బాగు బ్లాగు | Repairing Blog | Sakshi
Sakshi News home page

బాగు బ్లాగు

Published Sun, Dec 7 2014 11:28 PM | Last Updated on Wed, Apr 3 2019 4:37 PM

బాగు బ్లాగు - Sakshi

బాగు బ్లాగు

కృతి- ఫేస్‌బుక్, వెంకట్- ఎల్‌ఓఎల్, కృష్ణ - మిస్టరీ షాపర్, చైతన్య- లవ్ టు ఎక్స్‌ప్రెస్, అశోక్- చికెన్ బిర్యానీ... ఇదీ అక్కడ చేరిన గమ్మత్తయిన పరిచయం. చదువు, ఉద్యోగం కాకుండా పేరుతో పాటు తమ గురించి ఒక పదం చెప్పమంటే ఇలా పరిచయం చేసుకున్న ఈ క్రియేటివ్ గ్యాంగ్ అంతా బ్లాగ్ కమ్యూనిటీకి చెందిన వారు. హైదరాబాద్‌లోని ఈ బ్లాగర్స్ అంతా ఒక చోటికి చేరారు. వీరిలో ట్రావెల్ లవర్స్,
 టెక్నాలజీ, ఈ కామర్స్, స్పిరుట్యువల్, లిటరేచర్, సామాజిక అంశాలు, కథలు ఇలా వివిధ అంశాలపై బ్లాగ్‌లు నిర్వహించే వాళ్లున్నారు. అందరూ తమని తాము డిస్కవర్ చేసుకుంటూనే.. బ్లాగ్స్ ద్వారా సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఒకసారి ఈ బ్లాగర్ గ్యాంగ్ ప్రపంచంలోకి తొంగిచూద్దాం.
 ..:: ఓ మధు
 
వాక్ స్వాతంత్య్రాన్ని బ్లాక్‌మెయిల్ చేయడానికి వాడుతుంటారు కొందరు. అదే హక్కుతో నోటికొచ్చినట్టు పేలుతారు ఇంకొందరు. కానీ ఈ బ్లాగర్స్ మాత్రం.. విలువైన పోస్ట్‌లతో సామాజిక స్పృహను తట్టిలేపుతున్నారు. దేశంలో పేరుకుపోయిన అవినీతి గురించి ప్రజల్లో, ప్రభుత్వాల్లో కదలిక తెచ్చే స్థాయిలో బ్లాగ్స్‌లో చర్చలు జరుగుతున్నాయి. ఇదే కాదు పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలపై స్ఫూర్తినిచ్చే విధంగా ముందుకెళ్తున్నాయి. టెక్నాలజీ, ఎకోలజీ, పాకశాస్త్రం.. ఇలా ఎన్నో అంశాల మీద బ్లాగ్‌లు జ్ఞానాన్ని పంచుతున్నాయి. సోషల్ మీడియా సైట్లు బ్లాగర్స్‌కు హెల్ప్ అవుతున్నాయి. వ్యక్తిగత అభిరుచులు, ఇష్టాలు, నచ్చిన ప్రతిదీ బ్లాగ్‌లో దర్శనమిస్తున్నాయి. అయితే బ్లాగ్‌లో రాసే ముందు జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు సీనియర్ బ్లాగర్స్. మన టార్గెట్ ఏమిటనే స్పష్టత ఉండాలని చెబుతున్నారు.
 
ఎల్లలు లేవు..
 
బ్లాగింగ్ ద్వారా మనం పంచుకున్న చిన్న అభిప్రాయం అయినా ప్రపంచవ్యాప్తం అవుతుంది. ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకోవడానికి ఇంతకన్నా మంచి వేదిక మరొకటి ఉండదు. బ్లాగర్స్‌కు ఎల్లలు లేవు. ప్రదేశం, వయసుతో సంబంధం లేకుండా అందరి వారధిగా ఇది నిలుస్తోంది. సంక్లిష్టమైన విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాయి.
 - ఏప్రిల్ వెల్స్, పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్, యూఎస్ కాన్సులేట్ జనరల్.
 
అప్పుడు అర్థమైంది..
 
‘ఐ రైట్ టు డిస్కవర్ వాట్ ఐ నో..’ఓ ఇంగ్లిష్ రచయిత చెప్పిన కోట్ బ్లాగర్స్‌కి సరిగ్గా వర్తిస్తుంది. ఈ సమాజం మన మీద రుద్దిన అలవాట్లు, విధానాలు మనవి కాదని బ్లాగ్స్ ద్వారా ఆలోచనలను పదును పెట్టినప్పుడే నాకు అర్థం అయింది. నిర్భయ సంఘటన జరిగిన తర్వాత వాయిసెస్ ఫర్ దామిని పేరుతో ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టాను. ఆమె గురించి ఆర్టికల్స్ అన్నీ పంపమని నా బ్లాగ్‌లో పెట్టాను. స్పందించి ఆర్టికల్స్, రైటప్స్ పంపిన వారు అనేకం. ఇలా ఒక అంశం చాలా మందిని చేరడానికి బ్లాగర్స్‌కి అవకాశం సోషల్ మీడియా కల్పిస్తోంది. ట్విట్టర్, ఫేస్‌బుక్ లేకపోతే బ్లాగర్ రాసే విషయాలు స్ప్రెడ్ అయ్యే చాన్స్‌తగ్గిపోయేది.
 - సుభోరప్ దాస్ గుప్తా, సోషల్ యాక్టివిస్ట్, రచయిత
 
సైబర్ ఆక్టివిజమ్..
 
సమాజంపై అవగాహన కల్పించడానికి బ్లాగ్స్ ఇప్పుడు వేదికలవుతున్నాయి. సామాజిక దృక్పథం ఉన్న వాళ్లు.. బ్లాగర్స్‌గా మారి ఆక్టివ్‌గా పనిచేస్తున్నారు. తమ మాటల ద్వారా ఎందరినో మోటివేట్ చేస్తున్నారు. వారి ఆలోచనలను ఆచరణలో పెట్టే మార్గాన్ని కూడా నిర్దేశిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బ్లాగింగ్ అంటే సైబర్ ఆక్టివిజమ్.
 - సుభ్‌బ్రతా దాస్ గుప్తా, 8 విండ్స్ డిజిటల్ మార్కెటింగ్  ప్రొఫెషనల్,
 హైదరాబాద్ బ్లాగర్స్ మీట్ ఆర్గనైజర్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement