Arun Vijay Injured in Achcham Enbadhu Ilaye Movie Shooting, Details Inside - Sakshi
Sakshi News home page

Arun Vijay: షూటింగ్‌లో యంగ్‌ హీరోకు గాయాలు, ఆయుర్వేద పద్ధతిలో ట్రీట్‌మెంట్‌..

Published Thu, Feb 9 2023 3:23 PM | Last Updated on Thu, Feb 9 2023 3:39 PM

Arun Vijay Injured in Achcham Enbadhu Ilaye Shooting - Sakshi

యాక్షన్‌ సీన్లు చిత్రీకరించే సమయంలో గతంలోనూ రెండుసార్లు అరుణ్‌ తీవ్రంగా గాయపడ్డారు. గతేడాది అక్టోబర్‌లో మోకాలికి గాయమవగా నవంబర్‌లో

సీనియర్‌ నటుడు విజయ్‌ కుమార్‌ తనయుడు, తమిళ యంగ్‌ హీరో అరుణ్‌ విజయ్‌ షూటింగ్‌లో గాయపడ్డారు. లండన్‌లో 'అచ్చం ఎన్బందు ఇళయే' మూవీ షూటింగ్‌లో గాయాలపాలయ్యారు. దీంతో ఇండియాకు తిరిగివచ్చిన ఆయన కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని అరుణ్‌ స్వయంగా సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. 'సాంప్రదాయ ఆయుర్వేద చికిత్సా విధానం ద్వారా కాలి గాయానికి చికిత్స పొందుతున్నాను. ప్రస్తుతం మెరుగ్గా అనిపిస్తుంది. త్వరలోనే తిరిగి షూటింగ్‌లో పాల్గొంటాను' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నట్లుగా ఓ ఫోటో సైతం రిలీజ్‌ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. 

కాగా ఈ సినిమాలో యాక్షన్‌ సీన్లు చిత్రీకరించే సమయంలో గతంలోనూ రెండుసార్లు అరుణ్‌ తీవ్రంగా గాయపడ్డారు. గతేడాది అక్టోబర్‌లో మోకాలికి గాయమవగా నవంబర్‌లో చేతులకు గాయమైంది. ఇప్పుడిది మూడోసారి కావడంతో ఫైట్‌ సీన్లలో కాస్త జాగ్రత్తగా ఉండమంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే 'అచ్చం ఎన్బందు ఇళయే' అనే తమిళ చిత్రానికి ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో హీరోయిన్‌ అమీ జాక్సన్‌ కోలీవుడ్‌లో కమ్‌బ్యాక్‌ ఇవ్వనుంది. ఈ చిత్రంలో మలయాళ నటి నిమిశ సజయన్‌ ముఖ్య పాత్ర పోషించనుండగా జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు.

చదవండి: అమ్మానాన్న విడాకులు.. ఆయన పేరు మాకొద్దు, అందుకే తీసేశా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement