Tamil Movies
-
మహారాజ సినిమా దుమ్మురేపడానికి రెడీ అవుతుంది
-
అలాంటి సినిమాల్లో నటించను : నిత్యా మీనన్
పాత్ర నచ్చితే చాలు చిన్న పెద్ద సినిమా అనే తేడా చూపకుండా నటిస్తూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నిత్యా మీనన్. హీరో ఎవరైనా సరే నిత్యా మీనన్ పాత్ర మాత్రం చాలా ఆ సినిమాలో కీలకంగా ఉంటుంది. భారీ సినిమా, పారితోషికం ఎక్కువ అని సినిమాలు ఒప్పుకొదు. తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలో నటిస్తుంది. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెబుతూ..తన సినిమాల ఎంపిక గురించి ఆసక్తిక వ్యాఖ్యలు చేసింది.(చదవండి: అభిమానులకు విజయ్ పిలుపు.. మొదటి సభకు ఏర్పాట్లు)‘70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటిగా ఎంపిక అవుతానని ఊహించలేదు. అవార్డులు, రివార్డుల కోసం సినిమాల్లో నటించను. నేను పోషించిన పాత్ర నాకు సంతోషాన్నిస్తే చాలనుకున్నా. దాన్ని దృష్టిలో పెట్టుకొనే పాత్రలను ఎంపిక చేసుకుంటా. . భారీ బడ్జెట్‌తో తీసే మసాలా సినిమాల్లో అవకాశం వచ్చినా నటించను. అలాంటి పాత్రలంటే నాకు ఆసక్తి ఉండదు. మంచి పాత్ర అయితే చిన్న సినిమా అయినా అంగీకరిస్తా’ అని నిత్యా మీనన్ అన్నారు. (చదవండి: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్ష సాయి)కాగా, ‘తిరు’ సినిమాకుగాను నిత్యామీనన్‌కు జాతీయ అవార్డు లభించింది. ఈ చిత్రంలో ధనుష్ హీరోగా నటించగా, రాఖీ ఖన్నా హీరోయిన్గా నటించింది. మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరో స్నేహితురాలిగా నిత్యమీనన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె పాండిరాజ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అలాగే ‘గోల్డెన్ వీసా’, ఇడ్లికడై అనే సినిమాల్లోనూ నటిస్తున్నారు. -
ఫాంటసీ చిత్రంలో నిత్యమీనన్
తమిళసినిమా: దక్షిణాది భాషా నటీమణుల్లో తనకంటూ ప్రత్యేకత కలిగిన నటి నిత్యామీనన్. ఈమె ఏ చిత్రంలో ఎలాంటి పాత్రను పోషించినా అందులో తన ముద్ర ఉండేలా చూసుకుంటారు. అలా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తున్న నిత్యామీనన్ ఇటీవల తమిళంలో నటించిన చిత్రం తిరుచిట్రంఫలం. ధనుష్ కథా నాయకుడిగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇందులో నిత్యామీనన్ తన నటనకుగానూ విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. ఇకపోతే నిత్యామీనన్‌ను తాజాగా మరో హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంలో నటించే అవకాశం వరించింది. వినోదంతో కూడిన ఫాంటసీ కథా చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని బాస్క్ టైమ్ థియేటర్స్, పాప్టర్ మీడియా సంస్థ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇందులో వినయ్‌రాయ్, నవదీప్, ప్రతీక్ బబ్బర్, దీపక్ పరంబోల్ ముఖ్యపాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రం ద్వారా కామిని దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఆమె దర్శకుడు విష్ణువర్ధన్ శిష్యురాలు కావడం గమనార్హం. త్వరలో సెట్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి ప్రీతా జయరా మన్ చాయాగ్రహణం, కళా దర్శకత్వం బాధ్యతలను షణ్ముగరాజా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వర లో వెల్లడించనున్నట్లు నిర్మాతలు శుక్రవారం మీడియా కు విడుదల చేసిన మీడియా ప్రకటనలో పేర్కొన్నారు. -
తన పేరుతో మోసం.. బండారం బయటపెట్టిన సీరియల్ నటి
జనాల్ని మోసం చేయడంలో దొంగలు సరికొత్తగా ఆలోచిస్తున్నారు. అయితే మిగతా విషయాలేమో గానీ సెలబ్రిటీలు పేరు చెప్పి డబ్బులు కాజేసే పనులు చేస్తుంటారు. అలా తాజాగా ఓ సీరియల్ నటి పేరు చెప్పి లక్షలు వెనకేసుకునే పనిలో పడ్డారు. కానీ సదరు నటి స్పందించడంతో బండారం అంతా బయటపడింది. (ఇదీ చదవండి: అందుకే ఇంత లావయ్యాను.. చిన్నప్పుడు ఆ భయం ఉండేది: వైవా హర్ష) ఏం జరిగింది? తమిళంలో పలు సీరియల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న అల్య మానస.. సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ సంపాదింంచింది. కొన్నిరోజుల క్రితం 'వణక్కం తమిళగం' అనే షోలో పాల్గొంది. ఆ షోలో ఈమె.. మార్కెటింగ్ స్కీమ్ గురించి చెప్పినట్లు.. దీని ద్వారా లెక్కలేనంతగా డబ్బు సంపాదిస్తున్నానని ఈమె చెప్పినట్లు ఓ వీడియో వైరల్ అయిపోయింది. పలు పత్రికల్లోనూ ఇదే విషయం పబ్లిష్ కాగా.. ఈ విషయం అల్య మానస దృష్టికి వెళ్లింది. 'అల్య మానస బాగా డబ్బు సంపాదిస్తోంది. ఈమెలానే మీరు కూడా కోటీశ్వరులు కావాలనుకుంటే.. దిగువన లింక్ క్లిక్ చేయండి' అని తన పేరు చెప్పి జరుగుత్ను మోసంపై అల్య మానస ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మార్కెటింగ్ స్కీమ్ గురించి షోలో తాను ఎలాంటి కామెంట్స్ చేయలేదని, కారు-ఇల్లు కొన్న విషయం నిజమే కానీ వాటిని ఈఎంఐ పద్ధతి తీసుకున్నానని చెప్పింది. అన్నింటికీ మించి అడ్డదారిలో కోటీశ్వరురాలిని కావాలనే ఆలోచన తనకు లేదని క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: మెగా హీరో మూవీకి చిక్కులు.. షూటింగ్‌కి ముందే నోటీసులు) -
సౌత్ ఇండియాలో క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలు ఇవే
తెలుగు అనగానే గుర్తొచ్చేది ఆవకాయ్... తమిళ్ అంటే సాంబార్... మలయాళంకి కూడా సాంబార్ టచ్ ఉంది. ఇప్పుడు ఆవకాయ్ డైరెక్షన్‌కి సాంబార్ సై అనడంతో క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. అదేనండీ.. మన తెలుగు డైరెక్టర్ల డైరెక్షన్లో తమిళ, మలయాళ హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఇటు తెలుగు అటు తమిళ, మలయాళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో ఈ చిత్రాలు విడుదల కానున్నాయి. ఇక తెలుగు డైరెక్టర్లు – పరభాషా హీరోల కాంబో గురించి తెలుసుకుందాం. శేఖర్ కమ్ముల, ధనుష్... డీ 51 వాణిజ్య అంశాల కంటే కథకి, సహజత్వానికి ప్రాధాన్యత ఇచ్చే దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ఒక సినిమా తర్వాత మరో సినిమా వెంట వెంటనే చేసేయాలని కాకుండా కొంచెం ఆలస్యమైనా మంచి సినిమాలు తీస్తుంటారు శేఖర్ కమ్ముల. ‘ఫిదా, లవ్‌స్టోరీ’ వంటి వరుస హిట్లు అందుకున్న ఆయన తన తర్వాతి చిత్రాన్ని తమిళ హీరో ధనుష్‌తో చేస్తున్నారు. ‘డీ 51’ (వర్కింగ్ టైటిల్) పేరుతో తెలుగు–తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో ఇంతకు ముందు చూడని సరికొత్త పాత్రలో ధనుష్‌ని చూపించనున్నారట శేఖర్. సోనాలీ నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. కాగా ధనుష్ చేసిన తొలి తెలుగు స్ట్రయిట్ మూవీ ‘సార్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్ చేస్తున్నది సెకండ్ స్ట్రయిట్ తెలుగు మూవీ అవుతుంది. చందు, సూర్య కాంబో కుదిరిందా? ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకున్నారు డైరెక్టర్ చందు మొండేటి. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ‘ఎన్సీ 23’ (వర్కింగ్ టైటిల్) సినిమా ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు చందు. ఇప్పటివరకూ తెలుగు హీరోలతోనే సినిమాలు తీసిన ఆయన తమిళ హీరో సూర్యతో ఓ సినిమా చేయనున్నారు. వీరి కాంబినేషన్లో ఓ సినిమా రానుందంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగు తోంది. సూర్య– చందు కాంబినేషన్ దాదాపు కుదిరిందని టాక్. సరైన కథ కుదిరితే డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తానంటూ చెప్పుకొస్తున్న సూర్య.. చందు మొండేటి చెప్పిన కథ తెలుగు ఎంట్రీకి కరెక్ట్ అని భావించారట. మైథాలజీ నేపథ్యంలో సోషియో–ఫ్యాంటసీ జానర్లో ఈ చిత్రకథ ఉంటుందని టాక్. పరశురామ్‌తో కార్తీ? ‘గీత గోవిందం, సర్కారు వారి పాట’ చిత్రాలతో వరుస హిట్లు అందుకున్నారు డైరెక్టర్ పరశురామ్. ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ–డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో మరో సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా తమిళ హీరో కార్తీతో పరశురామ్ ఓ సినిమా తెరకెక్కించనున్నారనే వార్తలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఆ మధ్య చెన్నై వెళ్లి కార్తీకి కథ వినిపించారట ఆయన. ‘ఊపిరి’ (2016) సినిమా తర్వాత తెలుగులో ఓ సరైన స్ట్రయిట్ ఫిల్మ్ చేయాలని ఎంతో ఆసక్తిగా ఉన్న కార్తీకి పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో పచ్చజెండా ఊపారని టాక్. ఈ సినిమాకు ‘రెంచ్ రాజు’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందట. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందించాలని భావిస్తున్నారట పరశురామ్. అటు కార్తీ, ఇటు పరశురామ్ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయా చిత్రాలు పూర్తయ్యాకే వీరి సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెంకీతో దుల్కర్ లక్కీ భాస్కర్ తమిళ హీరో ధనుష్‌తో ‘సార్’(తమిళంలో వాత్తి) సినిమాని తెరకెక్కించి, సూపర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ వెంకీ అట్లూరి. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తన తాజా చిత్రాన్ని మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌తో తీస్తున్నారు వెంకీ అట్లూరి. ‘లక్కీ భాస్కర్’ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో వెంకీ అట్లూరితో ‘సార్’ నిర్మించిన సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ‘లక్కీ భాస్కర్’ నిర్మిస్తున్నారు. ‘సార్’ సినిమాతో విద్యా వ్యవస్థ నేపథ్యంలో సమాజానికి చక్కని సందేశం ఇచ్చిన వెంకీ అట్లూరి ‘లక్కీ భాస్కర్’ ద్వారా మరో విభిన్న కథాంశంతో ప్రేక్షకులను మెప్పించనున్నారట. ఒక సామాన్యుడు తనకు అడ్డొచ్చిన అసమానతలను దాటుకుని ఉన్నత శిఖరాలను ఎలా చేరుకున్నాడు? అనే నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. కాగా ‘మహా నటి’, ‘సీతా రామం’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మరో స్ట్రయిట్ తెలుగు చిత్రం ‘లక్కీ భాస్కర్’. -
కొత్త రూల్స్.. తమిళనాడులోనే షూటింగ్.. తమిళులకే ఛాన్స్!
తమిళ చిత్రాలను అనవసరంగా విదేశాల్లో షూటింగ్ నిర్వహించరాదని దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి పేర్కొన్నారు. ఈ సమాఖ్య నిర్వాహకులు, తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులు బుధవారం సాయంత్రం చైన్నెలో సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో తీసుకున్న నిర్ణయాలను సెల్వమణి మీడియాకు వెల్లడించారు. అందులో ఒక సినిమాను నిర్మించడానికి ముందు నటీనటులు, సాంకేతికవర్గంతో ఒప్పందం చేసుకున్న తర్వాత ఆ వివరాలను ఫెఫ్సీకి లిఖిత పూర్వక లేఖ రాసి అందజేయాలన్నారు. అన్ని అంశాలు సక్రమంగా ఉన్నాయని చిత్ర నిర్మాత ఫెఫ్సీకి లిఖితపూర్వక లేఖను అందించిన తర్వాతే ఫెప్సీ కార్మికులు ఆ చిత్రాల్లో పనిచేస్తారన్నారు. లేకుంటే 2022, మార్చిలో చేసుకున్న ఒప్పందంలోని నిబంధనల్లో ప్రధానంగా తమిళ చిత్రాల షూటింగ్లలో తమిళ కళాకారులకే పని కల్పించాలని, తమిళ చిత్ర షూటింగ్ లను తమిళనాడులోనే నిర్వహించాలని చెప్పారు. షూటింగ్లో పనిచేసే దినసరి కార్మికులకు అదేరోజు వేతనాలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. చిత్ర కథను దర్శకుడే రాసుకుంటే ఆ తర్వాత ఆ కథ గురించి తలెత్తే సమస్యలకు ఆయనే బాధ్యత వహించాలన్నారు. నిర్మాతలను సమస్యల్లోకి లాగకూడదన్నారు. ఇతర రచయిత కథ అయితే దర్శకుడు అందుకు తగిన విధివిధానాలను రూపొందించాలన్నారు. చిత్రాన్ని ముందుగా నిర్ణయించిన బడ్జెట్లో నిర్ణయించిన రోజుల్లో పూర్తిచేయలేకపోతే నిర్మాతల వర్గం అందుకు కారణాలను లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. ఈనిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. FEFSI - Film employee's federation of south India new rules 1. For Tamil films only Tamil artists should be employed. 2. Shooting of films should happen only in Tamil Nadu. 3. Shoot should not take place in outside state or outside country without utmost necessity. 4. If… pic.twitter.com/Drno33OSX5 — Manobala Vijayabalan (@ManobalaV) July 20, 2023 చదవండి: ప్రాజెక్ట్ కె టైటిల్ గ్లింప్స్ రిలీజ్ -
రెస్టారెంట్‌కు ఓనర్ కాబోతున్న హీరోయిన్
బుల్లితెర నుంచి వెండి తెరకు వచ్చిన నటి ప్రియా భవాని శంకర్. అతి తక్కువ కాలంలోనే ఎక్కువ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. పాత్ర చిన్నదో పెద్దదో స్టార్ హీరోల చిత్రాలు కనిపిస్తోంది.. మరోపక్క కథానాయకిగానూ చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఆ మధ్య కార్తీ కథానాయకుడిగా వచ్చిన కడైకుట్టి సింగం చిత్రంలో చిన్న పాత్రలో నటించింది. అయితే ఆ చిత్రం విజయంతో ఈ అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది. అదేవిధంగా ఇటీవల ధనుష్ చిత్రం తిరుచిట్ట్రంఫలం చిత్రంలోనూ కనిపించింది. ఇకపోతే తాను డబ్బు వస్తుందనే నటించడానికి వచ్చానని ఓ ఇంటర్వ్యూలో ఆమె పేర్కొంది. తాజాగా తాను అలా అనలేదంటూ ప్లేట్ పిరాయించింది. వచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుంటూ తక్కువ కాలంలోనే డబ్బు బాగానే కురబెట్టింది. ఇందుకు ఉదాహరణ గత డిసెంబర్ నెలలో చెన్నై సముద్ర తీరంలో ఒక కొత్త ఇంటిని కొనుక్కున్నట్లు తనే స్వయంగా వెల్లడించింది. అంతేకాకుండా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే పాలసీని అమలు చేస్తూ తాజాగా వ్యాపారంగంలోకి అడుగుపెడుతోంది. ఈ అమ్మడు ఇప్పుడు ఒక రెస్టారెంట్‌కు ఓనర్ కాబోతోంది. ఇందు కోసం స్థలాన్ని కొనుగోలు చేసి రెస్టారెంట్‌ను కట్టిస్తోంది. త్వరలో దీన్ని ప్రారంభించనునట్లు నటి ప్రియా భవాని శంకర్ ఒక వీడియోను విడుదల చేసింది. View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) -
దేనికైనా అదృష్టం ఉండాలి: నిధి అగర్వాల్
సినిమా రంగంలో అదృష్టం చాలా ముఖ్యమని అంటోంది నటి నిధి అగర్వాల్. ఆకర్షణీయమైన అందం ఈమె సొంతం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కథానాయకిగా నటిస్తున్నా ఆ స్థాయిలో పెద్ద హిట్లు సాధించలేకపోతోంది. తమిళంలో జయం రవికి జంటగా భూమి, శింబు సరసన ఈశ్వరన్, ఉదయనిధి స్టాలిన్‌తో కలగతలైవన్ చిత్రాలు చేసింది. వీటిల్లో ఏది ఈ అమ్మడి కెరీర్‌కు ప్లస్ కాలేదనే చెప్పాలి. ఇటీవల నిధి అగర్వాల్ ఒక కార్యక్రమంలో తన అనుభవాలను పంచుకున్నారు. తాను అదృష్టాన్ని నమ్ముతానని చెప్పింది. అది లేకపోతే ఎవరికి ఏదీ కుదరదని పేర్కొంది. ముఖ్యంగా సినిమా రంగంలో అదృష్టం చాలా అవసరమని చెప్పింది. ఉదాహరణకు కొన్ని కథలు వినడానికి అద్భుతంగా ఉంటాయని.. అయితే చివరికి చిత్రం వేరే విధంగా వస్తుందని పేర్కొంది. అదే విధంగా పేపర్‌పై సుమారుగా ఉన్న కథలు తెరపై చూస్తే బ్రహ్మాండంగా ఉండి ఆశ్చర్యపరుస్తాయని తెలిపింది. అందుకు కారణం 90 శాతం అదృష్టమే అని తాను భావిస్తానంది. ఇకపోతే కథలను ఆశతో ఎంపిక చేసుకునే స్థాయికి తాను చేరుకున్నానని భావించడం లేదని చెప్పింది. అయితే వైవిధ్యభరిత కథా పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నానని, ముఖ్యంగా నాట్యానికి ప్రముఖ్యత ఉన్న కథా చిత్రంలో నటించాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తున్నా నటన పరంగా ఎలాంటి వ్యత్యాసం లేదని అయితే వ్యాపారపరంగా చాలా తేడా ఉంటుందని నటి నిధి అగర్వాల్ పేర్కొంది. -
ఆ దర్శకుడి సినిమాలో నటించాలని ఉంది: జాన్వీ కపూర్
దివంగత నటి శ్రీదేవి సాధించిన పేరు ప్రఖ్యాతలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. దక్షిణాది నుంచి బాలీవుడ్‌కి వెళ్లిన ఆమెను అక్కడ కూడా సక్సెస్ వరించింది. తాజాగా ఆమె వారసురాలు జాన్వీ కపూర్ బాలీవుడ్లో మంచి కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనలోని నటనకు పదును పెడుతున్నారు. తమిళం, మలయాళం భాషల్లో హిట్ అయిన చిత్రాలను హిందీ రీమేక్‌లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. అలా ఆమె మలయాళంలో మంచి విజయం సాధించిన హెలెన్ హిందీ రీమేక్‌లో నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా తమిళంలో నయనతార ప్రధాన పాత్రలో నటించిన కోలమావు కోకిల చిత్రం హిందీ రీమేక్‌లో జాన్వీ కపూర్ నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాది చిత్రాల్లో నటించాలన్న కోరిక చాలాకాలంగా ఉందని చెప్పారు. ముఖ్యంగా మలయాళ దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రన్ చిత్రాలంటే చాలా ఇష్టం అన్నారు. అలాగే తమిళంలో వెట్రిమారన్ దర్శకత్వంలో నటించాలన్న కోరిక ఉందన్నారు. కాగా ఈ బ్యూటీని దక్షిణాది చిత్రంలో నటింపజేయాలన్న ప్రయత్నాలు చాలాకాలంగానే జరుగుతున్నాయన్నది వాస్తవం. ఆ మధ్య తెలుగులో విజయ్ దేవరకొండకు జంటగా నటించడానికి సిద్ధమైందనే ప్రచారం కూడా జరిగింది. అయితే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. -
Viranica Manchu: చెన్నైలో మంచు విష్ణు సతీమణి సందడి
తమిళసినిమా: టాలీవుడ్ స్టార్ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త మంచు విష్ణు సతీమణి వెరోనికా పాప్ అప్ షోతో సందడి చేశారు. అమెరికాలో పుట్టి పెరిగిన ఈమె న్యూయార్క్‌లో జ్యువెలరీ డిజైనింగ్ చేశారు. వివాహానంతరం ఫ్యాషన్ మార్కెటింగ్ రంగంలోకి ప్రవేశించి హైదరాబాదులో ఫ్యాషన్ డిజైనింగ్ షాప్‌ను కూడా ఏర్పాటు చేశారు. తాజాగా చెన్నైలో తన ఫ్యాషన్ మార్కెటింగ్ విస్తరించేందుకు లేబుల్ విడా పేరుతో పాప్ అప్ షో నిర్వహించారు. నటులు జయం రవి భార్య ఆర్తి, సినీ ప్రముఖులు, మహిళలు ఇందులో పాల్గొన్నారు. చదవండి: ('కేజీఎఫ్' అభిమానులకు గుడ్ న్యూస్.. పార్ట్-3 కూడా?) -
మరో నెగెటివ్ రోల్లో సమంత !.. ప్రేమకు అడ్డుగా
Samantha Negative Role In Kaathu Vaakula Rendu Kadhal Movie: స్టార్ హీరోయిన్ సమంత అందం, అభినయంతో సినీ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. 'ఫ్యామిలీ మ్యాన్ 2' హిందీ వెబ్ సిరీస్‌కు ముందు గ్లామర్ పాత్రలతో అలరించిన సామ్ ఈ సిరీస్‌తో తన నటనేంటో నిరూపించింది. ఈ సిరీస్‌తో జాతీయ స్థాయిలో వినపడిన సమంత పేరు ఇంటర్నేషనల్ రేంజ్‌కు పాకింది. ఇక నుంచి తాను నటనకు ప్రాధాన్యమున్న ఛాలేంజింగ్ రోల్స్ చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అందుకు తగినట్లుగానే పాత్రలను సెలెక్ట్ చేసుకుంటుంది సామ్. హాలీవుడ్ మూవీ 'అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్' సినిమాలో తాను బై-సెక్సువల్ యువతి పాత్ర పోషిస్తున్న విషయాన్ని తానే ప్రకటించింది. ఇదీ చదవండి: ఏం చేయగలను.. వారిని ఇంతవరకూ చూడలేదు: సమంత అయితే తాజాగా తాను మరో ఛాలేంజింగ్ పాత్ర చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సమంత మరో నెగెటివ్ పాత్రలో అలరించనుందట. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, అందాల అభినయం నయన తారతో కలిసి సమంత నటిస్తున్న చిత్రం 'కాత్తువాక్కుల రెండు కాదల్'. ఇందులో నయన తారకు సమానమైన పాత్రలో సామ్ నటించనుందట. విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఊహించని రీతిలో 'ఖతిజా'గా సామ్ నెగెటివ్ షేడ్స్‌లో ఆకట్టుకోనుందని సమాచారం. ఈ పాత్రలో సమంత యాక్టింగ్ సూపర్‌గా ఉందని కోలీవుడ్ సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయట. విజయ్ సేతుపతి, నయన తార ప్రేమాయణానికి అడ్డుపడి సమంత తన విలనిజంతో కథను మలుపు తిప్పనుందట. అయితే ఈ వార్తల్లో ఎంతవరకూ నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇప్పటికే 'ఫ్యామిలీ మ్యాన్ 2'లో రాజీగా ఆకట్టుకున్న సామ్ ఈ సినిమాలో ఎలాంటి విలనిజం చూపెట్టనుందో వేచి చూడాలి. ఇదీ చదవండి: 'ఊ అంటావా' సాంగ్ పూర్తి వీడియో వచ్చేసింది.. చూశారా ! -
వందల సినిమాల్లో నటించిన ఈ ‘ఎమోషనల్ యాక్ట్రెస్’ గుర్తుందా?
సినిమా అంటే జనాలకు మాత్రమే రంగుల ప్రపంచమే కాదు.. అవతల నటించే వాళ్లకు కూడా. ‘ఎంత బలవంతులనైనా ఏదో ఒక టైంలో మానసికంగా కుంగుబాటుకు కచ్ఛితంగా గురిచేసేదే సినిమా’ అంటూ స్పీల్‌బర్గ్‌లాంటి దిగ్గజాలు చెప్పడం చూస్తుంటాం. అలా ఎన్నో కలలతో సినిమాల్లోకి అడుగుపెట్టిన సీనియర్ నటి శ్రీవిద్య జీవితం..విషాదంగా ముగియడం మీలో ఎంత మందికి గుర్తుంది?. ఇవాళ ఆమె జయంతి.. మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ.. ఇలా సుమారు 800కు పైగా సినిమాల్లో నటించారు శ్రీవిద్య. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్గా.. అటుపై సపోర్టింగ్ రోల్స్, అక్కా-చెల్లి, అమ్మ, అత్త క్యారెక్టర్లతో అలరించారు. ముఖ్యంగా ఆమె పండించే భావోద్వేగాలు ఇప్పటికీ జనాలకు గురుతు. అందుకే ఎమోషనల్ యాక్ట్రెస్‌గా ఆమెకు ఓ పేరు ముద్రపడింది. కేవలం నటనతోనే కాదు.. తన మధుర గాత్రంతో ఎన్నో పాటలు, డబ్బింగ్‌తోనూ దక్షిణాది ప్రేక్షకుల్ని రంజింపచేశారామె. ‘నటన’ కుటుంబంలో జననం 1953, జులై 24న మద్రాస్‌లో పుట్టారామె. తండ్రి కృష్ణమూర్తి సినిమాల్లో కమెడియన్‌గా స్థిరపడగా, తల్లి వసంతకుమారి కర్ణాటక క్లాసిక్ సింగర్(ఎంఎస్ సుబ్బలక్క్క్ష్మి, డీకే పట్టమ్మస్ సమకాలికురాలు). అయితే శ్రీవిద్య పుట్టిన కొన్నాళ్లకే తండ్రి పక్షవాతం బారినపడడంతో కుటుంబానికి ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. దీంతో వసంతకుమారి నానాకష్టాలు పడి సంపాదించింది. ఒకానొక టైంలో తనకు పాలు ఇచ్చే సమయం ఉండేది కాదన్న తల్లి మాటల్ని శ్రీవిద్య పలు ఇంటర్వ్యూలో సైతం గుర్తు చేసుకునేవాళ్లు. ‘బొటాబొటీ’ చదువు కొనసాగించిన శ్రీవిద్య అందగత్తె కావడంతో అమెరికా నుంచి ఓ సైంటిస్ట్ సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. అయితే డబ్బు లేదన్న కారణంతో ఆ సంబంధం అంతే స్పీడ్‌గా వెనక్కి వెళ్లిపోయింది. దీంతో కుటుంబానికి భారం కాకూడదన్న ఉద్దేశంతో తండ్రి పరిచయాలతో ఆమె నటనలోకి అడుగుపెట్టారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదలై.. 1967 తమిళ సినిమా శివాజీ గణేషన్ హీరోగా ‘తిరువరుల్చెల్వర్’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారామె. ఆ తర్వాత మలయాళ సినిమా ‘కుమార సంభవం’తో, తెలుగులో దాసరి ‘తాతా మనవడు’తో అరంగ్రేటం చేసింది శ్రీవిద్య. దర్శకదిగ్గజం కే బాలచందర్ డైరెక్షన్లో వచ్చిన ‘నూట్రుక్కు నూరు’(1971) నటిగా ఆమెకంటూ ఓ గుర్తింపు తెచ్చిపెట్టింది. హీరోయిన్గా ‘ఢిల్లీ టు మద్రాస్’(1972) ఆమె మొదటి సినిమా. ఆ తర్వాత బాలచందర్ డైరెక్షన్లో వచ్చిన సినిమాల ద్వారా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ వచ్చారామె. మల్టీటాలెంటెడ్ అల్లరి క్యారెక్టర్లతో అలరించినా.. మెచ్యూర్డ్రోల్స్ చేసినా.. ఆ క్యారెక్టర్‌తో ఎమోషనల్‌గా ట్రావెల్ కావడం ఆమెకు ఉన్న నైజం. అందుకే హీరోయిన్గా ఫేడ్అవుట్ అయ్యాక ఆమెకు హుందా పాత్రలెన్నో వచ్చాయి. నటిగానే కాదు.. ప్లేబ్యాక్ సింగర్‌గానూ ఆమె అలరించారు. స్వతహాగా క్లాసికల్ సింగర్ కావడంతో ఆమె గాత్రం పాటలకు మరింత అందాన్ని తెచ్చిపెట్టేవి. అంతేకాదు పదుల సంఖ్యలో సినిమాలకు ఆమె డబ్బింగ్ కూడా చెప్పారు. ‘ప్రేమ’ మోసం కెరీర్ తొలినాళ్లలో కమల్ హాసన్‌తో ఆమె నటించింది. ఆ టైంలో ఇద్దరి మధ్య ఎటాచ్మెంట్ ఎక్కువగా ఉండేది. ఒకానొక టైంలో కమల్‌తో పీకలలోతు ప్రేమలో కూరుకుపోయిందామె. అయితే అప్పటికే కమల్ వాణీ గణపతితో ప్రేమలో ఉండడంతో ఆమె పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి మలయాళంలో అసిస్టెంట్ డైరెక్టర్ అయిన జార్జ్ థామస్‌తో ప్రేమలో పడి.. తల్లిదండ్రుల మాట వినకుండా వివాహం చేసుకుంది. మతం మార్చుకుని నటనకు దూరమైంది. డబ్బు కోసం తిరిగి నటించాలన్న భర్త ఒత్తిడితో తిరిగి మేకప్ వేసుకుంది. ఆపై భర్త తీరును అర్థం చేసుకుని.. విడాకులిచ్చేసింది. నటన కొనసాగిస్తున్న టైంలో మలయాళ దర్శకుడు భరతన్‌తో కొన్నాళ్లపాటు ప్రేమాయణం కొనసాగించింది. అయితే భరతన్ మరొకరిని వివాహం చేసుకున్నాడు. దీంతో భరతన్ తన ఆస్తులు లాగేసుకుని తనను మోసం చేశాడంటూ శ్రీవిద్య కోర్టుకెక్కింది. చివరికి సుప్రీం కోర్టు తీర్పుతో విజయం సాధించి తన ఆస్తుల్ని దక్కించుకున్న ఆమె.. చెన్నై నుంచి తిరువంతపురానికి మకాం మార్చేసింది. అపూర్వ రాగంగల్-అపూర్వ సగోదరర్గల్ చనిపోయే ముందు దాకా.. 2003లో అనారోగ్యం పాలైన ఆమెకు.. క్యాన్సర్ అని తేలింది. ఆటైంలో మూడేళ్లపాటు ఆమె చికిత్స తీసుకుంది. ఆ టైంలోనూ ఆమెను వదల్లేదు. అంతేకాదు ఫోర్త్ స్టేజ్‌లో ఉన్న తాను బతకడం కష్టమనే విషయం అర్థమైయ్యింది ఆమెకు. అందుకే తన పేరు మీద ఒక్క పైసా కూడా ఉండొద్దన్నది నిర్ణయించుకుంది. మొత్తం ఆస్తిని సేవాకార్యక్రమాలకు ఇచ్చేయాలని నిర్ణయించుకుంది. అప్పటికే కేరళ ప్రభుత్వం స్కాలర్షిప్ ఆపేయడంతో పేద సంగీత, నృత్య కళాకారులైన విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. అందుకని మలయాళ నటుడుని రిజిస్టర్‌గా నియమిస్తూ.. తన ఆస్తులను అప్పజెప్పింది. తద్వారా ఓ ఛారిటబుల్ సొసైటీ ఏర్పాటు చేయించి అర్హులైనవాళ్లకు స్కాలర్షిప్ అందించే ఏర్పాటు చేయించింది. మిగిలిన ఆస్తిని బంధువుల పేరిట రాసేసింది. తన అన్నల పిల్లలకు ఒక్కొక్కరి ఐదు లక్షలు, చివరికి తన ఇంట్లో పని వాళ్లు.. వాళ్ల ఇంటి సభ్యులకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున జమ చేయించింది. మరికొంత ఆస్తిని సొంత వూరికి, ఇంకొంత సొమ్మును రెండో ఇల్లు తిరువనంతపురానికి దానం చేసింది. ఆ తర్వాత కీమో థెరపీకి వెళ్లిన ఆమె.. ఆ ట్రీట్మెంట్ టైంలోనే 2006, ఆగస్టు 17న యాభై మూడేళ్ల వయసులో ఆమె కన్నుమూసింది. ఆమె సేవానీరతికి గుర్తుగా తిరువనంతపురం ప్రజలు లాంఛనంగా ఆమె అంత్యక్రియల్ని ఘనంగా జరిపించారు. తల్లిగా ప్రత్యేకం నలభై ఏళ్లపాటు మలయాళం, తమిళంలో వందలకొద్దీ, తెలుగులో నలభై దాకా, కన్నడలో డజను, హిందీలో రెండు.. మొత్తం 800 దాకా సినిమాల్లో నటించారామె. ఇక సౌత్ సూపర్‌స్టార్ రజినీకాంత్ తొలి హీరోయిన్ శ్రీవిద్యే. ఆయన మొదటి సినిమా అపూర్వ రాగంగల్(1975) రజినీ జోడిగా. అయితే రజినీతో హీరోయిన్‌గానే కాదు.. అక్కగా, చెల్లిగా, తల్లిగా, అత్తగా.. ఇలా దాదాపు అన్ని క్యారెక్టర్లలో ఆమె నటించడం విశేషం. తల్లి క్యారెక్టర్లో శ్రీవిద్య అద్భుతమైన నటన కనబరిచేవారామె. ముగ్గురు మొనగాళ్లు, గాండీవం, చిన్నబ్బాయ్, వెంకటేష్‌కు తల్లిగా ‘బ్రహ్మపుత్రుడు’, ‘ధర్మచక్రం’ ఆమె మరిచిపోలేని నటనను అందించారు. సుమంత్ హీరోగా వచ్చిన ‘విజయ్ ఐపీఎస్’ తెలుగులో శ్రీవిద్య నటించిన చిట్టచివరి చిత్రం. -సాక్షి వెబ్‌డెస్క్ -
మాట తప్పిన ప్రముఖ కమెడియన్
హాస్యనటుడు వడివేలు మరోసారి హీరోగా నటించడానికి రెడీ అవుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. తమిళంలో మరుదమలై, తలైనగరం సినిమాలను డైరెక్ట్ చేసిన సూరజ్ దర్శకత్వంలో వడివేలు హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో స్టార్ట్ కానుందని కోలీవుడ్ సమాచారం. సూరజ్ డైరెక్ట్ చేసిన ‘మరుదమలై, తలై నగరం’ ఈ రెండు సినిమాల్లోనూ వడివేలు కీలక పాత్రల్లో నటించారు. సో... ఇప్పుడు వడివేలు హీరోగా సూరజ్ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని ఉహించవచ్చు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఇంతకుముందు ‘ఇమ్సై అరసన్ 23ఆమ్ పులికేసి’, ‘తెనాలిరామన్ ’ వంటి సినిమాల్లో వడివేలు హీరోగా నటించారు. అయితే తాను మరోసారి హీరోగా నటించనని కమెడియన్ వడివేలు గతేడాది ప్రకటించారు. అయినప్పటికీ ఆయనకు సినిమా అవకాశాలు వస్తుండటంతో మరోసారి హీరోగా నటించడానికి ఓకే చెప్పారు. -
చిక్కుల్లో షాలినీ పాండే.. నిర్మాత ఫిర్యాదు
సాక్షి, చెన్నై: ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలినీ పాండే చిక్కుల్లో పడ్డారు. ఆమెపై తమిళ నిర్మాత ఒకరు ఫిర్యాదు చేశారు. అమ్మ క్రియేషన్ పతాకంపై తెరకెక్కిస్తున్న ‘అగ్ని సిరగుగల్’ చిత్రాన్ని నిర్మాత శివ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో అరుణ్ విజయ్, విజయ్ ఆంటోని, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 29శాతం పూర్తయింది. మిగతా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఈ క్రమంలో హీరోయిన్ షాలినీకి రణ్‌బీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బాలీవుడ్ చిత్రంలో అవకాశం వచ్చింది. ఈ భారీ అవకాశం రావడంతో షాలినీ పాండే యూటర్న్ తీసుకున్నారని, ఇక నుంచి దక్షిణాది సినిమాల్లో నటించలేదని ఆమె తేల్చిచెప్పారని నిర్మాత శివ వాపోతున్నారు. ఆమె అకస్మాత్తు నిర్ణయం వల్ల తాము తీవ్రస్థాయిలో నష్టపోయామని, ఎన్నిసార్లు పిలిచినా ఆమె షూటింగ్స్ రావడం లేదని, ఆకస్మికంగా సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన ఆమెపై చర్యలు తీసుకోవాలని శివ నిర్మాతల మండలి, ఫిలిం చాంబర్, నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేశారు. తెలుగు, హిందీ చిత్రపరిశ్రమలకు చెందిన నిర్మాతల మండలిలోనూ, ఆర్టిస్టుల సంఘాల్లోనూ ఫిర్యాదు చేయనున్నట్టు శివ తెలిపారు. షాలినీ పాండేపై చట్టరీత్యా కూడా చర్యలు తీసుకోవాలని నిర్మాత శివ భావిస్తున్నారు. -
తమన్నాతో కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది
తమిళసినియా : యాక్షన్ సన్నివేశాల్లో నటి తమన్నాతో కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందని నటుడు విశాల్ పేర్కొన్నారు. ఈ జంట నటించిన తాజా చిత్రం యాక్షన్. సుందర్.సీ దర్శకత్వంలో ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై రవీంద్రన్ నిర్మించిన ఈ చిత్రానికి హిప్హాప్ తమిళా సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చిత్ర యూనిట్ స్థానిక ప్రసాద్‌ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు విశాల్ మాట్లాడుతూ సామాజిక ఆలోచనలు ఉన్నా సంపాదన కూడా ముఖ్యం అని తనకు తెలియజేసింది దర్శకుడు సుందర్.సీ అని పేర్కొన్నారు. తాము ఈ వేదికపై నిలబడడానికి, తాము యూనిట్ అవడం సాధారణ విషయం కాదన్నారు. దాన్ని ట్రైడెంట్ ఆర్ట్స్ రవీంద్రన్ సాధ్యం చేశారని పేర్కొన్నారు. సంఘమిత్ర సుందర్.సీ డ్రీమ్ చిత్రం అన్నారు. దాని నిర్మాణం ఆలస్యం కావడంతో మధ్యలో ఈ చిత్రం చేసినట్లు తెలిపారు. తన కెరీర్లోనే అధిక ఫైట్స్ కలిగిన చిత్రం, అధికంగా దెబ్బలు తిన్న చిత్రం ఇదేనన్నారు. ఒక సమయంలో తన చావును తాను కళ్లారా చూశానని చెప్పారు. ఒక సన్నివేశంలో నటిస్తుండగా కాళ్లు, చేతులకు గాయాలు కావడంతో 5 నెలలు షూటింగ్ చేయలేని పరిస్థితి అని తెలిపారు. అయినా దర్శక నిర్మాతలు తన కోసం వేచి ఉన్నారని చెప్పారు. ఏడాదికి ఒక చిత్రాన్ని సుందర్.సీ దర్శకత్వంలో నటిస్తే ఆరోగ్యం బాగుంటుందన్నారు. తన గురువు అర్జున్ అయినా, ప్రతి ఒక్కరూ ఈగో ఫీలవకుండా సుందర్.సీ వద్ద అసిస్టెంట్‌గా పనిచేయాలన్నారు. ఆయన ఒక సాధారణ ప్రాంతాన్ని కూడా బ్రహ్మాండంగా చూపించగలరని అన్నారు. 90 రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయడం సవాల్‌తో కూడిన విషయంగా పేర్కొన్నారు. ఒక సహాయ దర్శకుడిగా తానాయననుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. ఆయన నుంచి నేర్చుకున్న విషయాలను ఇకపై తన చిత్రాలకు ఉపయోగించుకుంటానని చెప్పారు. సంగీదర్శకుడు ఆది లాంటి టాలెంటెడ్ యువకులు పలువురు రావాలన్నారు. తాను గాయాలపాలయిన తరువాత స్టంట్‌మాస్టర్ అన్బరివు, దర్శకుడు సుందర్.సీ ఫైట్స్ సన్నివేశాలకు డూప్‌ను వాడదామని చెప్పారని, అయితే అందుకు తాను అంగీకరించలేదని తెలిపారు. ఫైట్స్ సన్నివేశాల్లో తనకు నటి తమన్నాకు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందని చెప్పారు. ఇక నటి ఆకాంక్షపురి గురించి చెప్పే తీరాలని, తాను ఇంతకు ముందెప్పుడూ మహిళలను కొట్టిందేలేదన్నారు.అలాంటిది ఈ చిత్రంలో సన్నివేశాల కోసం నటి ఆకాంక్షపురిని పలుమార్లు కొట్టాల్సి వచ్చిందని చెప్పారు. యాక్షన్ చిత్రాన్ని అందరూ సినిమా థియేటర్లలో చూడాలని నటుడు విశాల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తమన్నా, దర్శకుడు సుందర్.సీ, సంగీతదర్శకుడు హిప్హాప్ తమిళా చిత్ర యూనిట్ పాల్గొన్నారు. -
రజనీకాంత్ ‘వ్యూహం’ ఫలించేనా!?
తమిళసినిమా: రజనీకాంత్ ఈ ఐదక్షరాల పేరు ఆలిండియా లెవల్లోనే ఒక అద్భుతం. రజనీ సినిమాలు వస్తున్నాయంటే బాక్సాఫీస్ షేక్ అవుతోంది. ఫ్యాన్స్ సెలబ్రేషన్ మూడ్‌లోకి వెళ్లిపోతారు. అలాంటి రజనీ త్వరలోనే మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చాలాకాలం తరువాత ఆయన పోలీసు ఆఫీసర్‌గా పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న చిత్రం దర్బార్.. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ అదుర్స్ అనిపించింది. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తనదైన స్టైల్లో చెక్కుతున్నారు. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, రజనీకాంత్ నటించబోయే మరో కొత్త సినిమాకు కూడా రంగం సిద్ధమైంది. దర్శకుడు శివ డైరెక్షన్లో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మింస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి ప్రస్తుతం పలు ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూపర్‌స్టార్ రజనీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కానుందని, ఈ సినిమా కోసం ఒక టైటిల్ కూడా పరిశీలనలో ఉందని టాక్ స్ప్రెడ్ అయ్యింది. దర్శకుడు శివకు ‘వీ’ సెంటిమెంట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు అజిత్ హీరోగా చేసిన నాలుగు చిత్రాల టైటిల్స్ వీతోనే మొదలయ్యాయి. వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం ఇలా శివ ‘వీ’ టైటిల్ చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌తో చేసే చిత్రానికి ‘వీ’ సెంటిమెంట్ కలిసివచ్చేలా.. ‘వ్యూహం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ‘వ్యూహం’ సినిమా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి కూడా పనికొచ్చేలా ఉంటుందని అంటున్నారు. ఇందులో నటి జ్యోతిక, కీర్తీసురేశ్ హీరోయిన్లుగా నటించనున్నట్లు తెలుస్తోంది. నటుడు సూరి, వివేక్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. రజనీకాంత్ 168వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి 2020లో సమ్మర్స్పెషల్గా తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నారు. -
ఔనా.. తమన్నా మారిపోయిందా..!
తమిళసినిమా: నటి తమన్నా మారిపోయిందట. ఏమిటా మార్పు? ఏమా కథ అంటే.. గ్లామర్‌కు మారుపేరైన ఈ అమ్మడు.. ఆదిలో అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకాడలేదు. ఇక ఐటమ్ సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదేమంటే డాన్స్ అంటే నాకిష్టం అనే సమాధానం ఈ జాణ నుంచి వస్తుంది. అయితే తమన్నాలోనూ మంచి నటి ఉంది. ఆ విషయం తమిళంలో నటించిన కల్లూరి చిత్రంలోనే ఆమె నిరూపించుకున్నా.. ఎందుకనో దర్శక, నిర్మాతలు తమన్నాను గ్లామర్ కోసం ఎక్కువగా ఫోకస్ చేశారు. అయితే ప్రతి నటికీ, నటుడికీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోయే చిత్రం ఉంటుంది. అలా తమన్నా సినీ కెరీర్లో ‘బాహుబలి’ మెమరబుల్ సినిమాగా నిలిచిపోయింది. ఆ తరువాత ఈ అమ్మడికి సరైన పాత్ర లభించలేదు. మళ్లీ షరా మామూలుగా గ్లామర్ పాత్రలకే ఆమె మొగ్గు చూపుతూ వచ్చింది. హర్రర్ కథా చిత్రాలూ ఆమెకు వరుస కడుతున్నాయి. ఇలాంటి సమయంలో చిరంజీవి ‘సైరా’తో మరోసారి తనలోని నటిని బయటకు తీసే అవకాశం వచ్చింది. పాత్రలో సత్తా ఉండాలేగాని, ఎంతటి పాత్రనైనా చేస్తాననేవిధంగా ‘సైరా’లో లక్ష్మీ పాత్రకు తమన్నా జీవం పోసింది. ఈ సినిమాలో నయనతార కంటే తమన్నా పాత్రకే ఎక్కువ పేరు వచ్చింది. ఈ క్రమంలో తాజాగా తెరపైకి వచ్చిన తమిళ చిత్రం ‘పెట్రోమ్యాక్స్’ తమన్నాకు మరోసారి సక్సెస్‌ను అందించింది. బాహుబలి, సైరా, పెట్రోమ్యాక్స్ వంటి నట ప్రాధాన్యమున్న సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న నేపథ్యంలో తమన్నా ఇకపై గ్లామర్ పాత్రలకు ఒకింత దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంచుకోవాలని ఈ అమ్మడు అనుకుంటోందని కోలీవుడ్ టాక్. మంచి కుటుంబ కథా చిత్రాల్లో ప్రాధాన్యమున్న పాత్ర చేయాలని తమన్నా కోరికను ఆహ్వానించాల్సిందే గానీ, ఈ బ్యూటీ తన మాటపై నిలబడుతుందా? ఎందుకంటే ప్రస్తుతం విశాల్‌తో నటిస్తున్న ‘యాక్షన్’ చిత్రంలో తమన్నా గ్లామరస్ పాత్రనే పోషించింది. పెళ్లి సంగతేమిటి? ఇక, పెళ్లి సంగతేమిటన్న ప్రశ్నకు ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చింది. తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరుగుతోందని, అందులో ఒక్క శాతం కూడా నిజం లేదని చెప్పింది. కొందరు ఈ విషయంలో కావాలనే కల్పిత రాతలు రాస్తున్నారని, అలాంటి కథనాలను తన వద్దకు తీసుకొస్తే, వాటిని తానే ఒక చిత్రంగా నిర్మించడానికి సిద్ధమని కొంచెం ఘాటుగానే బదులిచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో గోపీచంద్‌కు జంటగా నటిస్తోంది. అదే విధంగా హిందీ చిత్రం క్వీన్ తెలుగు రీమేక్ దటీజ్ మహాలక్ష్మీ చిత్రంలోనూ కనిపించనుంది. -
జయలలిత.. నేనూ సేమ్ : హీరోయిన్
తమిళసినిమా: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు తనకు సారూప్యత ఉందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అంటున్నారు. సంచలన నటిగా తరచూ వార్తల్లో ఉండే కంగనా చాలాకాలం తరువాత కోలీవుడ్‌లో రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. మొదట్లో జయంరవికి జంటగా ‘ధామ్ ధూమ్’ చిత్రంలో నటించిన ఈ అమ్మడు ఆ తరువాత బాలీవుడ్లో బిజీ అయి.. అక్కడ టాప్ హీరోయిన్గా రాణిస్తున్నారు. ఇటీవల చారిత్రాత్మిక చిత్రం ‘మణికర్ణిక’లో ఝాన్సీరాణిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. త్వరలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో ఆమె నటించబోతున్నారు. ‘తలైవి’ అనే పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందనుంది. విజయ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంపై ప్రారంభానికి ముందే నుంచే బోలెడంత హైప్ క్రియేట్ అయింది. కారణం జయలలిత పాత్రలో కంగనా నటించనుండటమే. ఈ చిత్రంలో ‘అమ్మ’గా మారడానికి కంగనా కూడా బగానే కష్టపడుతున్నారు. జయ పాత్ర కోసం ఇటీవల అమెరికాలో మేకప్ టెస్ట్ చేయించుకున్న ఆమె భరతనాట్యంలో శిక్షణ కూడా పొందుతున్నారు. జయలలితలా తెరమీద కనిపించేందుకు ప్రత్యేకంగా తర్ఫీదు కూడా తీసుకుంటున్నారు. మా మధ్య స్వారూప్యం చాలానే ఉంది ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి కోవై వచ్చిన కంగనా మీడియాతో కాసేపు ముచ్చటించారు. తాను నటిస్తున్న జయలలిత బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కనుందని ఆమె తెలిపారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, యుక్త వయసులోనే సినీరంగప్రవేశం చేసిన జయలలిత.. సిని ఇండస్ట్రీలో పురుషాధిక్యతను ఎదుర్కొని పలు విజయాలను అందుకున్నారని చెప్పారు. తానూ ఆమె మాదిరేనని, కాబట్టి తమ మధ్య స్వారూప్యం చాలానే ఉందని తెలిపారు. జయలలిత విజయవంతమైన రాజకీయ నాయకురాలిగా మాత్రమే కాకుండా చాలా శక్తిమంతమైన మహిళగా జీవించారని ప్రశంసించారు. భాషలో పరిణితి, భరతనాట్యం వంటి పలు విషయాల్లో ప్రతిభావంతురాలైన జయలలిత పాత్రలో నిజాయితీగా నటించాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. అందుకోసం తమిళ భాషను కూడా నేర్చుకుంటున్నట్లు కంగనా వెల్లడించారు. రాజకీయ నేపథ్యంతో ఉన్న చిత్రాల్లో నటిస్తున్నా.. నిజజీవితంలో రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి లేదని కంగనా రనౌత్ స్పష్టం చేశారు. -
సక్సెస్ బాంబ్ ఎవరిది?
ఈ ఏడాది దీపావళికి జోరుగా పేలడానికి మూడు బాంబు ( తమిళ సినిమా)లు రెడీ అవుతున్నాయి. ఫుట్‌బాల్ ప్లేయర్‌గా విజయ్, ఖైదీగా కార్తీ, రాజకీయ నాయకుడిగా విజయ్ సేతుపతి.. ఈ ముగ్గురు హీరోలు దీపావళి బరిలో నిలిచారు. వీరి చిత్రాలతో పాలు పండక్కి ఇంకెన్ని చిత్రాలు వస్తాయో చూడాలి. ప్రస్తుతం ఈ మూడు చిత్రాల వివరాల్లోకి వెళితే... గత రెండేళ్లుగా దీపావళికి తన సినిమా విడుదలయ్యేలా చూసుకున్నారు విజయ్. 2017లో ‘మెర్సెల్’ (తెలుగులో ‘అదిరింది’), 2018లో ‘సర్కార్ చిత్రాలతో దీపావళికి తెరపై సందడి చేశారు. ఈ దీపావళిని కూడా ఆయన మిస్ కావడంలేదు. ప్రస్తుతం నటిస్తున్న ‘బిగిల్’ సినిమాను దీపావళి విడుదలకు రెడీ చేశారు. విజయ్‌తో ఇదివరకు ‘తేరి, మెర్సెల్’ వంటి హిట్ సినిమాలను తీసిన అట్లీ ఈ ‘బిగిల్’ సినిమాకు దర్శకుడు. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఫుట్‌బాల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు అర్థం అవుతోంది. ఈ సినిమాకు విజయ్ సుమారు 150 రోజులు కాల్షీట్స్ ఇవ్వగా ఆల్రెడీ ఈ సంఖ్య 200 దగ్గరకు చేరుకుంది. దీన్నిబట్టి రాజీ అనేది లేకుండా కాకుండా ఎంత శ్రమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఇక ఇటీవలి కాలంలో కోలీవుడ్‌లో మంచి స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యారు విజయ్ సేతుపతి. కేవలం హీరోగానే కాదు వీలు చిక్కినప్పుడల్లా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారం కూడా ఎత్తి ఆడియన్స్ మనసు దోచుకునే పాత్రలు చేస్తున్నారు. విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం ‘సంగ తమిళన్’. ‘స్కెచ్’ ఫేమ్ విజయ్ చందర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో రాశీ ఖన్నా కథానాయికగా నటించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి రాజకీయ నాయకుడి పాత్రలో నటించారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కూడా దీపావళికే విడదుల కానుంది. ‘బిగిల్’లో విజయ్ రెండు పాత్రలు చేశారనే ప్రచారం జరుగుతున్నట్లుగానే ‘సంగ తమిళన్’లో విజయ్ సేతుపతి కూడా డ్యూయల్ రోల్ చేశారనే ప్రచారం జరుగుతోంది. ఇక దీపావళికి వస్తున్న మరో హీరో కార్తీ. ‘ఖైదీ’ చిత్రంతో ఆయన పండక్కి తెరపై కనిపించబోతున్నారు. ‘మానగరం’ సినిమాతో ఆడియన్స్‌ను మెప్పించిన లోకేష్ కనగరాజన్ ఈ సినిమాకు దర్శకుడు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనింగ్ చిత్రం ఇది. ఈ సినిమాలో హీరోయిన్ లేకపోవడం విశేషం. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్, టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాయి. ఇలా మూడు సినిమాలు ఈ ఏడాది దీపావళికి విడుదల కానున్నాయి. మరి.. మూడు బాంబుల్లో మూడూ దిగ్విజయంగా పేలి, వసూళ్ల సౌండ్ బలంగా వినిపిస్తే ఇండస్ట్రీకి మంచిదే. మరి ఎవరిది సక్సెస్ బాంబ్ అవుతుందో వేచి చూడాలి. -
రాజకీయాల్లో ఈజీ.. సినిమాల్లోనే కష్టమబ్బా!
తమిళసినిమా: రాజకీయాల్లో వారసులు రాత్రికి రాత్రే ఎదుగుతున్నారని, సినిమాల్లో మాత్రం అలా కుదరడం లేదని సీనియర్ దర్శకుడు, నటుడు కే భాగ్యరాజ్ వ్యాఖ్యానించారు. నటుడు విక్రమ్‌ప్రభు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘అసురగురు’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న కే భాగ్యరాజ్ మాట్లాడుతూ.. సినీరంగంలో వారసులకు విజయాలు సులభంగా రావడం లేదని, పోరాడి సాధించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అయితే రాజకీయాల్లో మాత్రం వారసులు రాత్రికిరాత్రే ఎదుగుతున్నారని, ముఖ్యమైన పదవులు వారిని వరిస్తున్నాయి అన్నారు. కే భాగ్యరాజ్ కొడుకు శంతను హీరోగా పరిచయమై చాలాకాలమైనా మంచి హిట్ కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్న విషయం ఇక్కడ గమనార్మం. మరోవైపు సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్న నటుడు, స్టాలిన్ తనయుడు ఉదయనిధి ఇటీవల డీఎంకే యువజన కార్యదర్శి పదవిని చేపట్టిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో కే భాగ్యరాజ్ చేసిన వ్యాఖ్యలు చర్ఛనీయాంశంగా మారాయి. విక్రమ్‌ప్రభుకు జోడీగా నటి మహిమా నంబియార్ నటించిన ‘అసురగురు’ చిత్రంలో యోగిబాబు, జగన్, మనోబాల ముఖ్యపాత్రలను పోషించారు. జేఎస్బీ ఫిలిం స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌దీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన దర్శకుడు మోహన్‌రాజా శిష్యుడు. గణేశ్‌రాఘవేంద్ర సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో నటుడు విక్రమ్‌ప్రభు, నటి మహిమా నంబియార్, నిర్మాత కలైపులి థాను, ఎడిటర్ మోహన్ అతిథులుగా పాల్గొన్నారు. -
సైలెన్స్ అంటున్న స్వీటీ
తమిళసినిమా: నటి అనుష్కను సన్నిహిత వర్గాలు అభిమానంగా స్వీటీ అని పిలుస్తుంటారన్న విషయం తెలిసిందే. అనుష్క నటించిన చివరి చిత్రం తెరపైకి వచ్చి సుమారు రెండేళ్లు దాటింది. భాగమతి తరువాత ఈ అమ్మడు మరో చిత్రం చేయలేదు. మధ్యలో దర్శకుడు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించినట్లు అనుష్క బహిరంగంగా వెల్లడించినా, ఆ చిత్రం సెట్‌పైకి వెళ్లలేదు. మరో విషయం ఇంజి ఇడుప్పళగి చిత్రంలోని పాత్ర కోసం తన బరువును కనీసం 100 కిలోలకు పెంచుకున్న అనుష్క ఆ తరువాత దాన్ని తగ్గించుకోవడానికి నానా తంటాలు పడిందనే చెప్పాలి. మొత్తం మీద సుదీర్ఘ శ్రమ తరువాత బరువు తగ్గి కొత్త అందాలను సంతరించుకుంది. తాను ఎలా బరువు తగ్గానన్న విషయాలను ఒక బుక్కుగా రాసి ఇటీవల విడుదల చేసింది కూడా. కాగా మళ్లీ ముఖానికి రంగేసుకోవడానికి రెడీ అయిన అనుష్క సైలెన్స్ అనే సైంటిఫిక్ థ్రిల్లర్ కథా చిత్రంలో నటించడానికి అంగీకరించింది. తెలుగు, తమిళం, హింది భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెలుగులో నిశబ్దం అనే టైటిల్‌ను నిర్ణయించారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కేఎఫ్‌సీ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇందులో నటుడు మాధవన్, హాలీవుడ్ నటుడు మైఖేల్ మెడ్సన్, నటి అంజలి, శాలినీపాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం అమెరికాలో సైలెంట్‌గా షూటింగ్‌ను ప్రారంభించింది. నటి అనుష్క ఇంతకుముందు పలు విభిన్నమైన కథా పాత్రల్లో నటించినా, ఈ సైలెన్స్ చిత్రంలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే కథా పాత్రలో కనిపించనుందట. దీంతో సైలెన్స్ చిత్రంపై సినీవర్గాలు, ప్రేక్షకుల్లో ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది. -
భర్తపై హీరోయిన్ ప్రశంసల జల్లు..!
సాక్షి, తమిళ సినిమా: పెళ్లి తరువాత భార్య నుంచి ప్రశంసలు లభిస్తే.. ఆ ఆనందమే వేరు. ఇప్పుడు నటుడు ఆర్య అలాంటి ఆనందాన్నే ఆస్వాదిస్తున్నాడు. ఈ సంచలన నటుడు ఇటీవల అనూహ్యంగా నటి సాయేషా సైగల్‌ను ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. ‘నాన్ కడవుల్’ చిత్రంతో నటుడిగా తానేమిటో నిరూపించుకున్న ఆర్య.. ఆ తరువాత బాస్ ఎన్గిర భాస్కరన్, రాజారాణి వంటి విజయవంతమైన చిత్రాలతో కోలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల ఆయన నటించిన కంబన్, గజనీకాంత్ వంటి చిత్రాలు కొంత నిరాశపరిచాయి. దీంతో ఆర్యకు ఇప్పుడు అర్జెంట్‌గా ఒక హిట్ కావాలి. ఈ క్రమంలో సూర్య హీరోగా నటిస్తున్న ‘కాప్పాన్’ చిత్రంలో ఆర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. కేవీ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఆర్య హీరో కాకపోయినా, ఆయన పాత్ర కీలకంగా ఉంటుందని సమాచారం. ఇకపోతే ఆర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మహాగురు. ఇంతకుముందు మౌనగురు చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు శాంతకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆర్యకు జంటగా ఇందుజా, మహిమా నంబియార్ నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని, నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ టీజర్ భార్య సాయేషా సైగల్తోపాటు ఆమె అమ్మను కూడా ఫిదా చేసిందట. ఈ చిత్ర టీజర్ గురించి నటి సాయేషా సైగల్ ట్విట్టర్లో స్పందిస్తూ.. ఎంతో శ్రమించి.. ఆర్య ఈ సినిమాలో కొత్త గెటప్‌తో సరికొత్తగా కనిపించబోతున్నారని, ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఆసక్తి కలుగుతోందని పేర్కొన్నారు. ఆమె తల్లి కూడా టీజర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. -
శరత్‌కుమార్, రాధారవి అరెస్టుకు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు
-
శరత్‌కుమార్, రాధారవిని అరెస్టు చేయండి: హైకోర్టు
సాక్షి, చెన్నై: ప్రముఖ నటులు శరత్‌కుమార్, రాధారవి అరెస్టుకు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. గతంలో సినీ నటీనటుల సంఘానికి శరత్‌కుమార్ అధ్యక్షుడిగా, రాధారవి కార్యదర్శిగా ఉన్నారు. ఆ కాలంలో కాంచీపురం జిల్లా పరిధిలోని వెంకటామంగళంలో ఉన్న నడిగర్ సంఘానికి చెందిన స్థలాన్ని వీరిద్దరు అక్రమంగా అమ్మారని 2017లో ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు శనివారం విచారించింది. సంఘం అనుమతి లేకుండా స్థలాన్ని విక్రయించిన ఈ కేసును 3నెలల్లో తేల్చి చర్యలు తీసుకోవాలని, శరత్, రవిలను అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది. -
వదినతో తొలిసారి నటిస్తున్నా..
తమిళసినిమా: ‘వదిన జ్యోతికతో కలిసి తొలిసారిగా సినిమాలో నటిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది’ అని నటుడు కార్తీ ట్విటర్లో పేర్కొన్నారు. గతంలో అగ్ర కథానాయికగా వెలుగొందిన జ్యోతిక.. నటుడు సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత నటనకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ‘36 వయదినిలే’ చిత్రంతో మళ్లీ నటిగా ఎంట్రీ ఇచ్చి ఆమె.. వరుసగా వుమెన్ ఒరియంటెడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె తన మరిది, నటుడు కార్తీతో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిత్రంలోనూ వీరు వదినా మరిదిగా నటించడనుండడం విశేషం. మలయాళ దర్శకుడు జిత్తు జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైకం 18 స్టూడియోస్ సమర్పణలో పారలల్ మైండ్స్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రం గురించి నటుడు కార్తీ తన ట్విటర్లో స్పందిస్తూ.. ‘వదినతో కలిసి తొలిసారి నటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. జిత్తు జోసెఫ్ దర్శకత్వంలో నటించనుండటం ఆనందకరం. ఈ చిత్రంలో నటుడు సత్యరాజ్ కీలక పాత్ర పోషించబోతున్నారు. మీ ఆశీస్సులతో చిత్రం ఈ రోజు ప్రారంభమైంది’ అని పేర్కొన్నాడు. నటుడు సూర్య కూడా కార్తీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో సూర్య, కార్తీ తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి గోవింద వసంత్ సంగీతాన్ని, ఆర్డీ.రాజశేఖర్ ఛాయాగ్రహణను అందిస్తున్నారు.