లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయపు అధికారిక ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్ గురైంది. హ్యాకింగ్‌కు పాల్పడ్డ దుండగలు.. అకౌంట్ టైం లైన్‌పై కోతి చేష్టలకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఇది జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
వందల మంది ట్విటర్ యూజర్లను ట్యాగ్ చేస్తూ సీఎంవో ట్విటర్ టైం లైన్‌పై పోస్టులు చేశారు హ్యాకర్లు. అటుపై ఆకతాయిలు కోతి బొమ్మను అకౌంట్ ప్రొఫైల్ ఫొటోగా మార్చేసి.. మరీ ఈ పనికి పాల్పడ్డారు. వెంటనే దీంతో అందుకు సంబంధించిన పోస్టుల స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి.
అయితే విషయం గమనించిన ప్రభుత్వ సాంకేతిక సిబ్బంది.. వెంటనే అకౌంట్‌ను పునరుద్ధరించారు. హ్యాకర్లు పోస్ట్ చేసిన ట్వీట్లను డిలీట్ చేసి.. ఘటనపై విచారణకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment