hacked
-
సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాక్
దేశంలో రోజురోజుకీ సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా, అధికారులు, కంపెనీలు ఇలా అన్నీ సైబర్లో వలలో చి కుటున్నాయి. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అధికారిక యూట్యూబ్ ఛానల్ శుక్రవారం హ్యాక్‌కు గురైంది. యూట్యూబ్ ఛానల్‌ను హ్యాక్ చేసిన నేరగాళ్లు.. అందులో క్రిప్టో కరెన్సీని ప్రమోట్ చేస్తున్నట్లుగా ఉన్న వీడియోలను పోస్టు చేశారు.సాధారణంగా ఈ యూట్యూబ్ ఛానల్‌ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించే వాటితో పాటు కొన్ని కీలక కేసులను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఆ వీడియోలకు బదులుగా అందులో ప్రస్తుతం అమెరికాకు చెందిన రిపిల్ ల్యాబ్స్ అభివృద్ధి చేసిన క్రిప్టో కరెన్సీ ఎక్స్ఆర్పీని ప్రచారం చేసే వీడియోలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అప్రమత్తమైన సుప్రీంకోర్టు ఐటీ విభాగం చర్యలు చేపట్టింది. -
హైదరాబాద్ మెట్రో X అకౌంట్ హ్యాక్
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. దీనిపై మెట్రో యాజమాన్యం స్పందించింది. ఎలాంటి లింకులపై క్లిక్ చేయొద్దని.. తమ ఎక్స్ అకౌంట్‌ను సంప్రదించేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని కోరింది. త్వరగా ఖాతాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని తెలిపింది.⚠️ Important Notice: Our official Twitter/X account (@ltmhyd) has been hacked. Please avoid clicking any links or engaging with posts until further notice. We're working on it and will update you soon. Stay safe! #landtmetro #metroride #mycitymymetromypride #hyderabadmetro… pic.twitter.com/NiNyNNlN1M— L&T Hyderabad Metro Rail (@ltmhyd) September 19, 2024 -
నటుడి ట్విటర్ ఖాతా హ్యాక్.. ఫ్యాన్స్‌కు హెచ్చరిక!
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ సోషల్ మీడియా ఖాతా ఎక్స్(ట్విటర్ అకౌంట్) హ్యాకింగ్ గురైంది. ఈ విషయాన్ని నటుడు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తన ఖాతా నుంచి ఏదైనా పోస్టులు వస్తే స్పందించవద్దని తెలిపారు. తన అభిమానులు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కాగా.. అర్జున్ రాంపాల్ చివరిసారిగా 'క్రాక్' చిత్రంలో నటించాడు. ప్రస్తుతం సంజయ్ దత్, రణవీర్ సింగ్‌లతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. ఆదిత్య ధర్ హెల్మ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరుగుతోంది. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బీ62 బ్యానర్లపై జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్, ఆదిత్య ధర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Arjun Rampal (@rampal72) -
Bangladesh: పీఎం కార్యాలయం, పోలీస్ వెబ్సైట్ హ్యాక్
బంగ్లాదేశ్‌లో ఉద్యోగ రిజర్వేషన్లపై తీవ్రమైన అశాంతి నెలకొంది. ఈ నేపధ్యంలో తాజాగా ప్రధానమంత్రి కార్యాలయం, సెంట్రల్ బ్యాంక్, పోలీసుల అధికారిక వెబ్సైట్లు హ్యాక్‌నకు గురయ్యాయి. ‘ది ఆర్3 సిస్టన్స్3’ అనే గ్రూప్ ఈ వెబ్సైట్లను హ్యాక్ చేసినట్లు ప్రకటించుకుంది. ‘ఆపరేషన్ హంట్డౌన్, స్టాప్ కిల్లింగ్ స్టూడెంట్స్’ అనే సందేశం హ్యాక్ అయిన ఈ మూడు సైట్లలో కనిపించింది.‘వీరత్వం కలిగిన విద్యార్థులు శాంతియుతంగా నిరసన చేపట్టినప్పటికీ.. ప్రభుత్వం, దాని రాజకీయ మిత్రపక్షాలు చేసిన క్రూరమైన దాడులను వారు ఎదుర్కోవలసి వచ్చింది. ఇది కేవలం నిరసన కాదు, న్యాయం, స్వేచ్ఛ, విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం’ అని హ్యాకర్లు ఆ సందేశంలో పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో, రిజర్వేషన్లలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసనలు నిర్వహిస్తున్నారు. ఇవి హింసాత్మకంగా మారాయి. ఈ హింసాయుత దాడుల్లో 100 మందికి పైగా జనం మృతి చెందారు. మూడు వేల మందికి పైగా జనం గాయపడ్డారు.ఈ హింసాకాండ కారణంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. రైల్వేలు, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. విద్యార్థుల ఆందోళనలను నియంత్రించడానికి ప్రధాని షేక్ హసీనా దేశంలో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించారు. నిరసనకారులు ఎవరైనా కనిపిస్తే కాల్చివేయాలనే ఆదేశాలు కూడా జారీ చేశారు. -
టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్
'సేవ్ ద టైగర్స్', 'సైతాన్' సిరీస్‌లతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న దేవయాని శర్మకు ఇప్పుడు ఊహించని కష్టం వచ్చి పడింది. ఆమె ఉపయోగిస్తున్న ఫోన్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. దీని వల్ల మానసికంగా తాను ఎంతో బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తన నంబర్ నుంచి ఎలాంటి మెసేజ్ వచ్చినా సరే స్పందించొద్దని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.(ఇదీ చదవండి: తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?)దేవయాని ఏం చెప్పింది?'కొన్నిరోజుల క్రితం నా ఫోన్ హ్యాక్ అయింది. నా వ్యక్తిగత సమాచారం అంతా వాళ్ల దగ్గరే ఉంది. అయితే ఇది ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నాకైతే తెలీదు. కానీ ఈ విషయాన్ని ఇప్పుడు చెబుతున్నాను. అలానే నా వాట్సాప్ కూడా హ్యాక్ అయింది. ఎందుకంటే ఫోన్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఒకవేళ నా నంబర్ నుంచి ఎవరికైనా ఎలాంటి మెసేజులు వచ్చినా స్పందించొద్దు. ఎందుకంటే అది నేను కాదు''ఇప్పటికే దీని వల్ల మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను. అలానే మూడుసార్లు ముంబయి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. కాబట్టి నా నంబర్ నుంచి ఎలాంటి మెసేజులు వచ్చిన చేస్తున్నది నేను కాదని అర్థం చేసుకోండి. వీలైనంత త్వరగా ఈ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. అయితే ఇదేదే నా పరువు తీసి, చెడుగా ప్రాజెక్ట్ చేసే ఉద్దేశంతో చేస్తున్నారని అనిపిస్తుంది. మామూలుగానే ఆర్టిస్ట్ జీవితం కష్టంగా ఉంటుంది. ఇలాంటి వాటితో మరింత కష్టంగా మారుతోంది' అని దేవయాని తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. (ఇదీ చదవండి: ఆ మాట అనగానే నాకు కోపం వచ్చేసింది: అల్లు అర్జున్) -
స్విగ్గీ అకౌంట్‌తో రూ.97 వేలు మాయం చేశారు - ఎలా అంటే?
ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ యాప్ స్విగ్గీ ఖాతాలను హ్యాకింగ్ చేసి ప్రజలను మోసగిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. హర్యానాలోని గురుగ్రామ్ నివాసితులైన అనికేత్ కల్రా (25), హిమాన్షు కుమార్ (23) సుల్తాన్‌పూర్‌కు చెందిన ఒక మహిళ స్విగ్గీ అకౌంట్‌ను హ్యాక్ చేసి సుమారు లక్ష రూపాయలు కాజేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు సామాన్య డెలివరీ బాయ్స్.. స్విగ్గీ ఖాతాలను హ్యాక్ చేయడానికి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (IVR) సిస్టం ఉపయోగించి ఓ మహిళకు ఫోన్ చేసి.. స్విగ్గి అధికారులమని నమ్మించి ఆమె యూజర్ నేమ్, పాస్వర్డ్ వంటివి తెలుసుకున్నారు. అకౌంట్ డీటైల్స్ తెలుసుకున్న తరువాత సుమారు రూ. 97 వేలు మాయమయ్యాయి. అకౌంట్ నుంచి భారీగా డబ్బులు కట్ అవుతుండటం గుర్తించిన మహిళ పోలీసులకు పిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దీనిపైన సమగ్ర విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్విగ్గీ అకౌంట్స్ హ్యాచ్ చేసి తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించేవారు. వచ్చిన డబ్బును చట్టబద్దమైన లావాదేవీలుగా మార్చుకోవడానికి వారు పనిచేసే మెడికల్ షాపుకు వచ్చిన వ్యక్తులకు ఇచ్చి వారి యూపీఐ ఐడీల ద్వారా తమ అకౌంట్లలో పడేలా చేసుకునే వారు. -
ఎమ్మెల్సీ కవిత సోషల్‌మీడియా అకౌంట్స్ హ్యాక్!
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్‌కు గురయ్యాయి. ఈ విషయాన్ని ఆమె తన ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘సైబర్ నేరగాళ్లు మంగళవారం నాడు రాత్రి 10 గంటల నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు వరుసగా పలుసార్లు నా సోషల్ మీడయా ఖాతాల హ్యాకింగ్‌కు యత్నించారు. అనుమానాస్పదంగా లాగిన్ అయ్యి దుండగులు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సంబంధం లేని ఒక వీడియోను పోస్టు చేశారు’ అని ఆమె పేర్కొన్నారు. My social media account experienced a brief unauthorized access. The suspicious activities and contents during this time do not reflect our values. Security measures have been reinforced, and we will observe a downtime to ensure security and we appreciate your understanding as my… — Kavitha Kalvakuntla (@RaoKavitha) January 17, 2024 అయితే వెంటనే గుర్తించిన కవిత తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్‌కు గురైనట్లు ‘ఎక్స్’ ద్వారా వెల్లడిస్తూ.. డీజీపీకి, సైబర్ సెక్యూరిటీ విభాగానికి ట్యాగ్ చేశారు. సోషల్ మీడియా ఖాతాలను పూర్తి స్థాయిలో తిరిగి పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. చదవండి: Congress: ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. అద్దంకి దయాకర్‌కు ఝలక్ -
గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
సాక్షి, హైదరాబాద్: రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులకు చెందిన ట్విట్టర్ అకౌంట్లు ఇటీవల వరుసగా హ్యాకింగ్‌కు గురవుతున్నాయి. ఈ అకౌంట్లను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు డీపీలు మార్చడం, సంబంధం లేని పోస్టులు పెడుతున్నారు. గతంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మాజీ మంత్రి కేటీఆర్ ట్వీటర్ అకౌంట్లు కూడా హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. మొన్న తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ చేసిన కేటుగాళ్లు.. తాజాగా గవర్నర్ తమిళిసై ట్విట్టర్(ఎక్స్) అకౌంట్ హ్యాక్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులకు రాజ్‌భవన్ అధికారులు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్బుక్ పేజ్ హ్యాక్
సంగారెడ్డి, సాక్షి: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ అయ్యింది. ఆయన అధికారిక ఫేస్ బుక్ పేజీ నుంచి రకరకాల పోస్టులు పెడుతున్నారు కేటుగాళ్లు. బీజేపీతో పాటు టీడీపీకి సంబంధించినవి, అలాగే.. తమిళనాడులోని రాజకీయ పార్టీలకు చెందిన పోస్టులను వందల సంఖ్యలో పెట్టారు. దీంతో మంత్రి అనుచరులు స్పందించారు. మంత్రి ఫేస్బుక్ అకౌంట్ నుంచి సందేశాలు వస్తే స్పందించవద్దని కార్యకర్తలను కోరుతున్నారు. -
ఏపీ: వైఎస్సార్సీపీ ట్విటర్ అకౌంట్ హ్యాక్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్ర ప్రదేశ్ అధికార పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్ గురైంది. ప్రొఫైల్పిక్, కవర్ పిక్‌లను మార్చేశారు హ్యాకర్లు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్విటర్ పేజీలో క్రిప్టో పోస్టులు చేశారు దుండగులు. రంగంలోకి దిగింది వైఎస్సార్సీపీ టెక్నికల్ టీం. ఈ ఘటనపై ట్విటర్ యాజమాన్యానికి వైఎస్ఆర్సీపీ ఐటీ సిబ్బంది ఫిర్యాదు చేశారు. పలు ట్వీట్లను రీట్వీట్లు సైతం చేస్తున్నారు హ్యాకర్లు. -
మరోసారి విష్ణుప్రియ ఫేస్బుక్లో అశ్లీల వీడియోలు కలకలం! ‘ఎందుకిలా చేస్తోంది?’
యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సుడిగాలి సుధీర్‌తో కలిసి ఓ షోకు యాంకర్‌గా వ్యవహరించిన ఆమె ప్రస్తుతం సినిమాలతో బిజీగా మారింది. మరోవైపు నెట్టింట ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన లేటెస్ట్ హాట్‌హాట్ ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా షేక్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల ఆమె ఫేస్బుక్ పేజీలో అశ్లీల ఫొటోలు దర్శనం ఇచ్చిన సంగతి తెలిసిందే. అవి చూసి అంత షాక్ ఒక్కసారిగా అయ్యారు. విష్ణు ప్రియ ఎంటి ఇలాంటి ఫొటోలు షేర్ చేసిందంటూ ఆశ్చర్యపోయారు. చదవండి: ‘జాతిరత్నాలు’ సమయంలో డైరెక్టర్ నిన్ను కొట్టారా? క్లారిటీ ఇచ్చిన ఫరియా చివరకు తన ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందని, తన పేజీని అన్‌ఫాలో చేయాల్సిందిగా ఆమె తన ఫాలోవర్స్‌కు సూచించింది. అయితే అంతా బాగుందని అనుకుంటున్న తరుణంలో మళ్లీ తన పేజీలో న్యూడ్ వీడియోలు దర్శనం ఇచ్చాయి. దీంతో తన స్నేహితులు, బంధువుల నుంచి ఆమెకు వరుసగా ఫోన్‌కాల్స్ వచ్చాయట. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావడం లేదు. ఇలాటే నా స్నేహితులు, బంధువులు ఫోన్ చేసి ఫేస్బుక్లో ఆ వీడియోలు ఎంటని అడుగుతున్నారు. అవి నేను పోస్ట్ చేసినవి కాదు. చదవండి: ‘గాడ్ ఫాదర్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్? పదే పదే నా అకౌంట్‌ను ఎందుకు హ్యాక్ చేస్తున్నారో అర్థం కావడం లేదు, నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు’ అంటూ తన స్నేహితుల వద్ద ఆమె వాపోయిందట. కాగా ఆమె ఫేస్బుక్ పేజీతో తరచూ అశ్లీల వీడియోలు పోస్ట్ అవుతూనే ఉన్నాయట, అప్పటి నుంచి ఆమె ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇంత జరుగుతున్న విష్ణు ప్రియ ఎందుకు సైలెంట్‌గా ఉంటుందని, ఎందుకు సైబర్ క్రైమ్‌ని ఆశ్రయించడం లేదని.. తన పేజీని ఎందుకు డిలిట్ చేయడం లేదంటూ నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
డేంజర్లో ఫేస్బుక్ ఖాతాలు: డక్టైల్ మాల్వేర్ కొత్త వెర్షన్
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్బుక్ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్. ఫేస్బుక్ బిజినెస్ ఖాతాలు కొత్త మాలావేర్ దాడికి గురయ్యాయి. డక్టైల్ మాల్వేర్ కొత్త పీహెచ్‌పీ వెర్షన్‌తో వినియోగదారులనుప్రమాదంలో నెట్టేసింది. పలు బిజినెస్ ఖాతాలు హ్యాకింగ్గు గురైనట్టు తెలుస్తోంది. దీనిపై క్లౌడ్ సెక్యూరిటీ క ంపెనీ తాజా హెచ్చరికలు జారీచేసింది. క్లౌడ్ సెక్యూరిటీ కంపెనీ, ZScaler అక్టోబర్ 13న తన బ్లాగ్ పోస్ట్‌లో ఈ కొత్త వాలావేర్ గురించి నివేదించింది. ఫ్రీ, క్రాక్డ్ అప్లికేషన్ ఇన్‌స్టాలర్‌గా ఆయా ఖాతాల్లోకి జొర పడుతోందని తెలిపింది. ఈ కొత్త పీహెచ్‌పీ డక్టైల్ మాల్వేర్, యూజర్ల ఇమెయిల్ అడ్రస్‌లు, పేమెంట్ రికార్డ్‌లు, ఫండింగ్ సోర్స్‌లు అకౌంట్ స్టేటస్‌లలో చెల్లింపు సమాచారం కూడా దృష్టి సారించింది. అంతేకాదు ఇది పేజీలను మార్చగలదు.. కీలక ఆర్థిక సమాచారాన్ని యాక్సెస్ చేయగలదని, ఫేస్‌బుక్‌తో పాటు టెలిగ్రామ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాప్స్ సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌లను కూడా లక్ష్యంగా చేసుకుందని కంపెనీ వెల్లడించింది. గతంలో ఉపయోగించిన డక్టైల్ డాట్నెట్ బైనరీకి బదులుగా తాజాగా దీన్ని సైబర్ నేరగాళ్లు పీహెచ్‌పీ మార్చారని పేర్కొంది. యాప్‌ను ఇన్స్టాల్ చేసిన తర్వాత, అప్లికేషన్ కంపాటబిలిటీని చెక్ చేసే నెపంతో, రెండు.tmp ఫైల్స్ జనరేట్ చేస్తున్నట్టు గుర్తించినట్టు తెలిపింది. అయితే ఈ రెండు డక్టైల్ వెర్షన్లు అత్యంత ప్రమాదకర మైనవని సూచించింది. ఇవి హానికరమైన కోడ్‌ను యూజర్ల ఖాతాలో వదిలి, దీని తరువాత, డేటా చోరీ చేస్తోందని వివరించింది. పుర్రె ఆకారంలో ఉండే కంప్యూటర్ కోడ్ డక్టైల్ మాలావేర్ను 2021లో తొలిసారి గుర్తించారు. డక్టైల్ ఇన్ఫోస్టీలర్ కీలకమైన డేటాను యాక్సెస్ చేయడం ద్వారా ఆర్థిక నష్టాన్ని కలిగించే అవకాశంకూడా ఉందని, ప్రొటెక్టివ్ లాగిన్ మెజర్స్ తీసుకున్న ఖాతాలు కూడా ప్రమాదంలో పడవచ్చని హెచ్చరిచింది. పీహెచ్‌పీ ఇన్ఫోస్టీలర్తో వినియోగ దారుల సమాచారం ఇప్పటికీ ప్రమాదంలో ఉందని తెలిపింది. -
జేఈఈ పేపర్ లీక్ కేసు: రష్యన్ వ్యక్తి అరెస్టు
న్యూఢిల్లీ: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) పేపర్ లీక్ కేసులో రష్యన్ వ్యక్తి ప్రమేయం ఉందన్న ఆరోపణలతో సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) అదుపులోకి తీసుకుంది. సదరు రష్యన్ వ్యక్తిని మిఖాయిల్ షార్గిన్‌గా అధికారులు గుర్తించారు. నిందితుడు జేఈఈ మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఉపయోగించే ఐలియన్ సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్ చేయడంలో సహకరించినట్లు సీబీఐ పేర్కొంది. మిఖాయిల్ కజికిస్తాన్‌లోని అల్మాటీ నుంచి భారత్‌కు వచ్చేందుకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావడంతో ఇమ్మిగ్రేషన్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతేగాదు జేఈఈ మెయిన్స్‌తో సహా వివిధ ఆన్లైన్ పరీక్షల్లో కొందరు విదేశీయులు కుమ్మక్కై హ్యాకింగ్‌లకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలిందని సీబీఐ వెల్లడించింది. ఈ మేరకు సీబీఐ మాట్లాడుతూ... జేఈఈ మెయిన్స్ 2021 పరీక్షను నిర్వహించే ఐలియన్ సాఫ్ట్‌వేర్‌ను మిఖాయిల్ షార్గిన్ హ్యాక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సాఫ్ట్‌వేర్‌ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) రూపొందించింది. పరీక్ష సమయంలో అనుమానిత అభ్యర్థుల కంప్యూటర్ సిస్టమ్‌ను హ్యాక్ చేయండలో ఈ నిందితులు సహకరించినట్లు తేలింది. దీంతో అతనికి నోటీసులు జారి చేసినట్లు పేర్కొంది. (చదవండి: విమానం గగనతలంలో ఉండగా బాంబు బెదిరింపు...దెబ్బకు నాన్ స్టాప్‌గా ప్రయాణించిన విమానం) -
యూపీ CMO ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన హ్యాకర్లు
-
యూపీ సీఎంవో ట్విటర్ అకౌంట్ హ్యాక్
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయపు అధికారిక ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్ గురైంది. హ్యాకింగ్‌కు పాల్పడ్డ దుండగలు.. అకౌంట్ టైం లైన్‌పై కోతి చేష్టలకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఇది జరిగినట్లు అధికారులు వెల్లడించారు. వందల మంది ట్విటర్ యూజర్లను ట్యాగ్ చేస్తూ సీఎంవో ట్విటర్ టైం లైన్‌పై పోస్టులు చేశారు హ్యాకర్లు. అటుపై ఆకతాయిలు కోతి బొమ్మను అకౌంట్ ప్రొఫైల్ ఫొటోగా మార్చేసి.. మరీ ఈ పనికి పాల్పడ్డారు. వెంటనే దీంతో అందుకు సంబంధించిన పోస్టుల స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి. అయితే విషయం గమనించిన ప్రభుత్వ సాంకేతిక సిబ్బంది.. వెంటనే అకౌంట్‌ను పునరుద్ధరించారు. హ్యాకర్లు పోస్ట్ చేసిన ట్వీట్లను డిలీట్ చేసి.. ఘటనపై విచారణకు ఆదేశించారు. -
పరీక్షల్లో ఫెయిలవ్వొద్దు అన్నందుకు తండ్రి హత్య! ట్విస్ట్ ఏంటంటే?
Scared of rebuke for failing exams: తల్లిదండ్రులు మందలించారనో లేకు తాము అడిగింది కొనివ్వటం లేదనో కన్న తల్లిదండ్రుల పై కక్ష సాధించే ప్రబుద్ధులను చూస్తూనే ఉన్నాం. అంతెందుకు దురాలవట్లకు బానిసై చెడు మార్గంలో పయనిస్తున్న పిల్లలను సరైన మార్గంలో పెట్టే నిమిత్తం కాస్త కఠినంగా వ్యవహరించినందుకే తల్లిదండ్రులనే హతమార్చే కిరాతక పిల్లల గురించి విన్నాం. అచ్చం అలానే మధ్యప్రదేశ్‌లోని ఒక బాలుడు దారుణమైన నేరానికి ఒడిగట్టాడు. వివరాల్లోకెళ్తే... మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాకు చెందిన 10వ తరగతి విద్యార్థిని అతని తండ్రి పరీక్షల్లో ఫెయిల్ అయితే ఇంటి నుంచి గెంటేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆ విద్యార్థి తాను పరీక్షల్లో ఫెయిల్ అయితే కచ్చితంగా ఇంటి నుంచి గెంటేయడం ఖాయం అన్న భయంతో తండ్రిని గొడ్డలితో నరికి చంపేశాడు. ఆ బాలుడు నేరం చేయడమే కాకుండా ఈ హత్య నేరంలో తమ పక్కంటివాళ్లను ఇరికించేందుకు యత్నించాడు. అంతేకాదు తమ పక్కింటివాళ్లే తన తండ్రిని చంపారని, తాను చూశానని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అయితే ఫోరెన్సిక్ విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు బాలుడిని విచారించగా తానే నేరం చేసినట్లు అంగీకరించడు. ఫైనల్ పరీక్షలు సరిగ్గా చదవలేదని అందువల్ల ఫెయిల్ అవుతానని భయపడ్డానని ఆ బాలుడు చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రాజీవ్ మిశ్రా ఆ బాలుడు తన తండ్రి నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో చంపాడని తెలిపారు. ప్రస్తుతం ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి, అక్కడి నుంచి జువైనల్ హోంకు తరలించినట్లు తెలిపారు. (చదవండి: జైలు నుంచి విడుదలై బాలిక కోసం గాలింపు.. ఇంట్లో తెలియడంతో..) -
హీరోయిన్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్, అప్రమత్తం చేసిన యామీ
సెలెబ్రిటీలు, హీరోలు, హీరోయిన్లు ఇలా చాలా మంది సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్‌గా ఉంటారు. తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని నేరుగా నెట్టింట అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు. ఒక్కోసారి సాధారణ ప్రజలతో పాటు సెలెబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు కూడా హ్యాకింగ్‌కు గురవుతుంటాయి. ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీలు కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నారు. ఈ మధ్య కాలంలో ఇది సాధారణ విషయయే అయినప్పటికీ ఇలాంటి వాటి పట్ల అప్రమత్తత లేకపోతే ఎలాంటి నష్టమైన జరగొచ్చు. గతంలో ఎంతోమంది స్టార్ హీరోయిన్ల అకౌంట్లను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేసి డబ్బు వసూలు చేయడం, తప్పుడు సమాచారం ప్రసారం చేయడం చేస్తుంటారు. చదవండి: అందుకే ‘ఆదిపురుష్’గా ప్రభాస్ పర్ఫెక్ట్ యాప్ట్: ఓం రౌత్ అందుకే ముందు జాగ్రత్తగా తమ ఫాలోవర్స్‌ను వారు అప్రమత్తం చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ కూడా తన ఫ్యాన్స్‌ను, ఫాలోవర్స్‌ను అలర్ట్ చేసింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయినట్లు వెల్లడించింది. దీనిపట్ల అందరు అప్రమత్తంగా ఉండాలని, తన ఖాతా నుంచి వచ్చిన ఎలాంటి పోస్ట్, ప్రకటనలకు స్పందించవద్దని పేర్కొంది. ప్రస్తుతం ఆమె టీం దీనిపై వర్క్ చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేసింది. కాగ ఇటీవల పెళ్లి చేసుకున్న యామీ ప్రస్తుతం దస్వీ మూవీతో బిజీగా ఉంది. అభిషేక్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. దీనితో పాటు ఆమె ‘ఓ మై గాడ్ సిక్వెల్’లో కూడా నటిస్తోంది. Hi, This is to inform you all that I've been unable to access my Instagram account since yesterday, it's probably hacked. We're trying to recover it as soon as possible. Meanwhile, if there is any unusual activity through my account, please be aware of it. Thank you! — Yami Gautam Dhar (@yamigautam) April 3, 2022 -
'టెంపర్' బ్యూటీ ఇన్‌స్టా అకౌంట్ మాయం.. అసలు సంగతి ఏంటంటే ?
Nora Fatehi Return To Instagram After Hacking Attempt: బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహీ తన క్రేజీ బాడీ మూమెంట్స్‌తో మెస్మరైజ్ చేస్తుంది. స్పెషల్ సాంగ్స్‌లో ప్రత్యేకంగా కనిపించడమే కాకుండా తన ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ప్రత్యేక గీతాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోస్, వీడియోస్‌తో అభిమానులను ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తుంది. అలాంటిది నోరా ఫతేహి ఇన్‌స్టా అకౌంట్ ఒక్కసారిగా మాయమైపోయింది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన సంఘటనతో నోరా ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. నోరానే తన ఇన్‌స్టా పేజీని డిలీట్ చేసిందని భావించారు. అయితే అదే రోజు రాత్రి అయ్యేసరికి అసలు విషయం తెలిసింది. తన అకౌంట్ ఎవరో హ్యాక్ చేయడానికి ప్రయత్నించారని తెలిపింది నోరా. శుక్రవారం రాత్రి మళ్లీ తన పేజీ రీస్టోర్ అయిందని పేర్కొంది. 'అందరికీ సారీ. నా ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసేందుకు ఉదయం నుంచి ప్రయత్నించారు. కానీ ఈ సమస్యను త్వరగా పరిష్కరించారు. వారి టీమ్‌కు ధన్యవాదాలు.' అని రీస్టోర్ అయిన అకౌంట్లో పోస్ట్ షేర్ చేసింది ముద్దుగుమ్మ. నోరా ఫతేహీకి ఇన్‌స్టాలో 37 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల నోరా ఫతేహి పులి పిల్లలకు ఆహారం పెడుతున్న వీడియో పోస్ట్ చేశాక అకౌంట్ హ్యాక్ అయింది. 'బాహుబలి', 'టెంపర్' తదితర సినిమాల్లో నోరా ఐటమ్ సాంగ్స్‌లో అలరించిన సంగతి తెలిసిందే. -
హ్యాకింగ్ బారిన పడిన సెలబ్రిటీలు వీళ్లే..
Celebrities List Who Have Been Affected By Hacking: సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చాలా యాక్టివ్‌గా ఉంటారు. తమకు సంబంధించిన విషయాలు, మెమోరెబుల్ సంఘటనలను ట్విటర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకుంటూ టచ్‌లో ఉంటారు. ఈ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులకు దగ్గరవుతుంటారు. కామెంట్స్ రూపంతో సెలబ్రిటీలతో వారి ఫ్యాన్స్ కూడా ఇంటరాక్ట్ అవుతుంటారు. అయితే తారలకు, అభిమానులకు అనుసంధానంగా ఉన్న ఈ సామాజిక మాధ్యామాలకు హ్యాకర్ల బెడద తక్కువేమి కాదు. ఇప్పటివరకు అనేకమంది ప్రముఖ సినీ సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్‌ను హ్యాక్ చేశారు కొందరు ఆకతాయిలు. హ్యాక్ చేసి తమకు నచ్చినట్లుగా అసభ్యకర పోస్టులు, వీడియోలు, కామెంట్స్ పెడుతూ తారలను ఇబ్బందులకు గురి చేస్తారు. ఇలా సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్‌కు గురై ఇబ్బందులపాలైన సెలబ్రిటీలు వీళ్లే. అమితాబ్ బచ్చన్ పవన్ కల్యాణ్ పూజా హెగ్డె టబు వరలక్ష్మీ శరత్ కుమార్ అమృత అయ్యర్ అవికా గోర్ ఈషా రెబ్బా మేఘా ఆకాష్ అమీ జాక్సన్ అమృతా రావు ఇషా డియోల్ యాంకర్ గాయత్రి భార్గవి విద్యుల్లేఖ -
అవును.. నా అకౌంట్ హ్యాక్ అయింది.. ఆ హీరోయిన్ ట్వీట్
Amritha Aiyer Instagram Has Been Account Hacked: ప్రముఖ సినీ సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్‌ను హ్యాక్ చేస్తుంటారు కొందరు ఆకతాయిలు. అలా హ్యాక్ చేసి తమకు నచ్చినట్లుగా అసభ్యకర పోస్టులు, వీడియోలు షేర్ చేయడమే కాకుండా ఇబ్బందికరంగా ఉండే కామెంట్స్ కూడా పెడుతుంటారు. ఇలా హ్యాక్ గురైన సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు. ఈ హ్యాక్‌కు గురైనా తారల్లో బుట్టబొమ్మ పూజా హెగ్డె, టబు, ఇషా డియోల్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు ఉన్నారు. తాజాగా వీరి జాబితాలో మరో యంగ్ హీరోయిన్ చేరింది. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాతో పాపులర్ అయిన అమృత అయ్యర్ ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపింది. తన అకౌంట్ మళ్లీ తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు అమృత ట్వీట్ చేసింది. ప్రస్తుతానికైతే హ్యాక్‌కు గురైన అమృత ఇన్‌స్టా అకౌంట్ నుంచి ఎలాంటి అసభ్యకర పోస్టులు రాలేదని తెలుస్తోంది. Yes ! my Instagram has been Hacked 😞 hope it gets recovered 🙏🏻 Will come back soon . — Amritha (@Actor_Amritha) February 1, 2022 -
వాటిని పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటే..కొంప కొల్లేరే
మనలో చాలా మంది ఇంట్లో వాళ్ల పేర్లు, డేటా ఆఫ్ బర్త్‌లు నచ్చిన నెంబర్లను పాస్‌వర్డ్‌లుగా ఉపయోగిస్తుంటాం. మరికొందరు సైబర్ నేరస్తుల నుంచి సేఫ్‌గా ఉండేందుకు 123లు, abcdలను పాస్‌వర్డ్‌లుగా మార్చేస్తుంటారు. వారిలో కొంతమంది మాత్రం వాళ్లకు నచ్చిన హీరోల పేర్లను పాస్‌వర్డ్‌లుగా పెట్టుకుంటుంటారు. అలా పెట్టుకోవడం చాలా ప్రమాదమని కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. హీరోల పేర్లు పాస్‌వర్డ్‌లుగా పెట్టుకుంటే 'దొంగ చేతికి తాళం' ఇచ్చిట్లవుతుందని తేలింది. మోజిల్లా ఫౌండేషన్ సంస్థ పాస్‌వర్డ్‌లపై రీసెర్చ్ నిర్వహించింది. ఆ రీసెర్చ్‌లో భాగంగా Haveibeenpwned.comలో దొరికిన వివరాల ఆధారంగా పలు ఆసక్తికర విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. ముఖ్యంగా సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, వోల్వరైన్, ఐరన్ మ్యాన్, వండర్ ఉమెన్, డేర్ డెవిల్, థోర్, బ్లాక్ విడో, బ్లాక్ పంతార్ పేర్లను పెట్టుకున్న వారి అకౌంట్లు ఈజీగా హ్యక్ అయినట్ల వెల్లడించింది. వీరితో పాటు క్లార్క్ కెంట్, బ్రూసీ వ్యాన్, పీటర్ పార్కర్, హీరోల పేర్లతో పాటు ఫస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, 12345, ఏబీసీడీలను పాస్‌వర్డ్‌లుగా పెట్టుకోవద్దని హెచ్చరించింది. అలా పెట్టుకున్న వారి అకౌంట్లు హ్యాక్ అయినట్లు స్పష్టం చేసింది. మరి ఎలాంటి పాస్వర్డ్లు పెట్టుకోవాలి హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఉండాలంటే స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను పెట్టుకోవాలని మోజిల్లా ఫౌండేషన్ తెలిపింది. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్‌తో పాటు '@#$*' ఇలా క్లిష్టమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోవాలని సూచించింది. మోస్ట్ డేంజరస్ పాస్వర్డ్లు ఇవే ఇక తాము నిర్వహించిన రీసెర్చ్‌లో '12345', '54321' పాస్వర్డ్లు అత్యంత ప్రమాదకరమని మోజిల్లా ప్రతినిధులు తెలిపారు. 2020లో పాస్వర్డ్ మేనేజర్ అయిన 'నార్డ్ పాస్' ప్రకారం '123456' మోస్ట్ డేంజరస్ పాస్వర్డ్ అని తెలిపింది. ఈ పాస్‌వర్డ్‌ను ఉపయోగించిన అకౌంట్లను హ్యాకర్లు 23 మిలియన్ల సార్లు హ్యాక్ చేసినట్లు వెల్లడించింది.'123456789' లను పాస్‌వర్డ్‌లుగా పెట్టుకుంటే సెకన్ల వ్యవధిలో హ్యాక్ చేస్తారని నార్డ్ పాస్ తన నివేదికలో పేర్కొంది. చదవండి: 18 వందల కోట్ల పాస్‌వర్డ్‌లపై దాడులు..! కొత్త వ్యూహంతో మైక్రోసాఫ్ట్..! -
మొబైల్ నెట్వర్క్ యూజర్ల డేటా లీక్.!
వాషింగ్టన్: సుమారు పదికోట్ల మొబైల్ నెట్వర్క్ యూజర్ల డేటాను హ్యాకర్లు దొంగిలించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన రెండో అతిపెద్ద టెలికాం సంస్థ టీ-మొబైల్ యూజర్ల డేటాను డార్క్‌వెబ్‌లో హ్యాకర్లు విక్రయానికి ఉంచినట్లు తెలుస్తోంది. పదికోట్ల మంది యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని హాక్ చేసినట్లు వస్తోన్న వార్తలపై దర్యాప్తు చేయనున్నట్లు టీ-మొబైల్ ప్రకటించింది. (చదవండి: Apple: ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్..!) వినియోగదారుల ఫోరమ్‌లో యూజర్ల డేటా హ్యాక్‌కు గురైన్నట్లు వస్తున్న క్లెయిమ్స్‌ను కంపెనీ పరిశీలిస్తుందని, వాటిని వెంటనే పరిష్కారిస్తామని టీ-మొబైల్ ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. టీ-మొబైల్ వినియోగదారుల డేటా హ్యక్కు గురైనట్లు మొదటిసారిగా వైస్‌కు చెందిన మదర్బోర్డ్ టెక్ న్యూస్ వెబ్సైట్ వెల్లడించింది. కస్టమర్ల పేర్లు, చిరునామాలు, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను హ్యాకర్లు డార్క్ వెబ్‌లో ఉంచినట్లు మదర్బోర్డ్ పేర్కొంది. జూన్ చివరి నాటికి టీ-మొబైల్ 26 మిలియన్ పోస్ట్‌పెయిడ్ ఖాతాలను, 84 మిలియన్ల మొబైల్ నెట్వర్క్ కనెక్షన్లను టీ-మొబైల్ కలిగి ఉంది. (చదవండి: సరికొత్త రికార్డు సృష్టించిన టీసీఎస్) -
ఖుష్బూ ట్విటర్ అకౌంట్ మళ్లీ హ్యాక్.. బ్రియాన్‌గా పేరు మార్పు
Khushbu Sundar Twitter Account Hacked: నటి, తమిళనాడు బీజేపీ నాయకురాలు ఖుష్బూ సందర్ ట్విటర్ మరోసారి హ్యాకింగ్‌కు గురైంది. ఈ సారి హ్యాకర్లు ఆమె అకౌంట్ పేరును బ్రియాన్‌గా మార్చారు. అలాగే కవర్ ఫోటోని కూడా మార్చేశారు. గతంలో ఆమె చేసిన ట్వీట్లన్నీ తొలగించారు. గతేడాది ఏప్రిల్‌లోనూ ఆమె అకౌంట్‌ను ఇలాగే ఎవరో హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తన ఫాలోవర్స్‌కి తెలియజేసింది. గతంలో ఇలా జరిగినప్పుడు ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు చెప్పింది. 48 గంటల నుంచీ తాను పాస్వర్డ్ మార్చడానికి ప్రయత్నిస్తున్నా కుదరడం లేదని, సాయం చేయాలని ఫ్యాన్స్‌ను కోరింది. View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
అలర్ట్! భారీగా తమిళనాడు ప్రజల డేటా హ్యాక్
తమిళనాడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(పీడీఎస్) డేటా దొంగలించబడింది. దాదాపు 50 లక్షల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారంతో కూడిన డేటాను హ్యాకర్ ఫోరంలో అప్ లోడ్ చేసినట్లు బెంగళూరుకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ టెక్నిశాంక్ తెలిపింది. లీక్ చేయబడ్డ డేటాలో ఆధార్ నెంబర్లు అదేవిధంగా లబ్ధిదారుల సున్నితమైన వివరాలు, వారి కుటుంబ సమాచారం, మొబైల్ నెంబర్లతో సహా ఉన్నాయి. హ్యాకర్లు ఫిషింగ్ దాడుల కోసం ఈ లీక్ చేసిన డేటాను ఉపయోగించవచ్చు. రాష్ట్రంలోని పెద్ద వ్యక్తుల నుంచి నిస్సహాయ ప్రజలను సైబర్ దాడులు జరిగే అవకాశం ఉంది. అయితే, డేటా హ్యాక్ కావడంపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా బహిరంగంగా ధృవీకరించలేదు. డార్క్ వెబ్ లో లీక్ అయిన డేటాలో తమిళనాడులో మొత్తం 49,19,668 మంది సమాచారం ఉందని సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ తెలిపింది. దీనిలో 3,59,485 ఫోన్ నంబర్లతో ప్రభావిత వినియోగదారుల చిరునామాలు, ఆధార్ నంబర్ల కూడా ఉన్నట్లు ఉంది. లీక్ డ్ డేటా ఫీల్డ్ లలో నవజాత శిశువులతో సహా పౌరులందరి డేటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మక్కల్ నంబర్' కూడా ఉన్నట్లు పేర్కొంది. హ్యాక్ అయిన డేటాలో లబ్ధిదారుల కుటుంబ సభ్యుల వివరాలు ఉన్నాయి. ఈ విషయాన్ని మొదట ది వీక్ నివేదించింది. తమిళనాడు ప్రభుత్వంతో సంబంధం ఉన్న వెబ్ సైట్ లేదా ఎక్కడి నుంచి డేటా హ్యాక్ అయ్యింది అనేది ప్రస్తుతం అస్పష్టంగా ఉంది. తమిళనాడు పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ విభాగం పోర్టల్ లో డ్యాష్ బోర్డ్ పీడీఎస్ వ్యవస్థ కోసం 6.8 కోట్లకు పైగా రిజిస్టర్డ్ లబ్ధిదారులు ఉన్నట్లు చూపిస్తుంది. బెంగళూరుకు చెందిన టెక్నిశాంక్ట్ సీఈఓ నందకిశోర్ హరికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. లీక్ అయిన డేటాను జూన్ 28న అప్ లోడ్ చేసినట్లు తెలిపారు. ఈ డేటాను కనుగొన్న కొద్దిసేపటికే ఈ హ్యాక్ అయిన డేటా గురుంచి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్ టీ-ఇన్)కు నివేదించినట్లు టెక్నిశాంక్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. హ్యాక్ అయిన వివరాలకు సంబంధించి తమిళనాడు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ సైబర్ స్పందించి, నివేదికను దర్యాప్తు కోసం ఫార్వర్డ్ చేసినట్లు ధృవీకరించినట్లు హరికుమార్ చెప్పారు. తమిళనాడు పౌర సరఫరాలు & వినియోగదారుల రక్షణ విభాగం (tnpds.gov.in) వెబ్ సైట్ సైబర్ దాడికి గురైనట్లు, "1945వీఎన్" అనే సైబర్ క్రిమినల్ గ్రూప్ హ్యాక్ చేసినట్లు టెక్నిశాంక్ట్ పేర్కొంది. గత డిసెంబర్ లో గాడ్జెట్స్ 360 తెలంగాణ ప్రభుత్వ సైట్ లో ఒక లోపం ఉన్నట్లు పేర్కొంది. ఈ లోపం వల్ల ఉద్యోగుల, పెన్షనర్ల సున్నితమైన డేటాను బహిర్గతం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. చదవండి: చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ కేసుపై స్పందించిన ట్విటర్ -
Phone Hacking : మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా? గుర్తించండిలా?!
రోజు రోజుకి టెక్నాలజీ అభివృద్ది చెందుతుంది. అయితే అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే నష్టాలు ఉన్నాయని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మనం వాడే గాడ్జెట్స్ అంటే మొబైల్స్, కంప్యూటర్, స్మార్ట్ వాచెస్ వినియోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని అంటున్నారు. చదవండి: దేశంలో ఇళ్ల ధరలు పెరిగాయ్ ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగిపోయింది. కానీ వినియోగదారులు ఒక్కోసారి పూర్తిగా అవగాహాన లేకుండా ఫోన్ వినియోగించడంతో హ్యాకర్స్ దీన్ని అస్త్రంగా మార్చుకుంటున్నారు. భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయడం, లేదంటే వ్యక్తిగత సమాచారాన్ని బహిర్ఘతం చేసి రోడ్డు కీడ్చుతున్నారు. ఇలాంటి సమయాల్లో ఫోన్‌ను హ్యాక్ అయ్యేందో? లేదో తెలుసుకొని అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని టెక్ నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇప్పుడు మన ఫోన్ హ్యాక్ అయ్యిందో? లేదో? తెలుసుకుందాం. హ్యాక్ అయిన ఫోన్ గుర్తించండి ఇలా!: ♦మీరు ఫోన్‌ను జాగ్రత్తగానే ఉంచుకుంటారు. కానీ ఒక్కోసారి బ్యాటరీ ఛార్జీంగ్ అయిపోతుంది. అలా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోవడానికి కారణం హ్యాకింగ్‌కు గురైందని అర్ధం చేసుకోవాలి. వెంటనే వ్యక్తిగత సమాచారాన్ని స్టోర్ చేసుకొని, బ్యాటరీ మార్చుకోవాలి. ♦ఒక్కోసారి ఫోన్ డెడ్ అవుతుంటుంది. ఇలాఫోన్ డెడ్ కావడానికి హ్యాకర్లు మాల్ వేర్ ను మన సెల్ ఫోన్ లోకి సెండ్ చేస్తారు. అలా వచ్చిన మాల్ వేర్ ఫోన్ లో ఉన్న సమాచారాన్ని సేకరిస్తారు. ♦ ఒక్కోసారి మీ ఫోన్ నుంచి టెక్ట్స్, కాల్స్ చేయలేరు. అలా వస్తున్నాయంటే సైబర్ నేరస్తులు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నట్లే లెక్క. మాల్ వేర్ సాయంతో మీ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బును కాజేస్తుంటారు. మిమ్మల్ని ఏమార్చేందుకు అన్ వాంటెండ్ కాల్స్, మెసేజ్‌లు సెండ్ చేస్తుంటారు. కావాలంటే మీకు వచ్చే కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఒక్కసారి చెక్ చేయండి. కానీ మీరు గుర్తించలేరు. ♦ మీఫోన్ గూగుల్ క్రోమ్ లో మీకు కావాల్సిన సమచారం కోసం అన్వేషిస్తున్నారు. ఆ సమయంలో కొన్ని అనుమానాస్పద పాప్ అప్ యాడ్స్ వస్తుంటాయి. యాహు మీరు లక్షల్లో ఫ్రైజ్ మనీని గెలుచుకున్నారు. మీకు ఆఫ్రైజ్ మనీ కావాలంటే మేం అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానాలు ఇవ్వాలని రిక్వెస్ట్‌లు పంపిస్తుంటారు. మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారంటే మీకు కాల్స్ వస్తుంటాయి. మీ ఫోన్ కాల్ ఆధారంగా మీజేబును ఖాళీ చేస్తుంటారు. హ్యాకర్స్‌లో కొంతమంది క్లిక్ చేస్తే డబ్బులు వచ్చేలా పాప్ అప్ యాడ్స్ పంపుతుంటారు. మీతో బలవంతం క్లిక్ చేసే మీ బ్రెయిన్ ను వాష్ చేస్తుంటారు. కాబట్టి ఇలా యాడ్స్ పట్ల అప్రమత్తంగా ఉంటే మంచిది ♦ ఒక్కసారి హ్యాకర్ మీ ఫోన్లోకి ఎంటర్ అయ్యాడంటే.. మీ జీమెయిల్, బ్యాంక్ అకౌంట్లలోకి ఈజీగా వెళతాడు.పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయడం,ఈమెయిల్స్‌ను పంపుతుంటారు. మీ డేటాను సేకరించి.. మీపేరు మీద క్రెడిట్ కార్డ్ లు తీసుకోవడం. మీ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న మనీని కాజేస్తుంటారు. ఇదిగో ఇలాంటివి సమస్యలు మీకు ఎదురవుతుంటే మీ ఫోన్ ను హ్యాక్ కు గురవుతుందని గుర్తుంచుకోవాలి.