భర్తపై హీరోయిన్‌ ప్రశంసల జల్లు..! | Sayesha Saigal Praises Husband Actor Arya | Sakshi

భర్తపై హీరోయిన్‌ ప్రశంసల జల్లు..!

May 18 2019 8:03 PM | Updated on May 18 2019 8:03 PM

Sayesha Saigal Praises Husband Actor Arya - Sakshi

సాక్షి, తమిళ సినిమా: పెళ్లి తరువాత భార్య నుంచి ప్రశంసలు లభిస్తే.. ఆ ఆనందమే వేరు. ఇప్పుడు నటుడు ఆర్య అలాంటి ఆనందాన్నే ఆస్వాదిస్తున్నాడు. ఈ సంచలన నటుడు ఇటీవల అనూహ్యంగా నటి సాయేషా సైగల్‌ను ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. ‘నాన్‌ కడవుల్‌’ చిత్రంతో నటుడిగా తానేమిటో నిరూపించుకున్న ఆర్య.. ఆ తరువాత బాస్‌ ఎన్గిర భాస్కరన్, రాజారాణి వంటి విజయవంతమైన చిత్రాలతో కోలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల ఆయన నటించిన కంబన్, గజనీకాంత్‌ వంటి చిత్రాలు కొంత నిరాశపరిచాయి. దీంతో ఆర్యకు ఇప్పుడు అర్జెంట్‌గా ఒక హిట్‌ కావాలి.

ఈ క్రమంలో సూర్య హీరోగా నటిస్తున్న ‘కాప్పాన్‌’ చిత్రంలో ఆర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఆర్య హీరో కాకపోయినా, ఆయన పాత్ర కీలకంగా ఉంటుందని సమాచారం. ఇకపోతే ఆర్య హీరోగా నటిస్తున్న  తాజా చిత్రం మహాగురు. ఇంతకుముందు మౌనగురు చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు శాంతకుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆర్యకు జంటగా ఇందుజా, మహిమా నంబియార్‌ నటిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకుని, నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ టీజర్‌ భార్య సాయేషా సైగల్‌తోపాటు ఆమె అమ్మను కూడా ఫిదా చేసిందట. ఈ చిత్ర టీజర్‌ గురించి నటి సాయేషా సైగల్‌ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ఎంతో శ్రమించి.. ఆర్య ఈ సినిమాలో కొత్త గెటప్‌తో సరికొత్తగా కనిపించబోతున్నారని, ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఆసక్తి కలుగుతోందని పేర్కొన్నారు. ఆమె తల్లి కూడా టీజర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement