కండలు తిరిగిన దృఢకాయంతో మతి పోగొడుతున్న ఈ హీరో ఎవరో చెప్పగలరా? అటు తిరిగి నిలుచోవడంతో గుర్తు పట్టలేకపోతున్నారా? దక్షిణాది ప్రేక్షకులకు చిరపరిచితమైన విలక్షణ నటుడు ఇతడు. తమిళ సినిమాల్లో హీరోగా సత్తా చాటిన ఈ నటుడు విలన్‌గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. అతనెవరో కాదు తమిళ హీరో ఆర్య. తన 30వ సినిమా కోసం తీవ్రంగా శ్రమించి కండలు పెంచి కొత్త అవతారంలోకి మారిపోయాడు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు గురువారం వెల్లడిస్తానని చెబుతూ ఈ ఫొటోను ఆర్య ట్వీట్ చేశాడు. ‘మీరంతట మీరు బలవంతులుగా మారేంత వరకు తెలియదు మీరెంత బలవంతులో’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు.
ఆర్య లేటెస్ట్ ఫొటోపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఊహించని హార్డ్‌వర్క్, అంకితభావంతో స్ఫూర్తిగా నిలిచారని ఆయన భార్య సాయేషా సైగల్ పేర్కొన్నారు. దర్శకుడు శక్తిసౌందర్‌రాజన్, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌ఎన్ ప్రసాద్, నటి శ్రియారెడ్డి, టీవీ యాంకర్ డీడీ నీలకందన్ తదితరులు ఆర్యను మెచ్చుకుంటూ ట్వీట్లు పెట్టారు. కాగా, ఆర్య నటించిన తాజా చిత్రం ‘టెడ్డీ’ విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు శక్తిసౌందర్‌రాజన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆర్యకు జంటగా ఆయన భార్య సాయేషా సైగల్ నటించడం విశేషం. జ్ఞానవేల్‌రాజా నిర్మించిన ఈ చిత్రంలో గ్రాఫిక్స్‌కు పెద్దపీట వేశారు. (చదవండి: టెడ్డీ చిత్రం కథేంటి?)
Comments
Please login to add a commentAdd a comment