ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న సాహో చిత్రం బాహుబలిని మించి ఉంటుందని అందులో ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్న నటుడు అరుణ్ విజయ్ పేర్కొన్నారు. ఈయన రామ్‌చరణ్ హీరోగా నటించిన బ్రూస్‌లీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు నేరుగా పరిచయం అయినా, అంతకు ముందు ఎంతవాడుగానీ లాంటి పలు అనువాద చిత్రాలతో తెలుగులోనూ గుర్తింపు పొందారు. తాజాగా మణిరత్నం చిత్రం నవాబ్ ( తమిళంలో సెక్క సెవంద వారం) చిత్రంలో నటించారు. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ ఇటీవలే తెరపైకి వచ్చి మంచి టాక్‌తో ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా నటుడు అరుణ్‌విజయ్ శనివారం స్థానిక ఆన్నామలైపురంలోని దర్శకుడు మణిరత్నం కార్యాలయంలో సాక్షితో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆయనతో సాక్షి భేటీ.
నవాబ్(సెక్క సెవంద వానం) చిత్రం గురించి?
చిత్రానికి ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. చాలా ఆనందంగా ఉంది. మణిరత్నం దర్శకత్వంలో నటించడం చాలా మంచి అనుభవం. అరవిందస్వామి, శింబు, జ్యోతిక, జయసుధ, ప్రకాశ్‌రాజ్ వంటి ప్రముఖ నటీనటులతో కలిసి నటించడం మధరమైన అనుభూతిని కలిగించింది.
నవాబ్ చిత్రంలో మీ పాత్ర గురించి?
నవాబ్ చిత్రంలో త్యాగు అనే పాత్రలో నటించాను. ముందుగా మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి కాస్త భయపడ్డాను. నటుడు అరవిందస్వామినే ఏం పర్వాలేదు. ఎలాంటి సందేహం కలిగినా దర్శకుడిని నిస్పందేహంగా అడుగు అని ధైర్యం ఇచ్చారు. నిజం చెప్పాలంటే త్యాగు చిత్రంలో నటించడం నాకు చాలెంజ్ అనిపించింది.అలాంటి పాత్రను ప్రేక్షకులు ఆదరించడం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు మణిరత్నం ఆల్వేస్ ఫ్యాషన్. ఆయన పాత్రల కన్వెర్టింగ్ అమేజింగ్‌గా ఉంటుంది. ఈ చిత్రంలోని పాత్ర తనకు చాలా ఎంకరేజింగ్ నిచ్చింది. మరిన్ని వైవిధ్యభరిత పాత్రలను పోషించడానికి ప్రేరణ నిచ్చింది.
ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు?
ప్రస్తుతం తడం అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాను. మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. మంచి కథా పాత్రలను ఎంచుకుని నటించాలన్నదే నా భావన.
తెలుగులో నటించడం గురించి?
తెలుగులో నటించడం నాకు చాలా ఇష్టం. నేను నటించిన ఎంతవాడు గానీ లాంటి పలు చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గర అయ్యాను. తెలుగులో రామ్‌చరణ్ హీరోగా నటించిన బ్రూస్‌లీ చిత్రంలో విలన్‌గా నటించాను. ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది.ఆ తరువాత చాలా అవకాశాలు వచ్చినా మంచి పాత్రల్లోనే చేయాలని వేచి చూశాను. అలాంటి సమయంలో ప్రభాష్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం సాహోలో నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రం అద్భుతంగా వస్తోంది. బాహబలి చిత్రాన్ని మించే స్థాయిలో సాహో వస్తోంది. మంచి అవకాశం అయితే తెలుగులో హీరోగానూ నటించాలని ఉంది. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఆశగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment