
తమిళ హీరో అరుణ్ విజయ్ లేటెస్ట్ మూవీ 'మిషన్ ఛాప్టర్ 1'. అమీ జాక్సన్ హీరోయిన్. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. ఎం.రాజశేఖర్, ఎస్.స్వాతి నిర్మించారు. భారీ యాక్షన్ ఎమోషనల్ కథతో తీసిన ఈ సినిమాలో అరుణ్ విజయ్ జై దుర్గ అనే పాత్రలో.. అమీ జాక్సన్ లండన్‌లోని జైలు అధికారిగా నటించారు.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సాయిపల్లవి చెల్లి.. కుర్రాడు ఎవరంటే?)
తన కుమార్తె వైద్య చికిత్స కోసం లండన్ వెళ్లిన అరుణ్ విజయ్.. అక్కడ జైలు పాలు అవడం, అక్కడ కొందరు పాకిస్తాన్‌కు చెందిన కరుడుగట్టిన నేరగాళ్లు జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం, దాన్ని అరుణ్‌విజయ్ అడ్డుకోవడం, దాంతో ఆయన మరో పోరాటానికి సిద్ధం కావలసి రావడం వంటి పలు ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో సాగే కథనే ఈ సినిమా.
లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా తమిళంలో ఈనెల 12న విడుదలైంది. అయితే చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో హీరోహీరోయిన్లతో పాటు దర్శకుడు ఏఎల్ విజయ్.. ఆదియోగి విగ్రహ సందర్శనకు వెళ్లారు. ఈశా ఫౌండేషన్‌కు వెళ్లిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే?)
Comments
Please login to add a commentAdd a comment