అద్దంలో చూసుకున్నట్టుంది
సిటీ వనితల వస్త్రధారణపై ఇరానీయులు
మోనా, మరాల్, కమ్రాన్‌లు విమెన్‌స వరల్డ్స్ కాంగ్రెస్‌లో పాల్గొనడానికి వచ్చిన ఇరానీయులు! వీళ్లతో సంభాషణ ఫేస్‌బుక్‌తో మొదలై సాహిత్యందాకా సాగింది. హైదరాబాద్ రావడం ఇదే మొదటిసారైనా.. సిటీకి బాగా కనెక్టయ్యాం అంటున్నారు ఇరానీ వనితలు. ఇక్కడి మహిళల వస్త్రధారణకు, మాకు చాలా పోలికలున్నాయని చెప్పుకొచ్చారు. తాము కూడా సల్వార్ కమీజ్‌ను పోలిన డ్రెస్సులే వేసుకుంటామని.. ఇది బాగా నచ్చింద ంటున్నారు. అంతేకాదు చార్మినార్, సిటీ రోడ్లపై కనిపించే మసీదులు, గుళ్లు అందంగా కనిపించాయని తమ ఇష్టాన్ని వ్యక్తం చేశారు.
మా దగ్గర నిషేధం
‘భారత్‌లో యూత్ ఫేస్‌బుక్‌కి చాలా ఎడిక్టెడ్. ఐ థింక్! నాకు తెలిసి దే వేకప్ విత్ దెయిర్ ఫెబీ స్టేటస్’ అని మోనా అన్నారు. మోనా టెహరాన్‌లోని ప్రైవేట్ కంపెనీలో వర్కింగ్ ఉమన్. ‘మా దగ్గర ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు నిషేధం. యూత్ వేరేపేర్లతో.. సీక్రెట్‌గా అప్పుడప్పుడు బ్రౌజ్ చేస్తుంటార’ని కొనసాగించారు మరాల్. టెహరాన్‌లో చైల్డ్ లేబర్‌కి సంబంధించిన ఎన్‌జీవోలో పనిచేస్తున్న కమ్రాన్.. ‘నేను చూసినంత వరకు చైల్డ్ లేబర్ ఇండియాలో కన్నా ఇరాన్‌లోనే ఎక్కువ. పాకిస్థాన్, అఫ్గనిస్తాన్ లాంటి దేశాల నుంచి వలసవచ్చిన వాళ్ల పిల్లలే బాలకార్మికులుగా ఉంటారు. వాళ్ల కోసమే మా సంస్థ పనిచేస్తుంది’అన్నాడు.
బాలీవుడ్ మస్తీ..
బాలీవుడ్ పిక్చర్స్ అంటే ఇష్టమని, అందులోనూ అమితాబ్‌బచ్చన్ సినిమాలంటే మరింత ఇష్టమని కమ్రాన్ తెలిపాడు. ‘షారూఖ్, సల్మాన్, ఆమీర్‌ఖాన్.. వెటరన్ యాక్టర్స్ రాజ్‌కపూర్, వైజయంతిమాల ఇష్టం’ అంది మోనా. ‘నేను ఇండియన్ మూవీస్ పెద్దగా చూడను. చూసిన లాస్ట్ మూవీ స్లమ్‌డాగ్ మిలియనీర్. ఇక్కడ ఫుల్ ఆఫ్ లైఫ్ ఉన్నా ఆర్ట్ మూవీస్ తక్కువే. ఎంతసేపూ కమర్షియల్ మూవీస్ వెంటే పడ్తారు. లిటరేచర్‌లో చూపించిన లైఫ్‌ని, క్రియేటివిటీని మూవీస్‌లో చూపించరు. ఇక్కడి బెంగాలీ, హిందీ సాహిత్యం ఎంతో బాగుంటాయి! ఝుంపాలాహిరి, అరుంధతీరాయ్‌లంటే నాకు చాలా ఇష్టం. వాళ్ల పుస్తకాలన్నీ మా పర్షియన్‌లోకి ట్రాన్స్‌లేట్ అవుతాయి. అలాగే రవీంద్రనాథ్ టాగూర్.. ఎంతగొప్ప రైటర్!’ అంటూ చెప్పుకుపోయింది. ‘ఓకే.. ఓకే లిటరేచర్ అండ్ మూవీస్ ఇన్ ఇండియా .. ఇరాన్’ అని ఓ టాపిక్ పెట్టుకొని దానిమీద తీరిగ్గా డిస్కస్ చేసుకుందాములే కానీ ఇప్పుడు కాదు.. సెషన్‌కి టైమ్ అవుతోంది అని మరాల్, కమ్రాన్‌లను అలర్ట్ చేస్తూ ఈ చర్చకు ఎండ్‌కార్డ్ వేసింది మోనా!