దర్శకుడు బాలా తెరకెక్కిస్తున్న చిత్రం వణంగాన్. ఈ చిత్రంలో మొదట సూర్య హీరోగా నటించారు. కొంత షూటింగ్ జరిగిన తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఈ చిత్రం నుంచి వైదొలిగారు. సూర్య స్థానంలో అరుణ్ విజయ్‌ను ఎంపిక చేశారు. ఇందులో నటి రోషిణీ ప్రకాశ్, సముద్రఖని, మిష్కిన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. వీ హౌస్ పొడక్షన్స్ పతాకంపై సురేశ్ కామాక్షి నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తయింది.
విగ్రహాలతో..
ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఆ మధ్య చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో అరుణ్ విజయ్ ఒక చేతిలో పెరియార్, మరో చేతిలో వినాయకుడి శిలను పట్టుకుని ఉన్న ఆ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. కాగా వణంగాన్ చిత్రం విడుదల గురించి నిర్మాత సురేశ్ కామాక్షి తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ జూలై నెలలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.
రిలీజ్ ఎప్పుడంటే?
ఈ మేరకు రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేశారు. అందులో కన్యాకుమారిలో ఉన్న తిరువళ్లువర్ శిలావిగ్రహం వద్ద నిలబడ్డ అరుణ్ విజయ్‌కు దర్శకుడు బాలా సూచనలుు ఇస్తున్నట్లుగా ఉంది. ఈ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని, ఆర్‌పీ గురుదేవ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
ஜூலை வெளியீடு(July release) @arunvijayno1 #Bala#Vanangaan@roshiniprakash_@thondankani@DirectorMysskin@Vairamuthu@gvprakash@editorsuriya@rk_naguraj@silvastunt @VHouseProd_Offl@memsundaram @johnmediamanagr #Bstudios pic.twitter.com/hKrOGvWZuR
— sureshkamatchi (@sureshkamatchi) June 1, 2024
Comments
Please login to add a commentAdd a comment