ఓటీటీలో రూ. 7 వేల కోట్ల ప్రాఫిట్‌ సినిమా | Hollywood Movie Moana 2 OTT Streaming Now | Sakshi
Sakshi News home page

ఓటీటీలో రూ. 7 వేల కోట్ల ప్రాఫిట్‌ సినిమా

Jan 31 2025 10:23 AM | Updated on Jan 31 2025 10:52 AM

Hollywood Movie Moana 2 OTT Streaming Now

మోనా ఫ్రాంచైజీలో భాగంగా విడుదలైనా సీక్వెల్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మోనా-2 టైటిల్‌తో గతేడాదిలో నవంబర్ 27న ఈ చిత్రం విడుదలైంది. తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది. యానిమేటెడ్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ మూవీని  డేవిడ్ డెరిక్ జూనియర్, జాసన్ హ్యాండ్, డానా లెడౌక్స్ మిల్లర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ముఖ్యంగా చిన్నపిల్లలను బాగా ఆకట్టుకుంది. సుమారు రెండు నెలల తర్వాత ఈ యానిమేటెడ్  థ్రిల్లర్ ఇండియాలో ఓటీటీ స్ట్రీమింగ్  అవుతుండటంతో నెట్టింట వైరల్‌ అవుతుంది.

అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న మోనా 2 చిత్రాన్ని చూడాలంటే రెంట్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఈ యానిమేటెడ్ మ్యూజికల్ అడ్వెంచర్‌ కోసం  రూ. 389 చెల్లించాలని మేకర్స్‌ ప్రకటించారు. మోనా 2 (Moana 2) చిత్రాన్ని సుమారు రూ.1300 కోట్ల బడ్జెట్‌తో వాల్ట్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్ నిర్మించింది. అయితే, ఈ చిత్రం కేవలం 50 రోజుల్లోనే వరల్డ్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ. 8500 కోట్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. హాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన టాప్‌ చిత్రాల లిస్ట్‌లో మోనా2 చేరిపోయింది.  ఈ చిత్రం సుమారుగా రూ. 7000 కోట్లకు పైగానే లాభాలను గడించింది.

మోనా2 మూవీలో డ్వేన్ జాన్సన్‌తో పాటు ఔలీ క్రావాలో, టెమూరా మోరిసన్, నికోల్ షెర్జింగర్ వంటి వారు తమ పాత్రలతో మరోసారి ప్రేక్షకులను మెప్పించారు. 2016లో వచ్చిన మోనా మూవీకి సీక్వెల్‌గా  మోనా 2 చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాకు కాస్త మిక్సిడ్‌ టాక్‌ వచ్చినప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద మాత్రం భారీ కలెక్షన్స్‌తో దుమ్మురేపింది. రెంటల్‌ కాకుండా ఉచితంగా ఈ చిత్రాన్ని అమెజాన్‌లో చూడాలంటే మార్చి 25 వరకు వేచి ఉండాల్సిందే. హాట్‌స్టార్‌లో తెలుగు వర్షన్‌ కూడా అదే సమయంలో రిలీజ్‌ కావచ్చు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement