మలయాళ మూవీ‘ప్రేమలు’సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది మమిత బైజు(Mamitha Baiju). తెలుగులోనూ ఈ బ్యూటీకి ఫుల్ పాలోయింగ్ ఉంది. ఇక సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడీయోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ప్రేమలు తర్వాత ఈ బ్యూటీ ఆ స్థాయి విజయాన్ని అయితే అందుకోలేదు కానీ వరుస అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. తమిళ్‌లోనూ హీరో సూర్య సరసన నటించే అవకాశం వచ్చి చేజారిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఓ దర్శకుడు మమితను లాగిపెట్టి కొట్టాడని, దీంతో ఆమె ఆ సినిమా నుంచే తప్పుకుందనే వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
బాల చేతిలో దెబ్బలు?
తమిళ దర్శకుడు బాల వణంగాన్ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సూర్య హీరోగా, కృతిశెట్టి, మమిత హీరోయిన్లుగా నటించాల్సింది. కానీ కొంత షూటింగ్ పూర్తయిన తర్వాత సూర్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత కృతి, మమిత కూడా ఈ చిత్రం నుంచి వైదొలిగారు. అయితే సూర్య, కృతి శెట్టి ఎందుకు తప్పుకున్నారనే విషయం చెప్పకుండా సైలెంట్‌గా వారి పనిలో బిజీ అయిపోయారు. మమిత మాత్రం దర్శకుడు బాల తనను కొట్టాడని, అందుకే ఈ చిత్రం నుంచి తప్పుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో ఈ విషయం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ తర్వాత మమిత మాట మార్చింది. మీడియా తన మాటలను వక్రీకరించిందని చెప్పింది.
నా కూతురు లాంటిది: బాల
తాజాగా ఈ విషయంపై దర్శకుడు బాల కూడా స్పందించారు. మమితను కొట్టానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. షూటింగ్ సమయంలో ఓవర్ మేకప్ వేసుకొని వస్తేఏ.. ‘ఎందుకు మేకప్ వేసుకున్నావ్?’ అంటూ కొట్టేలా చేయి పైకిఎత్తేవాడినని..అంతేకాని ఆమెపై చేయి చేసుకోలేదని చెప్పారు. మమితా తనకు బిడ్డలాంటిదని..ఒక మహిళను నేను ఎందుకు కొడతాను ’ అని బాల అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment