Mona
-
Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్ చేసేలా...
వరల్డ్స్ మోస్ట్ ప్రిస్టీజియస్, గ్లామరస్ ఫ్యాషన్ ఈవెంట్ ‘మెట్ గాలా–2024’లో బ్రేక్ఔట్ స్టార్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది మోనా పటేల్. ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్ చేసేలా చేసింది. వడోదర నుంచి అమెరికా వరకు ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మోనా ఎదిగిన వైనం స్ఫూర్తిదాయకం. ఫిలాంత్రపిస్ట్‌గా ఎన్నో రకాల సేవాకార్యక్రమాలు చేపడుతోంది...గుజరాత్‌లోని వడోదరలో పుట్టి పెరిగిన మోనా పటేల్ చాలామంది అమ్మాయిలలాగే స్కూల్, కాలేజీ రోజుల్లో రకరకాల వివక్షలు, సవాళ్లు ఎదుర్కొంది. ‘ఆటలు మగవారి కోసమే’, ‘ఆడవారు ఇంట్లోనే క్షేమంగా ఉంటారు’ ‘లక్ష్యాలు అనేవి మగవారి కోసమే’ ఇలాంటి ఎన్నో పురుషాధిక్య భావజాల ధోరణులకు సంబంధించిన మాటలు విన్నది మోనా.అయితే అలాంటి మాటలకు ఎప్పుడూ విలువ ఇవ్వలేదు. సవాలుకు సై అనడం తప్ప వెనక్కి తిరిగి చూసింది లేదు. పన్నెండు సంవత్సరాల వయసు నుంచి బాయ్స్–స్టైల్ హెయిర్ కట్‌తో కనిపించడంప్రారంభించింది. వస్త్రధారణ కూడా అచ్చం అబ్బాయిలలాగే ఉండేది.‘ఏమిటీ వేషం’లాంటి వెక్కిరింపులకు ముఖం మీదే సమాధానం చెప్పి నోరు మూయించేది. ‘హెయిర్ కట్ అనేది రెబిలియన్ యాక్ట్. సెల్ఫ్–ఎంపవర్మెంట్కు సింబల్’ అంటూ ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటుంది మోనా. ఇంటి నుంచి బయటి వెళ్లడమే సాహసంగా భావించే రోజుల నుంచి చదువు కోసం గుజరాత్ యూనివర్శిటీలో అడుగు పెట్టింది. హోమ్టౌన్ తప్ప మరో టౌన్ తెలియని మోనా పైచదువుల కోసం న్యూజెర్సీలోని రాత్గర్స్ యూనివర్శిటీకి వెళ్లింది.‘ఔట్‌సైడ్ ఇండియా లైఫ్ గురించి ఎప్పటినుంచో ఆసక్తి ఉండేది. చదువుల రూపంలో అది నెరవేరింది. ఒంటరిగా బయలుదేరినప్పటికీ ఆ ఒంటరితనమే ధైర్యాన్ని ఇచ్చింది. కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది’ అంటుంది మోనా. అమెరికాకు వెళ్లిన కొత్తలో అక్కడి వేషధారణ, ఆచార వ్యవహారాలు తనకు కొత్తగా అనిపించేవి.‘ఈ ప్రపంచంలో నేను ఇమడగలనా!’ అని కూడా సందేహించేది. అయితే ఆ ప్రపంచంలోనే ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయధ్వజం ఎగరేసింది మోనా పటేల్. ఒక్కో మెట్టు ఎక్కుతూ హెల్త్‌కేర్, టెక్, రియల్ ఎస్టేట్... మొదలైన రంగాలలో ఎనిమిది కంపెనీలను నెలకొల్పింది. వ్యాపార విజయాలే కాదు సామాజిక సేవాకార్యక్రమాలు కూడా మోనాకు ఇష్టం. జెండర్ ఈక్వాలిటీ, అమ్మాయిల చదువు, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను దృష్టిలో పెట్టుకొని ‘కొచర్ ఫర్ కాజ్’ అనే స్వచ్ఛంద సంస్థనుప్రారంభించింది.‘మూడు పెద్ద సూట్‌కేస్‌లతో తొలిసారిగా ఇండియా నుంచి డల్లాస్‌కు బయలుదేరాను’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మోనా.ఆ సూటుకేసులలో విలువైన వస్తువులు ఉండచ్చు. అయితే వాటి అన్నిటికంటే అత్యంత విలువైనది... ఆమెలోని ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసమే మోనా పటేల్‌ను తిరుగులేని ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది. ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చేలా చేస్తోంది.బంగారు రెక్కల సీతాకోకచిలక..ప్రతిష్ఠాత్మకమైన మెట్‌గాలా 2024 ఎడిషన్‌ను న్యూయార్క్‌లోని ‘మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్’లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెన్నిఫర్ లోపెజ్, సారా జెస్సికా, ఆలియా భట్, ఇషా అంబానీ, నటాషా పూనావాలా... మొదలైన ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్నారు. మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై కనిపించాలనేది ఎంతోమంది అమ్మాయిల కల.అయితే తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులు ‘వావ్’ అనుకునేలా చేసి, మెట్ గాలాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పటేల్. ‘ది గార్డెన్ ఆఫ్ టైమ్’ థీమ్‌తో రూపొందించిన సీతాకోకచిలక ఆకారంలో ఉన్న గౌనుకు ఎంతోమంది ఫిదా అయ్యారు. ‘నా వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకునేలా నా డెబ్యూ లుక్ ఉండాలనుకున్నాను’ అంటుంది పటేల్. రెడ్ కార్పెట్‌పై పటేల్ బ్యూటీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ సెన్సేషన్‌గా మారింది.ఇవి చదవండి: Rosa Shruti Abraham: సెరామిక్ అండ్ గ్లాస్ డిజైనర్.. -
పగ.. ప్రతీకారం...
కళాధర్ కొక్కొండ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కర్ణ’. మోనా ఠాకూర్ హీరోయిన్గా నటించారు. సనాతన క్రియేషన్స్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ని నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేశారు. కళాధర్ కొక్కొండ మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనలతో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘కర్ణ’. పగ, ప్రతీకారం నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ చిత్రంలోని ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ బీజే, కెమెరా: శ్రవణ్ జి.కుమార్. -
పాఠం ఆడియో ఆవిష్కరణ
తమిళసినిమా: అన్నీ ప్రైవేట్ సంస్థల ఆధీనంలోకి వెళ్లిపోతున్నాయి. ఇక ప్రభుత్వం పనేంటి అని ప్రశ్నించారు దర్శకుడు, నామ్ తమిళర్ పార్టీ అధ్యక్షుడు సీమాన్. మన దేశ విద్యా విధానాన్ని మార్చాలన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రం పాఠం. రోలాన్ మూవీస్ పతాకంపై పీఎస్.జుపిన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఇ.రాజశేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు రాజేశ్ శిష్యుడు. నవ జంట కార్తీక్, మోనా హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి మనో ఛాయాగ్రహణం, గణేశ్ రాఘవేంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ సోమవారం ఉదయం స్థానిక సత్యం థియేటర్లో జరిగింది. ఈ వేడుకలో అతిథిగా పాల్గొన్న సీమాన్ మాట్లాడుతూ... ఈ చిత్రం పలు అవార్డులను గెలుచుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చదువుకోవడం విద్యార్థుల హక్కు అని, దాన్ని సక్రమంగా అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు విద్య, వైద్యం, అన్నీ వ్యాపారం అయిపోయాయని ఆరోపించారు. మనం అన్నిటికీ పన్నులు చెల్లిస్తున్నా, ఏదీ అందుబాటులోకి రావడం లేదన్నారు. అలాంటప్పుడు ప్రభుత్వం పనేంటి? అని ప్రశ్నించారు. జయలలిత లాంటి వారే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారని, అంటే పాలకులకే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యంపై నమ్మకం లేనట్టేగా అని నిలదీశారు. ఇక్కడ డబ్బున్నోళ్లే ప్రాణా లను కాపాడుకుంటారని, లేనోళ్లు ప్రాణాలు కోల్పోవాల్సిందేనని సీమా న్ వ్యాఖ్యానించారు. -
మ్యూజియంలో మైక్రోస్కోపిక్ మోనాలీసా
లండన్: ప్రపంచంలో అత్యంత ఖరీదైన... అందమైన పెయింటింగుల్లో మోనాలీసా ఒకటి. ఆమె.. ఇప్పుడు సాంకేతిక నిపుణుల చేతిలో కొత్త రూపం దాల్చింది. పారిస్ లౌన్రే మ్యూజియంలో అతి సూక్ష్మ రూపంలో దర్శనమిస్తోంది. నానో టెక్నాలజీని ఉపయోగించి రూపొందించిన ఆ వర్ణ చిత్రం ఓ పిక్సల్ కంటే తక్కువగా ఉండి, ఐఫోన్ రెటీనా డిస్ ప్లే లా నిజమైన మోనాలీసా కంటే సుమారు పదివేల రెట్లు తక్కువగా కనిపిస్తోంది. లేజర్ ప్రింటింగ్ టెక్నాలజీలో ఇప్పుడు అద్భుతాలను సృష్టించగల్గుతున్నారు. ఏ చిత్రాన్నైనా భిన్నంగా చూపించగల్గుతున్నారు. సుమారు 127.000 (డాట్స్ పర్ ఇంచ్) డిపిఐ రిజల్యూషన్ తో చిత్రాలు రూపొందే అవకాశం ఉండటంతో పాటు...అధిక నాణ్యత ఉండే ఈ కొత్త టెక్నాలజీపైనే అంతా ఆధారపడుతున్నారు. ముఖ్యంగా వార పత్రికలు వంటివి ప్రింట్ చేసేందుకు సుమారు మూడు వందల డిపిఐతో ఇది మంచి ఫలితాలనిస్తోంది. ఈ లేజర్ టెక్నాలజీతో ఓ కొత్త అప్లికేషన్ ను కూడా రూపొందించే అవకాశం ఉన్నట్లుగా డెబ్ మార్క్ టెక్నికల్ యూనివర్శిటీ పరిశోధక బృందం చెప్తోంది. దీంట్లో డేటాను కనిపించకుండా ఉండేంత సూక్ష్మ రూపంలో దాచుకునేందుకు వీలౌతుంది. సీరియల్ నెంబర్లు, బార్ కోడ్ లు వంటి వాటితో పాటు... ఇతర డేటానూ భద్రపరచుకోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో మోసాలకు పాల్పడేవారికి ముకుతాడు వేయొచ్చంటున్నారు అధ్యయనకారులు. ఇప్పుడు ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా మోనాలీసా చిత్రానికి వినియోగించి అతి సూక్ష్మరూపంలో రూపొందించి ప్రత్యేకతను చాటారు. కుడ్య రూపాలు, చిత్రాలకే కాక... అలంకరణలు, మొబైల్ ఫోన్లు వంటి ఉత్పత్తుల కోసం ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. కార్ల భాగాలు, వాయిద్య పరికరాల ప్యానెల్స్, బటన్స్ వంటి వస్తువుల తయారీ సులభతరం అవుతుండటంతో ఈ కొత్త విధానంపై విదేశీ కంపెనీలు సైతం ఆసక్తి చూపుతున్నాయి. -
అద్దంలో చూసుకున్నట్టుంది
సిటీ వనితల వస్త్రధారణపై ఇరానీయులు మోనా, మరాల్, కమ్రాన్‌లు విమెన్స వరల్డ్స్ కాంగ్రెస్‌లో పాల్గొనడానికి వచ్చిన ఇరానీయులు! వీళ్లతో సంభాషణ ఫేస్‌బుక్‌తో మొదలై సాహిత్యందాకా సాగింది. హైదరాబాద్ రావడం ఇదే మొదటిసారైనా.. సిటీకి బాగా కనెక్టయ్యాం అంటున్నారు ఇరానీ వనితలు. ఇక్కడి మహిళల వస్త్రధారణకు, మాకు చాలా పోలికలున్నాయని చెప్పుకొచ్చారు. తాము కూడా సల్వార్ కమీజ్ను పోలిన డ్రెస్సులే వేసుకుంటామని.. ఇది బాగా నచ్చింద ంటున్నారు. అంతేకాదు చార్మినార్, సిటీ రోడ్లపై కనిపించే మసీదులు, గుళ్లు అందంగా కనిపించాయని తమ ఇష్టాన్ని వ్యక్తం చేశారు. మా దగ్గర నిషేధం ‘భారత్‌లో యూత్ ఫేస్‌బుక్‌కి చాలా ఎడిక్టెడ్. ఐ థింక్! నాకు తెలిసి దే వేకప్ విత్ దెయిర్ ఫెబీ స్టేటస్’ అని మోనా అన్నారు. మోనా టెహరాన్‌లోని ప్రైవేట్ కంపెనీలో వర్కింగ్ ఉమన్. ‘మా దగ్గర ఫేస్బుక్, ట్విట్టర్లు నిషేధం. యూత్ వేరేపేర్లతో.. సీక్రెట్‌గా అప్పుడప్పుడు బ్రౌజ్ చేస్తుంటార’ని కొనసాగించారు మరాల్. టెహరాన్‌లో చైల్డ్ లేబర్‌కి సంబంధించిన ఎన్జీవోలో పనిచేస్తున్న కమ్రాన్.. ‘నేను చూసినంత వరకు చైల్డ్ లేబర్ ఇండియాలో కన్నా ఇరాన్‌లోనే ఎక్కువ. పాకిస్థాన్, అఫ్గనిస్తాన్ లాంటి దేశాల నుంచి వలసవచ్చిన వాళ్ల పిల్లలే బాలకార్మికులుగా ఉంటారు. వాళ్ల కోసమే మా సంస్థ పనిచేస్తుంది’అన్నాడు. బాలీవుడ్ మస్తీ.. బాలీవుడ్ పిక్చర్స్ అంటే ఇష్టమని, అందులోనూ అమితాబ్‌బచ్చన్ సినిమాలంటే మరింత ఇష్టమని కమ్రాన్ తెలిపాడు. ‘షారూఖ్, సల్మాన్, ఆమీర్‌ఖాన్.. వెటరన్ యాక్టర్స్ రాజ్‌కపూర్, వైజయంతిమాల ఇష్టం’ అంది మోనా. ‘నేను ఇండియన్ మూవీస్ పెద్దగా చూడను. చూసిన లాస్ట్ మూవీ స్లమ్‌డాగ్ మిలియనీర్. ఇక్కడ ఫుల్ ఆఫ్ లైఫ్ ఉన్నా ఆర్ట్ మూవీస్ తక్కువే. ఎంతసేపూ కమర్షియల్ మూవీస్ వెంటే పడ్తారు. లిటరేచర్‌లో చూపించిన లైఫ్‌ని, క్రియేటివిటీని మూవీస్‌లో చూపించరు. ఇక్కడి బెంగాలీ, హిందీ సాహిత్యం ఎంతో బాగుంటాయి! ఝుంపాలాహిరి, అరుంధతీరాయ్లంటే నాకు చాలా ఇష్టం. వాళ్ల పుస్తకాలన్నీ మా పర్షియన్లోకి ట్రాన్స్‌లేట్ అవుతాయి. అలాగే రవీంద్రనాథ్ టాగూర్.. ఎంతగొప్ప రైటర్!’ అంటూ చెప్పుకుపోయింది. ‘ఓకే.. ఓకే లిటరేచర్ అండ్ మూవీస్ ఇన్ ఇండియా .. ఇరాన్’ అని ఓ టాపిక్ పెట్టుకొని దానిమీద తీరిగ్గా డిస్కస్ చేసుకుందాములే కానీ ఇప్పుడు కాదు.. సెషన్‌కి టైమ్ అవుతోంది అని మరాల్, కమ్రాన్లను అలర్ట్ చేస్తూ ఈ చర్చకు ఎండ్‌కార్డ్ వేసింది మోనా!