆమె అడగ్గా– ‘‘రెహమాన్ తన తండ్రి దగ్గర కంటే నా దగ్గరే ఎక్కువ ఉన్నాడు. కరెక్టే కదా (రెహమాన్ వైపు చూస్తూ). దానికి రెహమాన్ అవును అన్నారు. ‘ఈ విషయాలన్నీ నువ్వు (రెహమాన్) చెప్పాలి’ అని సరదాగా పేర్కొన్నారు. మరో యాంకర్‌గా వ్యవహరించిన నటి కస్తూరి.. రెహమాన్ కంపోజ్ చేసిన ఏదైనా పాటను పాడమని అడగ్గా ఇళయరాజా ‘మౌనరాగం’ చిత్రంలోని ‘మండ్రం వంద తెండ్రులుక్కు.’ అనే పాటను ఆలపించారు. అదే సమయంలో కీబోర్డ్ దగ్గర ట్యూన్ చేస్తున్న రెహమాన్.. సంగీతజ్ఞాని పాట వింటూ ఆగిపోయారు. ‘ఏమైంది? ట్యూన్ సరిగ్గా గుర్తులేదా? ’ అంటూ రాజా చమత్కరించారు. ► రజనీకాంత్ మాట్లాడుతూ – ‘‘ఇళయరాజా స్వయంభూలింగం. ధోతి ధరించకముందు వరకూ సార్ అని పిలిచేవాణ్ని. ఆ తర్వాత నుంచి స్వామి అంటున్నాను. రాజాగారు కూడా నన్ను అలానే పిలుస్తారు. నాకంటే కమల్‌కు మంచి సంగీతాన్ని అందించారు’’ అని రజనీ అంటుండగా, ఇళయరాజా అందుకుంటూ ‘కమల్‌హాసనేమో మీకు మంచి మ్యూజిక్ ఇచ్చాను అంటుంటారు. నాకు యాక్టర్ ఎవరన్నది కాదు. ఏ పాటకైనా నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను’’ అన్నారు. ► కమల్ హాసన్ ఆయన కుమార్తె శ్రుతీహాసన్ స్టేజ్ మీద మూడు పాటలు పాడి, ఇళయరాజాతో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. ‘‘నేను రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నప్పుడు రాజాగారు సలహాలిచ్చారు’’ అన్నారు కమల్. ► ‘‘సంగీతానికి ఒకరే రాజు. ఆయనే ఇళయరాజా. లాంగ్‌డ్రైవ్‌లకు వెళ్తున్నప్పుడు బండిలో పెట్రోల్ ఉందా లేదా అని చూసుకోవడం కంటే ముందు ఇళయరాజా పాటలున్నాయా? లేదా ? అని చెక్ చేసుకుంటారు. ఇలాంటి లెజెండ్స్‌ను సన్మానించుకోవడం మా బాధ్యత. ఇండస్ట్రీలోని వాళ్లకోసం ఇండస్ట్రీ వాళ్లం ఈవెంట్స్ చేయడంలో తప్పు లేదనుకుంటున్నాను. ఈ వేడుక చరిత్రలో మిగిలిపోతుంది. అలాగే దీన్ని వ్యతిరేకించినవాళ్లు కూడా చరిత్రలో ఉంటారు’’ అని పేర్కొన్నారు నిర్మాతల మండలి అధ్యక్షుడు, హీరో విశాల్. రెహమాన్, ఇళయరాజా శ్రుతీహాసన్, కమల్‌హాసన్ కమల్, రజనీ -
సంగీత జ్ఞానికి ఘన సత్కారం
సంగీతజ్ఞాని ఇళయరాజాకు శనివారం సాయంత్రం చెన్నైలో ఘనసత్కారం జరిగింది. 1000కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించి రికార్డుకెక్కిన ఇళయరాజా 75 వసంతాలను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ సంగీత రాజాకు తమిళ నిర్మాతల మండలి చెన్నైలో అభినందన సభ నిర్వహించింది. శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు, చెన్నై నందనంలోని వైఎంసీఏ మైదానంలో బ్రహ్మాండమైన సంగీత విభావరిని తలపెట్టారు. అందులో భాగంగా శనివారం సాయంత్రం జరిగిన ఈ సంగీత కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘1996లో ‘అన్నక్కిళి’ చిత్రంతో తన సంగీత పయనాన్ని ప్రారంభించిన ఇళయరాజా గ్రామీణ, తమిళ సంప్రదాయ పాటలకు ప్రాణప్రతిష్ట చేశారు. 13 రోజుల్లో సింపోనికి బాణీలు కట్టి ప్రపంచ రికార్డు సాధించిన ఘనత ఇళయరాజాది. ప్రపంచస్థాయిలో అభిమాన గణం కలిగిన ఇళయరాజా ఇంకా పదికాలాల పాటు సంగీత దర్శకుడిగా కొనసాగాలి’’ అన్నారు. సంగీత సామ్రాజ్యానికి ఏకైక రారాజు ఇళయరాజానే అని తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, నటుడు విశాల్ సంగీతజ్ఞానిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఆర్ రెహమాన్ తన మార్గదర్శి ఇళయరాజానే అని పేర్కొన్నారు. కాగా ఈ వేదికపై సినీ పరిశ్రమ తరఫున ఇళయరాజాకు బంగారంతో చేసిన వయోలిన్‌ను బహూకరించి ఘనంగా సత్కరించారు. -
పెళ్లి కోసం మండపాన్ని బుక్ చేసిన విశాల్
సాక్షి, చెన్నై : హీరో, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. అయితే పెళ్లి వచ్చే ఏడాది జనవరిలో జరగనుందట. అయితే పెళ్లి కూతురు ఎవరనేది మాత్రం విశాల్ వెల్లడించలేదు. నిన్న (శుక్రవారం) అతడు చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణం వేగంగా జరుగుతోందని, డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందని, జనవరిలో ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపాడు. సంఘం సొంత భవనంలో జరగనున్నమొదటి వివాహం తనదే అవుతుందని, అందుకు మండపానికి అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకున్నట్లు విశాల్ పేర్కొన్నాడు. సినిమాల్లోనే అనుకున్నా.. ఇక చెన్నైలో రౌడీముఠా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంపై విశాల్ స్పందిస్తూ...‘రౌడీ ముఠా పుట్టిన రోజు వేడుకను జరుపుకోవడం, అందులో ఆటా, పాటా లాంటివి సినిమాల్లోనే చూపిస్తారనుకుంటామని, నిజ జీవితంలో జరగడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, వారిని చాకచక్యంగా అరెస్ట్ చేసిన పోలీసులను అభినందించాడు. మార్చి నుంచి సమ్మె చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న క్యూబ్, జీఎస్టీ లాంటి సమస్యలపై పోరాడే విధంగా దక్షిణ భారత సినీనటుల సంఘం మార్చి ఒకటి నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి చిత్రాల విడుదల ఉండదని వెల్లడించారు. ఈ విషయమై స్పందించిన విశాల్ మార్చి 1 నుంచి సమ్మె తథ్యం అని స్పష్టం చేశాడు. అయితే క్యూబ్ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని, చర్చలు సఫలం అవుతాయని భావిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశాడు. అమెరికలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తమిళభాషకు ప్రత్యేక విభాగం ఏర్పాటుకు నిధులను అందించే విషయమై నటీనటుల సంఘం సమాలోచనలు చేస్తోందని తెలిపాడు. -
నటుడు విశాల్ కు షాక్
చెన్నై: సినీ నటుడు, నడిగర్ సంఘం విశాల్ కు తమిళ నిర్మాతల మండలి(టీఎఫ్ పీసీ) షాక్ ఇచ్చింది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ(వీఎఫ్ఎఫ్) సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఓ తమిళ మేగజిన్ కు ఇచ్చిన ఇంటర్వూలో నిర్మాతల మండలిపై విశాల్ చేసిన కామెంట్లకు వివరణ ఇవ్వాలనంటూ టీఎఫ్ పీసీ నోటీసులు జారీ చేసింది. నోటీసులకు స్పందించిన విశాల్ లేఖ ద్వారా టీఎఫ్ పీసీకి వివరణ ఇచ్చారు. విశాల్ లేఖను పరిశీలించిన నిర్మాతల కార్యనిర్వహణ కమిటీ వివరణ సరిగా లేదని పేర్కొంది. దీంతో తాత్కాలికంగా విశాల్ మెంబర్ షిప్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.