
మలయాళ నటుడు బాలా (Actor Bala) గతేడాది కోకిలను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ జంటగా ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది చూసిన నెటిజన్లు కామెంట్స్‌లో ఈ జంటను ఆశీర్వదిస్తూ అతడి మాజీ భార్యపై అనుచిత కామెంట్లు చేశారు. బాల రెండో మాజీ భార్య, డాక్టర్ ఎలిజబెత్ నటుడిని ప్రలోభపెట్టిందని, అతడు హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు బాలాను వశం చేసుకుందని ఆరోపించారు. ఒకవేళ రోగి ప్రపోజ్ చేసినా డాక్టర్‌గా దాన్ని అంగీకరించకూడదు. కానీ ఆమె నటుడిని వశపరుచుకుంది. ఇది వైద్య వృత్తికే కళంకం అని కామెంట్స్ చేశారు. దీనిపై ఎలిజబెత్ ఘాటుగా స్పందించింది.
అంత డబ్బు లేదు
నిజంగా నేనలా చేసుంటే నాపై ఫిర్యాదు చేయొచ్చుగా! నేను అతడిని బెదిరించానా? ఇలాంటి ప్రచారం చేయించేందుకు నా దగ్గర అంత డబ్బు లేదు. రాజకీయ నాయకుల సపోర్ట్ అసలే లేదు. అంతెందుకు, ఒకసారి నువ్వు నాపై అత్యాచారం చేశాక.. ఇంటికి తీసుకెళ్లండంటూ చెన్నైలోని ఓ పోలీసాఫీసర్ నా పేరెంట్స్‌కు ఫోన్ చేశాడు. చచ్చిపోదామని ప్రయత్నించాను. నేను నీ భార్య కాదని చెప్తున్నావు. అలాగైతే నా అనుమతి లేకుండా నువ్వు చేసిన పనిని ఇంకేమంటారు? జనాలు నా గురించి నోటికొచ్చింది వాగుతున్నప్పుడు నేను నోరు విప్పక తప్పడం లేదు.
పిచ్చిదాన్నని ప్రచారం..
నేను నిజాల్ని వెల్లడిస్తూ పోస్ట్ పెట్టడం నేరమైతే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ చాలా భయంగా ఉంది. ఇప్పుడు నేను చట్టపరంగా ముందుకు వెళ్లాలన్నా కూడా గతంలో ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నిస్తారు. నేను ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు కూడా పోలీసులు పట్టించుకోలేదు. నాకు మానసిక స్థితి సరిగా లేదని ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఈ పోస్ట్‌ను సాక్ష్యంగా పెట్టుకోండి అని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చింది.
చిత్రహింసలు
మరో పోస్ట్‌లో.. బాలాను నేను ఫేస్‌బుక్‌లో కలిశాను. అతడు నాతో రిలేషన్‌లో ఉన్నప్పుడు వేరే అమ్మాయిలతో చేసిన చాటింగ్, వాయిస్ రికార్డింగ్స్ ఇప్పటికీ నా దగ్గరున్నాయి. పోలీసుల ఎదుట మా పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి అతిథులు కూడా వచ్చారు. అలాంటిది ఇప్పుడు మళ్లీ ఎలా పెళ్లి చేసుకున్నాడో అర్థం కావడం లేదు. నన్ను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టాడు. నా కుటుంబాన్ని కూడా వేధించాడు. తన గురించి చెప్తే వదిలిపెట్టనని గూండాలతో హెచ్చరించాడు. మా బెడ్‌రూమ్ వీడియో లీక్ చేస్తానని బెదిరించాడు.
అమ్మాయిలతో ఆడుకున్నాడు
డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. నన్నే కాదు చాలామంది అమ్మాయిలను మోసం చేశాడు. ఇదంతా టైప్ చేస్తుంటే నా చేతులు వణుకుతున్నాయి. ఎందుకంటే నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నేను గొడ్రాలినని అందరి ముందు నానా మాటలన్నాడు అని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చింది. కాగా బాలా సినీ నేపథ్యానికి చెందిన కుటుంబం నుంచి వచ్చాడు. అతడి తాతయ్యకు అరుణాచల స్టూడియో ఉండగా తండ్రి 350కు పైగా సినిమాలు డైరెక్ట్ చేశాడు. బాలా సోదరుడు శివ కంగువా సినిమాను డైరెక్ట్ చేశాడు.
బాలా పర్సనల్ లైఫ్
బాలా 2మచ్ అనే తెలుగు సినిమాతో నటుడిగా ప్రయాణం ఆరంభించాడు. ఇతడు చిన్న వయసులో చందన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు విడాకులిచ్చేసి అమృతా సురేశ్‌ను పెళ్లాడాడు. ఆమెతోనూ విడిపోయిన తర్వాత డాక్టర్ ఎలిజబెత్‌ను వివాహం చేసుకున్నాడు. చివరకు ఆమెను కూడా వదిలేసి ఇటీవలే కోకిలను నాలుగో పెళ్లి చేసుకున్నాడు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment