Arun Vijay
-
సూర్యను రీప్లేస్ చేసిన హీరో.. రిలీజ్ ఎప్పుడంటే
దర్శకుడు బాలా తెరకెక్కిస్తున్న చిత్రం వణంగాన్. ఈ చిత్రంలో మొదట సూర్య హీరోగా నటించారు. కొంత షూటింగ్ జరిగిన తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఈ చిత్రం నుంచి వైదొలిగారు. సూర్య స్థానంలో అరుణ్ విజయ్ను ఎంపిక చేశారు. ఇందులో నటి రోషిణీ ప్రకాశ్, సముద్రఖని, మిష్కిన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. వీ హౌస్ పొడక్షన్స్ పతాకంపై సురేశ్ కామాక్షి నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తయింది. విగ్రహాలతో..ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఆ మధ్య చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో అరుణ్ విజయ్ ఒక చేతిలో పెరియార్, మరో చేతిలో వినాయకుడి శిలను పట్టుకుని ఉన్న ఆ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. కాగా వణంగాన్ చిత్రం విడుదల గురించి నిర్మాత సురేశ్ కామాక్షి తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ జూలై నెలలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. రిలీజ్ ఎప్పుడంటే?ఈ మేరకు రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేశారు. అందులో కన్యాకుమారిలో ఉన్న తిరువళ్లువర్ శిలావిగ్రహం వద్ద నిలబడ్డ అరుణ్ విజయ్‌కు దర్శకుడు బాలా సూచనలుు ఇస్తున్నట్లుగా ఉంది. ఈ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని, ఆర్పీ గురుదేవ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ஜூலை வெளியீடு(July release) @arunvijayno1 #Bala#Vanangaan@roshiniprakash_@thondankani@DirectorMysskin@Vairamuthu@gvprakash@editorsuriya@rk_naguraj@silvastunt @VHouseProd_Offl@memsundaram @johnmediamanagr #Bstudios pic.twitter.com/hKrOGvWZuR— sureshkamatchi (@sureshkamatchi) June 1, 2024 -
సడన్‌గా ఓటీటీలోకి యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ అక్కడే!
సంక్రాంతికి రిలీజ్ చేస్తే కనీస వసూళ్లయినా వస్తాయి.. అందుకే చాలామంది సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలున్నా సరే రిలీజ్ చేసేందుకు వెనకడుగు వేయరు. మరికొందరేమో పెద్ద సినిమాలు బరిలో ఉంటే మరో ఆప్షనే లేదన్నట్లు తప్పుకుంటారు. అలా ఈసారి సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ సినిమాలు రిలీజయ్యాయి. అదే సమయంలో(జనవరి 12న) తమిళంలో మిషన్ చాప్టర్ 1 రిలీజైంది. దీన్ని తెలుగులోనూ విడుదల చేయాలనుకున్నారు. కానీ తర్వాత ఈ ఆలోచన విరమించుకున్నారు. భారీ బడ్జెట్.. ఈ మూవీలో అరుణ్ విజయ్ హీరోగా నటించాడు. అమీ జాక్సన్, నిమీషా సజయన్ హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. విజయ్ దర్శకత్వం వహించగా రూ.25 కోట్ల బడ్జెట్‌తో వంశీ, రాజశేఖర్ ఈ సినిమా నిర్మించారు. ఇది హీరో కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా కావడం విశేషం. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. ఇది ఈయనకు మ్యూజిక్ డైరెక్టర్‌గా 100వ సినిమా కావడం విశేషం. రెండు ఓటీటీలలో! యాక్షన్ మూవీ సడన్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోంది. సింప్లీ సౌత్ అనే ఓటీటీలో మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇండియా మినహా మిగతా అన్ని చోట్ల అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా మరో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేటి అర్ధరాత్రి నుంచి ప్రసారం కానుందట! #MissionChapter1 from tonight! pic.twitter.com/3ltYghmggH — Christopher Kanagaraj (@Chrissuccess) March 14, 2024 #MissionChapter1 | MARCH 15. Streaming worldwide, excluding India. pic.twitter.com/jxF16RmuL3 — Simply South (@SimplySouthApp) March 14, 2024 చదవండి: అంబానీ ప్రీవెడ్డింగ్ పార్టీలో ఇతడే హైలైట్.. తేడా పోజులతోనే ఫేమస్ -
డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఆ యాక్షన్ సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
స్టార్ హీరో కొత్త సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. తమిళంలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాని తెలుగులోనూ విడుదల చేయాలనుకున్నారు. కానీ అక్కడ ఫలితం చూసి తెలుగు వెర్షన్ రిలీజ్ ఆలోచన మానుకున్నారు. ఇప్పుడీ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోకి తీసుకొచ్చేయబోతున్నారట. తాజాగా స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటా మూవీ? ఈ సంక్రాంతికి తెలుగులో గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ చిత్రాలు రిలీజయ్యాయి. వీటిలో బాక్సాఫీస్ విన్నర్‌గా 'హనుమాన్' నిలిచింది. ఇది తప్పితే మిగతా మూడు చిత్రాలు ఓటీటీలోకి వచ్చేశాయి. మరోవైపు తమిళంలోనూ సంక్రాంతికి రిలీజైన 'కెప్టెన్ మిల్లర్', 'అయలాన్' హిట్ టాక్ తెచ్చుకున్నాయి. కొన్నిరోజుల క్రితం ఓటీటీలోకి కూడా వచ్చేశాయి. వీటితో పాటు తమిళంలో ఇదే పండక్కి 'మిషన్ ఛాప్టర్ 1' చిత్రం కూడా రిలీజైంది. (ఇదీ చదవండి: మూడు ఓటీటీల్లో ఒకేసారి హిట్ సినిమా రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) యాక్షన్ స్టోరీతో తీసిన ఈ సినిమాని తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ సొంత భాషలోనే తేడా కొట్టేయడంతో మన దగ్గర థియేటర్లలో విడుదల చేయడం అనే ఆలోచనని పూర్తిగా పక్కనబెట్టేశారు. అలా అందరూ మర్చిపోయిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కి సిద్ధమైందట. మార్చి 1 నుంచి దక్షిణాది భాషల్లో అందుబాటులోకి రానుందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మిషన్ ఛాప్టర్-1 కథ విషయానికొస్తే.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న తన కూతురిని ఎలాగైనా కలుసుకోవాలని.. విదేశీ జైలులో ఖైదీగా ఉండే హీరో అనుకుంటాడు? మరి ఇందుకోసం ఎలాంటి పోరాటం చేశాడు? విదేశీ జైలులో ఖైదీగా మారడానికి కారణమేంటనేదే స్టోరీ. అరుణ్ విజయ్ హీరోగా నటించగా.. అమీజాక్సన్, నిమిషా సజయన్ హీరోయిన్లుగా నటించారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే!) -
దర్శకుడితో గొడవ.. హీరో తారుమారు.. సినిమా టీజర్ చూశారా?
సేతు, నందా, పితామహన్, నాన్ కడవుల్, అవన్ ఇవన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన బాలా డైరెక్షన్లో వస్తున్న చిత్రం వణంగాన్. ఇందులో అరుణ్ విజయ్ హీరోగా నటిస్తున్నాడు. తొలుత ఈ చిత్రంలో నటించిన హీరో సూర్యతో దర్శకుడికి విభేదాలు ఏర్పడడంతో ఆయన ఈ చిత్రం నుంచి వైదొలగారు. ఆ తర్వాత సూర్య పాత్రలో అరుణ్ విజయ్ నటిస్తున్నారు. ఇందులో రోషిని ప్రకాశ్, సముద్రఖని, మిష్కిన్ వంటి ప్రముఖులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. గతేడాది వణంగాన్ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ఇందులో శరీరమంతా బురదతో కనిపించిన అరుణ్ విజయ్ ఒక చేతిలో పెరియార్, మరో చేతిలో వినాయకుడి విగ్రహాలతో ఆక్రోషంగా కనిపించాడు. ఆ పోస్టర్ తెగ వైరలయింది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. కన్యాకుమారి సముద్ర తీరంలోని తిరువళ్లువర్ విగ్రహ విశ్వరూపంతో టీజర్ ప్రారంభమవుతుంది. దేవాలయం వెనుకవైపు బైక్‌పై నుదుట విభూది, కుంకుమతో అరుణ్ విజయ్ కనిపిస్తున్నారు. బావిలో నుంచి ఓ చేతితో పెరియార్, మరో చేతిలో వినాయకుడితో పైకి వస్తున్న అరుణ్ విజయ్ సీన్ ఆకట్టుకుంటోంది. చదవండి: హీరోయిన్ త్రిషపై వల్గర్ కామెంట్స్.. సారీ చెప్పిన ఎమ్మెల్యే -
నన్ను నమ్మి రూ.25 కోట్లతో సినిమా తీసినందుకు థ్యాంక్స్: హీరో
అరుణ్ విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మిషన్ చాప్టర్–1. అమీ జాక్సన్, నిమీషా సజయన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని విజయ్ దర్శకత్వంలో వంశీ, రాజశేఖర్ నిర్మించారు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర విడుదల హక్కులను పొందిన లైకా ప్రొడక్షన్ సంస్థ దీన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారు మిషన్ చాప్టర్–1 సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం సాయంత్రం చైన్నెలో థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో అరుణ్ విజయ్ మాట్లాడుతూ.. మంచి కథా చిత్రాలను ప్రేక్షకులు, మీడియా ఎప్పుడు నిరాకరించింది లేదన్నారు. అందుకే తాము థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. తనకు ప్రతి చిత్రంలో ఏదో ఒక సమస్య ఏర్పడుతుందని.. అదే విధంగా ఈ చిత్రం కోసం శారీరకంగా చాలా కష్టపడినట్లు చెప్పారు. ఇంత సక్సెస్ ఊహించలేదు సినిమా విడుదలైన తరువాత మధురై, తిరుచ్చి ఇలా తాము వెళ్లిన ప్రతిచోటా ప్రేక్షకులు మిషన్ చాప్టర్–1ను విశేషంగా ఆదరిస్తున్నారని చెప్పారు. ఇంత సక్సెస్‌ను తాము ఊహించలేదని, ఇంతమంచి కథలో తమను భాగమయ్యేలా చేసిన దర్శకుడు విజయ్‌కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. తమను నమ్మి రూ.25 కోట్ల ఖర్చుతో ఈ చిత్రాన్ని నిర్మించిన వంశీ, రాజశేఖర్‌లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. అదేవిధంగా ఆరంభ దశలో చిత్రం పలు సమస్యలను ఎదుర్కొందని గుర్తు చేసుకున్నారు. అలాంటిది ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన లైకా ప్రొడక్షన్స్‌కు, తమిళ్ కుమరన్‌కు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి: గుంటూరు కారం కలెక్షన్స్.. ఆల్‌టైమ్ రికార్డ్ సెట్ చేసిన మహేశ్ -
సినిమాకు పాజిటివ్ టాక్.. ఆదియోగి సందర్శనలో హీరోహీరోయిన్
తమిళ హీరో అరుణ్ విజయ్ లేటెస్ట్ మూవీ 'మిషన్ ఛాప్టర్ 1'. అమీ జాక్సన్ హీరోయిన్. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. ఎం.రాజశేఖర్, ఎస్.స్వాతి నిర్మించారు. భారీ యాక్షన్ ఎమోషనల్ కథతో తీసిన ఈ సినిమాలో అరుణ్ విజయ్ జై దుర్గ అనే పాత్రలో.. అమీ జాక్సన్ లండన్‌లోని జైలు అధికారిగా నటించారు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సాయిపల్లవి చెల్లి.. కుర్రాడు ఎవరంటే?) తన కుమార్తె వైద్య చికిత్స కోసం లండన్ వెళ్లిన అరుణ్ విజయ్.. అక్కడ జైలు పాలు అవడం, అక్కడ కొందరు పాకిస్తాన్‌కు చెందిన కరుడుగట్టిన నేరగాళ్లు జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం, దాన్ని అరుణ్‌విజయ్ అడ్డుకోవడం, దాంతో ఆయన మరో పోరాటానికి సిద్ధం కావలసి రావడం వంటి పలు ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో సాగే కథనే ఈ సినిమా. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా తమిళంలో ఈనెల 12న విడుదలైంది. అయితే చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో హీరోహీరోయిన్లతో పాటు దర్శకుడు ఏఎల్ విజయ్.. ఆదియోగి విగ్రహ సందర్శనకు వెళ్లారు. ఈశా ఫౌండేషన్‌కు వెళ్లిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే?) View this post on Instagram A post shared by Arun Vijay (@arunvijayno1) -
హీరో కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రం.. పొంగల్ రేసులో..
అరుణ్ విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మిషన్ చాప్టర్ 1. అమీ జాక్సన్, నిమీషా విజయన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి జీవీ.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. ఇది ఈయనకు సంగీత దర్శకుడిగా 100వ చిత్రం కావడం విశేషం. కాగా విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ విడుదల చేస్తోంది. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం పొంగల్ పండుగ సందర్భంగా ఈనెల 12న తెరపైకి రానుంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు విజయ్ మాట్లాడుతూ ఇంతకు ముందు చాలా చిత్రాలకు దర్శకత్వం వహించినా ఈ చిత్రం కొత్త అనుభవం అనిపించిందన్నారు. ఈ చిత్ర నిర్మాత స్వాతికి కృతజ్ఞతలు తెలుపుతూ.. తమిళ్ కుమరన్ ఈ చిత్రాన్ని చూసిన వెంటనే సహ నిర్మాతగా చేరారని చెప్పారు. పలు కష్టాలను అధిగమించి ఈ చిత్రాన్ని ఇక్కడివరకూ తీసుకొచ్చామని చెప్పారు. అరుణ్ విజయ్ మాట్లాడుతూ.. పొంగల్ సందర్భంగా విడుదలవుతున్న తన తొలి చిత్రం ఇది కావడం సంతోషంగా ఉందని చెప్పారు. మనం ఎంతగా శ్రమించినా సినిమా సరైన సమయంలో విడుదల కావడమే ముఖ్యం అన్నారు. తాను ఇంతవరకూ నటించిన చిత్రాలన్నింటికంటే భారీ బడ్జెట్ చిత్రం మిషన్ చాప్టర్ 1 అని పేర్కొన్నారు. ఈ స్క్రిప్ట్ ఇచ్చిన దర్శకుడు విజయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు విజయ్ పనితనం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. ఆయన చిత్రాన్ని చాలా వేగంగా, అదే సమయంలో చాలా క్వాలిటీతో తెరకెక్కించారని చెప్పారు. షూటింగ్ స్పాట్లో కాస్త విరామం తీసుకుందామని భావించినా, దర్శకుడు ఆ అవకాశం ఇవ్వలేదన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను లండన్, చెన్నైలలో నిర్వహించినట్లు చెప్పారు. చెన్నైలో నాలుగున్నర ఎకరాల్లో భారీ సెట్ వేసి యాక్షన్స్ సన్నివేశాలను చిత్రీకరించారని చెప్పారు. చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హాట్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా? -
పొంగల్ బరిలో మరో చిత్రం.. ఆ స్టార్ హీరోలతో పోటీ!
సంక్రాంతి వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద పోటీ మామూలుగా ఉండదు. స్టార్ హీరోల సినిమాలు పొంగల్ బరిలో ఉండడం సహజం. అలాగే వచ్చే ఏడాది కూడా కోలీవుడ్ స్టార్స్ రజనీకాంత్, ధనుష్ చిత్రాలు కూడా ఉన్నాయి. స్టార్ హీరోలతో మరో చిత్రం పోటీకి సిద్ధం అవుతోంది. అరుణ్ విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మిషన్ చాప్టర్– 1. ఐచ్చంయన్బదు ఇల్లయే. ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్గా కనిపించనున్నారు. ఆమెతో పాటు నటిగా మలయాళంలో మంచి పేరు తెచ్చుకున్న నిమీషా సజయన్ నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదల హక్కులను లైకా ప్రొడక్షనన్స్ అధినేత సుభాస్కరన్ పొందారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని పొంగల్ సందర్భంగా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. దర్శకుడు విజయ్ తన దర్శక ప్రతిభతో నిర్మాతలకు నచ్చిన దర్శకుడిగా మారారన్నారు. చిత్ర షూటింగ్‌ను చైన్నె, లండన్‌లో 70 రోజల పాటు నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. మంచి యాక్షన్‌తో రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల విడుదల చేసిన చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. ముఖ్యంగా యాక్షన్‌తో కూడిన ఉద్వేగ భరిత సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం త్వరలోనే వివరాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో అభిహాసన్, భరత్ బొప్పన్న ముఖ్యపాత్రలు పోషించారు. జీవీ.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. Mission Chapter 1 Teaser (Tamil) https://t.co/hIpcbHhM8Z GRAND WORLD WIDE RELEASE IN PONGAL #MISSION CHAPTER - 1 teasar Bgm music extraordinary All the best #mission entire team 🎉@arunvijayno1 @iamAmyJackson @NimishaSajayan @gvprakash #Mahadev pic.twitter.com/8L9svtJp2F — Satishtanikella (@SatishC68386813) December 24, 2023 -
భారీ అంచనాలతో వస్తున్న 'మిషన్: చాప్టర్1'
కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్, అమీ జాక్సన్ నటిస్తోన్న లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ ‘మిషన్: చాప్టర్ 1’. ఈ చిత్రానికి ఎం.రాజశేఖర్, ఎస్.స్వాతి నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ వరుస సక్సెస్‌లను సొంతం చేసుకుంటున్న లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దర్శకుడు విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో 2.0, పొన్నియిన్ సెల్వన్, ఇండియన్ 2 వంటి చిత్రాలు సహా ఎన్నో భారీ చిత్రాలను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని కేవలం 70 రోజుల్లో లండన్, చెన్నై సహా పలు లొకేషన్స్‌లో శరవేగంగా చిత్రీకరించటం గొప్ప విశేషం. తాజాగా ‘మిషన్: చాప్టర్ 1’ సినిమాను విశ్లేషించి ఒక పరిమితమైన హద్దులని లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని లైకా టీమ్ భావిస్తోంది. దీంతో లైకా సంస్థ ‘మిషన్: చాప్టర్ 1’ చిత్రాన్ని నాలుగు భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, ఆడియో, థియేట్రికల్ రిలీజ్‌కి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. చాలా గ్యాప్ తర్వాత.. 2.0లో నటించి అలరించిన ముద్దుగుమ్మ అమీ జాక్సన్ ఈ చిత్రంతో సినిమాల్లో అడుగు పెడుతున్నారు. జైలును సంరక్షించే ఆఫీసర్ పాత్రలో ఆమె కనిపించనున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన విలక్షణ నటి నిమిషా సజయన్ ఈ మూవీలో ఓ కీలక పాత్రను పోషించారు. జీవీ ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతమందించారు. ఈ సినిమా కోసం లండన్ జైలును పోలి ఉండేలా చెన్నైలో భారీగా ఖర్చుతో ఓ జైలు సెట్ వేశారు. -
అజిత్ సినిమాలో విలన్‌గా పాపులర్ హీరో
అజిత్ లేటెస్ట్ మూవీ తుణివు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ స్టార్ హీరో తన 62వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించడానికి కథతో సహా అన్నీ సిద్ధం చేసుకున్నారు. అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. విఘ్నేష్ శివన్ చెప్పిన కథ నటుడు అజిత్‌కు, నిర్మాణ సంస్థకు నచ్చకపోవడంతో ఆయన్ను తప్పించి మగిళ్ తిరుమేణిని తీసుకొచ్చారు. త్వరలోనే ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనుంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అజిత్ నటిస్తున్న ఈ చిత్రంలో నటుడు అరుణ్ విజయ్ నటించనున్నారట. గతంలో వీరిద్దరు కలిసి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఎన్నై అరిందాల్ అనే చిత్రంలో నటించారు. అందులో అజిత్ పోలీసు అధికారిగా, అరుణ్ విజయ్ ప్రతినాయకుడిగా పవర్ ఫుల్ పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అజిత్ 62వ సినిమాలో కూడా అరుణ్ విజయ్ ఢీ కొనబోతున్నారన్నమాట. -
వరుసగా మూడోసారి షూటింగ్లో గాయపడ్డ హీరో, ఫోటో వైరల్
సీనియర్ నటుడు విజయ్ కుమార్ తనయుడు, తమిళ యంగ్ హీరో అరుణ్ విజయ్ షూటింగ్లో గాయపడ్డారు. లండన్‌లో 'అచ్చం ఎన్బందు ఇళయే' మూవీ షూటింగ్లో గాయాలపాలయ్యారు. దీంతో ఇండియాకు తిరిగివచ్చిన ఆయన కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని అరుణ్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. 'సాంప్రదాయ ఆయుర్వేద చికిత్సా విధానం ద్వారా కాలి గాయానికి చికిత్స పొందుతున్నాను. ప్రస్తుతం మెరుగ్గా అనిపిస్తుంది. త్వరలోనే తిరిగి షూటింగ్లో పాల్గొంటాను' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా ఓ ఫోటో సైతం రిలీజ్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. కాగా ఈ సినిమాలో యాక్షన్ సీన్లు చిత్రీకరించే సమయంలో గతంలోనూ రెండుసార్లు అరుణ్ తీవ్రంగా గాయపడ్డారు. గతేడాది అక్టోబర్‌లో మోకాలికి గాయమవగా నవంబర్‌లో చేతులకు గాయమైంది. ఇప్పుడిది మూడోసారి కావడంతో ఫైట్ సీన్లలో కాస్త జాగ్రత్తగా ఉండమంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే 'అచ్చం ఎన్బందు ఇళయే' అనే తమిళ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో హీరోయిన్ అమీ జాక్సన్ కోలీవుడ్‌లో కమ్‌బ్యాక్ ఇవ్వనుంది. ఈ చిత్రంలో మలయాళ నటి నిమిశ సజయన్ ముఖ్య పాత్ర పోషించనుండగా జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. View this post on Instagram A post shared by Arun Vijay (@arunvijayno1) Behind all my hard-core actions you'll see on screen there are plenty of bruises like these... But still love doing my own stunts..😉 Wait for the next on screen..💪🏽 Luv you all..❤️#AchchamEnbadhuIllayae #actorslife #nothingcanstop pic.twitter.com/UqTcsOhuiS — ArunVijay (@arunvijayno1) November 26, 2022 View this post on Instagram A post shared by Arun Vijay (@arunvijayno1) చదవండి: అమ్మానాన్న విడాకులు.. ఆయన పేరు మాకొద్దు, అందుకే తీసేశా -
Arun Vijay: ప్లీజ్.. వదంతులను ప్రచారం చేయొద్దు.. అదంతా అబద్ధం
వదంతులను ప్రచారం చేయొద్దని నటుడు అరుణ్ విజయ్ కోరారు. ఆయన సీనియర్ నటుడు విజయ్‌కుమార్ వారసుడన్న విషయం తెలిసిందే. ఎంజీఆర్, శివాజీ గణేషన్ కాలం నుంచి నేటి తరం నటీనటుల వరకు నటిస్తున్న విజయ్‌కుమార్ మొదట్లో హీరోగా, విలన్‌గా నటించారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తమిళం, తెలుగు తదితర భాషల్లో నటిస్తున్నారు. ఇటీవల తన కొడుకు అరుణ్ విజయ్ కథానాయకుడిగా సినం అనే చిత్రాన్ని నిర్మించారు. విజయ్‌కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన నటుడు అరుణ్ విజయ్ తన తండ్రి విజయకుమార్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, వదంతులను ప్రచారం చేయవద్దని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఈయన కథానాయకుడిగా నటించిన యానై, సినమ్ చిత్రాలు ఇటీవల విడుదలై మంచి ప్రజాదరణ పొందాయి. అదే విధంగా తమిళ రాకర్స్ అనే వెబ్‌సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ప్రశంసలు అందుకుంటోంది. కాగా ప్రస్తుతం ఈయన ఏఎల్ విజయ్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో నటి అమీజాక్సన్ హీరోయిన్గా రీ ఎంట్రీ ఇస్తోంది. దీనికి అచ్చం యంబదు ఇల్లయే అనే టైటిల్ నిర్ణయించారు. ఈ చిత్ర షూటింగ్ ఆగస్టు 20న ప్రారంభమైంది. -
హైదరాబాద్‌కి వస్తే నా ఇంటికి వచ్చినట్లే అనిపిస్తుంది: నటి
వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న అరుణ్ విజయ్ హీరోగా నటించిన చిత్రం ఆక్రోశం. జి.యన్.కుమార వేలన్ దర్శకత్వం వహించాడు. తమిళ హిట్ చిత్రం ‘సినం’ను నిర్మాత ఆర్.విజయ్ కుమార్ తెలుగులో ‘ఆక్రోశం’ పేరుతో డిసెంబర్ 16న విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో హీరోయిన్ పల్లక్ లల్వాని మాట్లాడుతూ..‘టాలీవుడ్ అంటే నాకు ఎంతో స్పెషల్. హైదరాబాద్‌కి వచ్చిన ప్రతీసారి నా ఇంట్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. తమిళంలో ఈ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ఆడియెన్స్ కూడా సినిమాను ఆదరిస్తారని భావిస్తున్నాం’అన్నారు. హీరో అరుణ్ విజయ్ మాట్లాడుతూ 'ఏనుగు సినిమా సమయంలో సతీష్‌గారితో అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు ఆయనే ఆక్రోశం సినిమాను రిలీజ్ చేయనుండటం చాలా సంతోషంగా ఉంది. తెలుగు ఆడియెన్స్‌కు చిన్న, పెద్ద అనే తేడా ఉండదు. మంచి కంటెంట్ ఉంటే ఆదరిస్తుంటారు. అలాంటి ఓ మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇది. తప్పకుండా తెలుగు ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతుంది. సినిమా థియేటర్స్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు ఓ ఎమోషన్‌తో బయటకు వెళతారు. షబీర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సిల్వగారి యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ప్లస్ అవుతుంది' అన్నారు. చదవండి: నన్ను చావబాదాడు, ఒంటిమీద బట్టలున్నాయో లేదో చూసుకోకుండా పరిగెత్తా -
అనాథాశ్రమంలో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న స్టార్ హీరో
తమిళ సినిమా: నటుడు అరుణ్ విజయ్ శనివారం తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు అన్నదానం, రక్తదా నం భారీ ఎత్తున నిర్వహించారు. పోరాడి కథానా యకుడుగా ఉన్నత స్థాయికి చేరుకున్న నటుడు అరుణ్ విజయ్. తమిళంతోపాటు తెలుగు తదితర భాషల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవ ల ఈయన కథానాయకుడిగా నటింన చిత్రాలు వరుసగా మం విజయాన్ని అందుకున్నాయి. తా జాగా తమిళ్ రాకర్స్ అనే సిరీస్‌తో వెబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు. కాగా ఆయన శనివారం తన పుట్టినరోజు వేడుకలను చెన్నైలోని ఉదవుమ్ కరంగల్ అనాథ ఆశ్రమంలో అనాథ బాలల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ ఆ శ్రమంలో బాలలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన అభిమాన సంఘం నిర్వాహకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం అభిమానులు స్థానిక రాయపేటలోని ప్రభుత్వాస్పత్రిలో రక్తదానం చేశారు. కాగా ప్రస్తుతం అరుణ్ విజయ్ అచ్చం ఎన్బదు ఇల్లయే అనే చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర యూనిట్ అరుణ్ విజయ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన కేక్ కట్ చేసి, యూనిట్ సభ్యులకు పంపిణీ చేశారు. -
అరుణ్ విజయ్ ఎమీజాక్సన్ జంటగా.. రూ.3.5 కోట్లతో లండన్ సెట్
నటుడు అరుణ్ విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి అచ్చమ్ ఎంబదు ఇల్లయే అనే టైటిల్ ఖరారు చేశారు. నటి ఎమీజాక్సన్ కథానాయకిగా, కీలక పాత్రలో నిమీషా విజయన్ నటిస్తున్నారు. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ షిరిడీ సాయి మూవీస్ పతాకంపై శ్రీ,కావ్య సమర్పణలో ఎం. రాజశేఖర్, ఎస్. స్వాతి నిర్మిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు విజయ్ తెలుపుతూ చిత్ర తొలి షెడ్యూల్ లండన్‌లో నిర్వహించినట్లు తెలిపారు. అక్కడ నటుడు విజయ్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. అక్కడ షూటింగ్లో విజయ్ తీవ్రంగా గాయపడ్డారు. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చిన లెక్క చేయకుండా షూటింగ్‌కు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో బాధను భరిస్తూనే నటించారన్నారు. కాగా చిత్ర రెండవ షెడ్యూల్‌ను చెన్నైలోని బిన్నీమిల్స్ సమీపంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్కడ ఈ చిత్రం కోసం రెండున్నర ఎకరాల స్థలంలో రూ.3.5 కోట్ల వ్యయంతో లండన్ సెట్ వేసినట్లు చెప్పారు. దీన్ని రామలింగం మేస్త్రి సహాయంతో ఆర్డ్ డైరెక్టర్ శరవణన్ వేలాదిమంది కార్మికులతో రూపొందించారని తెలిపారు. అదేవిధంగా ఈ చిత్రం కోసం 1000 మందికి పైగా విదేశాలకు చెందిన జూనియర్ ఆర్టిస్టులను రప్పించినట్లు చెప్పారు. వాళ్లతో అరుణ్ విజయ్ నటిస్తున్న భారీ పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. కాగా దర్శకుడు విజయ్ ప్రణాళిక ప్రకారం షూటింగును అనుకున్న దానికంటే ముందుగానే పూర్తి చేస్తున్నారంటూ నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. కాగా దీనికి సూర్యవంశీ, ప్రసాద్ గోదా, జీవన్ గోదా సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని, సందీప్ కె. విజయ్ చాయాగ్రహణం అందిస్తున్నట్లు వెల్లడించారు. -
తమిళ హీరో అరుణ్ విజయ్ 'ఆక్రోశం'..ఎవరిపైన?
అరుణ్ విజయ్ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘సినం’. జీఎన్ఆర్ కుమారవేలన్ దర్శకత్వంలో ఆర్. విజయ్‌కుమార్ నిర్మించిన చిత్రం ఇది. ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌ను తెలుగులో ‘ఆక్రోశం’ పేరుతో సీహెచ్ సతీష్ కుమార్, జగన్మోహనిలు విడుదల చేస్తున్నారు. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. సీహెచ్ సతీష్‌కుమార్ మాట్లాడుతూ – ‘‘నిర్మాతగా కాకుండా ఓ ఆడియన్‌గా ‘సినం’ ట్రైలర్ చూసి ఆశ్చర్యపోయాను. తెలుగులో ఈ సినిమాను విడుదల చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. మంచి సినిమా చూశామనే అనుభూతిని ప్రేక్షకులు పొందుతారు’’ అన్నారు. -
రిలీజ్‌కు రెడీ అయిన అరుణ్ విజయ్ చిత్రం
తమిళ సినిమా: అరుణ్ విజయ్ కథానాయకుడు నటించిన చిత్రం బోర్డర్. ఆయనకు జంటగా నటి రెజీనా, స్టెఫీ పటేల్ నటించారు. అరివళగన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆల్ ఇన్ పిక్చర్స్ పతాకంపై విజయరాఘవేంద్ర నిర్మించారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, బి.రాజశేఖర్ చాయాగ్రహణంను అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. దీని తమిళనాడు విడుదల హక్కులను పొందిన 11:11 ప్రొడక్షన్స్ అధినేతప్రభు తిలక్ చిత్రాన్ని అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించారు. అరుణ్ విజయ్ ఇంతకు ముందు నటించిన చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అలాగే ఆయన తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ తమిళ్ రాకర్స్ ఇటీవల ఓటీటీలో విడుదలై వీక్షకుల నుంచి మంచి ఆదరణను పొందుతోంది. దీంతో బోర్డర్ చిత్రంపై మరింత అంచనాలు నెలకొన్నాయి. కమర్షియల్ అంశాలతో యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ విడదలై ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకుంది. దీనిపై ప్రభు తిలక్ మాట్లాడుతూ.. తమిళ చిత్ర పరిశ్రమలో మంచి అంచనాలు ఏర్పరచుకున్న ఈ చిత్రాన్ని తమ సంస్థ ద్వారా విడుదల చేస్తుండడం సంతోషంగా ఉందన్నారు. తమ సంస్థ ద్వారా మంచి కథాంశంతో కూడిన చిత్రాలను, నిర్మించడం, విడుదల చేయటం చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దర్శకుడు అరివళగన్ చిత్రాన్ని బ్రహ్మాండంగా తెరకెక్కించారన్నారు. చిత్రానికి పనిచేసిన సాంకేతిక వర్గం పనితనం అభి నందనీయమన్నారు. ఇక నటు డు అరుణ్ విజయ్ గురించి చెప్పాలంటే ఆయన అద్భుతమైన నటన చిత్రాన్ని గొప్పగా మార్చిందని తెలిపారు. -
థియేటర్లో విడుదలకు సిద్ధమైన అరుణ్ విజయ్ చిత్రం
అరుణ్ విజయ్ కథానాయకుడిగా తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ తమిళ్ రాకర్స్ ఇటీవల ఓటీటీలో విడుదలై విశేష ఆదరణను అందుకుంటోంది. కాగా ఈయన నటించిన మరో చిత్రం సినమ్. జీఎన్ఆర్ కుమరవేలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలక్ లాల్వాణి నాయకిగా నటించింది. నటుడు కాళీవెంకట్ ముఖ్య పాత్ర పోషించారు. ఈ త్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 16న విడుదలకు సిద్ధం అవుతోంది. చదవండి: బిగ్‌బాస్‌లోకి స్టార్ సింగర్స్ దంపతులు? ఇక ప్రేక్షకులకు రెట్టింపు వినోదమే.. కాగా శుక్రవారం చిత్రంలోని నెంజెల్లాం అనే పాటను విడుదల చేశారు. సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్, గాయని శివాంగి కలిసి పాడిన ఈ పాటకు మం స్పందన వస్తోందని యూనిట్ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. కాగా ఇందులో నటుడు అరుణ్ విజయ్ పోలీస్ అధికారిగా నటించడం విశేషం. చిత్రం క్రైమ్ థ్రిల్లర్ నేప«థ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టెయినర్గా ఉంటుందని దర్శకుడు తెలిపారు. దీనికి షబీర్ సంగీతాన్ని అందించారు. -
ఆ ఓటీటీలోకి ‘తమిళ రాకర్స్’.. ఎప్పుడంటే..
ఏవీఎం ప్రొడక్షన్స్. ఈ పేరు విజయాలకు చిరునామా. ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేశన్, రజినీకాంత్, కమలహాసన్ వంటి గొప్ప నటులందరూ ఈ సంస్థలో నటించిన వారే. అలాంటి సంస్థ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. తాజాగా ఈ సంస్థ మళ్లీ చిత్రాలను నిర్మించడం ప్రారంభించింది. ఏవీ మెయ్యప్పన్ కుటుంబం నుంచి 4వ తరం చెందిన అరుణ గుహన్ తాజాగా చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ముందుగా తమిళ రాకర్స్ పేరుతో వెబ్‌సిరీస్‌ను రూపొందించారు. అరివళగన్ దర్శకత్వం వహించిన ఎనిమిది భాగాలతో ఈ వెబ్‌సిరీస్‌లో నటుడు అరుణ్ విజయ్, నటి ఐశ్వర్య మీనన్, వాణిభోజన్ హీరో హీరోయిన్లుగా నటించారు. సోనీ లివ్ సంస్థ భాగస్వామ్యంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 19వ తేదీ నుంచి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. నూతన చిత్రాలను పైరసీ చేస్తూ నిర్మాతల ఆదాయానికి గండి కొడుతున్న తమిళరాకర్స్ నేపథ్యంలో రూపొందించిన వెబ్‌సిరీస్ ఇదని దర్శకుడు అరివళగన్ తెలిపారు. ఇందులో అరుణ్ విజయ్ పోలీసు అధికారిగాను, ఆయనకు జంటగా ఐశ్వర్య మీనన్, సహ పోలీసు అధికారిణిగా వాణి భోజన్ నటించారని తెలిపారు. ఇందులో రొమాన్స్ సన్నివేశాలు పరిధికి మించకుండా ఉంటాయన్నారు. నటుడు అరుణ్ విజయ్ మాట్లాడుతూ అరివళగన్ దర్శకత్వంలో ఇంతకుముందు రెండు చిత్రాలలో నటించానన్నారు. తాను నటించిన తొలి వెబ్‌సిరీస్ ఇదేనన్నారు. వెబ్ సిరీస్ ద్వారా విషయాన్ని మరింత విఫులంగా చెప్పే వీలు ఉంటుందని పేర్కొన్నారు. అరుణ గుహన్ మాట్లాడుతూ కథ నచ్చడంతో ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. త్వరలోనే భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఆమె వెల్లడించారు. -
Tamilrockerz Official Teaser: పైరసీ వెబ్‌సైట్‌పై వెబ్ సిరీస్.. ఆసక్తిగా టీజర్
Arun Vijay New Web Series On Tamil Rockers: సినిమా వేధించే ప్రధాన సమస్యల్లో పైరసీ ఒకటి. పైరసీ మహమ్మారీ కారణంగా అనేక సూపర్ హిట్ మూవీస్ కలెక్షన్లలో వెనుకపడ్డాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సినిమా.. ఈ పైరసీ భూతానికి బలి అవుతూనే వస్తోంది. గతంలో చిత్రాలు నెలలు, వందల రోజులు ఆడి, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకునేవి. కానీ ఈ పైరసీ ఎంట్రీ ఇచ్చాక సినిమాలు పట్టుమని నెల రోజులు కూడా కనిపించట్లేదు. ఇలాంటి పైరసీ వెబ్సైట్లో ప్రముఖంగా చెప్పుకునేది తమిళ్ రాకర్స్. దక్షిణాది సినిమాలకు ఇది అతిపెద్ద గండగా పరిణిమించిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని వాడుతూ పైరసీ ప్రింట్లను తీసుకువచ్చి దర్శకనిర్మాతలకు ముచ్చెటమలు పట్టేలా చేసింది ఈ వెబ్సైట్. తాజాగా ఈ తమిళ్ రాకర్స్‌పై ఓ వెబ్ సిరీస్ రానుంది. తమిళ్ రాకర్స్ వల్ల నిర్మాతలు ఎదుర్కొన్ని కష్టాలను ఈ వెబ్ సిరీస్‌లో చూపించనున్నారట. ఈ సిరీస్‌కు ప్రముఖ దర్శకుడు శంకర్ శిష్యుడు అరివళగన్ డైరెక్షన్ చేయనున్నారు. ఇందులో అరుణ్ విజయ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకు కుట్రమ్ 23, బోర్డర్ సినిమాలు వచ్చి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కూడా మంచి విజయం సాధిస్తుందని చిత్రబృంద నమ్మకంగా ఉంది. తమిళ్ రాకర్స్ పేరుతోనే టైటిల్ ప్రకటన ఇచ్చి ఆసక్తి కలిగించారు. ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను జులై 3న విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: హీరో విశాల్‌కు గాయాలు.. నిలిచిపోయిన సినిమా షూటింగ్ మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం కమల్ హాసన్‌కు ప్రభుత్వం నోటీసులు ! కారణం ? -
‘ఏనుగు’ మూవీ రివ్యూ
టైటిల్ : ఏనుగు నటీనటులు : అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, రాధికా శరత్ కుమార్, యోగిబాబు, అమ్ము అభిరామి, కేజీయఫ్ రామచంద్రరాజు తదితరులు నిర్మాత: సీహెచ్ సతీష్ కుమార్ దర్శకత్వం: హరి సంగీతం : జీవీ ప్రకాశ్ కుమార్ సినిమాటోగ్రఫీ: గోపీనాథ్ ఎడిటర్: ఆంథోని విడుదల తేది: జులై 1,2022 హరి దర్శకత్వంలో అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం ‘యానై’. ఈ తమిళ చిత్రం ‘ఏనుగు’ పేరుతో తెలుగులో విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. కాకినాడకు చెందిన పీఆర్వీ, ‘సముద్రం’ కుటుంబాల మధ్య శత్రుత్వం ఉంటుంది. పీఆర్వీ రెండో భార్య కొడుకు రవి(అరుణ్) తన కుటుంబానికి, సవతి తల్లికొడుకులు(సముద్రఖని, బోస్ వెంకట్, సంజీవ్)కు అండగా నిలబడతాడు. ‘సముద్రం’కుటుంబానికి చెందిన లింగం( కేజీయఫ్ గరుడ రామ్)తో తన ఫ్యామిలీకి ముప్పు ఉందని తెలుసుకున్న రవి.. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ అన్నయ్యలకు ఎలాంటి హానీ కలగకుండా చూసుకుంటాడు. ఈ క్రమంలో తన అన్నయ్య(సముద్రఖని)కూతురు దేవి(అమ్ము అభిరామి)చేసిన పనికి రవి,అతని తల్లి(రాధికా శరత్ కుమార్)ఇంటిని వీడాల్సి వస్తుంది. అసలు దేవి చేసిన తప్పేంటి? దాని వల్ల రవి ఎందుకు అన్నయ్యలకు దూరమయ్యాడు? పీవీఆర్, సముద్రం కుటంబాల మధ్య వైరుధ్యుం ఎందుకు ఏర్పడింది? తండ్రి మరణం అన్నదమ్ముల మధ్య ఎలాంటి చిచ్చు పెట్టింది? ఈ మధ్యలో మేరీ (ప్రియా భవానీ శంకర్)తో రవి ప్రేమాయణం ఎలా సాగింది? చివరకు రవి కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అనేదే మితగా కథ ఎలా ఉందంటే.. సింగం సిరీస్, పూజ సినిమాలతో కమర్శియల్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు హరి. ఆయన చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ ఉంది. అందుకే తమిళ సినిమా యానైని తెలుగు ఏనుగు పేరుతో విడుదల చేశారు. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఎమోషనల్ కంటెంట్‌తో పాటు మంచి ఫ్యామిలీ వ్యాల్యూస్ ఉన్నాయి. ఫస్టాఫ్ అంతా పీవీఆర్, సముద్రం కుటుంబాల మధ్య వైర్యం, మేరి, రవిల ప్రేమాయణంతో రొటీన్‌గా సాగుతుంది. ప్రధాన పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు దర్శకుడు. యోగిబాబుతో వచ్చే కామెడీ సీన్స్ నవ్వులు పూయిస్తాయి. పీవీఆర్ కుటుంబంలో చీలికలు ఏర్పడడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్‌తో నింపేశాడు. అన్నయ్య కూతురు దేవిని వెతికే క్రమంలో వచ్చే ట్విస్టులు, ఎమోషన్ సీన్స్ సినిమాని మరోస్థాయి తీసుకెళ్తాయి. రవి తండ్రి చనిపోయిన సీన్ అయితే కంటతడి పెట్టిస్తాయి. అయితే రొటీన్ స్క్రీన్‌ప్లే, కొన్ని సాగదీత సీన్స్ సినిమా స్థాయిని తగ్గిస్తాయి. అలాగే నిడివి కూడా ఎక్కువగా ఉండడం మైనస్. ఫ్యామిలీ ఎమోషన్స్ కోరుకునే ప్రేక్షకులను ఈ సినిమా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. రవి పాత్రకు న్యాయం చేశాడు అరుణ్ విజయ్. యాక్షన్, ఎమోషన్స్ సీన్స్‌లో చక్కగా నటించాడు. ఇక మేరి పాత్రలో ఒదిగిపోయింది ప్రియా భవానీ శంకర్. తెరపై తెలుగింటి అమ్మాయిగా, అందంగా కనిపించింది. పీఆర్వీ కుటుంబ పెద్దగా సముద్రఖని తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో ఆయనది చాలా కీలకమైన పాత్ర. రవి తల్లిగా రాధిక శరత్ కుమార్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించారు. విలన్ గా గరుడ రామ్ ఆకట్టుకున్నాడు. జిమ్మిగా యోగిబాబు తనదైన కామెడీ పంచ్‌లతో నవ్వించాడు. మిగిలిన నటీటనులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకెతిక విషయానికొస్తే.. జీవి ప్రకాశ్ సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. గోపినాథ్ సినిమాటోగ్రఫి బాగుంది. సముద్ర తీరం అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఎడిటర్ ఆంథోని తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. కొన్ని సీన్స్‌కి తొలగించి, నిడివిని తగ్గిస్తే సినిమా స్థాయి మరోరకంగా ఉండేది. నిర్మాణ విలువల చాలా రిచ్‌గా, సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
‘ఏనుగు’ వచ్చేస్తుంది
హరి దర్శకత్వంలో అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం ‘యానై’. సీహెచ్ సతీష్ కుమార్, వేదికకారన్‌పట్టి ఎస్.శక్తివేల్ నిర్మించిన ఈ తమిళ చిత్రం ‘ఏనుగు’ పేరుతో తెలుగులో రానుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను జులై 1 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ...మంచి కంటెంట్ ఉన్న సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం సమాజంలో ఉన్న సమస్యలని ఎంటర్టైన్మెంట్ రూపంలో ‘ఏనుగు’ ద్వారా చూపించబోతున్నాం. తెలుగులో దర్శకుడు హరి చేసిన గత సినిమాలు ఎంత పెద్ద హిట్టయ్యాయో ఇప్పుడు వస్తున్న కమర్శియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఏనుగు’చిత్రం కూడా అంతే పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’అన్నారు. చిత్ర దర్శకుడు హరి మాట్లాడుతూ..‘‘ఏనుగు’ చిత్రంలో ఎమోషనల్ కంటెంట్ తో పాటు మంచి ఫ్యామిలీ వాల్యూస్ ఇందులో చూయించడం జరిగింది.అలాగే ఈ సినిమాలో యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్, కామెడీ ఇలా ప్రేక్షకులకు కావలసిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఫ్యామిలీ తో వచ్చి చూసే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ఇంతకుముందు నేను చేసిన చిత్రాలను ఆదరించి నట్లే ఇప్పుడు మంచి కంటెంట్ తో జులై 1 న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ 'ఏనుగు" సినిమాను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను’ అన్నారు. -
తెలుగులో వస్తున్న ఏనుగు, ట్రైలర్ చూశారా?
‘‘నా కెరీర్లో ‘ఏనుగు’ బిగ్గెస్ట్ సినిమా. తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ అవుతుంది. ఇందులో మంచి ఎమోషనల్ కంటెంట్‌తో పాటు ఫ్యామిలీ వాల్యూస్‌ని చూపించారు హరి. అందరూ తప్పుకుండా కనెక్ట్ అవుతారు’’ అని హీరో అరుణ్ విజయ్ అన్నారు. హరి దర్శకత్వంలో అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం ‘యానై’. వేదిక కారన్పట్టి, ఎస్. శక్తివేల్ నిర్మించిన ఈ తమిళ చిత్రం ‘ఏనుగు’ పేరుతో తెలుగులో రానుంది. జగన్మోహిని సమర్పణలో సీహెచ్ సతీష్ కుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు.‘‘ఈ సినిమాలో ప్రస్తుత సమాజంలో ఉన్న సమస్యలని వినోదాత్మకంగా చూపిస్తూ, మంచి సందేశం ఇచ్చాం’’ అన్నారు హరి. ‘‘మా సినిమా చూసిన ప్రేక్షకులు హ్యాపీగా బయటకు వస్తారు’’ అన్నారు సీహెచ్ సతీష్ కుమార్. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. చదవండి: లేడీ ఓరియంటెడ్ మూవీస్, ఒక్కరితో కాదు ఇద్దరు, ముగ్గురితో! డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు.. పార్టీ లోపలి వీడియో వైరల్ -
ఎంటర్టైన్ చేయడానికి ‘ఏనుగు’గా వస్తున్న తమిళ్ ‘యానై’
ఢిఫరెంట్ కథలను ఎంచుకుంటూ కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచుకున్నాడు సినియర్ నటుడు విజయ్ కుమార్ తనయుడు అరుణ్ విజయ్. ఈ యంగ్ హీరో తాజాగా నటించిన చిత్రం ‘యానై’. ఈ మూవీ ఇప్పుడు ‘ఏనుగు’పేరుతో టాలీవుడ్లో జూన్ 17న విడుదల కాబోతుంది. ఉత్తరాంధ్ర లో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేసి, దనుష్ ‘ధర్మయోగి’తో నిర్మాతగా మారిన సీహెచ్ సతీష్ కుమార్.. విఘ్నేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాడు. హీరో సూర్య తో సింగం సిరీస్ , విశాల్ తో పూజ వంటి యాక్షన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు హరి ఈ మూవీకి దర్శకత్వం వహించడం విశేషం. అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్,సముద్రఖని, కేజీయఫ్ ఫేమ్ రామచంద్రరాజు, రాధిక శరత్ కముఆర్, యోగిబాబు, అమ్ము తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. -
మామతో హీరో కలిసి చేసిన మూవీ యానై, ట్రైలర్ చూశారా?
కమర్షియల్ చిత్రాలకు మారుపేరు దర్శకుడు హరి. ఈ తరహా చిత్రాలకు కాస్త భిన్నంగా ఆయన తెరకెక్కించిన చిత్రం యానై అని హీరో అరుణ్ విజయ్ పేర్కొన్నారు. వీరి కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రాన్ని డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్ పతాకంపై వెడిక్కారన్‌పట్టి ఎస్.శక్తివేల్ నిర్మించారు. ప్రియ భవానీ శంకర్ నాయకిగా నటించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం రాత్రి చెన్నైలో నిర్వహించిన చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నటుడు విజయ్ మాట్లాడుతూ తాను తన మామ హరి కలిసి చిత్రం చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నామని, అది ఈ చిత్రంతో కుదిరిందని తెలిపారు. ఈ కథకు భారీ బడ్జెట్ అవసరం అవడంతో శక్తి వేల్‌ను సంప్రదించామన్నారు. ఇందులో తన చుట్టూ ఉన్న వారిని రక్షించుకునే పాత్రలో తాను నటించానన్నారు. ఇది చాలెంజింగ్ అనిపించిందన్నారు. చదవండి: నాగార్జునను సైడ్ చేసి సమంతకు బాధ్యతలు! ఆస్ట్రేలియా ఆఫర్, భారీ రెమ్యునరేషన్, కానీ మేనేజర్‌ను పర్సనల్‌గా కలవాలట!