బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ముగింపుకు వచ్చేస్తోంది. ఈ వారం అవినాష్, నిఖిల్, నబీల్, విష్ణుప్రియ, గౌతమ్, పృథ్వీ, ప్రేరణ, తేజ నామినేషన్స్‌లో ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందన్న నాగ్.. ఈ మేరకు తేజను ఆల్‌రెడీ ఎలిమినేట్ చేసేశాడు. టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్‌కు నామినేషన్స్ నుంచి మినహాయింపు ఉంటుందన్నాడు.
ఎలిమినేషన్
నేడు మరో ఎలిమినేషన్ జరగనుంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో విష్ణు, పృథ్వీ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు చూపించారు. ఎవరి అక్వేరియంలో నీళ్లు ఎరుపురంగులో ఉంటాయో వారు ఎలిమినేట్ అని తెలిపాడు. చివర్లో మాత్రం ఇద్దరూ ఎలిమినేట్ అని ప్రకటించాడు. అయితే ఇది నిజమయ్యే ఛాన్సే లేదు.
ప్రాంక్?
ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ అని నాగార్జునే శనివారం ఎపిసోడ్‌లో ఓపెన్‌గా చెప్పాడు. ఈపాటికే తేజను పంపించేయగా మరొకరిని మాత్రమే పంపించే ఛాన్స్ ఉంది. కానీ ఈరోజు ఇద్దరూ ఎలిమినేట్ అన్నాడంటే ఇది ప్రాంక్ అని ఇట్టే తెలిసిపోతుంది. పైగా పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన విష్ణు హౌస్‌లోనే ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment