
తల్లి, సోదరుడితో తేజ్‌ప్రతాప్ యాదవ్
పట్నా : తన ఫేస్‌బుక్ ఖాతాను హ్యాక్ చేశారని ఆర్జేడీ ఛీప్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బిహార్ మాజీ మంత్రి తేజ్‌ప్రతాప్ యాదవ్ తెలిపారు. సీఎం నితీష్ కుమార్, బీజేపీ కలిసి ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని తన తల్లి, మాజీ సీఎం రబ్రీదేవి తనను ఆదేశించినట్లు తన ఖాతాలో తప్పుడు పోస్ట్‌లు చేస్తున్నారని తెలిపారు. తమను రాజకీయంగా ఎదుర్కొలేక తమ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని జేడీయూ-బీజేపీపై మండిపడ్డారు.
ఎన్నికల్లో లబ్ధిపొందాలని తమ కుటుంబంపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని, తామంతా ఐక్యంగానే ఉన్నామన్నారు. తన సోదరుడు మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కి తనకు ఎలాంటి విభేదాలు లేవని, నా బలం తేజస్వీ అని పేర్కొన్నారు. జేడీయూ-బీజేపీ ఎన్నికుట్రలు చేసినా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి తీరుతుందని దీమా వ్యక్తం చేశారు. కాగా తేజ్‌ప్రతాప్ రాజకీయల నుంచి తప్పుకుని సినిమా రంగంలోకి వెళ్తున్నారని గతకొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment