
తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఫేస్‌బుక్ పేజీ నుంచి టీడీపీతో పాటు ఇతర పార్టీలకు..
సంగారెడ్డి, సాక్షి: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ అయ్యింది. ఆయన అధికారిక ఫేస్ బుక్ పేజీ నుంచి రకరకాల పోస్టులు పెడుతున్నారు కేటుగాళ్లు. బీజేపీతో పాటు టీడీపీకి సంబంధించినవి, అలాగే.. తమిళనాడులోని రాజకీయ పార్టీలకు చెందిన పోస్టులను వందల సంఖ్యలో పెట్టారు. దీంతో మంత్రి అనుచరులు స్పందించారు. మంత్రి ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి సందేశాలు వస్తే స్పందించవద్దని కార్యకర్తలను కోరుతున్నారు.