లక్ష్మీరాయ్‌కి లక్కీచాన్స్? | Lakshmi Rai in Tamil remake of Ishqiya? | Sakshi
Sakshi News home page

లక్ష్మీరాయ్‌కి లక్కీచాన్స్?

Published Mon, Mar 3 2014 9:13 AM | Last Updated on Wed, Apr 3 2019 9:12 PM

లక్ష్మీరాయ్‌కి లక్కీచాన్స్? - Sakshi

లక్ష్మీరాయ్‌కి లక్కీచాన్స్?

నటి లక్ష్మీరాయ్‌కు లక్కీచాన్స్ వచ్చినట్లు సమాచారం. ఈ భామను తమిళ తెరపై చూసి చాలాకాలం అయ్యింది. కాంచన చిత్రం తరువాత లక్ష్మీరాయ్‌ను కోలీవుడ్ మరచిపోయిందనే చెప్పాలి. కన్నడం, మలయాళం చిత్రాలపై దృష్టి సారించిన ఈ బ్యూటీ కాంచన చిత్రం సీక్వెల్‌లో అవకాశం వస్తుందని ఆశించి భంగపడింది. తాజాగా ఈ అమ్మడికో మంచి అవకాశం కోలీవుడ్‌లో రానుందని సమాచారం.

హిందీలో ఇటీవల మంచి హిట్ సాధించిన చిత్రాల్లో ఇష్కియా ఒకటి. విద్యాబాలన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఇప్పుడు తమిళంలో రీమేక్‌కు సిద్ధం అవుతోంది. విద్యాబాలన్ పాత్ర తమిళంలో నటి లక్ష్మీరాయ్‌ను వరించినట్లు కోడంబాక్కం టాక్. ఈ విషయం గురించి లక్ష్మీరాయ్ వద్ద ప్రస్తావించగా ఇష్కియా చిత్రం తమిళ రీమేక్‌లో నటించే విషయమై దర్శకుడు తనను సంప్రదించిన మాట నిజమేనని తెలిపింది.

అయితే ఈ చిత్ర ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉంది. అందువలన దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సమయం వచ్చినప్పుడు చెబుతానని అంది. అయితే హిందీ చిత్రం ఇష్కియాను తాను చూశానని చెప్పింది. ఇందులో మూడు పాత్రలు ప్రధానంగా ఉంటాయని పేర్కొంది. విద్యాబాలన్ తన పాత్రను సమర్థవంతంగా పోషించిందని చెప్పింది. ఆ పాత్ర తనకు చాలా బాగా నచ్చిందని తెలిపింది. అలాంటి పాత్రను తానిప్పటి వరకు పోషించలేదని, నిజంగా తనకిది మంచి అవకాశమేనని చెప్పింది. ఈ చిత్రం తమిళం, మలయాళం భాషల్లో తెరకెక్కనుందని లక్ష్మీరాయ్ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement