Chief minister office
-
యూపీ CMO ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన హ్యాకర్లు
-
యూపీ సీఎంవో ట్విటర్ అకౌంట్ హ్యాక్
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయపు అధికారిక ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్ గురైంది. హ్యాకింగ్‌కు పాల్పడ్డ దుండగలు.. అకౌంట్ టైం లైన్‌పై కోతి చేష్టలకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఇది జరిగినట్లు అధికారులు వెల్లడించారు. వందల మంది ట్విటర్ యూజర్లను ట్యాగ్ చేస్తూ సీఎంవో ట్విటర్ టైం లైన్‌పై పోస్టులు చేశారు హ్యాకర్లు. అటుపై ఆకతాయిలు కోతి బొమ్మను అకౌంట్ ప్రొఫైల్ ఫొటోగా మార్చేసి.. మరీ ఈ పనికి పాల్పడ్డారు. వెంటనే దీంతో అందుకు సంబంధించిన పోస్టుల స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి. అయితే విషయం గమనించిన ప్రభుత్వ సాంకేతిక సిబ్బంది.. వెంటనే అకౌంట్‌ను పునరుద్ధరించారు. హ్యాకర్లు పోస్ట్ చేసిన ట్వీట్లను డిలీట్ చేసి.. ఘటనపై విచారణకు ఆదేశించారు. -
నివాస స్థలాలను స్వయంగా పరిశీలించండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 25 లక్షల మందికి నివాస స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నివాస స్థలాల పంపిణీ కోసం ప్రతిపాదించిన ప్రతి ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్లు/జాయింట్ కలెక్టర్లు/రెవెన్యూ డివిజనల్ అధికారులు స్వయంగా పరిశీలించాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చినట్టు మనం ఇళ్ల స్థలాలను అసైన్మెంట్ పట్టాల రూపంలో ఇవ్వడం లేదని, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నామన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి తరఫున జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లకు ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ల స్థలాలకు ప్రతిపాదించిన భూముల్లో కంపచెట్ల తొలగింపు, చదును చేయడం, సరిహద్దుల నిర్ధారణ పనులను వచ్చే వారంలో చేపట్టాలని సూచించారు. తాము పంపిన నమూనాలో భూముల సమాచారాన్ని సోమవారం సాయంత్రంలోగా వాట్సాప్ నంబరు 9013133636కు గానీ, మెయిల్‌కు గానీ పంపించాలని పేర్కొన్నారు. దేశంలోనే చరిత్రాత్మక నిర్ణయం ‘‘ఇళ్ల పట్టాలు పొందిన వారు ఆ స్థలాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి, రుణాలు తీసుకునేందుకు వీలుగా లబ్ధిదారులందరికీ కన్వెయన్స్ డీడ్ (రిజిస్ట్రేషన్ పత్రం) ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అయిదేళ్ల తర్వాత వీటిపై విక్రయ హక్కులు కూడా కల్పిస్తోంది’’ అని ప్రవీణ్ ప్రకాశ్ రాసిన లేఖలో పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం చేపడుతున్న నివాస స్థలాల పంపిణీ విధానం దేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలకు సైతం మార్గదర్శకం అవుతుందని నమ్ముతున్నట్లు వెల్లడించారు. ప్రవీణ్ ప్రకాశ్ పంపిన సర్క్యులర్‌లోని ముఖ్యమైన అంశాలు.. - కలెక్టర్లు/జాయింట్ కలెక్టర్లు/సబ్ కలెక్టర్లు/ ఆర్డీఓలు వెళ్లి పరిశీలించనిదే ఆయా భూములు నివాస స్థలాలకు పనికొస్తాయా? లేదా అన్నది నిర్ధారించలేరు. కాబట్టి నివాస స్థలాలు ఇవ్వడానికి ప్రతిపాదించే ప్రతి భూమిని ఉన్నతాధికారులు తప్పకుండా పరిశీలించాలి. - నివాస స్థలాలకు ప్రతిపాదించే భూములకు సంబంధించి కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, కచ్చితంగా వచ్చే వారంలో అమలు చేయాలి. ప్రతి మండలంలో క్రమబద్ధంగా భూముల జాబితాను రూపొందించాలి. విభాగాల వారీగా భూముల జాబితాను రూపొందిస్తేనే ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయో అర్థం చేసుకుని, పరిష్కరించడానికి వీలవుతుంది. ఈ విభాగాలకు సంబంధించిన భూములన్నింటినీ నివాస స్థలాల కోసం వినియోగించుకుంటాం. విభాగాల వారీగా భూముల జాబితా ఎలా ఉండాలంటే... - సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వివాదాస్పద భూములు - రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలోని అప్పీళ్ల కమిషనర్ వద్ద పెండింగ్‌లో ఉన్న వివాదాస్పద భూములు - రాష్ట్ర సర్వే సెటిల్మెంట్ కమిషనర్ వద్ద పెండింగ్‌లో ఉన్న వివాదాస్పద భూములు - వివిధ ప్రభుత్వ విభాగాల అధీనంలో ఉన్న వినియోగించని భూములు - ఇతరత్రా ప్రభుత్వ భూములు -
ఎక్కడివాళ్లు అక్కడే
సాక్షి, అమరావతి: వైద్య ఆరోగ్యశాఖలో గత సర్కారు ఇష్టారాజ్యంగా డెప్యుటేషన్లు, బదిలీలు చేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. ఈ శాఖలో డెప్యుటేషన్లు రద్దు చేయాలని నిర్ణయించారు. వందల సంఖ్యలో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, తదితరులు పోస్టింగ్‌లు ఒకచోట, పనిచేస్తున్నది మరోచోట కావటంతో ఎక్కడ ఎవరు పనిచేస్తున్నారు? ఎన్ని ఖాళీలున్నాయి? అన్నది తెలియడంలేదు. వైద్యులు మిస్‌మ్యాచింగ్ (తన స్పెషాలిటీ కాకపోయినా అందులో కొనసాగడం) పోస్టుల్లో కొనసాగుతుండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సైకియాట్రిస్ట్ పని ప్లాస్టిక్ సర్జన్ మెడికల్ కళాశాలల్లో చాలామంది అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు డెప్యుటేషన్లపై కొనసాగుతున్నారు. అనంతపురం, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు తదితర బోధనాసుపత్రుల్లో పనిచేయాల్సిన చాలామంది వైద్యులు కాకినాడ, విశాఖపట్నం, కర్నూలు, విజయవాడ తదితర చోట్ల ఉన్నట్టు తేలింది. సైకియాట్రీ ప్రొఫెసర్ పనిచేయాల్సిన చోట ప్లాస్టిక్ సర్జన్ పనిచేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు కూడా జిల్లా కేంద్రాల్లో డెప్యుటేషన్లమీద కొనసాగుతున్నారు. రోగులకు ఇబ్బంది కలగకూడదనే... డెప్యుటేషన్లన్నిటినీ రద్దుచేసి వారికి ఎక్కడ పోస్టింగ్ ఉందో తక్షణమే అక్కడకు పంపించాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఎక్కడ పనిచేయాలో వాళ్లను అక్కడకు పంపించి ఖాళీలెన్ని ఉన్నాయి, అదనంగా ఎంతమందిని నియమించాలన్న వివరాలు సర్కారుకు పంపించాలని సీఎంఓ కార్యాలయం ఆదేశించింది. దీనిపై ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి డా. పీవీ రమేష్ ‘సాక్షి’తో మాట్లాడుతూ రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సుజాతారావు అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ సైతం వైద్యుల కొరతపై పలు సిఫార్సులు చేసిందని ఆయన చెప్పారు. -
కేంద్రంపై ముఖ్యమంత్రుల అసంతృప్తి పూర్తిగా కల్పితం
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల అసంతృప్తి అంటూ ఈనాడు దిన పత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనం పూర్తిగా కల్పితమని ఏపీ సీఎం కార్యాలయం ఖండించింది. ఇద్దరు ముఖ్య మంత్రుల సమావేశంలో అసలు అలాంటి అంశమే ప్రస్తావనకు రాలేదని స్పష్టం చేసింది. ఇద్దరు సీఎంలు మాట్లాడుకున్నదాన్ని పక్కన ఉండి విన్నట్లుగా రాయడం శోచనీయమని వ్యాఖ్యానించింది. ఊహాజనితమైన ఇలాంటి వార్తలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టించడం దురదృష్టకరమని పేర్కొంది. మంగళవారం సీఎంవో నుంచి విడుదలైన ఖండనలో వివరాలు... ‘‘ముఖ్యమం త్రుల సమావేశంలో అసలు అలాంటి అంశమే ప్రస్తావనకు రాలేదు. ఊహాజనితమైన అంశాలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. ఈనాడు కథనాన్ని మేం పూర్తిగా ఖండిస్తున్నాం. ఉద్దేశపూ ర్వకంగా రాసిన కథనంగా దీన్ని భావిస్తున్నాం. ఇరు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఇద్దరు సీఎం సమావేశం సాగింది. గత నాలుగు నెలలుగా ఇరువురు సీఎంల మధ్య భేటీలు జరుగు తున్న విషయం అందరికీ తెలిసిందే. రాజకీయ అంశాలు, రాజకీయ సమీకరణాలకు దూరంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. తాజా భేటీలో గోదావరి జలాల తరలింపు ద్వారా సాగర్ కుడికాల్వ కింద కృష్ణా డెల్టా, ప్రకాశం సహా రాయ లసీమకూ, తెలంగాణలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు మేలు చేకూర్చే అంశంపై చర్చలు జరిగాయి. ఈ ప్రాజెక్టును సఫలం చేసే దిశగా.. అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలపై కూడా ఇరువురూ చర్చించారు. పోలీసు అధికారులకు సంబంధించిన విభజన అంశాలపై సంప్రదింపులు జరిపారు. తెలంగాణలో కొత్తగా నియామకం అవుతున్న పోలీసు కానిస్టేబుళ్లకు ఏపీలో కూడా శిక్షణ ఇచ్చే అంశంపై చర్చ జరిగింది. విద్యుత్ ఉద్యోగుల సమస్యలపైనా ఇద్దరు ముఖ్యమంత్రులు దృష్టి సారించారు. సోమవారం జరిగిన ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు తప్ప మరే ఇతర అంశాలు చోటు చేసుకోలేదు. ఈ సమావేశంపై ఊహాజనిత అంశాలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టించడం దురదృష్టకరం. ఇలాంటి కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నాం’’. -
ఎల్లో మీడియా కథనాన్ని ఖండించిన ఏపీ సీఎంవో
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వంపై ఇద్దరు ముఖ్యమంత్రులు అసంతృప్తిగా ఉన్నారంటూ ఎల్లో మీడియాలో ప్రచురితమైన కథనం కల్పితమని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో అలాంటి అంశమేదీ ప్రస్తావనకు రాలేదని తెలిపింది. ఉహాజనిత అంశాలను ప్రచురించి, ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఏపీ సీఎంవో హితవు పలికింది. ఈ విషయమై ఈనాడు దినపత్రిక రాసిన కథనాన్ని ఖండిస్తున్నామని, అది ఉద్దేశపూర్వకంగా రాసిన కథనంగా భావిస్తున్నామని ప్రకటించింది. ఇరు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం జరిగిందని ఏపీ సీఎంవో స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వేదికగా సుదీర్ఘంగా సమావేశమైన సంగతి తెలిసిందే. ఇరురాష్ట్రాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఈ సమావేశం సాగిందని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. గత నాలుగు నెలలుగా ఉభయ రాష్ట్రాల ప్రయోజనాల లక్ష్యంగా ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య సమావేశాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందేనని, రాజకీయ అంశాలు, రాజకీయ సమీకరణాలకు దూరంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయని పేర్కొంది. గోదావరి జలాలను తరలింపు ద్వారా సాగర్ కుడికాల్వ కింద ఉన్న కృష్ణా డెల్టా, ప్రకాశం సహా రాయలసీమకూ, తెలంగాణలోని పాత మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు మేలు చేకూర్చే అంశంపై సుదీర్ఘ చర్చలు జరిగాయని, ఈ ప్రాజెక్టును సఫలం చేసేదిశగా నిశితంగా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారని సీఎంవో పేర్కొంది. అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలను కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించారని, పోలీసు అధికారులకు సంబంధించిన విభజన అంశాలపై కూడా చర్చించారని తెలిపింది. తెలంగాణలో కొత్తగా నియామకం అవుతున్న పోలీసు కానిస్టేబుళ్లకు ఏపీలోనూ శిక్షణ ఇచ్చే అంశంపైనా చర్చ జరిగిందని, విద్యుత్ ఉద్యోగుల సమస్యలపైనా ఇద్దరు ముఖ్యమంత్రులు దృష్టిపెట్టారని సీఎంవో తెలిపింది. సోమవారం నాటి సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు తప్ప మరే ఇతర విషయాలూ చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది. ఇలాంటి సమావేశం మీద ఊహాజనిత అంశాలు రాసి ప్రజలను తప్పుదోవపట్టించడం దురదృష్టకరమని, ఇలాంటి కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. చదవండి: కృష్ణకు గో‘దారి’పై.. -
దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకేసారి లక్షల సంఖ్యలో ఉద్యోగాల భర్తీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టింది. పూర్తి పారదర్శకంగా, ఎలాంటి సిఫార్సులకు తావు లేకుండా రాతపరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగాలకు మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. అయితే, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు అభ్యర్థుల దగ్గర నుంచి వసూళ్లు ప్రారంభించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ముఖ్యమంత్రి కార్యాలయ(సీఎంవో) వర్గాలు తాజాగా స్పష్టం చేశాయి. ఆఖరికి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ఉద్యోగాలు ఇప్పించలేరని తేల్చిచెప్పాయి. సిఫార్సులకు ఆస్కారం లేకుండా మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఇంటర్వ్యూలు పెట్టలేదని వెల్లడించాయి. -
రేపే భారీ పెట్టుబడుల సదస్సు
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడుల సదస్సు విజయవాడలో శుక్రవారం జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన డిప్లొమాటిక్ ఔట్రీచ్ పేరుతో జరిగే ఈ సదస్సులో దక్షిణ కొరియా, యూకే, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో సహా 35 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. పరస్పరం ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను పెంపొందించుకునే దిశగా పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్, స్టీల్, టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి ప్రధాన రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలను ఆయా దేశాల ప్రతినిధులకు వివరించడం ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించాలన్నదే ఈ సదస్సు ఉద్దేశమని ముఖ్యమంత్రి కార్యాలయ(సీఎంవో) వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ పథకాలు, విధానాలను ఈ సదస్సు ద్వారా ప్రపంచ దేశాలకు తెలియచేయనున్నట్లు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవడానికి వీలుగా ఆయా దేశాలను ఇక్కడ చాంబర్ ఆఫ్ కామర్స్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిందిగా కోరనున్నారు. పెట్టుబడుల సదస్సు సందర్భంగా వివిధ దేశాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సదస్సు ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. విదేశాల్లో కార్యాలయాలు పెట్టుబడులను ఆకర్షించడానికి దేశ విదేశాల్లో పెట్టుబడుల ప్రోత్సాహక కార్యాలయాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో బిజినెస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే టోక్యో, సియోల్ వంటి ఎంపిక చేసిన విదేశీ రాజధానుల్లో కార్యాలయాలు నెలకొల్పనున్నారు. సీఐఐ, ఫిక్కీ వంటి సంస్థల సహకారంతో పెట్టుబడుదారులతో సంప్రదింపులు జరుపుతారు. అంతేకాకుండా అంతర్జాతీయంగా పలు రంగాల్లో పేరున్న ప్రముఖులను పిలిచి, ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర సర్కారు ప్రణాళికలు రూపొందిస్తోంది. పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమల స్థాపన, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. -
'తెలంగాణ ప్రభుత్వం చొరవను మోదీ అభినందించారు'
హైదరాబాద్: విద్యుత్ ఉత్పత్తి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారని సీఎం కార్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్న సీఎం కార్యాలయం నూతన ఆవిష్కరణలు, విద్యుత్ కోసం అనుసరిస్తున్న మార్గాలను ప్రధాని స్వాగతించారని తెలిపింది. ఢిల్లీలో జరిగిన సాంప్రదాయేతర ఇంధన సదస్సులో తెలంగాణ విద్యుత్ విధానాలను మోదీ ప్రస్తావించారని తెలంగాణ పేర్కొంది. దేశంలో మెరుగైన ఫలితాలను సాధించిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి ప్రధాని తెలిపారని తెలిపింది. సౌర విద్యుత్ లో తెలంగాణ చొరవకు మోదీ అవార్డు అందించినట్లు సీఎం కార్యాలయం తెలిపింది. -
తెలంగాణ సీఎం వద్ద పేరుకుపోయిన ఫైళ్లు
-
తెలంగాణ సీఎం వద్ద భారీగా పేరుకుపోయిన ఫైళ్లు
వెయ్యి వరకు అక్కడే ఉన్నట్లు సమాచారం జాబితాలో పద్మ అవార్డులు, టీపీఎస్సీ, ఫాస్ట్ మార్గదర్శకాలు, రోడ్ల నిర్మాణం ఫైళ్లు పరిశ్రమల సింగిల్ విండో, ఆస్తి పన్ను, భూముల ఫైళ్లకూ కలగని మోక్షం సమీక్షలు, రాజకీయ వ్యూహాలతోనే ముఖ్యమంత్రి బిజీ కేసీఆర్ ఆధ్వర్యంలోని కీలక శాఖల సాధారణ ఫైళ్లూ పెండింగ్ ఇప్పటికీ అమలు కాని తొలి కేబినెట్ భేటీ నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వద్ద భారీగా ఫైళ్లు పేరుకుపోతున్నాయి. మరీ అత్యవసరమైన వాటిని తప్ప ఇతర ఫైళ్లను ఆయన చూడడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారులు కూడా ఫైళ్లను ఎప్పటికప్పుడు ఆయన వద్దకు తీసుకెళ్లడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర కోణంలోనే విధానాల రూపకల్పన జరగాలని, అందుకు తగ్గట్టుగా చట్టాలు ఉండాలని కేసీఆర్ నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఈ దిశగా శాఖలవారీగా కొత్త విధానాల రూపకల్పన, సూత్రీకరణ కోసం ఉన్నతాధికారులతో గంటల తరబడి సమీక్షలు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి తీరికలేకుండా గడుపుతున్నారు. మరోపక్క రాజకీయంగా స్థిరత్వం సాధించేందుకూ ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో సీఎం కార్యాలయంలో ఫైళ్లు పేరుకుపోతున్నాయి. వీటి సంఖ్య వెయ్యి వరకు ఉన్నట్లు సమాచారం. వివిధ శాఖల నుంచి వస్తున్న ఫైళ్లను కేసీఆర్ కానీ, ఆయన కార్యాలయ అధికారులు కానీ చూడడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. విధానాల రూపకల్పనపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు ప్రభుత్వం చెబుతున్నా.. వాటి అమలుకు సంబంధించి ఇప్పటివరకు ఏ ఒక్క స్పష్టమైన ఉత్తర్వూ బయటకు రాలేదన్న వాదన వినిపిస్తోంది. సమీక్షా సమావేశాల్లో ప్రస్తావనకు వస్తున్న పలు అంశాలకు వాస్తవ రూపం రావడం లేదని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫైళ్లను పంపించడం మినహా.. తర్వాత వాటి విషయాన్ని సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం కూడా ఫైళ్లు పేరుకుపోవడానికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పలు కీలక శాఖలు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఉండటంతో ఆయా శాఖలకు సంబంధించిన సాధారణ ఫైళ్లు కూడా ఆయన వద్దకు వెళ్లి ఆగిపోతున్నాయి. ఆర్థిక సంబంధమైన, కోర్టు అంశాలపై మాత్రమే అధికారులు స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి ఆయన ముఖ్యకార్యదర్శికి వివరించి మరీ సంబంధిత ఫైళ్లకు సీఎంతో ఆమోదం వేయించుకుంటున్నారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలతో సహా మొత్తం 43 తీర్మానాలను ఆమోదించడంతో వాటి అమలు ఇక వేగవంతమవుతుందని అంతా ఆశించారు. కేబినెట్ ఆమోదించిన అంశాలకు సంబంధించిన ఫైళ్లను ఆయా శాఖలు తిరిగి ముఖ్యమంత్రికి పంపించి లాంఛనంగా ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫైళ్లలో చాలా వాటికి ఇంకా మోక్షం దక్కలేదని విశ్వసనీయ సమాచారం. రోజురోజుకీ పెరుగుతున్న జాబితా గత నెల చివరి వారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన పద్మ అవార్డుల కమిటీ పరిశీలనకు 37 మంది పేర్లు రాగా.. ఈ జాబితాను సగానికి కుదించి ముఖ్యమంత్రి ఆమోదం కోసం ఫైలును పంపించారు. దీనికి ఇప్పటి వరకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. పద్మ అవార్డులకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాల్సిన గడువు ఈ నెల 15తో ముగుస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీపీఎస్సీ) ఏర్పాటైనప్పటికీ.. దానికి చైర్మన్‌తో పాటు సభ్యులను నియమించాల్సి ఉంది. దీని ఏర్పాటుకు తొలి కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకున్నా ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. అలాగే పురపాలక శాఖకు సంబంధించిన భూ వినియోగ మార్పిడి ఫైళ్లు అనేకం ముఖ్యమంత్రి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ శాఖ సీఎం చేతిలోనే ఉంది. ఈ శాఖ ఫైళ్లను మంత్రి హోదాలో కేసీఆరే ఆమోదించాల్సి ఉంటుంది. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను సవరణకు అనుమతి కోరుతూ ముఖ్యమంత్రికి ఫైలును పంపించారు. ఇది కూడా ఇప్పటివరకు తిరిగి రాలేదు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డు కమిటీల ఏర్పాటుకు సంబంధించిన ఫైలు కూడా పెండింగ్‌లో ఉంది. ప్రజాప్రతినిధులకు ఎప్పుడు, ఎక్కడ శిక్షణ ఇవ్వాలన్న ఫైలు కూడా ఇంకా సీఎం వద్దనే పరిశీలనలో ఉంది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ బోర్డు సమావేశానికి ముఖ్యమంత్రి సమయం కేటాయించాల్సి ఉంది. నీటిపారుదల శాఖ పెండింగ్ బిల్లులకు సంబంధించిన పలు ఫైళ్లు కూడా సీఎం పేషీలోనే ఆగిపోయాయి. బాలల హక్కుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు, పరిశ్రమలకు ఏక గవాక్ష పద్ధతిలో అన్ని అనుమతులు మంజూరు చేయాలన్న విధానపరమైన నిర్ణయానికి సంబంధించిన ఫైలు, రాష్ర్టంలో కొత్త యూనివర్సిటీల ఏర్పాటు, 104, 108 కింద పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు, ఎస్పీడీసీఎల్ సీఎండీ నియమాకం, జిల్లాల నుంచి మండల కేంద్రాలకు రెండు లైన్ల రోడ్ల నిర్మాణం, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు నాలుగు లైన్ల రహదారుల నిర్మాణానికి సంబంధించిన ఫైలు వంటివన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇలా లెక్కకు మించిన ఫైళ్లు ముఖ్యమంత్రి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించే పథకం(ఫాస్ట్)కు సంబంధించిన మార్గదర్శకాలను కూడా కేసీఆర్ ఇప్పటికీ ఆమోదించలేదు. ఒకవైపు ఇంజనీరింగ్ తొలిదశ ప్రవేశాలు పూర్తయినా దీనిపై స్పష్టత రాకపోవడం అధికారులను కలవరపరుస్తోంది. -
15లోగా సీమాంధ్ర సీఎం కార్యాలయం సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనలో కీలకమైన సచివాలయంలో ఇరు రాష్ట్రాలకు బ్లాకుల కేటాయింపుతో పాటు ఏ పనులు ఎప్పటిలోగా పూర్తి చేయాలనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, అలాగే సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి శివశంకర్ వేర్వేరుగా అంతర్గత మెమోలు జారీ చేశారు. ఏ, బీ, సీ, డీ బ్లాకులను తెలంగాణ ప్రభుత్వానికి, సౌత్ హెచ్, నార్త్ హెచ్, జె. కె. ఎల్ బ్లాకులను సీమాంధ్ర ప్రభుత్వానికి కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సీమాంధ్ర సీఎం కార్యాలయానికి కేటాయించిన సౌత్ హెచ్ బ్లాకులో పనులన్నింటినీ ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాల్సిందిగా సీఎస్ ఆదేశించారు. ఈ బ్లాకులో ఉన్న ఆంధ్రా బ్యాంకును జె బ్లాకులోని పాత స్థలానికి తరలించాలని స్పష్టం చేశారు. సౌత్ హెచ్ బ్లాకు ప్రధాన ద్వారాన్ని ఆంధ్రాబ్యాంకు వైపునకు మార్చాలని సూచించారు. సౌత్ హెచ్ బ్లాకులోని రెండో అంతస్తును సీమాంధ్ర ముఖ్యమంత్రి కార్యాలయంగా తీర్చిదిద్దాలని, అందుకు అవసరమైన చేర్పులు మార్పులు వచ్చే 15వ తేదీకల్లా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం హెలిపాడ్ పక్కనే ఉన్న స్కూల్‌ను తొలగించి అక్కడ తెలంగాణ ప్రభుత్వ రాకపోకలకు గేట్లను ఏర్పాటు చేయాలని, దీన్ని కూడా 15వ తేదీ కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. స్కూల్‌ను ఎ బ్లాకు వెనక ప్రాంతానికి తరలించాలన్నారు. సౌత్ హెచ్ బ్లాకులో గల హోమియో డిస్పెన్సరీని డి బ్లాకుకు తరలించాలని, మింట్ కాంపౌండ్ వైపు ఖాళీగా ఉన్న స్థలాన్ని తీసుకుని అప్రోచ్ రహదారి నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. -
ఆర్డినెన్సుల జారీ కోసమే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభను నిరవధికంగా వాయిదా (ప్రొరోగ్) వేయాలని అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి లేఖ రాయటం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో.. ఆర్డినెన్సులు తీసుకువచ్చేందుకు వీలుగా అసెంబ్లీని ప్రొరోగ్ చేయాలని కోరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇచ్చింది. ఈమేరకు సీఎంఓ శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. ‘‘అసెంబ్లీ, కౌన్సిల్ ప్రొరోగ్ విషయమై స్పీకర్ కార్యాలయానికి సీఎంఓ లేఖ రాసింది. ఇది కేవలం పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం రాసిన లేఖ మాత్రమే. అసెంబ్లీ ప్రొరోగ్ కాకుండా ఉన్న సమయంలో ఆర్డినెన్సులు తీసుకురావటానికి సాంకేతికంగా వీలుండదు. కొన్ని ఆర్డినెన్సులు తీసుకురావలసిన అవసరమున్నందున ప్రొరోగ్ చేయాలని లేఖ పంపాం. ఇది పరిపాలనా సౌలభ్యం కోసమే’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ 21వ తేదీతో ముగిశాయి. దాదాపు ఐదు మాసాలుగా అసెంబ్లీని ప్రొరోగ్ చేయాలంటూ స్పీకర్‌కు లేఖ రాయని సీఎం కిరణ్.. 15 రోజుల కిందటే ఈ లేఖ రాశారు. మలివిడత సమావేశాలకు వ్యవధి నెల రోజుల్లోపే ఉన్న తరుణంలో, ఈ నెలాఖరుకు అసెంబ్లీకి తెలంగాణ బిల్లు రానున్న సమయంలో ఈ లేఖ సహజంగానే వివాదాన్ని రేపింది.