తమిళ చిత్రాలను అనవసరంగా విదేశాల్లో షూటింగ్ నిర్వహించరాదని దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి పేర్కొన్నారు. ఈ సమాఖ్య నిర్వాహకులు, తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులు బుధవారం సాయంత్రం చైన్నెలో సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో తీసుకున్న నిర్ణయాలను సెల్వమణి మీడియాకు వెల్లడించారు.
అందులో ఒక సినిమాను నిర్మించడానికి ముందు నటీనటులు, సాంకేతికవర్గంతో ఒప్పందం చేసుకున్న తర్వాత ఆ వివరాలను ఫెఫ్సీకి లిఖిత పూర్వక లేఖ రాసి అందజేయాలన్నారు. అన్ని అంశాలు సక్రమంగా ఉన్నాయని చిత్ర నిర్మాత ఫెఫ్సీకి లిఖితపూర్వక లేఖను అందించిన తర్వాతే ఫెప్సీ కార్మికులు ఆ చిత్రాల్లో పనిచేస్తారన్నారు. లేకుంటే 2022, మార్చిలో చేసుకున్న ఒప్పందంలోని నిబంధనల్లో ప్రధానంగా తమిళ చిత్రాల షూటింగ్‌లలో తమిళ కళాకారులకే పని కల్పించాలని, తమిళ చిత్ర షూటింగ్ లను తమిళనాడులోనే నిర్వహించాలని చెప్పారు.
షూటింగ్‌లో పనిచేసే దినసరి కార్మికులకు అదేరోజు వేతనాలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. చిత్ర కథను దర్శకుడే రాసుకుంటే ఆ తర్వాత ఆ కథ గురించి తలెత్తే సమస్యలకు ఆయనే బాధ్యత వహించాలన్నారు. నిర్మాతలను సమస్యల్లోకి లాగకూడదన్నారు. ఇతర రచయిత కథ అయితే దర్శకుడు అందుకు తగిన విధివిధానాలను రూపొందించాలన్నారు. చిత్రాన్ని ముందుగా నిర్ణయించిన బడ్జెట్లో నిర్ణయించిన రోజుల్లో పూర్తిచేయలేకపోతే నిర్మాతల వర్గం అందుకు కారణాలను లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. ఈనిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
FEFSI - Film employee's federation of south India new rules
— Manobala Vijayabalan (@ManobalaV) July 20, 2023
1. For Tamil films only Tamil artists should be employed.
2. Shooting of films should happen only in Tamil Nadu.
3. Shoot should not take place in outside state or outside country without utmost necessity.
4. If… pic.twitter.com/Drno33OSX5
Comments
Please login to add a commentAdd a comment