సంక్రాంతికి రిలీజ్ చేస్తే కనీస వసూళ్లయినా వస్తాయి.. అందుకే చాలామంది సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలున్నా సరే రిలీజ్ చేసేందుకు వెనకడుగు వేయరు. మరికొందరేమో పెద్ద సినిమాలు బరిలో ఉంటే మరో ఆప్షనే లేదన్నట్లు తప్పుకుంటారు. అలా ఈసారి సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ సినిమాలు రిలీజయ్యాయి. అదే సమయంలో(జనవరి 12న) తమిళంలో మిషన్ చాప్టర్ 1 రిలీజైంది. దీన్ని తెలుగులోనూ విడుదల చేయాలనుకున్నారు. కానీ తర్వాత ఈ ఆలోచన విరమించుకున్నారు.
భారీ బడ్జెట్..
ఈ మూవీలో అరుణ్ విజయ్ హీరోగా నటించాడు. అమీ జాక్సన్, నిమీషా సజయన్ హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. విజయ్ దర్శకత్వం వహించగా రూ.25 కోట్ల బడ్జెట్‌తో వంశీ, రాజశేఖర్ ఈ సినిమా నిర్మించారు. ఇది హీరో కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమా కావడం విశేషం. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. ఇది ఈయనకు మ్యూజిక్ డైరెక్టర్‌గా 100వ సినిమా కావడం విశేషం.
రెండు ఓటీటీలలో!
యాక్షన్ మూవీ సడన్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోంది. సింప్లీ సౌత్ అనే ఓటీటీలో మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇండియా మినహా మిగతా అన్ని చోట్ల అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా మరో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేటి అర్ధరాత్రి నుంచి ప్రసారం కానుందట!
#MissionChapter1 from tonight! pic.twitter.com/3ltYghmggH
— Christopher Kanagaraj (@Chrissuccess) March 14, 2024
#MissionChapter1 | MARCH 15.
— Simply South (@SimplySouthApp) March 14, 2024
Streaming worldwide, excluding India. pic.twitter.com/jxF16RmuL3
చదవండి: అంబానీ ప్రీవెడ్డింగ్ పార్టీలో ఇతడే హైలైట్.. తేడా పోజులతోనే ఫేమస్
Comments
Please login to add a commentAdd a comment