
కోలీవుడ్‌లో నటుడు సతీష్ కమెడియన్‌గా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే 'నాయ్ శేఖర్' సినిమాతో హీరోగా ఆయన ఎంట్రీ ఇచ్చారు. అయితే, తాజాగా 'సట్టం ఎన్ కైయిల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ మూవీని చాచి దర్శకత్వం వహించారు. ఇందులో సతీష్‌తో పాటు మైమ్‌గోపి, అజయ్ రాజ్ పలు పాత్రలలో నటించారు.
'సట్టం ఎన్ కైయిల్' సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. IMDb రేటింగ్‌లో కూడా ఈ మూవీ 9.3 సాధించి ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే, ఈ చిత్రం నవంబర్ 8న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం తప్పకుండా మెప్పిస్తుందని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment