నాకు నాలుగు పెళ్లిళ్లయ్యాని అందరూ ఈర్ష్యపడుతున్నారు.. పెళ్లి కాని ప్రసాదులైతే నాపై ఎంతో ఏడుస్తున్నారు అని మలయాళ నటుడు బాలా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ అంతలోనే యూటర్న్ తీసుకున్నాడు. తనకు రెండు పెళ్లిళ్లు మాత్రమే జరిగాయంటున్నాడు.
అది నా మొదటి పెళ్లి
తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాల మాట్లాడుతూ.. నాకు 21 ఏళ్ల వయసులో చందనతో వివాహం జరిగింది. ఆమె నా స్కూల్‌మేట్. ఇద్దరం ప్రేమించుకున్నాం, గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నాం. కానీ నా దృష్టిలో అది నిజమైన పెళ్లి కాదు. ఎందుకంటే తను మరో వ్యక్తితో వెళ్లిపోకూడదనుకుని ఆవేశంలో అలా చేశాను. మా కుటుంబాలు మమ్మల్నిద్దరినీ విడదీయడంతో కలిసుండలేకపోయాం.
కోకిల నా రెండో భార్య
కానీ తనతో నాకు ఇప్పటికీ పరిచయం ఉంది. మా మధ్య స్నేహం ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె అమెరికాలో తన భర్తతో సంతోషంగా ఉంది. ఇకపోతే నేను నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నానని జనాలు నమ్మడం ఆశ్చర్యంగా ఉంది. చట్టపరంగా కోకిల నా రెండో భార్య. డాక్టర్ ఎలిజబెత్ ఉదయన్‌ను మూడో పెళ్లి చేసుకున్నట్లు రూమర్స్ ఉన్నాయి.
అది లీగల్ మ్యారేజ్ కాదు
నిజానికి అది చట్టపరమైన వివాహం కాదు. ఇంతకుమించి తనగురించి ఎక్కువ మాట్లాడదల్చుకోలేదు. అయితే ఓ విషయం. నేను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నన్నెంతో జాగ్రత్తగా చూసుకుంది, చాలా సాయం చేసింది. అందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞత తెలుపుకుంటాను. ఆమె ఎంతో అద్భుతమైన వ్యక్తి. తనకెప్పుడూ అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.
బాలా- అమృత విడాకులు
సింగర్ అమృతా సురేశ్‌తో జరిగిన వివాహం గురించి మాత్రం ఎక్కడా నోరు విప్పలేదు. ఇకపోతే బాలాకు, అమృతకు 2010లో పెళ్లి జరగ్గా వీరికి అవంతిక అనే కూతురు ఉంది. 2019లో వీరు విడాకులు తీసుకున్నారు. తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ అమృత.. బాలాపై కేసు కూడా పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment