హైదరాబాద్: విద్యుత్ ఉత్పత్తి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారని సీఎం కార్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్న సీఎం కార్యాలయం నూతన ఆవిష్కరణలు, విద్యుత్ కోసం అనుసరిస్తున్న మార్గాలను ప్రధాని స్వాగతించారని తెలిపింది. ఢిల్లీలో జరిగిన సాంప్రదాయేతర ఇంధన సదస్సులో తెలంగాణ విద్యుత్ విధానాలను మోదీ ప్రస్తావించారని తెలంగాణ పేర్కొంది.
దేశంలో మెరుగైన ఫలితాలను సాధించిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి ప్రధాని తెలిపారని తెలిపింది. సౌర విద్యుత్ లో తెలంగాణ చొరవకు మోదీ అవార్డు అందించినట్లు సీఎం కార్యాలయం తెలిపింది.