tamil hero
-
పేరు మార్చుకున్న హీరో.. ఇకపై అలా పిలవొద్దంటూ..
తమిళ హీరో జయం రవి (Jayam Ravi) పేరు మార్చుకున్నాడు. తనను ఇకపై రవి మోహన్(Ravi Mohan) అని పిలవాలని చెప్తున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన కాదలిక్క నెరమలై సినిమా రిలీజ్‌కు ఒక రోజు ముందు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశాడు. ఈ రోజు నుంచి నా పేరు రవి లేదా రవి మోహన్. వ్యక్తిగతంగా కానీ, వృత్తిగతంగా కానీ ఇలాగే పిలవండి. ఇకపై అలా పిలవొద్దుదయచేసి ఇకపై ప్రతి ఒక్కరూ నన్ను జయం రవి అని సంభోదించకుండా రవి/ రవి మోహన్ అని మాత్రమే పిలవాలని కోరుతున్నాను అన్నాడు. జయం రవి అసలు పేరు రవి. ఆయన తండ్రి మోహన్ డైరెక్ట్ చేసిన జయం (తెలుగు జయం మూవీ రీమేక్) మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో తన పేరు జయం రవిగా మారింది. రెండు దశాబ్దాలుగా జయం రవిగానే కొనసాగిన ఆయన ఇప్పుడు తనను పాత పేరుతోనే పిలవాలని చెప్తున్నాడు. అలాగే ఈ హీరో తన పేరు మీద రవి మోహన్ స్టూడియోస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. తన బ్యానర్ ద్వారా మంచి కథలను అందించడంతో పాటు ప్రతిభావంతులైన కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని చెప్పుకొచ్చాడు. (చదవండి: 50 ఏళ్ల వయసులో హీరోయిన్ డేటింగ్? నిజమిదే!)మీరిచ్చిన ప్రేమకు ప్రతిఫలంగా..అంతే కాదు తన అభిమానుల కోసం రవిమోహన్ ఫ్యాన్స్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించాడు. దీని ద్వారా ఆపదలో ఉన్నవారికి, అవసరం కోసం అర్థిస్తున్నవారికి సాయం చేస్తానన్నాడు. ఈ ఫౌండేషన్‌తో సమాజంలో సానుకూల మార్పును ఆశిస్తున్నట్లు తెలిపాడు. మీరు నాకందించిన ప్రేమాభిమానాలను, సపోర్ట్‌కు ప్రతిఫలంగా నేను మీకు సహాయసహాకారాలు అందిస్తాను అని సదరు లేఖలో పేర్కొన్నాడు. సినిమాఇకపోతే జయం రవి, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటించిన కాదళిక్క నేరమిళై మూవీ జనవరి 14న విడుదల కానుంది. కిరుతిగ ఉదయనిధి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. ఉదయనిధి స్టాలిన్ నిర్మించారు. View this post on Instagram A post shared by Ravi Mohan (@jayamravi_official) చదవండి: డైరెక్టర్ అసభ్యకర వ్యాఖ్యలు.. స్పందించిన మన్మథుడు హీరోయిన్ -
తెలుగు మార్కెట్ ని కబ్జా చేస్తున్న పొరుగు హీరోలు
-
నన్ను అలా పిలవొద్దు.. కమల్ హాసన్ రిక్వెస్ట్
తమిళ హీరో కమల్ హాసన్ పనైపోయిందని అందరూ అనుకున్నారు. అలాంటి టైంలో 'విక్రమ్' మూవీతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ ఏడాది 'ఇండియన్ 2' రూపంలో దెబ్బ తగిలినప్పటికీ.. 'కల్కి'లో డిఫరెంట్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. రాజకీయాల్లో తనవంతు ప్రయత్నం చేశారు కానీ సక్సెస్ కాలేకపోయారు. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు మీడియా మిత్రులు, అభిమానులని ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. అది ఇప్పుడు వైరల్ అవుతుంది.'నా పనిని మెచ్చి 'ఉలగనాయగన్' లాంటి ఎన్నో బిరుదులు ఇచ్చినందుకు థ్యాంక్యూ. ప్రేక్షకులు, సహ నటీనటులు, ఆత్మీయులు నుంచి ఇలాంటి ప్రశంసలు నన్నెంతగానో కదిలించాయి. సినిమా విషయంలో నేను నిత్య విద్యార్థిని. ఇండస్ట్రీలో ఎన్నో విషయాలు నేర్చుకోవాలని, మరింత ఎదగాలని ఆశిస్తున్నాను. కళా కంటే కళాకారుడు గొప్ప కాదనేది నా నమ్మకం. ఎంతో ఆలోచించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకున్నాను. స్టార్ ట్యాగ్స్‌ని మర్యాదపూర్వకంగా తిరస్కరిస్తున్నాను'(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?)'నా అభిమానులు, మీడియా, సినీ ప్రముఖులు.. నన్ను కమల్ హాసన్ లేదా కమల్ లేదా కేహెచ్ అని పిలవండి చాలు. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి బిరుదులతో మీరు నాపై చూపించిన ప్రేమాభిమానాలకు థ్యాంక్స్. మూలాలకు కట్టుబడి ఉండాలని, నటుడిగా బాధ్యత నిర్వర్తించాలని అనుకుంటున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను' అని కమల్ హాసన్ ట్వీట్ చేశారు.కమల్ హాసన్ అనే కాదు తమిళ హీరో అజిత్ కూడా గతంలో ఇలానే చేశాడు. తనని వేరే పేర్లతో పిలవొద్దని.. అజిత్ కుమార్ లేదా అజిత్ అని పిలవండి చాలు అని రిక్వెస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: మెట్లపైనుంచి జారిపడ్డ విజయ్.. ట్రోలర్స్‌కు అదిరిపోయే పంచ్)உங்கள் நான்,கமல் ஹாசன். pic.twitter.com/OpJrnYS9g2— Kamal Haasan (@ikamalhaasan) November 11, 2024 -
నటుడు కాకముందే పెళ్లి.. ఇప్పుడేమో స్టార్ హీరో.. ఇతడెవరంటే?
సినిమా ఇండస్ట్రీలో నిలబడాలంటే బ్యాక్ గ్రౌండ్ ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ అప్పుడప్పుడు ఎలాంటి అంచనాల్లేకుండా నటుడు అయినోళ్లు.. కష్టంతో పాటు అదృష్టం కలిసొచ్చి స్టార్స్ అవుతారు. ఇతడు కూడా సేమ్ అలాంటివాడే. టీవీ యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. పైన హీరో ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో ఉన్నది 'అమరన్' ఫేమ్ శివకార్తికేయన్. ఏంటి అతడా? అని ఆశ్చర్యపోతున్నారా! ఇది సినిమాల్లోకి రాకముందు, పెళ్లి టైంలో తీసుకున్న ఫొటో ఇది. శివకార్తికేయన్ పక్కనున్న ఉన్నది ఇతడి భార్య ఆర్తి. 2010లో వివాహం జరిగింది. తమిళనాడులో పుట్టిపెరిగిన శివకార్తికేయన్‌కి చిన్నప్పటి నుంచే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. కానీ పూర్తిస్థాయి నటుడు కావడానికి ముందే ఆర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు 2013లో పాప పుట్టింది. ఆమె పేరు ఆరాధన.(ఇదీ చదవండి: అక్కడ సౌండ్ చేస్తే చచ్చిపోతారు.. ఓటీటీలోనే క్రేజీ మూవీ)ఓసారి ఫ్రెండ్స్ బలవంతం చేయడంతో షోలో పాల్గొని విజేతగా నిలిచాడు. మరోవైపు యాంకర్‌గానూ పలు షోలు చేశాడు. ఇవి కాదన్నట్లు షార్ట్ ఫిల్మ్స్‌లోనూ నటించాడు. '3' సినిమాలో ధనుష్‌కి ఫ్రెండ్‌గా చేశాడు. 2013లో విడుదలైన 'కేడీ బిల్లా కిలాడీ రంగ' మూవీ హీరోగా శివ కార్తికేయన్‌కి ఇచ్చింది. అక్కడి నుంచి ఒక్కో మూవీతో తన రేంజ్ పెంచుకుంటూ వెళ్లాడు. 'డాక్టర్' మూవీతో రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. ఇదే సినిమాతో తెలుగులోనూ ఫ్యాన్స్ ఏర్పడ్డారు.'డాక్టర్' తర్వాత అయలాన్, మహావీరుడు, డాన్ తదితర చిత్రాలతో ఎంటర్టైన్ చేశాడు. కానీ రీసెంట్గా దీపావళికి రిలీజైన 'అమరన్' మూవీతో మాత్రం తనలోని అసలు సిసలు నటుడిని అందరికీ పరిచయం చేశాడు. ఇప్పటికే రూ.100 కోట్ల కలెక్షన్స్‌కి దగ్గర్లో ఉంది. ఈ మూవీ వల్ల అప్పుడెప్పుడో పెళ్లినాటి ఫొటోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పైన ఫోటో అదే!(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు) -
బిచ్చగాడిలా మారిపోయిన యంగ్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా?
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో చాలా ప్రయోగాలు చేశారు. హిట్ కొట్టడంతో పాటు ప్రేక్షకుల మనసుల్ని కూడా గెలుచుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం రొటీన్ రొట్ట కొట్టుడు కమర్షియల్ మూవీస్ ఎక్కువగా తీస్తున్నారు. కొద్దోగొప్పో పలువురు చిన్న హీరోలు ప్రయోగాలు చేస్తున్నారు గానీ పెద్దగా వర్కౌట్ కావట్లేదు. తాజాగా తమిళ యంగ్ హీరోని బిచ్చగాడు పాత్రలో పెట్టి ఏకంగా సినిమా తీసేశారు.(ఇదీ చదవండి: 'లెవల్ క్రాస్' సినిమా రివ్యూ (ఓటీటీ))తమిళ బిగ్‌బాస్ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న కవిన్.. రీసెంట్ టైంలో 'దాదా' అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా కాస్త పరిచయమే. ఇప్పుడు ఇతడిని హీరోగా పెట్టి 'బ్లడీ బెగ్గర్' అనే మూవీ తీశారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. బిచ్చగాడు పాత్రలో కనిపించిన సీన్స్ చూసి ఆశ్చర్యపోయారు. నిజం బెగ్గర్ ఏమో అనుకునేంతలా పరకాయ ప్రవేశం చేశాడనిపించింది.దివ్యాంగుడిలా నటిస్తూ బిచ్చమెత్తుకుంటే జీవించే ఓ బెగ్గర్.. ఊహించని పరిస్థితుల్లో ఓ ఇంట్లో పెద్ద కుటుంబం మధ్యలో చిక్కుకుపోతే ఏం జరిగింది? చివరకు ఆ ఇంటినుంచి బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది. 'బీస్ట్', 'జైలర్' సినిమాలతో దర్శకుడిగా ఆకట్టుకున్న నెల్సన్.. ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ఈ మూవీ రిలీజ్ కానుంది. తమిళ వెర్షన్ మాత్రమే థియేటర్లలోకి వస్తుంది. కొన్నాళ్లకు డబ్బింగ్ వెర్షన్ ఓటీటీలోకి వస్తుంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు కానీ!) -
మౌనంగా ఉన్నానంటే తప్పు చేసినట్లు కాదు: ఆర్తి
తమిళ హీరో జయం రవి విడాకుల వ్యవహారం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని రవి తెలపగా.. తన అనుమతి లేకుండానే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడని ఆర్తి ఆవేదన వ్యక్తం చేసింది. విడాకుల విషయంలో వెనక్కు తగ్గేదే లేదని రవి పేర్కొంటుండగా ఇప్పటికీ తన భర్తతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని ఆర్తి అంటోంది. రవిని ముప్పుతిప్పలు పెట్టిన ఆర్తి?ఇంతలో వీరి విడాకులకు ఈవిడే కారణమంటూ ఓ సింగర్ పేరు తెరపైకి రావడం, ఆమె స్పందించి తనను మధ్యలోకి లాగొద్దని హెచ్చరించడమూ జరిగింది. ఇక జయం రవిని ఆర్తి ముప్పుతిప్పలు పెట్టిందంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరిగింది. అతడి సోషల్ మీడియా ఖాతాలన్నీ ఆర్తి ఆధీనంలో ఉన్నాయని, వాటిని అతడికి అప్పగించకుండా ఇబ్బందిపెడుతోందని సదరు వార్తల సారాంశం. ఈ నేపథ్యంలో ఆర్తి తాజాగా సోషల్ మీడియాలో ఓ నోట్ షేర్ చేసింది.మౌనంగా ఉన్నానంటే..'నా వ్యక్తిగత జీవితం గురించి నానారకాలుగా ప్రచారం జరుగుతోంది. నన్ను చెడుగా చిత్రీకరించి నిజాన్ని కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు. అయినా మౌనంగా ఉంటున్నానంటే నేను తప్పు చేశానని అర్థం కాదు. కేవలం హుందాగా వ్యవహరించాలనుకున్నాను. న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నాం అని అతడు లేఖ రిలీజ్ చేసినప్పుడు నేను నిజంగానే షాకయ్యాను.అదే నాకు ముఖ్యంఅప్పుడు నేను మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇప్పటికీ ఈ విషయంలో తనతో వ్యక్తిగతంగా మాట్లాడేందుకు అవకాశం ఉందేమోనని ఎదురుచూస్తున్నాను. వివాహవ్యవస్థను నేను గౌరవిస్తాను. ఇరువురి ప్రతిష్టను దెబ్బతీసే బహిరంగ చర్చలను నేను ఎంకరేజ్ చేయను. నా కుటుంబ క్షేమమే నాకు ముఖ్యం అని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆర్తి పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi) చదవండి: సినిమాల్లోకి రావాలనుకుని టీవీలో సెటిలయ్యా,.. అనుకున్నంత ఈజీ కాదు! -
ఒకప్పుడు హీరోగా.. ఇప్పుడేమో క్యారెక్టర్ ఆర్టిస్టుగా!
చార్మింగ్ స్టార్ ప్రశాంత్ 1990 ప్రాంతంలో టాప్ హీరోగా రాణించాడు. అప్పట్లో ఈయన నటించిన చిత్రాలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌తో కలిసి నటించిన జీన్స్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అతడు తమిళంలో నటించిన ఎన్నో చిత్రాలు తెలుగులో అనువాదమై సక్సెసయ్యాయి. ఈయన తెలుగులోనూ తొలిముద్దు, ప్రేమశిఖరం, లాఠీ చిత్రాల్లో హీరోగా నటించారు. వియన విధేయ రామ సినిమాలో చివరిసారిగా కనిపించారు. గోట్ మూవీలో కీలకపాత్ర ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభుదేవా, అజ్మల్, నటి మీనాక్షీ చౌదరి, స్నేహా, లైలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైయిన్‌మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కుతున్నట్లు సమాచారం. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం ప్రస్తుతం మాస్కోలో చిత్రీకరణ జరుపుకుంటోంది. విజయ్ సినిమాలో ఎందుకు? శనివారం ప్రశాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ విడుదల చేసింది. ఈ సందర్భంగా టాప్ స్టార్‌గా వెలిగిన మీరు విజయ్ హీరోగా నటిస్తున్న చిత్రంలో నటించడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు ప్రశాంత్ బదులిస్తూ వెంకట్‌ప్రభు కథ చెప్పినప్పుడే ఇది మల్టీస్టారర్ చిత్రం అనిపించిందన్నారు. ఆయన చెప్పిన కథ అద్భుతంగా ఉండడంతో విజయ్, ప్రభుదేవాలతో కలిసి నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. కథలో చాలా ట్విస్టులు ఉంటాయన్నారు. చిత్రం అన్ని వర్గాల వారికి పసందైన విందుగా ఉంటుందని, విజయ్, ప్రభుదేవాలతో పాట తన డాన్స్ బాగుంటుందన్నారు. OFFICIAL: Team The G.O.A.T Wishing the Top Star #Prashanth a very happy birthday! #TheGreatestOfAllTime @actorvijay @actorprashanth pic.twitter.com/g8m6vJPcoI — Actor Vijay Team (@ActorVijayTeam) April 6, 2024 చదవండి: అల్లు అర్జున్ గురించి ఈ విషయాలు తెలిస్తే.. ఎత్తిన ప్రతి వేలూ ముడుచుకోవాల్సిందే -
ఈ హీరో క్రేజ్, కలెక్షన్స్ చూసి రజనీకాంతే భయపడ్డారు!
సుమారు 12 ఏళ్ల గ్యాప్ తరువాత నటుడు రామరాజన్ హీరోగా నటిస్తున్న చిత్రం సామాన్యన్. ఆర్.రాకేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత వి.మదియళగన్ నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు రామరాజన్, ఇళయరాజా కాంబోలో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. కాగా సుమారు 23 ఏళ్ల తరువాత మళ్లీ వీరి కాంబోలో రూపొందుతున్న చిత్రం సామాన్యన్. నటి నక్సాచరణ్, స్మృతి వెంకట్, అపర్ణ హీరోయిన్లుగా నటిస్తున్న ఇందులో రాధారవి, ఎంఎస్.భాస్కర్, లియో శివకుమార్, రాజారాణి పాండియన్, మైమ్ గోపి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంతే భయపడ్డారు శుక్రవారం సాయంత్రం చైన్నెలో ఆడియో లాంచ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు ఆర్వీ ఉదయకుమార్, పేరరసు, కేఎస్.రవికుమార్, శరణసుబ్బయ్య తదితర సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు కేఎస్.రవికుమార్ మాట్లాడుతూ.. సహయ దర్శకుడిగా 9 ఏళ్లు కష్టపడ్డప్పటికీ.. తనను దర్శకుడిని చేసింది రామరాజన్నేనని చెప్పారు. ఈయన నటించిన చిత్రాలన్నీ విజయాన్ని సాధించాయని, ఒక సమయంలో రామరాజన్ గురించి నటుడు రజనీకాంత్ తనతో మాట్లాడుతూ రామరాజన్ మాస్ ఫాలోయింగ్, వసూళ్లను చూస్తుంటే తనను మించి పోతారేమోనని భయంగా ఉందని అన్నారన్నారు. 23 ఏళ్ల తర్వాత.. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ.. వనవాసం ముగించుకుని వచ్చిన రామరాజన్‌కు ఇక పట్టాభిషేకమేనని పేర్కొన్నారు. ఆయన పరిగెత్తే గుర్రం కాదని, పలు గుర్రాలను పరిగెత్తించిన నటుడన్నారు. రామరాజన్ చిన్న మక్కళ్ తిలగం అని దర్శకుడు ఆర్వీ ఉదయకుమార్ పేర్కొన్నారు. 23 ఏళ్ల తర్వాత ఇళయరాజా, రామరాజన్ కలిసి పని చేస్తున్న ఈ చిత్రానికి తాను దర్శకత్వం వహించడం భాగ్యంగా భావిస్తున్నానని చిత్ర దర్శకుడు రాకేశ్ అన్నారు. నటుడు రామరాజన్ మాట్లాడుతూ 2010లో పార్టీ మీటింగ్ ముగించుకుని వస్తున్న సమయంలో ఘోర ప్రమాదానికి గురయ్యానని, వెంట్రుక వాసిలో బతికి బయట పడ్డానని, ఇప్పుడు ఈ చిత్రంలో నటించడం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. అభిమానుల ప్రార్థనల వల్లే తాను మళ్లీ ప్రాణాలతో బయట పడ్డానన్నారు. చదవండి: కలెక్షన్స్‌తో మోత మోగిస్తున్న టిల్లుగాడు.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే -
క్రేజ్ కాపాడుకోలేకపోయాడు.. ఆ తప్పు వల్ల కెరీర్, జీవితం సర్వనాశనం!
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ తిరిగేవాళ్లు చాలామందే కనిపిస్తారు. నిజంగానే ఒక్క ఛాన్స్‌తో అద్భుతాలు జరిగిపోతాయా? అంటే అవుననే చెప్పాలి. ఎంతోమంది తొలి సినిమాతోనే తామేంటో ప్రూవ్ చేసుకుని గొప్ప స్థాయికి ఎదిగారు. అదే సమయంలో ఫస్ట్ సినిమాతో క్రేజ్ అందుకున్నా తర్వాతి రోజుల్లో దాన్ని కాపాడుకోలేక మరుగునపడ్డ హీరోలూ ఉన్నారు. ప్రేమికుల రోజు సినిమా హీరో కునాల్ సింగ్ ఈ కోవలోకే వస్తాడు. ఆయన గురించే నేటి ప్రత్యేక కథనం.. ఫస్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్ కునాల్ సింగ్ నటించిన తొలి సినిమా కాదల్ దినం. ఈ మూవీ తెలుగులో ప్రేమికుల రోజు పేరిట డబ్ అయింది. ఇందులో సోనాలి బింద్రే హీరోయిన్గా యాక్ట్ చేయగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. వాలు కనులదానా, ప్రేమ అనే పరీక్ష రాసి.. , దాండియా ఆటలు ఆడ.. ఇలా అన్ని పాటలు బ్లాక్‌బస్టర్ హిట్టయ్యాయి. సినిమా కూడా సూపర్ హిట్టయింది. ఇంకేముంది.. వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇక్కడే తప్పటడుగులు వేశాడు. హిట్ల కన్నా ఫ్లాపులే ఎక్కువగా అందుకున్నాడు. అతడు సంతకం చేసిన సినిమాలు ఆదిలోనే ఆగిపోయాయి. (చదవండి: Vithika Sheru: మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.. వితికా ఎమోషనల్ పోస్ట్) భార్య ఉండగా నటితో క్లోజ్.. మరికొన్ని షూటింగ్ జరిగినా విడుదలకు నోచుకోలేదు. ఐదేళ్లలోనే డీలా పడిపోయాడు. 2007లో చివరగా నంబనిన్ కాదలై అనే సినిమాలో యాక్ట్ చేశాడు. యాక్టర్‌గా రాణించడం కష్టమని తెలియగానే అసిస్టెంట్ డైరెక్టర్ అవతారమెత్తాడు. తర్వాత నిర్మాతగానూ మారాడు. అయతే కునాల్, నటి లావిణ పంకజ్ భాటియా అత్యంత సన్నిహితంగా మెదిలేవారని అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పటికే అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి ప్రేమ విషయం కునాల్ భార్య అనురాధకు తెలిసింది. దీని గురించి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవట! ప్రాణాలు తీసుకున్నాడు ఆమె కోపంతో ఇల్లు విడిచి పుట్టింటికి వెళ్లిపోవడంతో కునాల్ మనస్తాపానికి గురయ్యాడు. 2008 ఫిబ్రవరి 7న తన అపార్ట్మెంట్లో ఉరేసుకుని చనిపోయాడు. ఇది జరగడానికి కొన్ని గంటల ముందు ఏదో సినిమా గురించి స్క్రిప్ట్ రైటర్, కాస్ట్యూమ్ డిజైనర్స్, నటి పంకజ్‌తో తన ఇంట్లోనే చర్చలు జరిపాడు. అందరూ వెళ్లిపోయాక పంకజ్ అక్కడే ఉన్న వాష్‌రూమ్‌ను వాడుకుందామని వెళ్లి వచ్చింది. అంతలోనే కునాల్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఏమీ మిగల్లేదు అయితే పంకజ్‌కు, కునాల్‌కు మధ్య ఏదో గొడవ జరిగిందని, ఆ ఆవేశంలోనే హీరో ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడన్న పుకార్లు కూడా వచ్చాయి. ఈ కేసులో పోలీసులు పంకజ్ భాటియాను అదుపులోకి తీసుకుని విచారించారు. కానీ ఇది ఆత్మహత్యే అని నిర్ధారించారు. అంతకుముందు కూడా కునాల్ ఒకటీరెండు సార్లు చనిపోయేందుకు ప్రయత్నించాడట! ఒకవైపు కెరీర్ నాశనమైంది.. మరోవైపు సంసార జీవితం కూడా సవ్యంగా లేదు.. వీటికి తోడు నిర్మాతగా అప్పులపాలు అవడంతోనే అతడు తనువు చాలించాడని చెప్తుంటారు. ఏదేమైనా 31 ఏళ్ల వయసులోనే అతడు ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలిచివేసింది. చదవండి: తనకెందుకు క్రెడిట్? అని ఆటిట్యూడ్ చూపించా.. తర్వాతి సినిమాల్లో నాకు ఛాన్స్ ఇవ్వలే! -
స్టార్ హీరో వింటేజ్ లుక్.. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా.. గుర్తుపట్టారా?
కొన్నిసార్లు మనకు బాగా తెలిసిన హీరోల్ని కూడా వాళ్ల పాత ఫొటోలు చూస్తే గుర్తుపట్టడం కష్టమే. ఎందుకంటే అంత మార్పు ఉంటుంది మరి. ఈ హీరో కూడా సేమ్ అలాంటోడే. పైన కనిపిస్తున్న ఫొటో అలాంటిదే. ఇతడు తెలుగోడు కానప్పటికీ మన దగ్గర వేరే లెవల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. హిట్ ఫ్లాప్ అనేది పక్కనబెడితే ప్రతి మూవీతో మెస్మరైజ్ చేస్తుంటాడు. మరి ఇంతలా చెప్పాం కదా ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన కనిపిస్తున్న హీరో పేరు సూర్య. అవును మీలో చాలామంది ఊహించింది కరెక్టే. ఇతడు అసలు పేరు శరవణన్ శివకుమార్. తండ్రి శివకుమార్ నటుడు కావడంతో ఇండస్ట్రీ గురించి కాస్తోకూస్తో తెలుసు. కానీ నేరుగా హీరో అయిపోలేదు. డిగ్రీ పూర్తయిన తర్వాత ఎవరనేది చెప్పకుండా బట్టల ఫ్యాక్టరీలో చాలా తక్కువ జీతానికి కొన్నినెలల పాటు పనిచేశాడు. ఫలానా నటుడి అబ్బాయి అని తెలిసిపోవడంతో అక్కడ పనిమానేశాడు. కెరీర్ ప్రారంభంలో నటుడిగా పలు విమర్శలు ఎదుర్కొన్నాడు. (ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?) ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవాలనే సామెతకి తగ్గట్లు నటుడిగా తనని తాను మెరుగుపెట్టుకుంటూ వెళ్లాడు. కాకా, మౌనం పెసియాదే, పితాగమన్, గజిని లాంటి చిత్రాలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 'గజిని' సినిమా అయితే తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్‌హిట్‌గా నిలచింది. ఆ తర్వాత 7th సెన్స్, వీడొక్కడే, 24, 'సింగం' సిరీస్ చిత్రాలతో.. చాలామంది తెలుగు స్ట్రెయిట్ హీరోల కంటే ఎక్కువ స్టార్డమ్ సంపాదించాడు. త్వరలో 'కంగువ' అనే చిత్రంతో రాబోతున్నాడు. సూర్య ఫ్యామిలీ విషయానికొస్తే.. తనతో పాటు కలిసి హీరోయిన్గా చేసిన జ్యోతికని 2006లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం హీరో కమ్ నిర్మాతగా సూర్య అదరగొట్టేస్తుంటే.. జ్యోతిక కూడా నటిగా రీఎంట్రీ ఇచ్చి హిందీ, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించేస్తోంది. తాజాగా ఒకానొక సందర్భంగా సూర్య పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పైన ఉన్న ఫొటో అదే. తొలుత చాలామంది గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే అప్పటికీ ఇప్పటికీ సూర్యలో అంత తేడా ఉంది మరి! (ఇదీ చదవండి: ప్రేమ కావాలంటున్న మెగా డాటర్ నిహారిక.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్) -
కోట్లు ఇస్తామన్నా రిజెక్ట్ చేశా.. హీరో
చల్లని పానీయాల ప్రకటనల్లో నటించడానికి కోట్లు ఇస్తానన్నా తాను అంగీకరించడం లేదని నటుడు, సంగీత దర్శకుడు, గాయకుడు జీవీ ప్రకాష్‌కుమార్ తెలిపారు. సినీ రంగంలో ప్రతిభను ప్రోత్సహించే విధంగా నరేష్ బృందం స్టార్డా అనే సరికొత్త ప్లాట్‌ఫామ్ ప్రారంభించింది. దీనికి జీవీ ప్రకాష్‌కుమార్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. గురువారం సాయంత్రం చైన్నెలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవీ మాట్లాడుతూ.. తాను చిన్నతనంలోనే చిత్ర రంగ ప్రవేశం చేశానన్నారు. హీరోగా 23 సినిమాలు చేశా పలు చిత్రాలకు సంగీతాన్ని అందించానని, అదే విధంగా కథానాయకుడిగా 23 చిత్రాలు చేశానన్నారు. వెట్రిమారన్, ఏఎల్ విజయ్, అట్లీ వంటి పలువురు దర్శకులతో తొలి రోజుల్లో తాను పనిచేసినట్లు చెప్పారు. పనిచేసిన దర్శకుల్లో 17 మంది కొత్త వారేనన్నారు. ఇక్కడ ప్రతిభకు కొరత లేదని, అయితే దానిని ప్రదర్శించడానికి సరైన మార్గం చాలా మందికి తెలియడం లేదన్నారు. ఇలాంటి వారికి ఈ స్టార్డా మంచి ప్లాట్‌ఫామ్ అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జూదం, కూల్ డ్రింక్స్.. నో! ఈ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసిన నరేష్ బృందాన్ని అభినందిస్తున్నానన్నారు. శీతల పానీయాలు, జూదం ఆడటం వంటి సంస్థల ప్రకటనల్లో నటించడానికి కోట్లు ఇస్తానంటున్నారని, అయినా తాను వాటిలో నటించడానికి అంగీకరించడం లేదన్నారు. ఈ స్టార్డా ప్లాట్‌ఫామ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం సంతోషంగా ఉందని జీవీ ప్రకాష్ కుమార్ పేర్కొన్నారు. చదవండి: వాలంటైన్స్ డే స్పెషల్.. 9 సూపర్ హిట్ చిత్రాలు రీ రిలీజ్ -
'షాపింగ్ మాల్' హీరో ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?
ఇండస్ట్రీలోకి చాలామంది హీరోలు వస్తుంటారు. కానీ వీళ్లలో హిట్ కొట్టి నిలబడేది చాలా తక్కువమంది. ఏమైనా బ్యాక్‌గ్రౌండ్ ఉండే పర్లేదు కానీ ఒకవేళ సినీ నేపథ్యం ప్లస్ హిట్లు లేకపోతే మాత్రం ఎంత త్వరగా ఫేమ్ తెచ్చుకున్నారో అంతే ఫాస్ట్‌గా కనుమరుగైపోతారు. 'షాపింగ్ మాల్' సినిమా హీరోది కూడా సరిగ్గా అలాంటి పరిస్థితే. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. మరి ఇప్పుడేం చేస్తున్నాడు? అసలెలా ఉన్నాడనేది చూద్దాం. తమిళనాడులోని దిండిగల్ పుట్టి పెరిగిన మహేశ్.. స్వతహాగా వాలీబాల్ ప్లేయర్. ఓ రోజు గేమ్ ఆడుతున్నప్పుడు ఇతడిని చూసిన డైరెక్టర్ వసంతబాలన్.. తన తీయబోయే సినిమాలో నటించమని కోరాడు. కానీ తనకు యాక్టింగ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని మహేశ్ చెప్పాడు. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకు మనసు మారడంతో అదే వసంతబాలన్ తీసిన 'అంగడి తెరు' మూవీలో హీరోగా నటించాడు. దీన్నే తెలుగులో 'షాపింగ్ మాల్' పేరుతో రిలీజ్ చేయగా సూపర్ హిట్ అయింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) 'షాపింగ్ మాల్' సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మహేశ్.. ఆ తర్వాత మాత్రం కెరీర్‌ని సరిగా ప్లాన్ చేసుకోలేకపోయాడు. ఎందుకంటే తమిళంలో వరసగా మూవీస్ చేస్తూ వచ్చాడు. అలానే మలయాళ, ఫ్రెండ్, తెలుగులోనూ తలో చిత్రం చేశాడు. కానీ ఏం లాభం... ఒక్కటంటే ఒక్క మూవీ కూడా 'షాపింగ్ మాల్' మాదిరి హిట్ అవ్వలేదు. మనోడికి పేరు రాలేదు. ఇక తన ఫ్రెండ్స్ అందరూ జీవితంలో సెటిలైపోయారు కానీ హీరోగా పలు సినిమాలు చేసిన మహేశ్ మాత్రం హిట్లు లేకపోవడంతో పూర్తిగా డీలా పడిపోయాడు. సినిమాల వల్లనో ఏమో గానీ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉండిపోయాడు. ప్రస్తుతం ఇతడికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తొలుత ఇతడిని గుర్తుపట్టలేకపోయారు. కానీ ఆ తర్వాత 'షాపింగ్ మాల్' హీరో అని తెలిసి తెలుగు నెటిజన్స్ అవాక్కయ్యారు. (ఇదీ చదవండి: 'హనుమాన్' కోసం 70-75 సినిమాలు రిజెక్ట్ చేశా: హీరో తేజ) -
ట్రైనింగ్ పూర్తి.. హెయిర్ స్టైలిస్ట్‌గా మారిన హీరో!
ఆర్జేగా జీవితాన్ని ప్రారంభించిన బాలాజీ ఆ తరువాత హాస్యనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి ఆ తరువాత కథానాయకుడిగా అవతారం ఎత్తి ఆపై మెగాఫోన్ పట్టి సక్సెస్ అయ్యారు. ఈయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సింగపూర్ సెలూన్. గోకుల్ దర్శకత్వంలో వేల్స్ ఫిలిం పతాకంపై ఐసరీ గణేష్ నిర్మించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా, సత్యరాజ్, లాల్, జీవా, దర్శకుడు లోకేష్ కనకరాజ్ ముఖ్యపాత్రలు పోషించారు. వీరితో పాటు ఒక ప్రముఖ నటుడు కీలక పాత్రను పోషించినట్లు దర్శకుడు చెప్పారు. వివేక్ మెర్విన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 25న తెరపైకి రానుంది. సింగపూర్ సెలూన్ చిత్రం సెన్సార్ బోర్డు నుంచి యూ సర్టిఫికెట్ పొందడం విశేషం. ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ పొందింది. ఈ చిత్రం చైన్నెలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు గోకుల్ మాట్లాడుతూ.. చదువుకుంటున్న దశలోనే హెయిర్ స్టైలిస్ట్ కావాలని ఆశపడే ఒక సాధారణ వ్యక్తి కథే ఈ సినిమా అన్నారు. సింగపూర్ సెలూన్ చిత్రం తన కెరీర్లో 10 కాలాల పాటు గుర్తుండిపోతుందనే నమ్మకాన్ని బాలాజీ వ్యక్తం చేశారు. ఈ చిత్రం కోసం హెయిర్ స్టైలిస్ట్‌గా ప్రాథమిక శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు. చదవండి: 'ధర్మం కోసం నిలబడేవాడు ఎప్పటికీ గెలుస్తాడు': ప్రశాంత్ వర్మ ట్వీట్ వైరల్! -
మరోసారి ఆస్పత్రిలో చేరిన హీరో విజయ్‌కాంత్.. అదే కారణం?
కొన్నాళ్ల ముందు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన తమిళ స్టార్ హీరో విజయ్ కాంత్.. కోలుకుని ఇంటికెళ్లిపోయారు. ఇప్పుడు మరోసారి ఆస్పత్రిలో చేరారు. దీంతో ఈయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇది రెగ్యులర్ చెకప్ కోసమేనని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని అంటున్నారు. (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న 'బిగ్‌బాస్' మానస్.. రేటు ఎంతో తెలుసా?) ఇకపోతే తమిళంలో పలు సినిమాల్లో హీరోగా నటించిన విజయ్‌కాంత్ చాలా ఫేమ్ సంపాదించారు. ఓ వైపు సినిమాలు చేస్తూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2011-16 మధ్య తమిళనాడు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. ఇలా నటుడు, పొలిటీషియన్ కాకుండా నిర్మాత, దర్శకుడిగానూ పేరు తెచ్చుకున్నారు. విజయ్‌కాంత్ పూర్తి పేరు విజయరాజ్ అలగర్‌స్వామి. 1952 ఆగస్టు 25లో పుట్టారు. కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో చాలా క్రేజ్ తెచ్చుకున్నారు. దీంతో ఆయన పేరు కాస్త కెప్టెన్ విజయ్‌కాంత్‌గా మారిపోయింది. విజయ్‌కాంత్ భార్య పేరు ప్రేమలత. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీళ్లలో ఒకబ్బాయి ఆల్రెడీ హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. ఇకపోతే 70 ఏళ్ల విజయ్‌కాంత్ గత కొన్నేళ్లుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే ఇలా ఆస్పత్రి పాలవుతున్నారు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7'లో ఓడిపోతేనేం.. ఇప్పుడు శోభాశెట్టికి ఆ అవార్డ్) -
కోలీవుడ్‌లో విషాదం.. గుండెపోటుతో హీరో కన్నుమూత
సినీ నటుడు గంగా (53) శుక్రవారం సాయంత్రం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన టి.రాజేందర్ దర్శకత్వం వహించిన ఉయిరుళ్లవరై ఉషా చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయ్యారు. నటి నళిని హీరోయిన్గా నటించిన ఈ చిత్రం అప్పట్లో ఘనవిజయం సాధించింది. దీంతో నటుడు గంగాకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా క్రైం తొడుమ్ అలైగళ్, మురుగేశన్ తునై, మామండ్రం, సావిత్రి వంటి చిత్రాల్లో నటించారు. ఆ తరువాత హీరోగా అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటించారు. అనంతరం కొన్ని టీవీ సీరియల్స్‌లో నటించిన గంగా మరికొన్ని టీవీ సీరియల్స్‌కు దర్శకత్వం కూడా వహించారు. స్థానిక మైలాపూర్‌లో నివసిస్తున్న ఈయన పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. కాగా శుక్రవారం సాయంత్రం హఠాత్తుగా గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. ఈయన భౌతిక కాయాన్ని సొంతూరు చిదంబరం సమీపంలోని భరత్తూర్ చావడి గ్రామానికి తరలించి శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. చదవండి: సల్మాన్ ఖాన్ ‘టైగర్-3’ మూవీ ఎలా ఉందంటే.. 900కుపైగా సినిమాల్లో నటన.. తొలి చిత్రానికే నంది అవార్డు -
మరో కొత్త కథతో వస్తున్నా: పార్థిబన్
విభిన్న కథా చిత్రాలకు కేరాఫ్ పార్థిబన్. నటుడిగా, కథకుడిగా, దర్శక, నిర్మాతగా ఈయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో పార్థిబన్ దిట్ట. ఆ మధ్య ఏకపాత్రాభినయం చేసి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఒత్త చెరుప్పు సైజ్ సెవెన్ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆధరణ పొందింది. అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టింది. ఆ తరువాత పార్థిబన్ రూపొందించిన చిత్రం ఇరవిన్ నిళల్. ఇది నాన్ లీనియర్ ఫార్మెట్లో సింగిల్ షాట్లో తెరకెక్కించిన ప్రయోగాత్మక కథా చిత్రం. ఈ చిత్రం ప్రశంసలను అందుకుంది. తాజాగా మరో కొత్త కథతో వస్తున్నానని ట్విట్టర్(ఎక్స్)లో పేర్కొన్నారు. ఈసారి నాన్ లీనియర్ ఫార్మెట్ కాదని, ప్రయోగాత్మకంగా కథా చిత్రం అస్సలు కాదని, అలాగని సాధారణ కథా చిత్రం కాదని చెప్పారు. ఇంతకు ముందు చిత్రాల్లో చేసిన తప్పులను సరి చేసుకుంటూ ఈ చిత్రాన్ని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రూపొందిస్తున్నట్లు తెలిపారు. చిత్రంలో వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉంటుందని, గ్రాఫిక్స్ అంటే హాలీవుడ్ చిత్రాలే గుర్తుకొస్తాయని అన్నారు. మనకు బడ్జెట్ సమస్య తలెత్తుతుందని అన్నారు. అయితే చాలాకాలం క్రితమే తమిళంలో చంద్రలేఖ, ఆయిరత్తిల్ ఒరువన్, ఉలగం చుట్రం వాలిబన్ వంటి బ్రహ్మాండ చిత్రాలు వచ్చాయని పేర్కొన్నారు. అలా మంచి కథతో తాను రూపొందిస్తున్న కథా చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను పూర్తి చేసి డబ్బింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రం కోసం తాను చాలా ఆసక్తిగా ఉన్నట్లు పార్థిబన్ అన్నారు. త్వరలోనే మంచి కథతో మీ ముందుకు వస్తున్నానని పేర్కొన్నారు. -
దొంగ దొరికాడు అంటూ నిత్యామీనన్ పోస్ట్
సౌత్ ఇండియాలో నిత్యా మీనన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పటి వరకు తను కూడా మంచి కథతో పాటు నటనకు స్కోప్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ వచ్చింది. అంతేకాకుండా వివాదాలకు కూడా దూరంగా ఉంటుంది. కానీ గత కొన్ని రోజులుగా ఆమెపై పలు వార్తలు వైరల్ అయ్యాయి. తమిళ సినీ ఇండస్ట్రీపై ఆమె వివాదస్పద వ్యాఖ్యలు చేశారంటూ కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పుకార్లు సోషల్ మీడియాలో దుమారాన్ని రేపుతున్నాయి. అయితే, నిత్య ఆ వ్యాఖ్యలు చేయలేదని తెలుస్తోంది. ఆ రూమర్స్ ఎంటి..? 'ఓ తమిళ హీరో నన్ను చాలా వేధించాడు.. షూటింగ్లో నన్ను ఇబ్బంది పెట్టాడు.. తమిళ ఇండస్ట్రీలో నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనలేదు.' అంటూ నిత్యా మీనన్ చెప్పినట్టుగా కొన్ని తమిళ మీడియా సంస్థలు ప్రచురించాయి. అవి ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని నిత్యా మీనన్ కూడా ఖండించింది. ఇది అవాస్తవం.. జర్నలిజంలోని కొన్ని వర్గాలు ఇలా దిగజారడం చాలా బాధాకరం. ఇలాంటి చెత్తపనులు ఎలా చేస్తారు. 'నేను ఇప్పటి వరకు ఎక్కడా ఇంటర్వ్యూనే ఇవ్వలేదు. ఇలాంటి తప్పుడు వార్తలు ఇవ్వకండి. దీని కంటే మెరుగ్గా ఉండండి. ఇలాంటివి పక్కన పెట్టి కాస్త మంచి పనులు చేయండి.' అని నిత్యా మీనన్ పోస్ట్ వేసింది. దొంగ దొరికాడు అంటూ నిత్యామీనన్ మరోక పోస్ట్ చేసింది. కొన్ని సోషల్ మీడియా ఖాతాలను స్క్రీన్ షాట్ తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 'మిమ్మల్ని చూస్తే సిగ్గేస్తోంది.. మనం అందరం ఈ భూమ్మీద తక్కువ సమయమే ఉంటాం. ఒకరికొకరం ఇలాంటి ఎంత పెద్ద తప్పులు చేస్తున్నామో అనుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. నేను దీనిని ఎందుకు ఎత్తి చూపుతున్నాననంటే.. జవాబుదారీతనం మాత్రమే చెడు ప్రవర్తనను ఆపుతుంది. ఈ తప్పుడు ప్రచారం చేసిన వారు ఇప్పటికైన మారండి. ఇలాంటి వారిని అనుసరించిన వారు కూడా తప్పును తెలుసుకోండి.' అని నిత్యా మీనన్ చెప్పింది. (ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ సినిమా నుంచి శ్రీలీల ఔట్.. క్రేజీ హీరోయిన్‌కు ఛాన్స్) ప్రస్తుతం నిత్యా మీనన్.. తన తరువాతి ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు వెబ్ సిరీస్‌లు చేయడానికి కూడా నిత్యా వెనకాడడం లేదు. అందుకే ‘కుమారి శ్రీమతి’ అనే వెబ్ సిరీస్‌తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 28న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) -
నిత్యామేనన్‌ని వేధించిన ఆ హీరో.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు వేధింపులు.. ఇదీ ఎంతకు తెగని టాపిక్. ఎందుకంటే అవకాశాల కోసం ప్రయత్నించే లేడీ యాక్టర్స్‌ని పలువురు దర్శకనిర్మాతలు ఇబ్బంది పెడుతుంటారనేది చాలామందికి తెలుసు. అయితే స్టార్ హీరోయిన్ల విషయానికొస్తే.. ఇలా జరగడం చాలా అంటే చాలా తక్కువ. కానీ నిత్యామేనన్‌ని ఓ తమిళ హీరో వేధించడనేది ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇప్పుడు దీనిపై సదరు బ్యూటీనే క్లారిటీ ఇచ్చింది. ఏం జరిగింది? మలయాళ ముద్దుగుమ్మ నిత్యామేనన్.. 'అలా మొదలైంది' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. దీనికి కొన్నాళ్ల మునందే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే తెలుగు, తమిళ, మలయాళంలో పలు సినిమాలు చేసిన నిత్యామేనన్.. మన దగ్గర చివరగా 'భీమ్లా నాయక్' చేసింది. అయితే ఈ ఏడాది జూన్‌లో నిత్యామేనన్ షాకింగ్ కామెంట్స్ చేసినట్లు వార్తలొచ్చాయి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 37 సినిమాలు) ఏం చెప్పింది? 'నేను చాలా తెలుగు సినిమాలు చేశాను కానీ ఎలాంటి ఇబ్బంది ఎదురవలేదు. తమిళంలో ఓ సినిమా చేస్తున్నప్పుడు మాత్రం షూటింగ్ సమయంలో ఓ హీరో నన్ను పదేపదే తాకుతూ వేధించాడు' అని హీరోయిన్ నిత్యామేనన్ చెప్పినట్లు పలు వెబ్‌సైట్స్ రాసుకొచ్చాయి. జూన్‌లో తొలుత ఈ కామెంట్స్ సెన్సేషన్ కాగా, ఇప్పుడు మరోసారి అవి తెరపైకి వచ్చాయి. అసలు నిజమేంటి? అయితే నిత్యామేనన్ పేరు చెప్పి వైరల్ అయిన ఈ కామెంట్స్ పూర్తిగా అబద్ధం. స్వయంగా ఈ బ్యూటీనే ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. తాను ఎవరికీ ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదని, అసలు ఇలాంటి రూమర్స్ ఎందుకు సృష్టిస్తారంటూ సీరియస్ అయింది. ఇదిలా ఉండగా 'కుమారి శ్రీమతి' అనే వెబ్ సిరీస్‌తో నిత్యా.. తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనుంది. సెప్టెంబరు 28న అమెజాన్ ప్రైమ్‌లో ఇది రిలీజ్ కానుంది. (ఇదీ చదవండి: సాయితేజ్-స్వాతి.. ఆ విషయం ఇప్పుడు బయటపెట్టారు!) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) -
నా పిల్లలను స్కూల్లో చేర్పించేందుకు వెళ్తే ఏ కులమని అడిగారు: హీరో
నెట్ కో స్టూడియోస్ పతాకంపై జేమ్స్ కార్తీక్, ఎం.నియాజ్కలిసి నిర్మించిన చిత్రం సీరన్. దురై కె.మురుగన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిర్మాతల్లో ఒకరైన జేమ్స్ కార్తీక్ ప్రధాన పాత్రను పోషించగా నటి ఇనియ, సోనియా అగర్వాల్, అరుంధతి నాయర్, ఆడుగళం నరేన్, కృష్ణ కురూప్, అజిత్, సెండ్రాయన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అక్కడ కులమత బేధాలు లేవు ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చైన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ఇనియా, సోనియా అగర్వాల్, అరుంధతి యూర్, చిత్ర దర్శక నిర్మాతలతో పాటు యూనిట్ అంతా పాల్గొన్నారు. నటుడు జేమ్స్ కార్తీక్ మాట్లాడుతూ ఇప్పటికీ సమాజంలో కులమత ద్వేషాలు రగులుతునే ఉన్నాయన్నారు. తాను ఆస్ట్రేలియాలో వ్యాపారం చేస్తున్నానని అక్కడ ఎలాంటి కులమత బేధాలు లేవని చెప్పారు. చైన్నెలో ఒక ఏడాది పాటు ఉండటానికి కుటుంబ సభ్యులతో సహా ఇక్కడికి వచ్చానని, అప్పుడు తన పిల్లలను చైన్నెలోని ఒక పాఠశాలలో చేర్పించడానికి కులం పేరు అడిగారన్నారు. డబ్బు లేని వారి పరిస్థితి ఏంటి? అందుకు తనకు కులం పేరు చెప్పడం ఇష్టం లేదని చెప్పానన్నారు. తనకు డబ్బు ఉంది కాబట్టి తన పిల్లలను ఆ పాఠశాలలో చేర్చుకున్నారని, కానీ డబ్బు లేని వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అలాంటి కథాంశంతో కూడిన చిత్రమే సీరన్ అని తెలిపారు. ఇది కులాల గురించి చెప్పే చిత్రం కాదని, కులం వద్దని చెప్పే కథా చిత్రం అని పేర్కొన్నారు. కులమతాల తారతమ్యం లేని సమాజాన్ని కోరుకునే కథా చిత్రం సీరన్ అని చెప్పారు. చిత్రం బాగా వచ్చిందని, యూనిట్ సభ్యులందరూ ఎంతగానో సహకరించారని జేమ్స్ కార్తీక్ తెలిపారు. చదవండి: మహాత్మ సినిమాలో మోసం, చావు అంచుల వరకు వెళ్లా, డబ్బుల్లేక.. ఏడ్చేసిన జబర్దస్త్ జీవన్ -
ఇవి నా సంతోషకరమైన కన్నీళ్లు అంటూ భార్య ఫోటో షేర్ చేసిన శివకార్తికేయన్
శివకార్తికేయన్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో తన భార్య ఆర్తి కోసం ఒక అందమైన సందేశాన్ని పంచుకున్నారు. నటుడు శివకార్తికేయన్-ఆర్తి జంట ఈరోజు 13వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు, ఉదయం నుండి చాలా మంది వారికి శుభాకాంక్షలు తెలిపారు.రెమో, డాక్టర్, డాన్ లాంటి సినిమాలతో శివ కార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తాజాగ ఆయన 13వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. దీంతో ఆయన అభిమానులతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. (ఇదీ చదవండి; శేఖర్ మాస్టర్ విషయంలో చాలా బాధపడ్డాను: శ్రీలీల) కోలీవుడ్‌లో విజయ్ టీవీ ద్వారా బుల్లితెరపై తన ప్రయాణాన్ని ప్రారంభించి వెండితెరపై విజయవంతంగా అడుగుపెట్టిన నటుడు శివకార్తికేయన్ తన ఎదుగుదలతో యావత్ సినీ ప్రపంచం వెనక్కి తిరిగి చూసేలా చేశాడు. ఒకవైపు తన డ్రీమ్ వైపు పయనిస్తున్న నటుడు శివకార్తికేయన్ అదే సమయంలో 2010 ఆగస్టు 27న తన బంధువైన ఆర్తిని పెళ్లి చేసుకున్నాడు. శివకార్తికేయన్-ఆర్తి దంపతులకు ఒక కుమార్తెతో పాటు కుమారుడు ఉన్నారు. వారిద్దరూ కూడా తమ ఫ్యామిలీ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 13 సంవత్సరాల వైవాహిక జీవితం తన 13వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న శివకార్తికేయన్ తన భార్య ఆర్తి కోసం తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక అందమైన సందేశాన్ని పంచుకున్నాడు. తన భార్యతో కలిసి దిగిన సంతోషకరమైన ఫోటోను 'ఇవి నా సంతోషకరమైన కన్నీళ్లు... విష్ హ్యాపీ వెడ్డింగ్ డే' అంటూ పోస్ట్ చేశారు. ఈ సందర్భంలో, శివకార్తికేయన్ అభిమానులు వారిద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తున్నారు శివకార్తికేయన్ ప్రయాణం మిమిక్రీ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన శివకార్తికేయన్, బుల్లితెరపై పాపులర్ హోస్ట్‌గా ఉంటున్న సమయంలోనే మెరీనా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్లో వచ్చిన '3' సినిమాతో మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత కేడి బిల్లా కిల్లాడి రంగా, మనంకోటి పక్షి, ఒప్పో నెచ్చిల వంటి హిట్లతో అంచెలంచెలుగా అభిమానులను సంపాదించుకున్నాడు. 2016లో రెమో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు తదుపరి సినిమా ఏమిటి? సూపర్‌హిట్ చిత్రాలను అందిస్తూ అంచెలంచెలుగా తమిళ చిత్రసీమలో టాప్ స్టార్లలో ఒకరిగా ఎదిగిన శివకార్తికేయన్ తెలుగు పరిశ్రమలో కూడా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం ఎస్కె 23 సినిమాపై దృష్టి సారించాడు. ఇంతకుముందు శివకార్తికేయన్-అదితి శంకర్ నటించిన మావీరన్ సూపర్ హిట్ అయ్యి 100 కోట్లు దాటింది. 'మండేలా' దర్శకుడు మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించిన మావీరన్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. View this post on Instagram A post shared by Sivakarthikeyan Doss (@sivakarthikeyan) -
ప్రేయసిని పెళ్లాడిన హీరో, ఫోటోలు వైరల్
కోలీవుడ్ యంగ్ హీరో కెవిన్ పెళ్లిపీటలెక్కాడు. ఇటీవలే దాదా చిత్రంతో సక్సెస్‌ను రుచి చూసిన ఈ హీరో ప్రేయసి మోనిక డేవిడ్ మెడలో మూడు ముళ్లు వేశాడు. ఆదివారం (ఆగస్టు 20) ఉదయం ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ సహా తదితర తారలు ఈ శుభకార్యానికి హాజరై వధూవరులను ఆశీర్వదించినట్లు తెలుస్తోంది. తన అర్ధాంగితో కలిసి దిగిన ఫోటోలను కెవిన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన అభిమానులు మీ జంట చూడముచ్చటగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. కాగా కెవిన్ 'కనా కానమ్ కలలాంగల్' సీరియల్లో తొలిసారి కెమెరా ముందు నటించాడు. మొదటి సీరియల్‌తోనే మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. శ్రావణన్ మీనాక్షి, తాయుమానవన్ వంటి సీరియల్స్‌తో బుల్లితెర హీరోగా మారాడు. 2017లో 'శత్రియాన్' చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు. ఆ తర్వాతి సంవత్సరమే 'నాట్పున్న ఎన్ననాను తెరియుమా' చిత్రంతో హీరోగా మారాడు. ఈ ఏడాది వచ్చిన 'దాదా'తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మధ్యలో తమిళ బిగ్‌బాస్ మూడో సీజన్లోనూ పాల్గొన్నాడు కెవిన్. ఆ సమయంలో తోటి కంటెస్టెంట్ లాస్లియాతో లవ్‌లో పడ్డాడు. ఈ విషయాన్ని లాస్లియా కూడా ధృవీకరించింది. కానీ వీరి ప్రేమ ఎంతోకాలం నిలవలేదు. కొద్దికాలానికే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. కెవిన్ ప్రస్తుతం కొరియోగ్రాఫర్ సతీష్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. Congratulation @Kavin_m_0431 🧡💚🖤#kavinpic.twitter.com/N9TbDp6snG — SathishKumar (@Sathish49531833) August 20, 2023 View this post on Instagram A post shared by Kavin M (@kavin.0431) చదవండి: 'విజయ్, సామ్‌లకు ఈ రేంజ్లో పారితోషికమా? అంత లేదు!' -
అర్ధ సెంచరీ కొట్టిన హీరో భరత్!
తమిళంలో బాయ్స్, కాదల్ చిత్రాలతో కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు భరత్. ఆ తర్వాత పలు భాషల్లో అనేక చిత్రాల్లో నటించి ఇప్పుడు అర్ధ సెంచరీ మైలురాయికి చేరుకున్నారు. ఈయన కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం లవ్. మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన లవ్ చిత్రానికి ఇది తమిళ రీమేక్. వాణిభోజన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని ఆర్పీ బాల స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. నటుడు వివేక్ ప్రసన్న రాధారవి జూనియర్ ముఖ్యపాత్ర పోషించిన ఈ చిత్రానికి పీజీ ముత్తయ్య ఛాయాగ్రహణం, లోని రప్పీల్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఈనెల 28న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఇది ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక జంట నేపథ్యంలో సాగే విభిన్న ప్రేమ కథా చిత్రం అని దర్శకుడు తెలిపారు. పెళ్లయిన జంట మధ్య ప్రేమ, సంతోషం, కోపం, చిన్నచిన్న గొడవలు చివరికి ఎలాంటి పరిణామాలకు దారి తీశాయన్నదే ఈ చిత్ర కథ అని తెలిపారు. ఒక సంఘటనలో పొరపాటున భరత్ కారణంగా అతని భార్య హత్యకు గురవుతుందన్నారు. దానిని మార్చడానికి భరత్ తన స్నేహితులతో కలిసి ఏం చేశాడు? అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో చిత్రం సాగుతుందని చెప్పారు. ఈ చిత్రం తనుకు చాలా ముఖ్యమైనదని నటుడు భరత్ పేర్కొన్నారు. కాగా మిరల్ చిత్రం తర్వాత భరత్‌తో కలిసి లవ్ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని వాణిభోజన్ అన్నారు. View this post on Instagram A post shared by Bharath (@bharath_niwas) చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి -
ఈ పిల్లవాడు ఇప్పుడు స్టార్ హీరో, అతడి వెనకాలున్న పాప అతడి భార్యే!
ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా? చిన్న బాబును ఎత్తుకున్న పిల్లాడు కోలీవుడ్‌లో టాప్ హీరో.. అతడి వెనకాల నుదుటన విభూతితో పింక్ డ్రెస్‌లో ఉన్న చిన్నారి ప్రస్తుతం అతడి భార్య! వీరిద్దరూ తమిళనాట సెలబ్రిటీ కపుల్.. ఇంకా అర్థం కాలేదా? అతడు శివకార్తికేయన్, ఆమె ఆర్తి. సోషల్ మీడియాలో ఈ దంపతుల చిన్ననాటి ఫోటో వైరల్ తెగ వైరలవుతోంది. ఈ హీరో విషయానికి వస్తే.. శివకార్తికేయన్ మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించాడు. అందరి పెదాలపై నవ్వులు పూయించే టాలెంట్ కార్తికేయన్ సొంతం. ఇది గమనించిన స్నేహితులు ఓ కామెడీ షోలో పాల్గొనమని సూచించాడు. సరే, వారి మాట ఎందుకు కాదనాలి? అనుకున్నాడే ఏమో కానీ ఓ రాయేద్దామనుకున్నాడు. కళక్క పోవతు యారు అనే కామెడీ షోలో పార్టిసిపేట్ చేయగా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ షో విజేతగా అవతరించాడు. ఆ తర్వాత షార్ట్ ఫిలింస్ చేశాడు. ముగప్పుటగం, ఐడెంటిటీ, కురాహి 786, 360° వంటి లఘుచిత్రాలు చేశాడు. అతడిలోని ప్రతిభను గుర్తించిన ఏగన్ చిత్రబృందం అదే సినిమాలో శివకార్తికేయన్‌కు ఓ చిన్న రోల్ ఇచ్చింది. కానీ ఎడిటింగ్‌లో అతడి పాత్రను తీసేశారు. దీంతో వెండితెరపై కనిపించాలన్న అతడి కలకు ఆదిలోనే హంసపాదు పడింది. ఆ తర్వాత డైరెక్టర్ పాండిరాజ్ 'మెరీనా' సినిమాతో అతడిని వెండితెరకు హీరోగా పరిచయం చేశాడు. ఈ మూవీ శివకార్తికేయన్‌కు మంచి గుర్తింపు తీసుకురావడంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు. తక్కువకాలంలోనే స్టార్ హీరోగా పేరు గడించాడు. ‘రెమో’, ‘కౌసల్యా కృష్ణ మూర్తి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ వీలు చిక్కినప్పుడల్లా తెలుగులో డబ్ చేస్తూ అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. హీరోగా, హోస్ట్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, సింగర్‌గా, నిర్మాతగానూ సత్తా చాటాడు. తన బంధువులమ్మాయి ఆర్తిని 2010 ఆగస్టు 27న పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు ఆరాధన, కుమారుడు గుగన్ దాస్ అని ఇద్దరు సంతానం. కౌసల్యా కృష్ణమూర్తి తమిళ వర్షన్ కనాలో శివకార్తికేయన్ తన కూతురితో కలిసి ఓ పాట పాడాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా నటించిన మావీరన్ జూలై 14న రిలీజ్ కానుంది. అయాలన్ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Sivakarthikeyan Doss (@sivakarthikeyan) చదవండి: క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వెల్లడించిన సుచిత్రా కృష్ణమూర్తి సెలబ్రిటీల బాడీగార్డు నెల జీతం లక్షల్లో.. ఏడాదికి కోట్లల్లోనే! -
రాఘవ లారెన్స్ గొప్ప మనసు.. 150 మంది చిన్నారుల దత్తత
తమిళ స్టార్ హీరో, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ మరోసారి తన గొప్పమనసును చాటుకున్నారు. లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే ఎంతోమంది చిన్నారులకు సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో 150 మంది చిన్నారులను ఆయన దత్తత తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పిల్లలతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. వారికి నాణ్యమైన విద్య అందించేలా కృషి చేస్తానన్నారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ లారెన్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న 'రుద్రన్' (తెలుగులో 'రుద్రుడు') మూవీ ఆడియా లాంఛ్ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించారు. పిల్లలకు అభిమానుల ఆశీస్సులు కావాలని కోరారు. కాగా.. గతంలో గుండె సమస్యలతో బాధపడుతున్న 141 మంది చిన్నారులకు సర్జరీ చేయించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులెవరైనా.. ఆర్థిక సమస్య కారణంగా చదువుకు దూరమవుతున్నా, హార్ట్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉన్నా.. వెంటనే లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్‌ను సంప్రదించాలని లారెన్స్ విజ్ఞప్తి చేశారు. లారెన్స్ నటించిన 'రుద్రన్' తెలుగులో రుద్రుడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో లారెన్స్ మాట్లాడారు. సేవ చేసే విషయంలో రాఘవేంద్ర స్వామి తనను ముందుకు నడిపిస్తున్నాడని తెలిపారు. తెరపైనే కాదు.. నిజ జీవితంలో హీరోగా ఉండాలన్న తన మాతృమూర్తి చెప్పిన మాటను ఆయన గుర్తుచేసుకున్నారు. కతిరేశన్ దర్శకత్వంలో తెరకెక్కిన‘రుద్రన్’ ఈ నెల 14న విడుదలకానుంది. ఇప్పటికే ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. మరోవైపు లారెన్స్ ‘చంద్రముఖి 2’లో నటిస్తున్నారు. వాసు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కీలక పాత్ర పోషించారు. త్వరలోనే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. I’m extremely happy to share the news of adopting 150 children and provide them with education as a new venture from rudhran audio launch. I need all your blessings #Serviceisgod 🙏🏼 pic.twitter.com/lSwns10Grs — Raghava Lawrence (@offl_Lawrence) April 11, 2023 -
తమిళ స్టార్ హీరోతో మీనా రెండో పెళ్లి!: నటుడు సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ నటి మీనా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. గతేడాది జూన్‌లో భర్త విద్యాసాగర్‌ను కోల్పోయిన మీనా ఆ బాధ నుంచి తేరుకోవడానికి వరుసగా షూటింగ్స్‌లో పాల్గొంటుంది. చాలా గ్యాప్‌తో తర్వాత ఇటీవల విడుదలైన తెలుగు చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మీనా తమిళం, మలయాళంలోనూ పలు చిత్రాలకు సైన్ చేసింది. ఇదిలా భర్తను కొల్పోయిన బాధలో ఉన్న మీనాపై సోషల్ మీడియాలో రకరకాలు పుకార్లు వినిపిస్తున్నాయి. చదవండి: అప్పట్లోనే సొంత హెలికాప్టర్, వేల కోట్ల ఆస్తులు.. నటి కేఆర్ విజయ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఆమె రెండో పెళ్లికి సిద్ధమైందంటూ కొద్ది రోజులుగా నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తన పెళ్లి వార్తలపై స్పందించిన మీనా తీవ్రంగా ఖండిచింది. అయినప్పటికీ ఆమె రెండో పెళ్లికి సంబంధించిన రూమర్స్‌కు మాత్రం చెక్ పడటం లేదు. తాజాగో ఓ సినీ క్రిటిక్, నటుడు తమిళ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మీనా రెండో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. మీనా త్వరలోనే ఓ తమిళ స్టార్ హీరోను పెళ్లి రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ హీరో పాన్ ఇండియా స్టార్ అని, గతేడాది భార్యతో విడాకులు తీసుకున్ని విడిపోయాడంటూ హింట్ ఇచ్చాడు. అంతేకాదు ఆ హీరో మీనా కంటే చిన్నవాడని, నిశ్చితార్థానికి కూడా ముహుర్తం పెట్టుకున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్ కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. సోషల్ మీడియాలో అతడి వ్యాఖ్యలు వైరల్ అవుతుండటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అతడి కామెంట్స్‌ని కొట్టిపారేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం ఎలా చేస్తారు?’,‘ఏదైనా చెబితే నమ్మే విధంగా ఉండాలి’ అంటూ సదరు ఫిలిం క్రిటిక్కు చురకలు అట్టిస్తున్నారు. చదవండి: నాటు నాటుకు ఆస్కార్.. అజయ్ దేవగన్ షాకింగ్ కామెంట్స్ కాగా గతంలోనే మీనా తాను తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని మీనా ఇటీవల ఓ ఇంటర్య్వూలో తేల్చి చెప్పిన సంగతి తెలిసింది. ఓ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మీనాకు రెండో పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నా భర్త చనిపోయినప్పటి నుంచి సోషల్ మీడియాలో నా గురించి ఆసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. బాధలో ఉన్న నాకు ఇలాంటి వార్తలు మరింత బాధిస్తున్నాయి. అసలు నాకు మరో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు’ అంటూ మీనా కుండ బద్దలు కొట్టారు.