నటుడి నాలుగో పెళ్లి.. ఎవరి దిష్టి తగలకూడదని గుండు గీయించుకున్న అత్త | Kokila Mother Shaved Her Head for Actor Bala Marital Life | Sakshi
Sakshi News home page

నటుడి కోసం గుండు గీయించుకున్న అత్త.. 'ముగ్గురు స్త్రీలను మోసం చేసి నువ్వెలా..'

Published Thu, Mar 6 2025 6:25 PM | Last Updated on Thu, Mar 6 2025 7:56 PM

Kokila Mother Shaved Her Head for Actor Bala Marital Life

మలయాళ నటుడు బాలా (Actor Bala) ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నానుతూనే ఉన్నాడు. గతంలో అతడి రెండో భార్య ఆరోపణలు, ఫిర్యాదుల వల్ల పోలీస్‌ స్టేషన్‌కు కూడా వెళ్లొచ్చాడు. ఇటీవల మూడో భార్య తనపై సంచలన ఆరోపణలు చేయగా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు బాలా గతేడాది తన చుట్టాలమ్మాయి కోకిలను నాలుగో పెళ్లి చేసుకున్నాడు. వీరి బంధం నూరేళ్లపాటు కొనసాగాలని కోరుతూ కోకిల తల్లి తిరుమలలో గుండు కొట్టించుకుంది.

వచ్చే ఏడాది బిడ్డతో..
'మీ జంటను చూసి చాలామంది కుళ్లుకుంటున్నారు. అందరి కళ్లు మీ పైనే ఉన్నాయి. అందుకే ఎవరి దిష్టి తగలకుండా మీ దాంపత్యజీవితం సాఫీగా సాగాలని భగవంతుడిని కోరుకుంటూ తలనీలాలు సమర్పించుకున్నాను' అని కోకిల తల్లి చెప్పుకొచ్చింది. కోకిల నానమ్మ అయితే దంపతులను ఆశీర్వదిస్తూ.. వచ్చే ఏడాది బిడ్డను ఎత్తుకుని రావాలని కోరింది. వీరిద్దరూ బాలాకు ఉంగరం, కోకిలకు ముక్కుపుడకను బహుమతిగా ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను బాలా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

బాలాపై ట్రోలింగ్‌
ఇది చూసిన కొందరు బాలాను విమర్శిస్తున్నారు. నువ్వు ఏం చేసినా సరే ఈ లోకంలోనే కాదు పరలోకంలోనూ నీకు మోక్షం లభించదు. ఈ ప్రపంచంలో సొంత బిడ్డను మోసం చేసిన ఏకైక తండ్రివి నువ్వే.. ముగ్గురు స్త్రీల కన్నీళ్లకు నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని ఆగ్రహంతో కామెంట్లు చేస్తున్నారు. దీనికి బాలా స్పందిస్తూ..నాపై నెగెటివ్‌ కామెంట్లు చేసే మిత్రులారా.. నేను పెట్టే వీడియోలు చూస్తుంటే మీకెంత కోపం వస్తుందో నాకు తెలుసు. కాబట్టి నా అకౌంట్‌ను మీరు అన్‌ఫాలో అయితే సరిపోతుంది. అలా చేయలేకపోతున్నారంటే నా వీడియోలకు మీరు బానిసైపోయారని అర్థం. అయినా నేనెవర్నీ మోసం చేయలేదు అని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు.

 

చదవండి: బంగారం అక్రమ రవాణా చేసిన హీరోయిన్‌.. తండ్రి డీజీపీ.. మరి భర్త?!
ఓటీటీలో ముగ్గురు స్టార్స్‌ నటించిన సినిమా.. డైరెక్ట్‌గా స్ట్రీమింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement