Kamran
-
అతడేమి పాపం చేశాడు.. ఒక్క కారణం చెప్పండి? సెలక్టర్లపై ఫైర్
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. ఈ జట్టు ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో టెస్టులకు ఎంపికైన కమ్రాన్ గులామ్, మహ్మద్ అలీలను ఈ సిరీస్‌కు పక్కన పెట్టడాన్ని చాలా పాక్ మాజీలు తప్పబడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి పాక్ మాజీ ఓపెనర్ అహ్మద్ షెహజాద్ చేరాడు. సెలక్టర్లపై షెహజాద్ విమర్శలు గుప్పించాడు. గులామ్, మహ్మద్ అలీలను జట్టు నుంచి ఎందుకు తప్పించిరంటూ సెలక్టర్లపై ప్రశ్నల వర్షం కురిపించాడు. "కమ్రాన్ గులాంకు మరోసారి మొండి చేయి చూపించారు. దేశీవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటకి అతడిని ఎందుకు ఎంపిక చేయడం లేదో నాకు ఆర్ధం కావడం లేదు. ఎలాగో ఖుర్రం షాజాద్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్ధానంలో జమాల్‌ను సెలక్ట్ చేశారు. జమాల్ సైతం పూర్తి ఫిట్నెస్తో లేడు.అంతేకాకుండా షాహీన్ అఫ్రిది కూడా గాయంతో బాధపడుతున్నాడు. అటువంటిప్పుడు పేసర్ మహమ్మద్ అలీని జట్టులోకి తీసుకోవచ్చుగా. సెలక్టర్లు ఏమి ఆలోచిస్తున్నారో నాకు ఆర్ధం కావడం లేదు. వీరిద్దరితో పాటు మరో యువ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ సైతం డొమాస్టిక్ క్రికెట్లో అదరగొడుతున్నాడు. అతడిని కూడా జట్టులోకి తీసుకోవడం లేదు.ఇందుకు సెలక్టర్లు ఏమి సమాధానం చెబుతారు? వారు చేసిన తప్పు ఏమిటి? బాబర్ బ్యాటింగ్ చేసే పొజిషన్లోనే బ్యాటింగ్ చేయడమా? కనీసం కమ్రాన్‌కు అయినా ఛాన్స్ ఇవ్వాల్సింది. ఈ జట్టును సెలక్టర్‌గా యూసుఫ్ భాయ్ ఎంపిక చేశాడు.కాబట్టి కమ్రాన్ గులామ్‌ను ఎందుకు సెలక్ట్ చేయలేదో నాకు ఒక్క కారణం చెప్పండి అంటూ" షెహజాద్ మండిపడ్డాడు. కాగా కమ్రాన్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ వన్ డే కప్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. అతడు 49.60 సగటు, 100 స్ట్రైక్-రేట్‌తో 248 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు పాక్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, మీర్ హమ్జా, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్-కీపర్), నసీమ్ షా, నోమన్ అలీ, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్-కీపర్), షాహీన్ షా ఆఫ్రిది. -
బంగ్లాతో తొలి టెస్టు.. పాక్ జట్టు నుంచి ఆ ఇద్దరు అవుట్
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు ఆరంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన జట్టు నుంచి ఇద్దరు ఆటగాళ్లను విడుదల చేసింది. బంగ్లాదేశ్-‘ఎ’ టీమ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడాల్సిందిగా ఆదేశించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో భాగంగా పాక్- బంగ్లా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగనుంది.ఈ రెండు టెస్టులు ఎందుకు కీలకం?రావల్పిండి వేదికగా ఆగష్టు 21- 25, కరాచీ వేదికగా ఆగష్టు 30- సెప్టెంబరు 3 వరకు మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో స్థానాన్ని మెరుగుపరచుకోవాలంటే సొంతగడ్డపై జరుగుతున్న ఈ సిరీస్ పాక్‌కు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా అడుగులు వేస్తోంది.ఈ నేపథ్యంలో తమ వ్యూహాల్లో భాగంగా బంగ్లాతో తొలి టెస్టులో కేవలం పేసర్లకు మాత్రమే తుదిజట్టులో చోటివ్వనుంది. ఈ క్రమంలో యువ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను జట్టు నుంచి రిలీజ్ చేసింది. పాకిస్తాన్ షాహిన్స్- బంగ్లాదేశ్-‘ఎ’ మధ్య ఆగష్టు 20న కరాచిలో మొదలుకానున్న నాలుగు రోజుల మ్యాచ్‌లో ఆడాల్సిందిగా ఆదేశించింది.అందుకే అతడిని రిలీజ్ చేశాంతద్వారా అతడికి కావాల్సినంత మ్యాచ్ ప్రాక్టీస్ లభించనుంది. ప్రధాన సిరీస్ తొలి టెస్టులో బెంచ్‌కే పరిమితం చేసే బదులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పాక్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. అబ్రార్ అహ్మద్‌తో పాటు టాపార్డర్ బ్యాటర్ కమ్రాన్ గులాంను రిలీజ్ చేశామని.. అతడు కూడా పాకిస్తాన్ షాహిన్స్ జట్టుతో చేరనున్నట్లు తెలిపింది.అంతేకాదు.. అతడే పాకిస్తాన్ షాహిన్స్ కెప్టెన్‌గానూ వ్యవహరిస్తాడని పీసీబీ పేర్కొంది. అయితే, అబ్రార్, కమ్రాన్ బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు ముందు పాకిస్తాన్ ప్రధాన జట్టుతో చేరతారని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. మీర్ హంజా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, నసీం షా, సయీమ్ ఆయుబ్, సర్ఫరాజ్ అహ్మద్, సౌద్ షకీల్ తదితరులు పాకిస్తాన్ షాహిన్స్(తొలి మ్యాచ్ తర్వాత)ను వీడి ఇప్పటికే బంగ్లాతో సిరీస్‌కు సన్నద్ధమవుతున్నారు.కాగా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టీమిండియా టాప్‌లో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఈ టేబుల్లో టాప్-2లో నిలిచిన జట్లే ఫైనల్‌కు అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే.బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు పాకిస్తాన్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సయీమ్ ఆయుబ్, మహ్మద్ హురైరా, బాబర్ ఆజమ్, అబ్దుల్లా షఫీక్, అఘా సల్మాన్, సౌద్ షకీల్, ఆమెర్ జమాల్, మహ్మద్ రిజ్వాన్, సర్ఫరాజ్ అహ్మద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, నసీం షా, ఖుర్రమ్ షెహజాద్, షాహిన్ అఫ్రిది.బంగ్లాదేశ్- ‘ఎ’ జట్టు(రెండో మ్యాచ్)తో పోటీపడే పాకిస్తాన్ షాహిన్స్ టీమ్కమ్రాన్ గులాం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అలీ జర్యాబ్, గులాం ముదస్సర్, ఇమామ్ ఉల్ హక్, మెహ్రాన్ ముంతాజ్, మహ్మద్ అవైస్ అన్వర్, నియాజ్ ఖాన్, ఖాసిం అక్రమ్, రోహైల్ నజీర్ (వికెట్ కీపర్), సాద్ బేగ్ (వికెట్ కీపర్), సాద్ ఖాన్, షరూన్ సిరాజ్, ఉమర్ అమీన్. -
‘పుల్వామా’ సూత్రధారి ఫొటో మార్ఫింగ్
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా జిల్లాలో 44 మంది సైనికులను పొట్టన పెట్టుకున్న ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి జైషే మొహమ్మద్ కమాండర్ అబ్దుల్ రషీద్ ఘాజీ అలియాస్ కమ్రాన్‌ను సోమవారం నాడు 12 గంటలపాటు కొనసాగిన సుదీర్ఘ ఎన్కౌంటర్లో మట్టుబెట్టామని భారత సైనిక వర్గాలు ప్రకటించాయి. ఈ వార్తను అన్ని జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. వార్తతోపాటు సైనిక కమాండర్ దుస్తుల్లో ఉన్న కమ్రాన్ ఫొటోను ఇండియా టుడేతోపాటు ఏబీపీ న్యూస్, జీ న్యూస్, ఇండియా టీవీ, అవుట్‌లుక్, ది ఎకనామిక్ టైమ్స్ ఇలా చాలా మీడియా సంస్థలు చూపించాయి. (ఎన్కౌంటర్లో కమ్రాన్ హతం) అది మార్ఫింగ్ ఫొటో అని ఈ మీడియా సంస్థలు గుర్తించినట్లు లేదు. ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ జాన్ బాన్ జోవి ఫొటోను తీసుకొని ఒక తలను మాత్రం మార్ఫింగ్ ద్వారా కమ్రాన్‌గా మార్చారు. పాప్ సింగర్ ఒరిజనల్ ఫొటోతోని పోల్చి చూస్తే ఇది మార్ఫింగ్ ఫొటో అని సులువుగా తెలిసిపోతుంది. జోవి ఎడమ చేతి వాకీటాకీని పట్టుకొని ఉండగా ఆ చేతికి వాచీ కూడా ఉంటుంది. కుడిచేయి నడుము వరకు ఉంటుంది. ఆ రెండు చేతులే కాకుండా ఒంటి మీది ఉన్న దుస్తులు కూడా కమ్రాన్ ఫొటోలో అచ్చుగుద్దినట్లు కనిపిస్తుంది. మార్ఫింగ్‌లో ఫొటో బ్యాక్ గ్రౌండ్‌ను, ఫొటో కలర్ షేడ్‌ను కాస్త మార్చారు. ఫొటోను మార్ఫింగ్ చేయడానికి ఫొటో సాఫ్ట్వేర్ అప్లికేషన్‌తోపాటు అమెజాన్‌కు చెందిన ‘పోలీస్ సూట్ ఫొటో ఫ్రేమ్ మేకర్’ అనే యాప్‌ను వాడినట్లు స్పష్టం అవుతుంది. ఫొటో మార్ఫింగ్‌కు ఎవరు పాల్పడ్డారో తెలియాల్సి ఉంది. ఎన్కౌంటర్లో కమ్రాన్ హతమయ్యాడని సైనిక వర్గాలు ప్రకటించినప్పటికీ ఆయన మృతదేహం ఫొటోలను విడుదల చేయక పోవడం కూడా పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. -
ఎన్కౌంటర్లో కమ్రాన్ హతం
శ్రీనగర్: కశ్మీర్లో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలుకోల్పోయిన ‘పుల్వామా ఆత్మాహుతి ఉగ్రదాడి’కి సూత్రధారిగా భావిస్తున్న కమ్రాన్ అలియాస్ అబ్దుల్ ఘాజీ రషీద్‌సహా ముగ్గురు జైషే మహ్మద్ ముష్కరులను ఎన్కౌంటర్లో భద్రతా దళాలు హతమార్చాయి. సోమవారం జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఓ ఆర్మీ మేజర్ సహా ఐదుగురు భద్రతా సిబ్బంది, ఓ పౌరుడు అమరులయ్యారు. పోలీస్ డీఐజీసహా 9 మంది సిబ్బంది గాయపడ్డారు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన ప్రదేశానికి 12 కి.మీ.ల దూరంలోని పింగ్లాన్‌లో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు దాదాపు 16 గంటలపాటు ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎన్కౌంటర్ కొనసాగింది. చనిపోయిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఇద్దరిని కమ్రాన్, హిలాల్ అహ్మద్‌గా గుర్తించారు. కమ్రాన్ పాకిస్తాన్ జాతీయుడు, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ టాప్ కమాండర్లలో ఒకరు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాద దాడికి ఇతడే సూత్రధారి అని అధికారులు భావించి ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు. హిలాల్ అహ్మద్ కశ్మీర్‌కే చెందినవాడు కాగా మూడో ఉగ్రవాది ఎవరనేది తెలియాల్సి ఉంది. అమరులైన భద్రతా దళాల సిబ్బందిలో ఆర్మీ మేజర్ విబూది ధొండ్యాల్, హవల్దార్ శివరామ్, సిపాయిలు హరిసింగ్, అజయ్, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. డీఐజీ అమిత్, ఓ బ్రిగేడ్ కమాండర్‌సహా 9 మంది గాయపడ్డారు. ఉత్తరాఖండ్ నుంచి రెండో మేజర్ ఉత్తరాఖండ్‌కు చెందిన ఇద్దరు ఆర్మీ మేజర్లు రెండు వరుస రోజుల్లో అమరులయ్యారు. ఓ వైపు హరిద్వార్‌లో మేజర్ చిత్రేశ్ బిష్ట్ అంత్యక్రియలు సోమవారం జరుగుతుండగానే, డెహ్రాడూన్‌కు చెందిన మరో మేజర్ విబూది ధొండ్యాల్ ఉగ్రవాదులతో ఎన్కౌంటర్లో నేలకొరిగారు. రాయబారిని వెనక్కు పిలిపించిన పాక్ ఇస్లామాబాద్: భారత్‌లో పాకిస్తాన్ రాయబారి మహ్మద్ ఫైజల్‌ను ఆ దేశం చర్చల కోసమంటూ వెనక్కు పిలిపించింది. పుల్వామా దాడి అనంతరం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో భారత చర్యకు ప్రతిచర్యగా పాక్ తమ రాయబారిని వెనక్కు రప్పించింది. దాడి తర్వాత గత వారమే పాక్‌లో భారత రాయబారి అజయ్‌ను భారత్ వెనక్కు రప్పించింది. బైక్ రిమోట్ కీతో ఐఈడీ పేల్చారు న్యూఢిల్లీ: పుల్వామా ఘటనలో ఐఈడీని పేల్చేందుకు బైక్ రిమోట్ తాళం చెవిని వాడినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. గత దాడుల్లో వాడిన ఐఈడీలనూ కీలతోనే ఆపరేట్ చేసినట్లు భావిస్తున్నాయి. కశ్మీర్ ఉగ్రవాద వ్యతిరేక విభాగం తాజాగా రూపొందించిన నివేదికలో ఇలాంటి కీలక విషయాలున్నాయి. ఐఈడీలను పేల్చేందుకు బైక్, ఇతర వాహనాల్లో వాడే రిమోట్ కీ, వాకీటాకీ, సెల్‌ఫోన్‌ల్లో వాడే ఎలక్ట్రానిక్ పరికరాలను వాడుతున్నారు. ఇవి మార్కెట్లో సులువుగా లభ్యం కావడంతోపాటు భద్రతా బలగాలతో ముఖాముఖి తలపడే అవసరం లేకుండానే తీవ్ర నష్టం కలగజేస్తాయి. ‘కొన్ని రాష్ట్రాల్లో మావోయిస్టులు వినియోగించుకుంటున్న సాంకేతికతనే భవిష్యత్తులో కశ్మీర్ ఉగ్రవాదులు అమలు పరిచే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో కశ్మీర్‌లోని భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి’ అని నివేదిక పేర్కొంది. ’కొన్నాళ్లక్రితం షోపియాన్‌లో ఐఈడీని పేల్చేందుకు బైక్ రిమోట్ కీ వాడారు. ఇటువంటివే గతంలో రెడ్ కారిడార్(మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు)లో మావోలు వాడారు. దీన్ని బట్టి వీరికీ వారికీ మధ్య సంబంధాలున్నట్లు భావించాల్సి వస్తోంది’ అని నివేదిక పేర్కొంది. కశ్మీర్లో జరిగిన ఐడీఈ పేలుళ్లలో లభ్యమైన ఆధారాలను బట్టి.. ఆర్డీఎక్స్, పీఈటీఎన్(పెంటాఎరిత్రిటోల్ టెట్రానైట్రేట్), టీఎన్టీ(ట్రైనైట్రోటోలిన్) వంటి మిలటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలతోపాటు విడిగా లభ్యమయ్యే అమోనియం నైట్రేట్, స్లర్రీస్ వంటి వాటిని ఐఈడీలను తయారు చేసేందుకు వాడినట్లు నివేదిక తేల్చింది. లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించేందుకు గాను ఉగ్రవాదులు ఐఈడీని ఎలక్ట్రానిక్ వైర్లతో అనుసంధానిస్తున్నారు. ‘దాడులకు కొత్త వ్యూహాలు, సాంకేతికత, పద్ధతులను అవలంభిస్తున్నారు. సైన్యంతో ప్రత్యక్షంగా తలపడేకంటే ఈ పద్ధతులు ఎంతో తేలికగా ఎక్కువ నష్టం కలిగించే అవకాశం ఉండటంతో ఉగ్రవాదులు ఈ మార్గాలనే ఎంచుకుంటున్నారు’ అని ఆ నివేదిక పేర్కొంది. -
అద్దంలో చూసుకున్నట్టుంది
సిటీ వనితల వస్త్రధారణపై ఇరానీయులు మోనా, మరాల్, కమ్రాన్‌లు విమెన్స వరల్డ్స్ కాంగ్రెస్‌లో పాల్గొనడానికి వచ్చిన ఇరానీయులు! వీళ్లతో సంభాషణ ఫేస్‌బుక్‌తో మొదలై సాహిత్యందాకా సాగింది. హైదరాబాద్ రావడం ఇదే మొదటిసారైనా.. సిటీకి బాగా కనెక్టయ్యాం అంటున్నారు ఇరానీ వనితలు. ఇక్కడి మహిళల వస్త్రధారణకు, మాకు చాలా పోలికలున్నాయని చెప్పుకొచ్చారు. తాము కూడా సల్వార్ కమీజ్ను పోలిన డ్రెస్సులే వేసుకుంటామని.. ఇది బాగా నచ్చింద ంటున్నారు. అంతేకాదు చార్మినార్, సిటీ రోడ్లపై కనిపించే మసీదులు, గుళ్లు అందంగా కనిపించాయని తమ ఇష్టాన్ని వ్యక్తం చేశారు. మా దగ్గర నిషేధం ‘భారత్‌లో యూత్ ఫేస్‌బుక్‌కి చాలా ఎడిక్టెడ్. ఐ థింక్! నాకు తెలిసి దే వేకప్ విత్ దెయిర్ ఫెబీ స్టేటస్’ అని మోనా అన్నారు. మోనా టెహరాన్‌లోని ప్రైవేట్ కంపెనీలో వర్కింగ్ ఉమన్. ‘మా దగ్గర ఫేస్బుక్, ట్విట్టర్లు నిషేధం. యూత్ వేరేపేర్లతో.. సీక్రెట్‌గా అప్పుడప్పుడు బ్రౌజ్ చేస్తుంటార’ని కొనసాగించారు మరాల్. టెహరాన్‌లో చైల్డ్ లేబర్‌కి సంబంధించిన ఎన్జీవోలో పనిచేస్తున్న కమ్రాన్.. ‘నేను చూసినంత వరకు చైల్డ్ లేబర్ ఇండియాలో కన్నా ఇరాన్‌లోనే ఎక్కువ. పాకిస్థాన్, అఫ్గనిస్తాన్ లాంటి దేశాల నుంచి వలసవచ్చిన వాళ్ల పిల్లలే బాలకార్మికులుగా ఉంటారు. వాళ్ల కోసమే మా సంస్థ పనిచేస్తుంది’అన్నాడు. బాలీవుడ్ మస్తీ.. బాలీవుడ్ పిక్చర్స్ అంటే ఇష్టమని, అందులోనూ అమితాబ్‌బచ్చన్ సినిమాలంటే మరింత ఇష్టమని కమ్రాన్ తెలిపాడు. ‘షారూఖ్, సల్మాన్, ఆమీర్‌ఖాన్.. వెటరన్ యాక్టర్స్ రాజ్‌కపూర్, వైజయంతిమాల ఇష్టం’ అంది మోనా. ‘నేను ఇండియన్ మూవీస్ పెద్దగా చూడను. చూసిన లాస్ట్ మూవీ స్లమ్‌డాగ్ మిలియనీర్. ఇక్కడ ఫుల్ ఆఫ్ లైఫ్ ఉన్నా ఆర్ట్ మూవీస్ తక్కువే. ఎంతసేపూ కమర్షియల్ మూవీస్ వెంటే పడ్తారు. లిటరేచర్‌లో చూపించిన లైఫ్‌ని, క్రియేటివిటీని మూవీస్‌లో చూపించరు. ఇక్కడి బెంగాలీ, హిందీ సాహిత్యం ఎంతో బాగుంటాయి! ఝుంపాలాహిరి, అరుంధతీరాయ్లంటే నాకు చాలా ఇష్టం. వాళ్ల పుస్తకాలన్నీ మా పర్షియన్లోకి ట్రాన్స్‌లేట్ అవుతాయి. అలాగే రవీంద్రనాథ్ టాగూర్.. ఎంతగొప్ప రైటర్!’ అంటూ చెప్పుకుపోయింది. ‘ఓకే.. ఓకే లిటరేచర్ అండ్ మూవీస్ ఇన్ ఇండియా .. ఇరాన్’ అని ఓ టాపిక్ పెట్టుకొని దానిమీద తీరిగ్గా డిస్కస్ చేసుకుందాములే కానీ ఇప్పుడు కాదు.. సెషన్‌కి టైమ్ అవుతోంది అని మరాల్, కమ్రాన్లను అలర్ట్ చేస్తూ ఈ చర్చకు ఎండ్‌కార్డ్ వేసింది మోనా!