ఇంగ్లండ్‌తో తొలి టెస్టు కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. ఈ జట్టు ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో టెస్టులకు ఎంపికైన కమ్రాన్ గులామ్, మహ్మద్ అలీలను ఈ సిరీస్‌కు పక్కన పెట్టడాన్ని చాలా పాక్ మాజీలు తప్పబడుతున్నారు.
తాజాగా ఈ జాబితాలోకి పాక్ మాజీ ఓపెనర్ అహ్మద్ షెహజాద్ చేరాడు. సెలక్టర్లపై షెహజాద్ విమర్శలు గుప్పించాడు. గులామ్, మహ్మద్ అలీలను జట్టు నుంచి ఎందుకు తప్పించిరంటూ సెలక్టర్లపై ప్రశ్నల వర్షం కురిపించాడు.
"కమ్రాన్ గులాంకు మరోసారి మొండి చేయి చూపించారు. దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నప్పటకి అతడిని ఎందుకు ఎంపిక చేయడం లేదో నాకు ఆర్ధం కావడం లేదు. ఎలాగో ఖుర్రం షాజాద్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్ధానంలో జమాల్‌ను సెలక్ట్ చేశారు. జమాల్ సైతం పూర్తి ఫిట్‌నెస్‌తో లేడు.
అంతేకాకుండా షాహీన్ అఫ్రిది కూడా గాయంతో బాధపడుతున్నాడు. అటువంటిప్పుడు పేసర్ మహమ్మద్ అలీని జట్టులోకి తీసుకోవచ్చుగా. సెలక్టర్లు ఏమి ఆలోచిస్తున్నారో నాకు ఆర్ధం కావడం లేదు. వీరిద్దరితో పాటు మరో యువ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ సైతం డొమాస్టిక్ క్రికెట్‌లో అదరగొడుతున్నాడు. అతడిని కూడా జట్టులోకి తీసుకోవడం లేదు.
ఇందుకు సెలక్టర్లు ఏమి సమాధానం చెబుతారు? వారు చేసిన తప్పు ఏమిటి? బాబర్ బ్యాటింగ్ చేసే పొజిషన్‌లోనే బ్యాటింగ్ చేయడమా? కనీసం కమ్రాన్‌కు అయినా ఛాన్స్ ఇవ్వాల్సింది. ఈ జట్టును సెలక్టర్‌గా యూసుఫ్ భాయ్ ఎంపిక చేశాడు.
కాబట్టి కమ్రాన్ గులామ్‌ను ఎందుకు సెలక్ట్ చేయలేదో నాకు ఒక్క కారణం చెప్పండి అంటూ" షెహజాద్ మండిపడ్డాడు. కాగా కమ్రాన్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ వన్ డే కప్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. అతడు 49.60 సగటు, 100 స్ట్రైక్-రేట్‌తో 248 పరుగులు చేశాడు.
ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు పాక్ జట్టు
షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, మీర్ హమ్జా, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్-కీపర్), నసీమ్ షా, నోమన్ అలీ, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్-కీపర్), షాహీన్ షా ఆఫ్రిది.
Comments
Please login to add a commentAdd a comment