దీపావళి సందర్భంగా విడుదలైన మూడు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో థియేటర్‌లు అన్నీ ప్రేక్షకులతో సందడిగా కనిపిస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్', కిరణ్ అబ్బవరం 'క', శివ కార్తికేయన్ 'అమరన్' బిగ్ స్క్రీన్‌పైకి వచ్చేశాయి. మొదటిరోజు భారీ కలెక్షన్లతో రికార్డ్ క్రియేట్ చేశాయి. అయితే, ఇప్పుడు ఈ సినిమాలు ఏ ఓటీటీలో విడుదల కానున్నాయో తెలుసుకుందాం.
లక్కీ భాస్కర్ (నెట్‌ఫ్లిక్స్ )
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం 'లక్కీ భాస్కర్'. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి ,సాక్షి వైద్య హీరోయిన్లుగా మెప్పించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ అంచనాలతో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. అయితే, వారి అంచనాలు నిజం చేసేలా సినిమా ఉందని చెప్పవచ్చు. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 12.7 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. అయితే, ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. అయితే, ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
అమరన్ (నెట్‌ఫ్లిక్స్)
శివకార్తికేయన్- సాయి పల్లవి కాంబినేషన్‌లో విడుదలైన చిత్రం అమరన్. వీర సైనికుడు ముకుంద్ వరదరాజన్ ఇతివృత్తంతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు కంటతడి కూడా పెట్టేస్తున్నారు. దీపావళి సందర్భంగా ప్రేక్షకులముందుకు వచ్చేసిన ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా అమరన్ రూ. 34 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. డిసెంబర్ మొదటి వారంలోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
కిరణ్ అబ్బవరం 'క' (ఓటీటీ పెండింగ్)
కిరణ్ అబ్బవరం హీరోగా, నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘క’. సుజీత్–సందీప్ దర్శకత్వంలో చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా విడుదలైంది. కిరణ్ కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. మొదటిరోజు 'క' సినిమా రూ. 6.18 కోట్లు రాబట్టింది. అయితే, ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఏ సంస్థ కొనుగోలు చేయలేదు. కానీ, ఆహా తెలుగు ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. నవంబర్ చివరి వారంలో ఓటీటీ విడుదల కావచ్చని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment